Telangana DGP: ఇన్‌చార్జి డీజీపీగా అంజనీకుమార్
ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి డిసెంబర్ 31న పదవీవిరమణ పొందుతున్నందున ఆయన స్థానంలో అంజనీకుమార్‌ను నియమించారు. అంజనీకుమార్‌తోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
డీజీపీ అంజనీకుమార్ బయోడేటా
☛ అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
☛ బిహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, ఢిల్లీ యూనివర్సిటీలో విద్యభ్యాసం
☛ గతంలో జనగామ ఏఎస్పీగా, కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్‌గా, ఉమ్మడి ఏపీలో గ్రేహౌండ్స్ చీఫ్‌గా, నిజామాబాద్ రేంజ్ డీఐజీ, వరంగల్ ఐజీగా, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్‌గా, తెలంగాణ పోలీస్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు.
☛ 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
☛ 2021 డిసెంబర్ 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు.
☛ అంజనీకుమార్ ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్(పీస్ మెడల్)ను రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998–99లో బోస్నియా దేశంలో పనిచేశారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకుగానూ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులు వీరే..
అధికారి పేరు | ప్రస్తుత స్థానం | బదిలీ స్థానం |
అంజనీకుమార్ | ఏసీబీ డీజీపీ | డీజీపీ(హెచ్‌వోపీఎఫ్) |
రవిగుప్తా హోంశాఖ | ముఖ్యకార్యదర్శి | ఏసీబీ, డీజీపీ |
డాక్టర్ జితేందర్ | శాంతిభద్రతల అడిషనల్ డీజీ | హోంశాఖ ముఖ్య కార్యదర్శి |
మహేశ్ మురళీధర్ భగవత్ | సీపీ, రాచకొండ | అడిషనల్ డీజీ, సీఐడీ |
దేవేందర్‌సింగ్ చౌహాన్ | అడిషనల్ సీపీ(లా అండ్ ఆర్డర్) | సీపీ, రాచకొండ |
సంజయ్‌కుమార్‌జైన్ | అడిషనల్ డీజీ(పీ అండ్ ఎల్) | శాంతిభద్రతల అడిషనల్ డీజీ |