RRR దక్షిణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌కు చుట్టూ 60, 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతోపాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి. తాజాగా దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. రీజినల్ రింగ్ రోడ్డులోని ప్రతిపాదిత 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపాందించాల్సిందిగా తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఆ సంస్థను ఆదేశించింది. త్వరలో కన్సల్టెన్సీ సంస్థ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి, అలైన్‌మెంట్ తయారీ కసరత్తు ప్రారంభించబోతోంది. దీనితో మొత్తంగా ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించేందుకు మార్గం సుగమమైంది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 27th కరెంట్ అఫైర్స్
రెండు భాగాలుగా రోడ్డుతో..
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపగా గతంలో ఓ కన్సల్టెన్సీతో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను రూపొందించారు. మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్ రోడ్డు ఉంటుందని అందులో ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేసే కే అండ్ జే సంస్థను కన్సల్టెన్సీగా నియమించగా.. ఆ సంస్థ సర్వే చేసి ఉత్తర భాగం పొడవును 158.62 కిలోమీటర్లుగా ఖరారు చేసింది. భూసేకరణలో భాగంగా 3ఏ గెజిట్ల విడుదల వరకు కసరత్తు పూర్తి చేసింది. భూసేకరణ అధీకృత అధికారులుగా ఉన్న ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు సంబంధించి ఇటీవలే విడతల వారీగా ఎనిమిది గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి కూడా.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: పదవీ విరమణ తర్వాత పైలట్‌లు విమానాలను నడిపేందుకు ఏ ఎయిర్‌లైన్ కొత్త విధానాన్ని
ఢిల్లీలోని గ్రీన్‌పార్కు ప్రాంతానికి చెందిన ఇంటర్‌కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ సంస్థకు.. బిహార్, యూపీ రాష్ట్రాల్లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే (పాట్నా రింగ్ రోడ్డు), గంగా బ్రిడ్జి కనెక్టివిటీ ప్రాజెక్టులను కేంద్రం కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగానికి డీపీఆర్ రూపొందించే బాధ్యతనూ ఇచ్చింది.
Also read: Weekly Current Affairs (International) Bitbank: 'లులో రోజ్' అనే అతిపెద్ద పింక్ డైమండ్ ఏ దేశంలో కనుగొనబడింది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP