One Time Settlement: శాశ్వత గృహ హక్కు పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది?
గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన ‘‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం(జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం)’’ 2021, డిసెంబర్ 21 నుంచి అమల్లోకి రానుంది. గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం వల్ల దాదాపు 67 లక్షల మంది పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వర్తింపచేసే వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం’గా నామకరణం చేశారు.
సిరిసిల్లలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఎఫ్‌జీవీ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ విషయమై చర్చించేందుకు సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కంపెనీ ప్రతినిధి బృందంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు భేటీ అయ్యారు.
చదవండి: ఎగుమతిదారుల కోసం ఎక్స్‌పోర్ట్ ట్రేడ్ పోర్టల్‌ను రూపొందించిన రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, డిసెంబర్ 21 నుంచి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అమలు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా...
ఎందుకు : గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు...