మార్చి 2017 రాష్ట్రీయం
Sakshi Education
లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌కు సీఐఐ ‘హరిత’ పురస్కారం
లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌కు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హరిత పురస్కారం దక్కింది. ఈ మేరకు మార్చి 22న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గ్రీన్-కో సిల్వర్ సర్టిఫికేషన్ పురస్కారాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ అందుకున్నారు. నీటి, ఇంధన పొదుపు, పునరుత్పాదన-పునర్వినియోగం, పచ్చదనం వంటి 8 అంశాల్లో ఉత్తమ హరితవిధానాలు అవలంబిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌కు సీఐఐ గ్రీన్-కో సిల్వర్ సర్టిఫికేషన్
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారతీయ పరిశ్రమల సమాఖ్య
ఎందుకు : ఉత్తమ హరితవిధానాలు అవలంబిస్తున్నందుకు
ఎస్‌డీఎఫ్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం (ఎస్‌డీఎఫ్) బిల్లుకి తెలంగాణ శాసనసభ మార్చి 24న ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రగతి పద్దులో జనాభా దామాషాకు అనుగుణంగా ఎస్‌డీఎఫ్‌కి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు కాని నిధులను తర్వాతి ఏడాదికి బదలీ చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌డీఎఫ్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : తెలంగాణ శాసనసభ
ఎందుకు : దళిత, గిరిజన సంక్షేమానికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేసేందుకు
260 మండలాలకు తెలంగాణ పల్లె ప్రగతి
2015లో ప్రారంభించిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని మండలాలకు విస్తరించింది. ఈ మేరకు ప్రస్తుతం 150 మండలాల్లో అమలవుతోన్న కార్యక్రమాన్ని మరో 110 మండలాలకు విస్తరిస్తూ మార్చి 24న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో పల్లె ప్రగతి కిందకు వచ్చే మండలాల సంఖ్య 260కి చేరింది. ఆయా మండలాల్లో ప్రజలకు జీవనోపాధులు కల్పించడం, పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టడం, పౌరసేవలకు వన్‌స్టాప్‌షాప్‌ల ఏర్పాటు తదితర కార్యక్రమాలను పల్లె ప్రగతి కింద చేపడతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం విస్తరణ
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : 260 మండలాల్లో అమలు
ఎందుకు : ఉపాధి, పంటలకు గిట్టుబాటు ధర, పౌర సేవలకు
మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ
విజయవాడకు అధికారికంగా మెట్రోపాలిటన్ సిటీ గుర్తింపు లభించింది. ఈ మేరకు నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న జీవో 104ను జారీ చేసింది. నగరం చుట్టు పక్కల ఉన్న 19 గ్రామాలు దీని పరిధిలోకి చేరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజయవాడకు మెట్రోపాలిటన్ సిటీ హోదా
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గోల్కొండ కోటలో మొఘల్ గార్డెన్ గుర్తింపు
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో 300 ఏళ్ల నాటి మొఘల్ గార్డెన్‌ను పురావస్తు పరిశోధకులు మార్చి 25న గుర్తించారు. కోటలోని నయా ఖిల్లా ప్రాంతంలో ఉన్న ఈ ఉద్యానవనం ఇరాన్‌లోని పర్షియా గార్డెన్ల తరహాలోనే ఉందని వివరించారు. మొఘలుల కాలం కంటే ముందే రూపుదిద్దుకున్న ఈ ఉద్యానవనం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో కుతుబ్‌షాహీల పాలన ముగియటంతోనే కాలగర్భంలో కలిసిపోయినట్లు అంచనా వేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్కొండ కోటలో మొఘల్ గార్డెన్ గుర్తింపు
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : పురావస్తు శాఖ
ఎక్కడ : హైదరాబాద్
బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నెల్లూరు
ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ మలవిసర్జన రహిత (Open Defacation Free) జిల్లాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుర్తింపు పొందింది. ఈ మేరకు జిల్లాలోని 46 మండలాలు, 940 పంచాయతీలను ఓడీఎఫ్‌గా ప్రకటించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మార్చి 26న వెల్లడించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 2,87,587 మరుగు దొడ్లు నిర్మించామని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓడీఎఫ్ జిల్లాగా నెల్లూరు
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : జిల్లాలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించినందుకు
సీసీటీఎన్‌ఎస్ గో లైవ్‌ను ప్రారంభించిన తెలంగాణ పోలీస్
తెలంగాణ పోలీసు శాఖ కొత్తగా సీసీటీ ఎన్‌ఎస్ ( క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్) గో లైవ్ వ్యవస్థను మార్చి 28న ప్రారంభించింది. పోలీస్ కంప్యూటర్ సర్వీస్, టెక్నికల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని ఏ స్టేషన్‌లో ఏ కేసులు నమోదవుతున్నాయన్న విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే దీని ద్వారా ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునే వీలు కలుగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : తెలంగాణ పోలీసు
ఎందుకు : ప్రజల ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునేందుకు
ఆర్థిక సంస్థల్లో 12వ స్థానంలో తెలంగాణ
ఆర్థిక సంస్థల సంఖ్యలో తెలంగాణ దేశంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు లేదా ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలో 10వ స్థానంలో ఉంది. ఈ మేరకు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆరో ఆర్థిక గణన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 28న వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 2013 ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఈ గణన నిర్వహించారు. అంతకు ముందు 2005లో నిర్వహించిన అయిదో ఆర్థిక గణనతో పోలిస్తే తెలంగాణలో ఆర్థిక సంస్థలు 77.94 శాతం పెరిగాయి.
ఆయా ప్రాంత పరిధిలో ఉన్న ఆర్థిక సంస్థలు, యూనిట్లను లెక్కించటమే ఆర్థిక గణన. సరుకుల ఉత్పత్తి లేదా సేవల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వాటిని ఆర్థిక సంస్థలుగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 6వ ఆర్థిక గణన వివరాలు
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : ఆర్థిక సంస్థల్లో 12వ స్థానంలో తెలంగాణ
తెలంగాణ ఆర్టీసీకి ఇంధన పొదుపు పురస్కారం
తెలంగాణ ఆర్టీసీకి ఉత్తమ ఇంధన పొదుపు అవార్డు లభించింది. ఈ మేరకు మార్చి 16న ఢిల్లీలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్‌రోడ్ ట్రాన్‌సపోర్టు అండర్‌టేకింగ్‌స (ఏఎస్‌ఆర్టీయూ) 61వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డును సంస్థ ఎండీ రమణరావు అందుకున్నారు. 4 వేల నుంచి 10 వేల బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో 2015-16 సంవత్సరానికి గాను టీఎస్‌ఆర్టీసీ 5.5 కేఎంపీఎల్ సాధించినందుకు ఈ అవార్డు దక్కింది. ఆ సంవత్సరంలో సంస్థ 9.4 లక్షల లీటర్ల ఇంధనాన్ని, తద్వారా రూ.6.05 కోట్లను ఆదా చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఆర్టీసీకి ఇంధన పొదుపు పురస్కారం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : అసోసియేషన్ ఆఫ్ స్టేట్‌రోడ్ ట్రాన్‌సపోర్టు అండర్‌టేకింగ్స్
ఎందుకు : 2015-16 సంవత్సరంలో 5.5 కేఎంపీఎల్ సాధించినందుకు
తెలంగాణ, ఏపీలో అత్యధిక సిజేరియన్లు
దేశంలో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు మార్చి 17న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన చేసింది. 2015-16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం తెలంగాణలో 58 శాతం సిజేరియన్ ప్రసవాలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో 40.1 శాతం జరుగుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో సిజేరియన్ ప్రసవాలపై ఎన్‌ఎఫ్‌ెహ చ్‌ఎస్-4 రిపోర్టు
ఎప్పుడు : 2015-16
ఎవరు : తెలంగాణలో 58 శాతం, ఏపీలో 40.1 శాతం
ఎర్లీ ప్రెగ్నెన్సీస్ ఏపీ, తెలంగాణలోనే ఎక్కువ
పద్దెనిమిదేళ్ల లోపే తల్లులవుతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని కేంద్ర సర్వే వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వయసుల వారీగా గర్భిణులపై జీఎఫ్‌కే అనే ఓ ప్రైవేటు సంస్థతో సర్వే చేయించిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 19న ఈ వివరాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 10,428 మంది గర్భిణుల్లో 11.8 శాతం (1,230 మంది) 18 లోపు వయసున్న వారు ఉన్నారు. తెలంగాణలో 7,567 మంది గర్భిణుల్లో 10.6 శాతం మంది (757 మంది) 18 ఏళ్ల లోపు వయసున్నవారే అని తేలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో 18 ఏళ్ల లోపు తల్లులపై కేంద్ర సర్వే
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఎందుకు : చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక నిధి బిల్లుకి తెలంగాణ కేబినెట్ ఆమోదం
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్)లకు ప్రత్యామ్నాయంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసే చట్టం ముసాయిదాకు తెలంగాణ కేబినెట్ మార్చి 21న ఆమోదం తెలిపింది. దీని ప్రకారం సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులుఒక ఏడాది ఖర్చు కాకుంటే వచ్చే ఏడాదికి బదిలీ చేస్తారు. అలాగే మూడు నెలలకోసారి అసెంబ్లీకి వ్యయ నివేదిక సమర్పిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక నిధి బిల్లుకి ఆమోదం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : తెలంగాణ మంత్రివర్గం
ఎందుకు : ఖర్చుకాని నిధులను వచ్చే ఏడాదికి బదలీ చేసేందుకు
విశాఖ తీరంలో చమురు, గ్యాస్ నిక్షేపాల గుర్తింపు
విశాఖపట్నం సాగర తీరంలో చమురు, సహజ వాయువులకు అనువైన లోయలు (కానియన్లు)ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు మార్చి 9న వీటికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆర్‌వీ సింధు సంకల్ప్ అనే అత్యాధునిక పరిశోధక నౌక ద్వారా విశాఖపట్నం-శ్రీకాకుళం మధ్య సముద్రంలో ఇటీవల పరిశోధనలు జరిపిన ఎన్‌ఐఓ బృందం విశాఖ పోర్టుకు దక్షిణాన మూడు కాన్యన్లు, భీమిలికి ఉత్తర దిశలో మరో మూడు కాన్యన్లు ఉన్నట్టు తేల్చింది. వీటికి విశాఖ, సంకల్ప్‌గా నామకరణం చేశారు.
కేజీ బేసిన తరహాలో ఒక్కొక్కటి 50-70 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ లోయల్లో హైడ్రో కార్బన్ నిక్షేపాలున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి పరిణామం తెలుసుకునేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశాఖ తీరంలో చమురు, గ్యాస్ నిక్షేపాల గుర్తింపు
ఎప్పుడు : మార్చి 9
ఎక్కడ :విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎవరు : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు
హైదరాబాద్‌లో గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ‘గ్లోబల్ బ్యాడ్మింటన్ అకాడమీ’ ని మార్చి 11న హైదరాబాద్‌లో ప్రారంభించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్‌ట్స అథారిటీ (శాప్)లో కోచ్‌గా పని చేసిన గోవర్ధన్ రెడ్డి ఈ అకాడమీ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనుండగా, ‘ద్రోణాచార్య’ అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరిఫ్ కూడా శిక్షణలో పాలుపంచుకుంటారు. హైదరాబాద్‌తో సహా వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 25 కోర్టులను కూడా ఇక నుంచి గ్లోబల్ అకాడమీనే నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ బ్యాడ్మింటన్ అకాడ మీ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : గుత్తా జ్వాల
ఎక్కడ : హైదరాబాద్
విజయవాడ, విశాఖలో హెల్మెట్ తప్పనిసరి
విజయవాడ, విశాఖపట్నంలో మార్చి 24 నుంచి హెల్మెట్ వాడకంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం రవాణా, పోలీస్ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. 2016లో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8,542 మంది మృతి చెందగా, 30,245 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీటిలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజయవాడ, విశాఖలో హెల్మెట్ వాడకం తప్పనిసరి
ఎప్పుడు : మార్చి 24 నుంచి
ఎవరు : రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూత
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (53) మార్చి 12న కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇస్రోతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), షార్‌లతో మార్చి 15న పలు ఒప్పందాలు చేసుకుంది. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఎస్‌సీతో జలవనరుల శాఖ, షార్‌తో కమాండ్ కంట్రోల్, ఇస్రోతో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా జియో పోర్టల్ ద్వారా జలవనరుల శాఖకు చెందిన వెబ్ పోర్టల్ అభివృద్ధికి ఇస్రో సహాయాన్ని అందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్రో, ఎన్‌ఆర్‌సీఎస్, షార్‌లతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలు
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఇస్రో,ఎన్‌ఆర్‌ఎస్‌సీ ప్రతినిధులు
ఎందుకు : జలవనరుల శాఖకు చెందిన వెబ్ పోర్టల్ అభివృద్ధికి
ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 15న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఏపీ ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇవ్వటంతో పాటు పర్యావరణ అనుమతుల విషయాన్ని కేంద్రమే పర్యవేక్షిస్తుంది. అలాగే ఈఏపీ రుణాల్లో 90 శాతం గ్రాంటుగా చెల్లిస్తుంది. హోదాతో సమానమైన నిధులను విదేశీ సాయం రూపంలో అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీని 2016 నవంబర్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : కేంద్ర కేబినెట్
హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్ టెక్నాలజీస్ సెంటర్ ప్రారంభం
ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం.. జెడ్‌ఎఫ్ టెక్నాలజీస్ భారత్‌లో తన తొలి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో మార్చి 2న ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అసెంబ్లీ భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన శాసనసభ, శాసనమండలి భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 2న ప్రారంభించారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అసెంబ్లీ భవనం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీ రామారావు పేరు
మార్చి 2న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు, తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని పేరు పెట్టేలా తీర్మానించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రవర్గం నిర్ణయించింది. ఇదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మ్యారీటైమ్ బోర్డు డ్రాఫ్ట్ట్ బిల్లు-2017కు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పోర్టు డిపార్ట్‌మెంట్ స్థానంలో పోర్టుల అభివృద్ధి, పరిపాలన కోసం ఈ బోర్డు ఏర్పాటవుతుంది.
హైదరాబాద్‌లో ఆదిరంగ్ మహోత్సవం
ఆదిరంగ్ మహోత్సవం (భారతీయ గిరిజన కళల ప్రదర్శన మహోత్సవం)-2017 హైదరాబాద్‌లోజరిగింది.మార్చి 3 నుంచి 5 వరకూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రదర్శనలో 500 మంది కళాకారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన నృత్య కళలను ఇందులో ప్రదర్శిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదిరంగ్ మహోత్సవం - 2017
ఎప్పుడు : మార్చి 3-5
ఎక్కడ :హైదరాబాద్
ఎవరు :నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ
తెలంగాణ ప్రభుత్వం-గూగుల్ మధ్య ఒప్పందం
డిజిటల్ తెలంగాణకు గూగుల్ సంస్థ సాయం అందించనుంది. ఈ మేరకు మార్చి 3న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం-గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇంటర్నెట్ సాథి అనే కార్యక్రమంతో గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రభుత్వానికి గూగుల్ సహాయం అందిస్తుంది. అలాగే చిన్న, మధ్యతరహా వ్యాపారాల్లో ఆన్‌లైన్ వినియోగంలో సాంకేతిక సహకారాన్ని ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ప్రభుత్వం-గూగుల్ మధ్య ఒప్పందం
ఎప్పుడు : మార్చి 3
ఎందుకు : గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు
లావణి నృత్య ప్రదర్శనకు గిన్నిస్‌లో చోటు
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మార్చి 5న 2,200 మంది విద్యారులు చేపట్టిన లావణి నృత్య ప్రదర్శనకు గిన్నిస్ బుక్‌లో చోటు లభించింది. తనూష్, నీలిమా డ్యాన్‌స అకాడమీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లావణి మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన నృత్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లావణి నృత్య ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ :హైదరాబాద్
ఎవరు :తనూష్, నీలిమా డ్యాన్స్ అకాడమీ
తెలంగాణలో 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం
తెలంగాణ రాష్ట్రంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, నిల్వ, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో 79ను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ-2016గా సవరించి మార్చి 6న ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ, భూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం
ఎప్పుడు : మార్చి 6
ఎక్కడ :తెలంగాణ రాష్ట్రం
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
మూడు భాషల్లో తెలంగాణ శాసనసభ వెబ్‌సైట్
తెలంగాణ శాసనసభకు సంబంధించి తెలుగు, ఉర్దూ భాషల్లోని వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు మార్చి 6న జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఈ వెబ్‌సైట్లను ప్రారంభించారు. ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ని 2014లో ప్రారంభించారు. ఇప్పుడు తెలుగు, ఉర్దూ సైట్లను అందుబాటులోకి తేవడం ద్వారా మూడు భాషల్లో శాసనసభ వెబ్‌సైట్లను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శాసనసభ వెబ్‌సైట్ తెలుగు, ఉర్దూలో ప్రారంభం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
సేవల్లో ఆర్‌జీఐఏకు మొదటి స్థానం
ప్రయాణీకులకు అందించే విమానాశ్రయ సేవల విషయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే మొదటి స్థానం దక్కింది. 2016 సంవత్సరానికి సంబంధించి 50 లక్షలు-కోటిన్నర ప్రయాణికుల విభాగంలో ఈ ర్యాంక్‌ను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్స్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) అందించినట్లు జీఎంఆర్ మార్చి 6న ఒక ప్రకటనలో తెలిపింది.

Published date : 18 Mar 2017 12:22PM