R&D Centre: థర్మో ఫిషర్ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?
శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్ సెంటర్’ను ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని నాలెడ్జి సిటీలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. «థర్మో ఫిషర్ ఆర్ అండ్ డీ కేంద్రం కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూనీటి వనరులపై పరిశోధన చేస్తోందని చెప్పారు. 2022, ఫిబ్రవరి నెల తాను చేపట్టిన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్‌లో థర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలిసినట్లు వివరించారు.
GK Sports Quiz: ఏ భారతీయ క్రికెటర్ ను మాల్దీవుల ప్రభుత్వం 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుతో సత్కరించింది?Andhra Pradesh: వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్ సెంటర్’ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : నాలెడ్జి సిటీ, హైదరాబాద్
ఎందుకు : శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో.. కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాల కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్