సెప్టెంబర్ 2018 రాష్ట్రీయం
Sakshi Education
గుంటూరులో అంతర్జాతీయ కవిత్వోత్సవం
గుంటూరులోని జేకేసీ కళాశాలలో 11వ గుంటూరు అంతర్జాతీయ కవిత్వోత్సవం సెప్టెంబర్ 21న ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 140 మంది కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఆల్ ఫర్ పీస్-పీస్ ఫర్ ఆల్’ నినాదంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
కవిత్సోత్సవం సందర్భంగా కవులు, కవయిత్రుల కవితలతో సంకలనం చేసిన ‘ట్రాంక్విల్‌మ్యూజ్’ పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రపంచశాంతి, మానవతా విలువలు, సామాజిక అసమానతలు, మహిళా సమస్యలపై కవులు, కవయిత్రుల రచనలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. అలాగే విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ కుటుంబీకురాలు అయిన నీతా బి. జార్జ్ తాను రచించిన ‘సె్ ఇన్‌ద యూనివర్శ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 11వ గుంటూరు అంతర్జాతీయ కవిత్వోత్సవం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎక్కడ : జేకేసీ కళాశాల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి ‘దేశీ రాక్ స్టార్స్’ ఎంపిక
సినిమా పండగల్లో అతి పెద్ద పండగ ఆస్కార్ అవార్డుల పండగ. ప్రపంచంలో అన్ని ప్రాంతాల సినిమాలను కొలమానంగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈ సంబరాలు జరిగేది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అయినా హడావిడి సెప్టెంబర్ అక్టోబర్ నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే.. ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీకి బరిలో నిలిచే సినిమాలను ఆయా దేశాలు అనౌన్స్ చేస్తుంటాయి. ఈసారీ స్టార్ట్ అయింది. 2018కిగాను ఇండియన్ సినిమా తరఫున ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ అని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఒక అస్సామీ సినిమా. కొత్త దర్శకురాలు. పొదుపైన బడ్జెట్. సినిమా తీసింది చిన్న కెమెరాతోనే. మొత్తం దర్శకురాలు రీమా దాస్ స్వగ్రామమే. దాదాపు 28 సినిమాలు ఉన్న లిస్ట్‌లో, వచ్చే ఏడాది జరిగే ఆస్కార్స్‌కి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున అఫీషియల్‌గా పంపబోతున్న సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’. ఈ సినిమా విషయానికి వస్తే.. రీమా దాస్ స్వీయ దర్శకత్వం వహించి, ఎడిటింగ్ చేసిన అస్సామీ చిత్రం. రీమా దాస్ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ కూడా కాదు. సెల్ఫ్ మేడ్ ఫిల్మ్ మేకర్. ఈ ఏడాది వచ్చిన నేషనల్ అవార్డ్‌లోనూ ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సత్తా చాటింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, చైల్డ్ ఆర్టిస్ట్, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంది. అంతేనా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా మంచి ప్రశంసలు పొందింది.
అస్సామీ పరిశ్రమలో దాదాపు 29 ఏళ్ల తర్వాత జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ఇది. ఆ రకంగా అస్సామీ పరిశ్రమకు ఈ సినిమా ఓ తీయని అనుభూతిని పంచితే, ఇప్పుడు ఏకంగా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి ఎంపిక కావడం మరో మంచి అనుభూతిని మిగ్చిలింది.
ఆస్కార్ నామినేషన్స్‌కు భారతదేశం నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ పరిగణనలోకి తీసుకున్నవి సుమారు 28 సినిమాలు ఉన్నట్టు సమాచారం. అందులో మన ‘మహానటి’, సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’, నందితా దాస్ ‘మంటో’, సూజిత్ సర్కార్ ‘అక్టోబర్’, లవ్‌సోనియే’ ప్యాడ్‌మ్యాన్, తుమ్‌బాద్ హల్కా, పీకు వంటి సినిమాలు ఫారిన్ క్యాటగిరీలో జరిగిన రేసులో పోటీపడ్డాయి.
మన దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి సినిమాలను పంపడం మొదలైంది 1957లో. అప్పటి నుంచి కేవలం మూడు సినిమాలు (మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్) మాత్రమే నామినేషన్ దక్కించుకున్నాయి. 1986లో నామినేషన్స్‌కు కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేస్ వరకూ వెళ్లింది కానీ నామినేషన్ దక్కించుకోలేదు. అంతదాకా వెళ్లి, నామినేషన్ దక్కించుకున్నా అవార్డు వరకూ రాలేకపోతున్నాం. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి.. ఇలా మనవాళ్లు ఆస్కార్ తెచ్చినా, అది మన దేశం సినిమా కాదు. బ్రిటిష్ ఫిల్మ్ కింద వస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి దేశీ రాక్ స్టార్స్
ఎప్పుడు : ఫిబ్రవరి లేదా మార్చి నెలలో
ఎక్కడ : భారతదేశం నుంచి
ముంపు మండలాలపై రాజపత్రం
రాష్ట్ర విభజనానంతరం పోలవరం ముంపు మండలాలను ఏ నియోజకవర్గాల్లో చేర్చాలన్న విషయంపై నెలకొన్న సందిగ్ధత తొలగింది. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ పరిధిలో ఉన్న మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చిన విషయం తెలిసిందే. ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవిగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన రాజపత్రంలో స్పష్టం చేసింది. ఆ మేరకు ఎస్టీ నియోజకవర్గాలైన రంపచోడవరం, పోలవరంలలో కలవనున్న గ్రామాల వివరాలను ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. దీని ప్రకారం రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోకి.. మారేడుమిల్లి, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, కూనవరం, చింతూరు, వి.ఆర్.పురం, ఎటపాక మండలం, భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా ఆ మండలంలోని గ్రామాలు వస్తాయి. అదే విధంగా పోలవరం నియోజకవర్గంలోకి.. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి.నరసాపురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలంలోని సీతారామనగరం, శ్రీధరవేలేరు, గుంపానపల్లి, గణపవరం, ఇబ్రహీంపట్నం, రావిగూడెం గ్రామాలు వస్తాయని ఆ గెజిట్‌లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : పోలవరం ముంపు మండలాలపై రాజపత్రం
ఎక్కడ :పోలవరం ముంపు మండలాలు
ఎందుకు : పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ పరిధిలో ఉన్న మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చిన విషయం
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కాల్చి చంపిన మావోలు
విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను సెప్టెంబర్ 23న మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపారు. ఏవోబీలో దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పథక రచన చేసి కొద్ది రోజులుగా రంగంలోకి దిగి సంచరిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పసిగట్టలేకపోయింది.
విశాఖ మన్యంలో మావోయిస్టులు ప్రతికారేచ్ఛతో మారణకాండకు పాల్పడ్డారు. క్యాబినేట్ హోదా కలిగిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను పట్టపగలే కాల్చి చంపారు. డుంబ్రిగూడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కండ్రుం పంచాయతీ సార్రాయి గ్రామంలో టీడీపీ తలపెట్టిన గ్రామదర్శిని, గ్రామవికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కిడారి, సోమలు అరకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో డుంబ్రిగుడ, గుంటసీమ మీదుగా కార్యకర్తలు, అనుచరులతో కలసి మూడు వాహనాల్లో బయలుదేరారు. లివిటిపుట్టు వద్ద అప్పటికే మాటువేసిన 40 మంది మహిళా మావోయిస్టులతో సహా 70 మంది సాయుధులు టీడీపీ నేతల వాహనాలను అడ్డగించారు. గన్‌మెన్‌ల నుంచి తుపాకులు, సెల్‌ఫోన్లు తీసుకుని దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించారు. అనంతరం కిడారి, సోమ చేతులు కట్టేసి కొంత దూరం తీసుకెళ్లి అరమ-గుంటసీమ జంక్షన్ వద్ద ఆగారు. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే సోమ పారిపోయేందుకు ప్రయత్నించగా దారుణంగా చంపేస్తామని హెచ్చరించారు.
ఉమ్మడి ఏపీలో ప్రజాప్రతినిధుల హత్యలు, కిడ్నాప్‌లు...
ఏమిటీ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు కాల్చివేత
ఎప్పుడు : సెప్టెంబర్ 23న
ఎవరు : కిడారి సర్వేశ్వరరావు
ఎక్కడ : విశాఖపట్నం జిల్లాలో
ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ వాసుల కలల మెట్రో రైలు ఎల్బీనగర్-అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో సెప్టెంబర్ 24 నుంచి అందుబాటులోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గం గుండా మెట్రో రైళ్లు లో ప్రయాణిస్తున్నారు. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతా చోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ-ఎంజీబీఎస్ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రో ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
ఎక్కడ : హైదరాబాద్
‘అమృత్’ పథ కం అమలులో ఏపీకి మొదటి స్థానం
అటల్ మిషన్ ఫర్ రిజ్యువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫర్మేషన్ (అమృత్) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌కి మొదటిస్థానం లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో సెప్టెంబర్ 24న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అవార్డును ప్రదానం చేశారు.
అమృత్ పథకం అమలులో 65.24 శాతం మార్కులతో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, 59.17 శాతంతో ఒడిశా రెండో స్థానం, 54.32 శాతంతో మధ్యప్రదేశ్ మూడో స్థానం, 52.39 శాతంతో తెలంగాణ నాలుగో స్థానం పొందాయి. పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు తదితర కార్యక్రమాలకు ఉద్దేశించిన అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 జూన్ 25న ప్రారంభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘అమృత్’ పథ కం అమలులో మొదటి స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
కరీంనగర్-లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై (11206/11205) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహేన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్ 26న ప్రారంభించారు. ఇప్పటివరకు నిజామాబాద్-ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్.. ఇక నుంచి కరీంనగర్-లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వరకు రాకపోకలు సాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు, కాజీపేట, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర చోట్ల సుమారు రూ.2వేల కోట్ల అంచనాలతో చేపట్టిన రైల్వే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు రాజెన్ శంకుస్థాపన చేశారు.
మరోవైపు రూ.106 కోట్లతో మంచిర్యాల-పెద్దంపేట మధ్య నిర్మించిన 3వ లైన్‌ను ప్రారంభించారు. అలాగే రూ.1693.45 కోట్ల అంచనాలతో చేపట్టిన కాజీపేట్-కొండపల్లి మధ్య 3వ రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. మొత్తంగా రూ.125 కోట్లతో పూర్తి చేసిన పలు సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరీంనగర్-లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహేన్
ఎక్కడ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
కొండవీటివాగు ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని సీతానగరం వద్ద నిర్మించిన కొండవీటివాగు వరద నీటి ఎత్తిపోతల పథకం ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 16న ప్రారంభించారు. రూ.237 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 5,250 క్యూసెక్కుల వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి పంప్ చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మొత్తం 22వేల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే చేరేలా రూ.400 కోట్లతో రెండో దశలో పనులు త్వరలోనే చేపడతామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొండవీటివాగు వరద నీటి ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : సీతానగరం, ఉండవల్లి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అమరావతి ని వరద ముంపు నుంచి రక్షించేందుకు
టెక్నాలజీ కార్యకలాపాల్లో బెంగళూరుకు అగ్రస్థానం
ఆసియాలో టోక్యో తర్వాత టెక్నాలజీ కార్యకలాపాలు ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఉన్న అనుకూల నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ 19న వెల్లడించింది. ఈ జాబితాలో బెంగళూరు (68 శాతం స్కోరు) సింగపూర్, షెంజెన్‌లతో కలిసి అగ్రస్థానం దక్కించుకోగా హైదరాబాద్‌కు(58 శాతం స్కోరు) 7వ స్థానం, ముంబైకి 10వ స్థానం, ఢిల్లీ-ఎన్‌సీఆర్ 11వ స్థానం పొందాయి.
ఆసియాలోని సంపన్న, వర్ధమాన దేశాల్లోని 16 నగరాల్లో మెరుగైన కార్యాలయాల లభ్యత, సంస్థల యాజమాన్యాలకు తక్కువ వ్యయాలు, జీవన వ్యయాలు వంటి 50 అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించి ఈ జాబితాను రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెక్నాలజీ కార్యకలాపాల్లో బెంగళూరుకు అగ్రస్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్
ఎక్కడ : ఆసియా
కృష్ణానదిలో లాంచీయాత్ర ప్రారంభం
పర్యాటకప్రాంతాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను సందర్శించేందుకు తెలంగాణ పర్యాటకశాఖ కృష్ణానదిలో చేపట్టిన లాంచీయాత్ర సెప్టెంబర్ 8న ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మీదుగా 110 కిలోమీటర్లపాటు లాంచీ ప్రయాణం సాగనుంది. నల్లమల కొండల మధ్య సాగే ఈ యాత్ర కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రభుత్వం రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణానదిలో లాంచీయాత్ర ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : తెలంగాణ పర్యాటక శాఖ
ఎందుకు : శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను సందర్శించేందుకు
తెలంగాణ అసెంబ్లీ రద్దు
తెలంగాణ అసెంబ్లీనీ రద్దుచేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్ సెప్టెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీని రద్దు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి సిఫారసు చేస్తూ తీర్మానం చేసింది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2 (బీ)ని అనుసరించి శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ రద్దయినటై్లంది.
శాసనసభ రద్దవడంతో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగనున్నాడు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా 2014, జూన్ 2న కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ అసెంబ్లీ రద్దు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్
ఎందుకు : అసెంబ్లీని రద్దు చేయాలని తెలంగాణ మంత్రిమండలి సిఫారసు చేయడంతో
బెంగళూరులో అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్
ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ బెంగళూరులోని బ్రిటిష్ కాలం నాటి ఓపెరా హౌస్‌లో సెప్టెంబర్ 11న ప్రారంభించింది. ఈ సెంటర్‌లో శాంసంగ్ కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను కస్టమర్లు పరిశీలించవచ్చని కంపెనీ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సీఈఓ హెచ్ సీ హాంగ్ చెప్పారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్ యాక్సెసరీలు ఈ సెంటర్‌లో అందుబాటులోని తెలిపారు.
ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ తయారీ ప్లాంటును ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శాంసంగ్ ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : శాంసంగ్
ఎక్కడ : బెంగళూరు
ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా సదర్‌మఠ్
తెలంగాణలోని నిర్మల్ జిల్లా మేడంపల్లి గ్రామ పరిధిలోని సదర్‌మఠ్ ఆనకట్ట, కామారెడ్డి జిల్లాలోని పెద్ద చెరువు ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తింపు పొందాయి. కెనడాలో ఆగస్టు 30న జరిగిన ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) 69వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఐడీ సెప్టెంబర్ 9న కేంద్రప్రభుత్వానికి తెలియజేసింది.
4.12 టీఎంసీల సామర్థ్యమున్న సదర్‌మఠ్ ఆనకట్టను 1891-92 నిర్మించారు. ఫ్రెంచ్ ఇంజనీర్ జేజే ఓట్లీ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 13,100 ఎకరాలు సాగవుతుంది. 7.76 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా సదర్ మఠ్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యంత పురాతన కట్టడం కావడంతో దీన్ని వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రతిపాదించింది.
1897లో నిర్మించిన కామారెడ్డిలోని పెద్దచెరువు కింద 858 ఎకరాలు సాగవుతోంది. మిషన్ కాకతీయలో భాగంగా రూ.8.96 కోట్లతో పెద్దచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. దీనిని కూడా వారసత్వ కట్టడంగా గుర్తించాలని తెలంగాణ ప్రతిపాదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తింపు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : సదర్‌మఠ్ ఆనకట్ట, పెద్ద చెరువు
ఎక్కడ : తెలంగాణ
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 30న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డెరైక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018 పేరిట కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం తెలంగాణలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6 జోన్లు ఉండగా రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీకి 4, తెలంగాణకు 2 జోన్లు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చడంతో కొత్త జిల్లాల ప్రకారం కొత్త జోనల్ విధానం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ మే 24న నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం మే 27న ఆమోదం తెలపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు (124) జారీ చేశారు.
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం.....
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : తెలంగాణ
తిరుపతిలో ‘స్వీకార్ ’ నిర్మాణం
తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఫర్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (స్వీకార్) సంస్థను టాటా ట్రస్ట్ నిర్మించనుంది. ఈ మేరకు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వీకార్ నిర్మాణానికి ఆగస్టు 31న భూమి పూజ చేశారు. స్వీకార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) బోర్డు విరాళంగా ఇచ్చిన 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించ నున్నారు.
భూమి పూజ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా 50 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారని, 2020 నాటికి ఈ సంఖ్య 1.50 లక్షలకు చేరే ప్రమాదం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 124 ఆస్పత్రులు నడుస్తున్నాయన్న సీఎం తిరుపతి ఆస్పత్రి రేడియేషన్ థెరపీకి హబ్‌గా మారనుందని చెప్పారు. అలాగే రతన్ టాటా మాట్లాడుతూ నాణ్యమైన కేన్సర్ వైద్యం అందించటం కోసం పరిశోధనతో కూడిన స్వీకార్ ఆస్పత్రిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. టీటీడీ సహకారంతో పేదలకు సేవలందిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వీకార్ నిర్మాణానికి భూమిపూజ
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : రతన్ టాటా, చంద్రబాబునాయుడు
ఎక్కడ : అలిపిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : నాణ్యమైన కేన్సర్ వైద్యం అందించటం కోసం
‘చేరువ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ డీజీపీ
సామాజిక మాద్యమాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రూపొందించిన ‘చేరువ..మీ చెంతకు.. మీ పోలీస్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో ఆగస్టు 31న ప్రారంభించారు. ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలు భాగస్వాములై విభిన్న సమస్యలు, అంశాలపై చర్చించనున్నారు. కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ప్రజలకు చేరువ అయ్యేలా ప్రత్యేక వాహనాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించనున్నారు.
సామాజిక మాద్యమాల్లో.....
ఏపీ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా సామాజిక మాద్యమాల్లో అకౌంట్‌లను డీజీపీ ఠాకూర్ ప్రారంభించారు. 9440900822 వాట్సాప్, ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చేరువ..మీ చెంతకు.. మీ పోలీస్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా
రామగుండం ఎన్టీపీసీకి ఎక్స్‌లెన్స్ అవార్డు
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అవార్డు-2018 లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1న జరిగిన 19వ జాతీయ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సదస్సులో టీఎస్ ఎనర్జీ విభాగం ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. విద్యుత్ ఉత్పత్తిలో అద్భుతమైన శక్తి సమర్థవంతమైన యూనిట్‌గా ఎన్టీపీసీ రామగుండం గుర్తింపు పొందినందుకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అవార్డు-2018
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
బెంగళూరులో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ సద స్సు
బెంగళూరులోని నిమ్‌హాన్స్ ఆడిటోరియంలో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్-2018 సదస్సు ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి 6 వరకు జరగనున్న ఈ సదస్సులో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇజ్రాయిల్, యూకేతోపాటు పలు దేశాల శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ నిపుణులు పాల్గొననున్నారు. అలాగే దేశంలోని ఆరు విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్సలర్లు హాజరుకానున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో శాటిలైట్ టెక్నాలజీ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వంటి విషయాలపై సదస్సులో చర్చించనున్నారు. డిజిటలైజేషన్, ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యలపై కూడా చర్చలు జరపనున్నారు.
ఇండియన్ టెక్నికల్ కాంగ్రెస్-2013 తొలిసారి బెంగళూరులో మొదలు కాగా అప్పటి నుంచి ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్‌వీ మురళీకృష్ణారెడ్డి చైర్మన్‌గా ఈ సదస్సు జరుగనుంది. గతేడాది సదస్సును పారిశ్రామిక విప్లవం 4.0 పేరుతో నిర్వహించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్-2018 సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 5 నుంచి 6 వరకు
ఎక్కడ : నిమ్‌హాన్స్ ఆడిటోరియం, బెంగళూరు, కర్ణాటక

- 1990లో వరంగల్‌లో మాజీ మంత్రి హయగ్రీవచారిని దారుణంగా హత్య చేశారు.
- 1991, మేలో అప్పటి మలక్‌పేట్ ఎమ్మెల్యే సుధీర్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు. మావోయిస్టు నేత నెమలూరి భాస్కర్‌రావు విడుదలకు డిమాండ్ చేశారు.
- 1993లో పెనుగొండ ఎమ్మెల్యే చెన్నారెడ్డిని నక్సల్స్ చంపారు.
- 1993, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే రంగదాసును కిడ్నాప్ చేసి హత్య చేశారు.
- 1995, నెల్లూరు జిల్లా మాగుంట సుబ్బరామిరెడ్డిని దారుణంగా చంపారు.
- 1999, మేలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావును దారుణంగా చంపారు.
- 1999, ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే పురుషోత్తంరావు హత్య.
- 2000, మార్చి 7న అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని మందుపాతర అమర్చి చంపేశారు.
- 2001, డిసెంబర్ 30న దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను కాల్చి చంపారు.
- 2001, అప్పటి కొల్లపూర్ ఎమ్మెలే, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావుపై నక్సలైట్లు దాడిచేయగా గన్‌మెన్‌తో పాటు ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు.
- 2003, అక్టోబర్ 24న తిరుపతి అలిపిరిలో చంద్రబాబుపై క్‌లైమర్ మైన్స్ పేల్చి దాడికి పాల్పడ్డారు.
- 2005, ఆగస్టు 15న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై కాల్పులు జరిపి చంపారు.
- 2007, సెప్టెంబర్ 17న మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపై మావోయిస్టు పార్టీ లాండ్‌మైన్లతో దాడిచేసింది. జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి తృటిలో తప్పించుకున్నారు.
ఏమిటీ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు కాల్చివేత
ఎప్పుడు : సెప్టెంబర్ 23న
ఎవరు : కిడారి సర్వేశ్వరరావు
ఎక్కడ : విశాఖపట్నం జిల్లాలో
ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ వాసుల కలల మెట్రో రైలు ఎల్బీనగర్-అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో సెప్టెంబర్ 24 నుంచి అందుబాటులోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గం గుండా మెట్రో రైళ్లు లో ప్రయాణిస్తున్నారు. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతా చోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ-ఎంజీబీఎస్ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రో ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
ఎక్కడ : హైదరాబాద్
‘అమృత్’ పథ కం అమలులో ఏపీకి మొదటి స్థానం
అటల్ మిషన్ ఫర్ రిజ్యువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫర్మేషన్ (అమృత్) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌కి మొదటిస్థానం లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో సెప్టెంబర్ 24న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అవార్డును ప్రదానం చేశారు.
అమృత్ పథకం అమలులో 65.24 శాతం మార్కులతో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, 59.17 శాతంతో ఒడిశా రెండో స్థానం, 54.32 శాతంతో మధ్యప్రదేశ్ మూడో స్థానం, 52.39 శాతంతో తెలంగాణ నాలుగో స్థానం పొందాయి. పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు తదితర కార్యక్రమాలకు ఉద్దేశించిన అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 జూన్ 25న ప్రారంభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘అమృత్’ పథ కం అమలులో మొదటి స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
కరీంనగర్-లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై (11206/11205) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహేన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్ 26న ప్రారంభించారు. ఇప్పటివరకు నిజామాబాద్-ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్.. ఇక నుంచి కరీంనగర్-లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వరకు రాకపోకలు సాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు, కాజీపేట, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర చోట్ల సుమారు రూ.2వేల కోట్ల అంచనాలతో చేపట్టిన రైల్వే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు రాజెన్ శంకుస్థాపన చేశారు.
మరోవైపు రూ.106 కోట్లతో మంచిర్యాల-పెద్దంపేట మధ్య నిర్మించిన 3వ లైన్‌ను ప్రారంభించారు. అలాగే రూ.1693.45 కోట్ల అంచనాలతో చేపట్టిన కాజీపేట్-కొండపల్లి మధ్య 3వ రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. మొత్తంగా రూ.125 కోట్లతో పూర్తి చేసిన పలు సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరీంనగర్-లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహేన్
ఎక్కడ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
కొండవీటివాగు ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని సీతానగరం వద్ద నిర్మించిన కొండవీటివాగు వరద నీటి ఎత్తిపోతల పథకం ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 16న ప్రారంభించారు. రూ.237 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 5,250 క్యూసెక్కుల వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి పంప్ చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మొత్తం 22వేల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే చేరేలా రూ.400 కోట్లతో రెండో దశలో పనులు త్వరలోనే చేపడతామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొండవీటివాగు వరద నీటి ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : సీతానగరం, ఉండవల్లి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అమరావతి ని వరద ముంపు నుంచి రక్షించేందుకు
టెక్నాలజీ కార్యకలాపాల్లో బెంగళూరుకు అగ్రస్థానం
ఆసియాలో టోక్యో తర్వాత టెక్నాలజీ కార్యకలాపాలు ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఉన్న అనుకూల నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ 19న వెల్లడించింది. ఈ జాబితాలో బెంగళూరు (68 శాతం స్కోరు) సింగపూర్, షెంజెన్‌లతో కలిసి అగ్రస్థానం దక్కించుకోగా హైదరాబాద్‌కు(58 శాతం స్కోరు) 7వ స్థానం, ముంబైకి 10వ స్థానం, ఢిల్లీ-ఎన్‌సీఆర్ 11వ స్థానం పొందాయి.
ఆసియాలోని సంపన్న, వర్ధమాన దేశాల్లోని 16 నగరాల్లో మెరుగైన కార్యాలయాల లభ్యత, సంస్థల యాజమాన్యాలకు తక్కువ వ్యయాలు, జీవన వ్యయాలు వంటి 50 అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించి ఈ జాబితాను రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెక్నాలజీ కార్యకలాపాల్లో బెంగళూరుకు అగ్రస్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్
ఎక్కడ : ఆసియా
కృష్ణానదిలో లాంచీయాత్ర ప్రారంభం
పర్యాటకప్రాంతాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను సందర్శించేందుకు తెలంగాణ పర్యాటకశాఖ కృష్ణానదిలో చేపట్టిన లాంచీయాత్ర సెప్టెంబర్ 8న ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మీదుగా 110 కిలోమీటర్లపాటు లాంచీ ప్రయాణం సాగనుంది. నల్లమల కొండల మధ్య సాగే ఈ యాత్ర కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రభుత్వం రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణానదిలో లాంచీయాత్ర ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : తెలంగాణ పర్యాటక శాఖ
ఎందుకు : శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను సందర్శించేందుకు
తెలంగాణ అసెంబ్లీ రద్దు
తెలంగాణ అసెంబ్లీనీ రద్దుచేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్ సెప్టెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీని రద్దు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి సిఫారసు చేస్తూ తీర్మానం చేసింది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2 (బీ)ని అనుసరించి శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ రద్దయినటై్లంది.
శాసనసభ రద్దవడంతో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగనున్నాడు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా 2014, జూన్ 2న కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ అసెంబ్లీ రద్దు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్
ఎందుకు : అసెంబ్లీని రద్దు చేయాలని తెలంగాణ మంత్రిమండలి సిఫారసు చేయడంతో
బెంగళూరులో అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్
ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ బెంగళూరులోని బ్రిటిష్ కాలం నాటి ఓపెరా హౌస్‌లో సెప్టెంబర్ 11న ప్రారంభించింది. ఈ సెంటర్‌లో శాంసంగ్ కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను కస్టమర్లు పరిశీలించవచ్చని కంపెనీ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సీఈఓ హెచ్ సీ హాంగ్ చెప్పారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్ యాక్సెసరీలు ఈ సెంటర్‌లో అందుబాటులోని తెలిపారు.
ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ తయారీ ప్లాంటును ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శాంసంగ్ ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : శాంసంగ్
ఎక్కడ : బెంగళూరు
ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా సదర్‌మఠ్
తెలంగాణలోని నిర్మల్ జిల్లా మేడంపల్లి గ్రామ పరిధిలోని సదర్‌మఠ్ ఆనకట్ట, కామారెడ్డి జిల్లాలోని పెద్ద చెరువు ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తింపు పొందాయి. కెనడాలో ఆగస్టు 30న జరిగిన ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) 69వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఐడీ సెప్టెంబర్ 9న కేంద్రప్రభుత్వానికి తెలియజేసింది.
4.12 టీఎంసీల సామర్థ్యమున్న సదర్‌మఠ్ ఆనకట్టను 1891-92 నిర్మించారు. ఫ్రెంచ్ ఇంజనీర్ జేజే ఓట్లీ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 13,100 ఎకరాలు సాగవుతుంది. 7.76 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా సదర్ మఠ్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యంత పురాతన కట్టడం కావడంతో దీన్ని వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రతిపాదించింది.
1897లో నిర్మించిన కామారెడ్డిలోని పెద్దచెరువు కింద 858 ఎకరాలు సాగవుతోంది. మిషన్ కాకతీయలో భాగంగా రూ.8.96 కోట్లతో పెద్దచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. దీనిని కూడా వారసత్వ కట్టడంగా గుర్తించాలని తెలంగాణ ప్రతిపాదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తింపు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : సదర్‌మఠ్ ఆనకట్ట, పెద్ద చెరువు
ఎక్కడ : తెలంగాణ
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 30న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డెరైక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018 పేరిట కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం తెలంగాణలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6 జోన్లు ఉండగా రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీకి 4, తెలంగాణకు 2 జోన్లు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చడంతో కొత్త జిల్లాల ప్రకారం కొత్త జోనల్ విధానం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ మే 24న నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం మే 27న ఆమోదం తెలపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు (124) జారీ చేశారు.
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం.....
మల్టీ జోన్ | జోన్ | జిల్లాలు |
మల్టీ జోన్-1 | జోన్ 1 - కాళేశ్వరం | ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి |
జోన్ 2 - బాసర | ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల | |
జోన్ 3 - రాజన్న | కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి | |
జోన్ 4 - భద్రాద్రి | కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ | |
మల్టీ జోన్-2 | జోన్ 5 - యాదాద్రి | సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ |
జోన్ 6 – చార్మినార్ | మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి | |
జోన్ 7 - జోగుళాంబ | వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు |
ఏమిటి : కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : తెలంగాణ
తిరుపతిలో ‘స్వీకార్ ’ నిర్మాణం
తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఫర్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (స్వీకార్) సంస్థను టాటా ట్రస్ట్ నిర్మించనుంది. ఈ మేరకు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వీకార్ నిర్మాణానికి ఆగస్టు 31న భూమి పూజ చేశారు. స్వీకార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) బోర్డు విరాళంగా ఇచ్చిన 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించ నున్నారు.
భూమి పూజ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా 50 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారని, 2020 నాటికి ఈ సంఖ్య 1.50 లక్షలకు చేరే ప్రమాదం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 124 ఆస్పత్రులు నడుస్తున్నాయన్న సీఎం తిరుపతి ఆస్పత్రి రేడియేషన్ థెరపీకి హబ్‌గా మారనుందని చెప్పారు. అలాగే రతన్ టాటా మాట్లాడుతూ నాణ్యమైన కేన్సర్ వైద్యం అందించటం కోసం పరిశోధనతో కూడిన స్వీకార్ ఆస్పత్రిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. టీటీడీ సహకారంతో పేదలకు సేవలందిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వీకార్ నిర్మాణానికి భూమిపూజ
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : రతన్ టాటా, చంద్రబాబునాయుడు
ఎక్కడ : అలిపిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : నాణ్యమైన కేన్సర్ వైద్యం అందించటం కోసం
‘చేరువ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ డీజీపీ
సామాజిక మాద్యమాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రూపొందించిన ‘చేరువ..మీ చెంతకు.. మీ పోలీస్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో ఆగస్టు 31న ప్రారంభించారు. ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలు భాగస్వాములై విభిన్న సమస్యలు, అంశాలపై చర్చించనున్నారు. కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ప్రజలకు చేరువ అయ్యేలా ప్రత్యేక వాహనాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించనున్నారు.
సామాజిక మాద్యమాల్లో.....
ఏపీ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా సామాజిక మాద్యమాల్లో అకౌంట్‌లను డీజీపీ ఠాకూర్ ప్రారంభించారు. 9440900822 వాట్సాప్, ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చేరువ..మీ చెంతకు.. మీ పోలీస్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా
రామగుండం ఎన్టీపీసీకి ఎక్స్‌లెన్స్ అవార్డు
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అవార్డు-2018 లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1న జరిగిన 19వ జాతీయ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సదస్సులో టీఎస్ ఎనర్జీ విభాగం ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. విద్యుత్ ఉత్పత్తిలో అద్భుతమైన శక్తి సమర్థవంతమైన యూనిట్‌గా ఎన్టీపీసీ రామగుండం గుర్తింపు పొందినందుకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అవార్డు-2018
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
బెంగళూరులో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ సద స్సు
బెంగళూరులోని నిమ్‌హాన్స్ ఆడిటోరియంలో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్-2018 సదస్సు ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి 6 వరకు జరగనున్న ఈ సదస్సులో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇజ్రాయిల్, యూకేతోపాటు పలు దేశాల శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ నిపుణులు పాల్గొననున్నారు. అలాగే దేశంలోని ఆరు విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్సలర్లు హాజరుకానున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో శాటిలైట్ టెక్నాలజీ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వంటి విషయాలపై సదస్సులో చర్చించనున్నారు. డిజిటలైజేషన్, ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యలపై కూడా చర్చలు జరపనున్నారు.
ఇండియన్ టెక్నికల్ కాంగ్రెస్-2013 తొలిసారి బెంగళూరులో మొదలు కాగా అప్పటి నుంచి ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్‌వీ మురళీకృష్ణారెడ్డి చైర్మన్‌గా ఈ సదస్సు జరుగనుంది. గతేడాది సదస్సును పారిశ్రామిక విప్లవం 4.0 పేరుతో నిర్వహించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్-2018 సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 5 నుంచి 6 వరకు
ఎక్కడ : నిమ్‌హాన్స్ ఆడిటోరియం, బెంగళూరు, కర్ణాటక
Published date : 20 Sep 2018 03:57PM