నవంబర్ 2018 రాష్ట్రీయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు లభించింది. ఈ మేరకు ఢిల్లీలో నవంబర్ 22న జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డులను అంద జేశారు. పర్యాటక రంగంలో ఉత్తమ ప్రగతి సాధించిన ఏపీ పర్యాటకశాఖకు ఇండియా టుడే అవార్డు దక్కింది. అలాగే సుపరిపాలనలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ ‘అత్యంత మెరుగైన పెద్ద రాష్ట్రం’ అవార్డును అందుకుంది. 2017లో రాష్ట్రంలోని పాలనను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు ఈ అవార్డును ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఎక్కడ : పర్యాటక రంగం, సుపరిపాలన
ఏఎన్‌యూలో ఐకాన్ సదస్సు ప్రారంభం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లో ‘వ్యర్థాల నిర్వహణ-యాజమాన్య పద్ధతుల’పై ఎనిమిదో ఐకాన్ సదస్సు నవంబర్ 22న ప్రారంభమైంది. ఐఎస్‌డబ్ల్యూఎంఏడబ్ల్యూ (ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్ అండ్ వాటర్), ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సుని నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దేశీ, విదేశీ పర్యావరణ రంగ నిపుణులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనిమిదో ఐకాన్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఐఎస్‌డబ్ల్యూఎంఏడబ్ల్యూ, ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్
ఎక్కడ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవ్‌లో నవంబర్ 22న జరిగిన ‘గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్’లో ఇండియా స్కిల్స్ నివేదిక-2019ను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధిలో ఏపీ మొదటిస్థానంలో నిలవగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇండియా స్కిల్స్ నివేదిక ప్రకారం చురుకైన విద్యార్థులు కలిగిన నగరాలలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా... చెన్నై, గుంటూరు, లఖ్‌నవ్, ముంబై, ఢిల్లీ, నాసిక్, పుణె వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా ఇంగ్లీషు, విశ్లేషణాత్మక ఆలోచనలు, లాజికల్ సమస్యలను పరిష్కరించడం, నడవడిక వంటి విషయాలలో ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం విద్యార్థులు ముంద ంజలో ఉన్నారు. ఏపీ యువతకు ఉద్యోగ కల్పన కోసం పలు అంతర్జాతీయ, జాతీయ ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఏటా 3 లక్షల మందికి నైపుణ్యభివృద్ధిలో శిక్షణను అందిస్తోంది. ఎంబీఏ కంటే ఇంజనీరింగ్ విద్యార్థులే రాష్ట్రంలో ఎక్కువగా, త్వరగా ఉద్యోగాలు పొందగలుగుతున్నారు.
మరోవైపు నాలుగేళ్ల తర్వాత 2019లో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఇండియా స్కిల్స్ నివేదిక పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆటోమోటివ్, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాలు ఉద్యోగ కల్పనలో కీలకంగా ఉండనున్నాయని వివరించింది. 2017తో ఫ్రెషర్స్ నియామకాలు 7 శాతంగా ఉండగా 2019లో 15 శాతానికి పెరుగుతాయంది. 2018లో మహిళా ఉద్యోగ కల్పన 38 శాతం నుంచి 46 శాతానికి పెరిగిందని, ఇదే సమయంలో పురుషు ఉద్యోగ కల్పన మాత్రం స్వల్పంగా 47 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని తెలిపింది.
ఇండియా స్కిల్స్ నివేదిక-2019ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ (యూఎన్‌డీపీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీయూ), పీపుల్ సా్ర్టంగ్, సీఐఐ, వీ-బాక్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి రూపొందించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఇండియా స్కిల్స్ నివేదిక-2019
ఎక్కడ : దేశంలో
అమరావతి ఎయిర్ షో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కష్ణానదీతీరం పున్నమిఘాట్‌లో నిర్వహిస్తున్న అమరావతి ఎయిర్ షో నవంబర్ 23న ప్రారంభమైంది. మూడు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే)కు చెందిన గ్లోబల్ స్టార్స్ ఏరోబాటిక్ టీమ్ నిర్వహిస్తోంది. ఎయిర్ షోలో భాగంగా యూకే నుంచి వచ్చిన నాలుగు విమానాల్లో 320 హార్స్ పవర్ ఇంజన్‌తో గంటకు 440 కి.మీ వేగంతో సెకన్‌కు 440 డైవింగ్‌తో విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరావతి ఎయిర్ షో ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : పున్నమిఘాట్ , కష్ణానదీతీరం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
గోదావరి- పెన్నా అనుసంధానం పనులకు శంకుస్థాపన
గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో రూ.6,020.15 కోట్లతో తలపెట్టిన గోదావరి- పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 26న శంకుస్థాపన చేశారు. అలాగే కొండమోడు - పేరేచర్ల రహదారి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. రూ.736 కోట్లతో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు పెద్ద నదులను అనుసంధానం చేసి పవిత్ర సంగమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి- పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ వద్ద పోకర్ణ కొత్త ప్లాంటు
హైదరాబాద్ వెలుపల కొత్తూరు వద్ద టెక్స్‌టైల్, గ్రానైట్ రంగాల్లో ఉన్న పోకర్ణ గ్రూప్ తన గ్రానైట్ విభాగానికి సంబంధించి కొత్త ప్లాంటును ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు 40 ఎకరాల విస్తీర్ణంలో, రూ.330 కోట్లతో ఈ అత్యాధునిక ప్లాంటును ఏర్పాటు చేస్తామని సంస్థ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ నవంబర్ 27న తెలిపారు. క్వాంట్రా బ్రాండ్‌తో సహజ క్వార్‌ట ్జ సర్ఫేసెస్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్‌కు ఇప్పటికే వైజాగ్‌లో ఒక యూనిట్ ఉంది. క్వాంట్రా ఉత్పత్తులను క్వార్‌ట ్జ రాయి, పాలిమర్ రెసిన్‌తో తయారు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోకర్ణ గ్రూప్ కొత్త గ్రానైట్ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 27
ఎక్కడ : హైదరాబాద్
తిరుపతిలో మెడికల్ ఎలక్టాన్రిక్స్ క్లస్టర్
తిరుపతిలో గ్రీన్‌ఫీల్డ్ మెడికల్ ఎలక్టాన్రిక్స్ వస్తువుల తయారీ క్లస్టర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎలక్టాన్రిక్స్ రంగానికి చెందిన మేజెస్ ఎలక్టాన్రిక్స్ పార్కు సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మధ్య నవంబర్ 28న ఒప్పందం కుదిరింది. సూమారు 200 ఎకరాల్లో రూ.188కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ క్లస్టర్‌లో వైద్యపరమైన ఎలక్టాన్రిక్ పరికరాలను తయారుచేయనున్నారు. ఈ క్లస్టర్‌లో 50 అంకుర సంస్థలు అభివృద్ధి చెంది 15వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెడికల్ ఎలక్టాన్రిక్స్ వస్తువుల తయారీ క్లస్టర్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మేజెస్ ఎలక్టాన్రిక్స్ పార్కు సంస్థ
ఎక్కడ : తిరుపతి, ఆంధ్రప్రదేశ్
విశాఖలో సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-వన్ ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 15న శంకుస్థాపన చేశారు. 2019 మేలోగా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను పూర్తిచేసి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
మరోవైపు ఎడ్యుటెక్-2018 సదస్సును విశాఖపట్నంలో నవంబర్ 15న సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ... విశాఖలో ఇంటెలిజెంట్ గ్లోబల్ హబ్(గేమింగ్ యూనివర్సిటీ) ఏర్పాటుకు యూనిసెఫ్ స్థలం అడిగిందని, ఇందుకు 50 ఎకరాలు కేటాయించనున్నామని తెలిపారు. యునెస్కో ఎంజీఐఈపీ తరఫున కిర్జికిస్తాన్ మాజీ అధ్యక్షురాలు రోజా ఒతుబుయేవి ప్రారంభోపన్యాసం చేశారు.
మూడు ఎంఓయూలు...
రాష్ట్రంలో 3 ప్రాజెక్టుల అమలుకు సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శాంసంగ్ మైడ్రీం ప్రాజెక్టు, డిజైన్ యూనివర్సిటీ, స్కిల్లింగ్ ప్రోగ్రాం ఆన్ క్రియేటివ్ డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందాలు కుదిరాయి. శాంసంగ్ స్మార్ట్ క్లాసుల కార్యక్రమాన్ని, తెలుగులో తొలి గ్లోబల్ వర్సిటీ యాప్‌ను, యునెస్కో-ఎంజీఐఈపీ అభివృద్ధి పరచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం-కలెక్టివ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను సీఎం ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-వన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : చోడవరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
పవర్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రారంభం
5వ పవర్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 16న ప్రారంభించారు. విజయవాడ వద్ద కృష్ణానదిలో భవానీఘాట్ వద్ద ఈ బోట్ రేసును నిర్వహిస్తున్నారు. బోట్ రేసు నిర్వహించే ప్రాంతాన్ని ఎన్టీఆర్ సాగర్ అమరావతిగా నామకరణం చేశారు. ప్రపంచంలో ఎఫ్1హెచ్2వో రేసులు ఏడు చోట్ల నిర్వహిస్తుండగా అమరావతిలో నిర్వహించేది 5వ రేసు. ఆరో రేసును దుబాయి, ఏడవ రేసును షార్జాలో నిర్వహించనున్నారు.
బోట్ రేసు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతిలో తప్ప ఇతర దేశాల్లో ఉప్పునీటిలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తారన్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువున వైకుంఠపురం దిగువున చోడవరం బ్యారేజీలు వస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో 70 నుంచి 80 కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ ఏర్పడనుందన్నారు. కృష్ణా నదిలో 9 ఐలాండ్‌లు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఐకానిక్ బ్రిడ్జిలు రాబోతున్నాయని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 32 చారిత్రక వారసత్వ కట్టడాలపై పర్యాటక శాఖ రూపొందించిన వీడియోను సీఎం ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 5వ పవర్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఎన్టీఆర్ సాగర్ అమరావతి, కృష్ణానది వద్ద, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
‘రైతుబంధు’కు ఐరాస గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఐరాస ఎంపిక చేయగా వాటిలో రైతుబంధు, రైతుబీమాలకు చోటు లభించింది. ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంతర్జాతీయ సదస్సులో ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఐరాస ఆహ్వానం పంపింది. ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో నవంబర్ 21-23 తేదీల మధ్య ఈ సదస్సును నిర్వహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఐక్యరాజ్యసమితి
శ్రీసిటీలో క్రియా విశ్వవిద్యాలయం ప్రారంభం
చిత్తురూ జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేసిన క్రియా విశ్వవిద్యాలయాన్ని ఉప రాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 18న ప్రారంభించారు. ఉద్యోగావకాశాలు కల్పించే సిలబస్‌ను క్రియా విశ్వవిద్యాలయంలో బోధించి ఉన్నత ప్రమాణాలతో కూడిన యువ నిపుణులను అందించాలని ఈ సందర్భంగా వెంకయ్య కోరారు. ఆర్థిక, వ్యాపారవేత్తల సహకారంతో నాణ్యమైన విద్యను అందివ్వడానికి క్రియా విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రియా విశ్వవిద్యాలయం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
ఎక్కడ : శ్రీసిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
భూదార్ కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రంలోని ప్రతి భూభాగం, స్థిరాస్తికి విశిష్ట సంఖ్య (11 అంకెలతో) అందించే ‘భూధార్’ కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నవంబర్ 20న ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద భూదార్‌కి సంబంధించిన ‘భూసేవ’ పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. భూసేవ ప్రాజెక్టులో భాగంగా భూధార్‌ను చేపట్టారు. వేలిముద్రలు, కనుపాపల ఆధారంగా మనుషులకు ఆధార్ ఇచ్చినట్లుగా.. భూములు, ఆస్తుల గుర్తింపునకు సర్వేనెంబర్లు, సబ్‌డివిజన్ల ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో భూధార్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 0.32 కోట్ల పట్టణ ఆస్తులు, 0.84 కోట్ల గ్రామీణ ఆస్తులకు భూధార్ కేటాయించనున్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీ, పురపాలక, అటవీ శాఖలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోనున్నాయి.
భూధార్ పథకంను మొదటగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 2018 ఏప్రిల్ 11న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. భూ సేవ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 20 రకాల సేవలను అందించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూదార్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
కోనాలో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయం
తూర్పు గోదావరి జిల్లాలోని కోనా గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ వాణిజ్య నౌకాశ్రయంను అభివృద్ధి చేయనున్నట్లు కాకినాడ గేట్‌వే పోర్ట్ (కేజీపీఎల్) తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు నవంబర్ 21న వెల్లడించింది. కేఎస్‌ఈజెడ్‌కు చెందిన 1,811 ఎకరాల్లో ఈ నౌకాశ్రయాన్ని నిర్మించనున్నారు. సుమారు రూ.2,123 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పోర్ట్‌లో సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సూమారు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కేజీపీఎల్ పేర్కొంది. కాకినాడ సెజ్ లిమిటెడ్ (కేఎస్‌ఈజెడ్)కు అనుబంధ సంస్థగా కేజీపీఎల్ పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రీన్ ఫీల్డ్ వాణిజ్య నౌకాశ్రయం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : కాకినాడ గేట్‌వే పోర్ట్ (కేజీపీఎల్)
ఎక్కడ : కోనా గ్రామం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
దేశంలోనే అతిపెద్ద తెలుగుతల్లి విగ్రహం ఆవిష్కరణ
దేశంలోనే అతిపెద్ద తెలుగుతల్లి విగ్రహంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 21న ఆవిష్కరించారు. 27 అడుగుల ఎత్తై ఈ విగ్రహాన్ని కృష్ణాజిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం వారధి వద్ద ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు ముందు ఉల్లిపాలెం గ్రామం వద్ద కృష్ణా నదిపై రూ.77.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఉల్లిపాలెం-భవానీపురం వారధిని సీఎం ప్రారంభించారు. ఈ వంతెన వల్ల దివిసీమ-మచిలీపట్నం మధ్య దాదాపు 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. చల్లపల్లిలో గాంధీ స్మారకవనంను కూడా చంద్రబాబు ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే అతిపెద్ద తెలుగుతల్లి విగ్రహం ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఎక్కడ : ఉల్లిపాలెం వారధి, కోడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభం
మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేశ్ అమరావతిలో నవంబర్ 21న ప్రారంభించారు. అలాగే మేక్ ఇన్ ఏపీ వెబ్‌సైట్, పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 10వేల అంకుర సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మేక్ ఇన్ ఏపీలో భాగంగా ప్రతినెల మెంటార్‌షిప్, హ్యాకథాన్‌లను నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో ఇజ్రాయేల్ భాగస్వామ్యంతో క్రాస్ బోర్డర్ హ్యాకథాన్‌లను నిర్వహిస్తామన్నారు. మేక్ ఇన్ ఏపీలో భాగంగా అంకుర సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.
ఐడియాల్యాబ్స్ నాలెడ్జ్ భాగస్వామిగా నాస్కామ్ 10,000 అంకుర సంస్థలు, ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీ సంయుక్తంగా మేక్ ఇన్ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
విజయనగరం గిరిజన వర్శిటీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నవంబర్ 8న ఆమోదం తెలిపింది. ఈ మేరకు వర్సిటీ ఏర్పాటుకు మొదటి విడతలో రూ.420 కోట్ల నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మరోవైపు విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)లో కేంద్రప్రభుత్వానికి ఉన్న 73.44శాతం వాటాలను పూర్తిగా ఉపసంహరించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ వాటాలను విశాఖ, కాండ్లా, ముంబయి (జేఎన్‌పీటీ), పారాదీప్ ఓడరేవుల సమాఖ్యకు అప్పగించంచనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్రమంత్రివర్గం
ఎక్కడ : రెల్లి, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఏపీ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్-2018 వైఎస్‌ఆర్ కడప జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ)లో నవంబర్ 9న ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్ ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సైన్స్ కాంగ్రెస్ సావనీర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2019లో నిర్వహించనున్న 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్‌ను శ్రీకాకుళంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్-2018 ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : యోగివేమన విశ్వవిద్యాలయం, వైఎస్‌ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో ఇంటెల్ టెక్ సెంటర్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇంటెల్ హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఆపద్ధర్మ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావుతో ఇంటెల్ ఇండియా అధిపతి నివృత్తి రాయ్ నవంబర్ 9న చర్చలు జరిపారు. రూ.3వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే ఈ కేంద్రం ద్వారా తొలి దశలో 1500 మందికి ఉపాధి కల్పించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటెల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : ఇంటెల్ సంస్థ
ఎక్కడ : హైదరాబాద్
ఏపీ మంత్రివర్గ విస్తరణ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ నవంబర్ 11న జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా శాసన మండలి చైర్మన్ ఎన్‌ఎండీ మహ్మద్ ఫరూక్‌ను, కిడారి శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ప్రస్తుతం మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలపి 26కి చేరింది. ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమంతోపాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు నక్సల్స్ దాడిలో చనిపోవడంతో ఆయన కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. శ్రావణ్‌కుమార్‌కు గిరిజన సంక్షేమం-సాధికారత శాఖను అప్పగించారు. శ్రావణ్‌కుమార్ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరికి చోటు
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : మహ్మద్ ఫరూక్, కిడారి శ్రావణ్‌కూమార్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
సుపరిపాలన పుస్తకావిష్కరణ
సీఎంసీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు రచించిన ‘ఇదీ సుపరిపాలన’ పుస్తకంను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్‌లో నవంబర్ 13న ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ఈ పుస్తకాన్ని రచించారు. సుపరిపాలన పుస్తకంను ‘51 మంత్‌స ఆఫ్ కేసీఆర్ గవర్నెన్స్ విత్ డిఫరెన్స్’పేరుతో ఇంగ్లీష్‌లోకి అనువదించారు. దీనిని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుపరిపాలన పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : వనం జ్వాలా నరసింహారావు
ఎక్కడ : హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధికారిక చిహ్నం
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధికారిక చిహ్నంను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చిహ్నాన్ని మల్టీ కలర్, నీలం, నలుపు తెలుపు రంగుల్లో ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించిన అధికారిక చిహ్నంలో పలు మార్పులు చేసి...అమరావతి శిల్ప కళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు.
కొత్త అధికారిక చిహ్నంలో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధమ్మ చక్క (ధర్మ చక్రం) ఉంటుంది. క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో ధాన్య కటక మహా చైత్యానికి విధికుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్న ఘటం (పూర్ణఘటం) చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణఘటం చుట్టూ ఉన్న మూడు వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి. పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది. చిహ్నం పైభాగంలో ‘ఆంధ్రప్రదేశ్’ అని, కింది భాగంలో ‘సత్యమేవ జయతే’ అని తెలుగులో రాసి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో ఇవి ఆంగ్లంలో రాసి ఉండేవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం మధ్యలో ‘పూర్ణ కుంభం’ ఉండేది. కానీ ధాన్య కటక మహాచైత్యంలో ఉన్నది పూర్ణఘటమే తప్ప, పూర్ణ కుంభం కాదని...ఆ మేరకు అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. ప్రముఖ స్థపతి, పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి తదితరులతో ఒక కమిటీని నియమించింది. వారి సూచనల మేరకు తగిన మార్పులతో అధికారిక చిహ్నాన్ని ఖరారు చేసింది. అధికారిక చిహ్నాన్ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదన్న విషయంలోను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
చిహ్నం వాడేందుకు అర్హులు...
- ముఖ్యమంత్రి, మంత్రులు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు
- అడ్వకేట్ జనరల్
- అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు
- జిల్లా కలెక్టర్లు
- సచివాలయ మధ్యస్థాయి అధికారులు, వారికి సమాన హోదా కలిగినవారు.
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధికారిక చిహ్నం
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డు
దివ్యాంగుల సంక్షేమం కోసం విశిష్ట సేవలందిస్తున్నందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డు దక్కింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును విశ్లేశించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2017-18 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి ‘బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబులిటీస్‘ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా నవంబర్ 10న దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, సంచాలకులు బి.శైలజ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్‌కే జోషిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ వారిని అభినందిస్తూ, దివ్యాంగుల సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం అందుకోనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివ్యాంగుల సంక్షేమం కోసం విశిష్ట సేవలందిస్తున్నందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 3న
ఎవరు : కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
ఎందుకు : దివ్యాంగుల సంక్షేమం కోసం విశిష్ట సేవలకు గాను
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నవంబర్ 12 నగారా మోగింది. తెలంగాణ శాసనసభ తొలి సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 12న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చే సింది. రాష్ట్ర శాసనసభ పరిధిలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 20న నామినేషన్లను పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా అదే రోజు వెల్లడికానుంది. డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 32,791 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,73,18,603 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్ 19న ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురించిన అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య 2.75 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.
అంకెల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు ..
- అక్టోబర్ 12న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ...
మహిళా ఓటర్లు : 1,35,28,020
పురుష ఓటర్లు : 1,37,87,920
ఇతరులు : 2,663
మొత్తంఓటర్ల సంఖ్య : 2,73,18,603
మొత్తం సర్వీస్ ఓటర్లు : 9,451
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు : 6 - శాసనసభ నియోజకవర్గాలు
ఎస్సీ రిజర్వ్‌డ్ : 19
ఎస్టీ రిజర్వ్‌డ్ : 12
జనరల్ : 88
మొత్తం :119 - పోలింగ్ కేంద్రాలు
పట్టణ పోలింగ్ కేంద్రాలు : 12,514
గ్రామీణ పోలింగ్ కేంద్రాలు : 20,060
మొత్తం పోలింగ్ కేంద్రాలు : 32,574
అనుబంధ పోలింగ్ కేంద్రాలు : 217
సున్నిత పోలింగ్ కేంద్రాలు : 10,280 - ఈవీఎంలు
బ్యాలెట్ యూనిట్లు : 51,529
కంట్రోల్ యూనిట్లు :39,763
వీవీ ప్యాట్స్ : 42,751 - పోలింగ్ అధికారులు, సిబ్బంది
రిటర్నింగ్ అధికారులు : 119
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు : 645
పోలింగ్ సిబ్బంది : 1,62,870 - భద్రత ఏర్పాట్లు
రాష్ట్ర పోలీసు బలగాలు : 54 వేల మంది
అవసరమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు : 275 కంపెనీలు
పురుషులు 68.64 శాతం
మహిళలు 69.03 శాతం
మొత్తం 68.78 శాతం
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
ఎప్పుడు : నవంబర్ 12న
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
ఎక్కడ : తెలంగాణ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫొటోతో పోస్టల్ కవర్
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు, ఫొటోతో పోస్టల్ కవర్‌ను రూపొందించారు. నెల్లూరులో నవంబర్ 1న జరిగిన కార్యక్రమంలో తన పేరుతో ఉన్న పోస్టల్ కవర్ పోస్టర్‌ను బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫొటో ఉండే స్టాంప్‌లను ఆయనకు చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రహ్మణ్యం బహూకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫొటోతో పోస్టల్ కవర్
ఎప్పుడు : నవంబర్ 1
ఎక్కడ : నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ కేంద్రానికి శంకుస్థాపన
విశాఖపట్నంలోని యారాడ డాల్ఫిన్ కొండపై నిర్మించనున్న నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ ఫెసిలిటీ కేంద్రానికి కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నవంబర్ 2న శంకుస్థాపన చేశారు. రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే తీరప్రాంత కోత, రక్షణ, సముద్ర కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. లక్షద్వీప్‌లో కొత్తగా 6 డిసాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి హర్షవర్ధన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డెరైక్టర్ జనరల్‌గా కేజే రమేష్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ ఫెసిలిటీ కేంద్రానికి శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
ఎక్కడ : యారాడ డాల్ఫిన్ కొండ, విశాఖపట్నం
విద్యుత్ వాడకంలో తెలంగాణకు అగ్రస్థానం
విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వాడకం విషయంలో అత్యధిక వృద్ధి శాతం నమోదు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం సొంతం చేసుకుంది. 2017-18 సంవత్సరానికి విద్యుత్ రంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన పురోగతి వివరాలను కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) నవంబర్ 3న ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం 13.62 శాతం వార్షిక వృద్ధి రేటు తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్ 11.92 శాతం వృద్ధి రేటుతో రెండో స్థానం దక్కించుకుంది. అలాగే 7.43 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం, 7.40 శాతంతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో నిలిచాయి. అదే సమయంలో దేశ సగటు వృద్ధి 6.11 శాతంగా నమోదైంది.
2016-17లో తెలంగాణ రాష్ట్రంలో 53,017 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా అది 2017-18లో 60,237 మిలియన్ యూనిట్లకు చేరింది. 2016-17 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 11,35,334 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా 2017-18లో 12,04,697 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అయింది. ప్రస్తుతం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యుత్ వాడకంలో తెలంగాణకు అగ్రస్థానం
ఎప్పుడు : నవంబర్ 2
ఎక్కడ : దేశంలో
క్షయ నివారణలో ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమ పురస్కారం
క్షయ నివారణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఉత్తమ పనితీరు’ పురస్కారం లభించింది. ఈ మేరకు అసోంలోని కజిరంగలో ‘ఉత్తమ విధానాలు-ఆవిష్కరణ’లపై నవంబర్ 2న జరిగిన వార్షిక సదస్సులో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రంలో క్షయ వ్యాధి బాధితుల నిర్ధరణ కోసం 220 ఆధునిక యంత్రాలతో సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య ఉన్నారు.
మరోవైపు తల్లుల నుంచి శిశువులకు ఎయిడ్‌స వ్యాపించకుండా ఏపీ తీసుకుంటున్న చర్యలకు కేంద్రం ప్రశంశాపత్రాన్ని అందజేసింది. అనంతపురం జిల్లా జాతీయస్థాయిలో ప్రథమ స్థానం, తూర్పుగోదావరి ఆరో స్థానం దక్కించుకున్నందుకు ఈఎంటీసీటీ (ఎలిమినేషన్ ఆఫ్ మదర్ టూ ఛైల్డ్ ట్రాన్సిమిషన్) అఛీవర్స్ పురస్కారాన్ని కూడా రాష్ట్రం అందుకుంది. ఏపీలోని 18 ఎయిడ్‌స నిర్ధరణ కేంద్రాల(ఐసీటీసీ) పనితీరు ఉత్తమంగా ఉందని గుర్తించిన కేంద్రం ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్‌లెన్సు’ను అందజేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్షయ నివారణలో ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమ పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 2
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ఉత్తమ పనీతీరు కనబరిచినందుకు
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం
వెఎస్సార్ జిల్లా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నవంబర్ 6న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ మేనేజింగ్ లిమిటెడ్ డెరైక్టరుగా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించింది. కార్పొరేషన్‌కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12,000 కోట్లుగా అంచనా వేసింది.
మరోవైపు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం మెట్రో ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దానిని నిర్మించేందుకు జారీచేసిన ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణానికి 2,395.98 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని కూడా తామే సొంతంగా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోైవె పు గ్రామీణ ప్రాంతాల్లో రూ.22 వేల వ్యయంతో తాగునీటి సరఫరా చేయాలని కేబినేట్ నిర్ణయించింది. ‘అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటుకూ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : వెఎస్సార్ జిల్లా కడప, ఆంధ్రప్రదేశ్