ఆగస్టు 2017 రాష్ట్రీయం
Sakshi Education
తెలంగాణలో భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళన
భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రంలో రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల వ్యవధిలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు తేదీలను ఖరారు చేశారు. ప్రక్షాళన చేసిన రికార్డుల ఆధారంగానే రైతులకు వ్యవసాయ పెట్టుబడి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం సెప్టెంబర్ 1 నుంచి రైతు సంఘాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ కార్యాచరణ..
ఏమిటి : భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళన
ఎప్పుడు : సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ వరకు
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం
పెట్టుబడి పథకం అమలుకు రైతు సమన్వయ సమితులు
రైతు పెట్టుబడి పథకాన్ని అమలు చేయడం సహా ఇతరత్రా అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సెప్టెంబర్ 9 నాటికి గ్రామ, మండల, జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటును పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమన్వయ సమితులు, వాటి సమన్వయకర్తలను నియమించే (నామినేట్) బాధ్యతను మంత్రులకు అప్పగించింది. రాష్ట్రస్థాయి సమన్వయ సమితిని సీఎం నియమిస్తారు.
ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి దానిలో 15 మంది సభ్యులను నియమిస్తారు. ఇదేవిధంగా మండల, జిల్లా రైతు సమన్వయ సమితిలో 24 మంది సభ్యులు, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. ప్రతీ సమితిలో మూడో వంతు మహిళలు ఉంటారు. ఆ ప్రకారం గ్రామ సమన్వయ సమితిలో ఐదుగురు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితిలో 8 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 14 మంది చొప్పున మహిళలు ఉంటారు.
రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నామినేట్ చేసే రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రూ.500 రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా, పండించిన పంట ఉత్పత్తులకు గ్రామాలు, మండలాల్లో వ్యాపారులతో బేరమాడేందుకు ఈ రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడనుంది.
రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలున్నాయి. దీని ప్రకారం మొత్తం గ్రామ రైతు సమన్వయ సభ్యుల సంఖ్య 1,56,510. అందులో మహిళా సభ్యులు 52,170.
మంగల్‌పల్లి అంగన్‌వాడీ టీచర్‌కు జాతీయ పురస్కారం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి అంగన్‌వాడీ టీచర్ మల్లమ్మకు జాతీయ పురస్కారం లభించింది. మహిళాశిశు సంక్షేమ శాఖ జాతీయ స్థాయిలో 2016-17 సంవత్సరానికి గాను ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త జాతీయ పురస్కారానికి ఆమెను ఎంపిక చేసింది. ఆగస్టు 31న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకుంటారు. పురస్కారం కింద రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక ఇవ్వనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : మల్లమ్మ
ఎక్కడ : మంగల్‌పల్లి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
డాక్టర్ ఏబీఎన్ రావు కన్నుమూత
సుప్రసిద్ధ ఈఎన్‌టీ వైద్య నిపుణుడు, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి వ్యవస్థాపక సూపరింటెండెంట్ ప్రొఫెసర్ అక్కినేపల్లి బద్రి నారాయణరావు(94) ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో ఆగస్టు 28న కన్నుమూశారు. రావు స్వస్థలం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, డాక్టర్ రాజ్ బహదూర్‌గౌర్‌లతో కలసి చదువుకున్న ఏబీఎన్ రావు.. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు సన్నిహితుడు. కోఠి ఈఎన్‌టీ వ్యవస్థాపకుడిగా, మొట్టమొదటి సూపరింటెండెంట్‌గా పని చేశారు. వైద్య రంగంలో సేవలకు గాను బ్రిటన్ నుంచి సీనియర్ స్పెషలిసు అవార్డు అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని రాయల్ డార్విన్ ఆస్పత్రి 1996లో ఆయనకు ‘డార్విన్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందజేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ ఏబీఎన్ రావు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి వ్యవస్థాపకులు
పోలవరం అథారిటీ సభ్యకార్యదర్శిగా శ్రీవాత్సవ
కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె. శ్రీవాత్సవను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలవరం, పట్టిసీమ వాటాలపై న్యాయం కోసం బోర్డు ముందు వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉంచాల్సిన బోర్డు చైర్మన్‌ను, ఏపీ ప్రాజెక్టుకు సభ్య కార్యదర్శిగా నియమించడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శిగా శ్రీవాత్సవ
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఏపీలో జలసిరికి హారతి కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 6 - 8 వరకు ‘‘జలసిరికి హారతి’’ కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. నదుల నుంచి చెరువుల వరకు రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజులు పూజించుకునేలా, ఇందులో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జలసిరికి హారతి కార్యక్రమం
ఎప్పుడు : సెప్టెంబర్ 6 - 8
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : జలవనరులను పూజించేందుకు
వారసత్వ సంపద పరిరక్షణకు 7 అకాడమీలు
తెలుగు భాషా, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వ సంపదను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు అకాడమీలను ఏర్పాటు చేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగస్టు 29న జరిగిన తెలుగు భాషా దినోత్సవంలో సాహిత్య, సంగీత, నృత్య, నాటక, దృశ్య కావ్య, జానపదకళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీల ఏర్పాటుకు సంబంధించిన జీవోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గతంలో ఉన్న అధికార భాషాచట్టం స్థానంలో తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సాహిత్య, సంగీత, నృత్య, నాటక, దృశ్య కావ్య, జానపదకళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అకడామీల ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : వారసత్వ సంపద పరిరక్షిణకు
ఏపీకి మరో 1.20 లక్షల ‘పీఎంఏవై’ ఇళ్ల మంజూరు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఆంధ్రప్రదేశ్‌కు 1,20,894 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు మొత్తం 2,17,900 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆగస్టు 29న ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 26 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేయగా ఇందులో ఏపీ వాటా 20.71 శాతం. అలాగే రాష్ట్రానికి ఇప్పటి వరకు మొత్తం 5,41,300 ఇళ్లు మంజూరు కాగా వీటికి రూ.31,056 కోట్ల మేర పెట్టుబడి ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించి రూ.8,138 కోట్ల మేర కేంద్రం సాయంగా అందనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎంఏవై కింద ఏపీకి 1.20 లక్షల ఇళ్లు మంజూరు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ
తెలంగాణలో స్వచ్ఛ భారత్ హ్యాకథాన్ 1.0
తెలంగాణ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ హ్యాకథాన్ 1.0 ను ఆగస్టు 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ప్రారంభించారు. సాంకేతిక కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, రాష్ట్రంలోని ఎంపిక చేసిన జిల్లాల నుంచి డీఆర్‌డీఓలు సహా యూనిసెఫ్ బృందం ఇందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్ స్వచ్ఛభారత్ మిషన్ అమలు విషయంలో తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరకాలంగా మంచి ప్రగతి కనబర్చిందని తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ డెరైక్టర్ నీతూ ప్రసాద్ తెలంగాణలో ఇప్పటికే 53% వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయన్నారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మేడ్చల్ జిల్లాలు బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించుకున్నాయని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ భారత్ హ్యాక్‌థాన్ 1.0
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఎందుకు : పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు
ఏపీకి ‘జాతీయ స్వచ్ఛ విద్యాలయ’ పురస్కారం
జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలను మెరుగ్గా పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. ఒక్కో రాష్ట్రంలోని 40 పాఠశాలల నుంచి ఎంట్రీలను ఆహ్వానించగా, మొత్తం 24 రాష్ట్రాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 960 ఎంట్రీల్లో 172 ను ఎంపిక చేసి ఉత్తమ ప్రమాణాలున్న పాఠశాలలకు ఈ పురస్కారాలను ప్రకటించారు. తమిళనాడు నుంచి అత్యధికంగా 25 పాఠశాలలు అత్యుత్తమ ప్రమాణాలున్నవిగా ఎంపిక కాగా, ఏపీ నుంచి 21 పాఠశాలలు ఎంపికయ్యాయి. అలాగే రాజస్తాన్ నుంచి 15 పాఠశాలలు అత్యుత్తమమైనవిగా ఎంపికయ్యాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలకు ‘‘జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను’ సెప్టెంబరు 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో బహుకరిస్తారు. అలాగే అత్యుత్తమ ఆరోగ్య, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్న ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున నగదును అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : పాఠశాలల్లో పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలను మెరుగ్గా పాటిస్తున్నందుకు
తెలంగాణలో తొలి స్మార్ట్ పోలీసు స్టేషన్ ప్రారంభం
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఈ స్టేషన్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని తెలిపారు. 13 జిల్లాల్లో నూతనంగా ఎస్పీ కార్యాలయాలతోపాటు మూడు కమిషనరేట్ కార్యాలయాల నిర్మాణానికి రూ.375 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : ఆర్థికమంత్రి ఈటల రాజేందర్
ఎక్కడ : జమ్మికుంట, కరీంనగర్
తెలంగాణలో మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్ 181ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 19న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెల్ప్‌లైన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వేధింపులు, దాడులకు గురైన మహిళలు 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేక హెల్ప్‌లైన్-181 ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : మహిళలపై వేధింపులను అరికట్టడానికి
కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ పురస్కారం
ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్‌షిప్-2017 పురస్కారానికి పాలసీ లీడర్‌షిప్ విభాగం కింద తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంపికయ్యారు. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఏడాది పురస్కారాన్ని ప్రకటించారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్‌ను ఈ పురస్కారానికి సిఫారసు చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో పురస్కార ప్రదానం జరగనుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి 2008 నుంచి భారత ఆహార, వ్యవసాయ మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) ఈ పురస్కారాలను అందజేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్‌షిప్ - 2017 పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : భారత ఆహార, వ్యవసాయ మండలి
ఎందుకు : రైతుల జీవితాల్లో మార్పునకు కృషి చేస్తున్నందుకు గాను
సీఎస్‌సీ నిర్వహణలో దేశంలోనే మొదటి స్థానంలో సింగోటం
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా సామాన్య జనాలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ల నిర్వహణలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఐదు నెలల్లో రూ.4 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీలో ఆగస్టు 22న జరిగిన నేషనల్ కాన్ఫరెన్‌స ఆన్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ త్రూ సీఎస్‌సీఎస్ కార్యక్రమంలో సింగోటంలోని కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకురాలు బి.పద్మ పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కామన్ సర్వీస్ సెంటర్ల నిర్వహణ అవార్డులు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశంలోనే మొదటి స్థానంలో సింగోటం గ్రామం
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన
నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 10న శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు వరద కాలువ జీరో పాయింట్ వద్ద నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. 2018 ఆగస్టు నాటికి కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్‌ను నింపుతామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం పూర్తయితే ఏటా ఫిబ్రవరి, మార్చిలోగా 90 టీఎంసీల నీళ్లు ఈ ప్రాజెక్టులోకి వస్తాయని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సారెస్పీ పున రుజ్జీవ పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ముఖ్యమంత్రి కేసీఆర్
ఎక్కడ : పోచంపాడు, నిజామాబాద్ జిల్లా
నంది, ఎన్టీఆర్ అవార్డుల ఎంపికకు కమిటీలు
నంది, ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఇతర చలనచిత్ర అవార్డుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 10న ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు 2014 సంవత్సరానికి నంది ఫిల్మ్ అవార్డుల ఎంపిక కోసం నటుడు గిరిబాబు అధ్యక్షతన, 2015 సంవత్సరానికి జీవిత రాజశేఖర్, 2016 సంవత్సరానికి పోకూరి బాబూరావు అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డులతో పాటు బీ.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి మరియు చక్రపాణి జాతీయ ఫిల్మ్ అవార్డులు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డుల ఎంపిక కోసం నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నంది, ఎన్టీఆర్ అవార్డుల ఎంపికకు కమిటీలు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : 2014, 2015, 2016 సంవత్సరాలకు అవార్డుల ఎంపిక కోసం
హైదరాబాద్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2017 నవంబర్ 28-30 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. భారత్, అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ పెట్టుబడిదారుల సద స్సు
ఎప్పుడు : నవంబర్ 28-30
ఎక్కడ : హైదరాబాద్
ఎవరు : భారత్, అమెరికా
ఏపీఎస్‌ఆర్టీసీకి జాతీయ రవాణా ప్రతిభా పురస్కారం
ఏపీఏస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయి రవాణా ప్రతిభ పురస్కారం దక్కింది. ప్రజా రవాణా వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు అనే అంశంపై ఆల్ ఇండియా స్టేట్ రోడ్ ట్రాన్‌సపోర్ట్ అండర్ టేకింగ్‌స (ఏఎస్‌ఆర్‌టీయూ) అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఆగస్టు 10, 11 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సదస్సులో వాహన తయారీదారులు, వాహన విడి భాగాల తయారీ దారులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ రవాణా రంగంలో వివిధ అంశాలపై నివేదికలు సమర్పించారు. ‘టెస్ట్ బ్రాండింగ్’, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్‌స విభాగంలో నూతన అల్ట్రా డీలక్స్ బ్రాండ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టినందుకుగాను ఈ పురస్కారం దక్కింది. పురస్కారం కింద ట్రోఫీ, ప్రశంసా పత్రం, రూ.2.50 లక్షల నగదు బహుమతి, ఏపీఎస్‌ఆర్టీసీకి దక్కాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీఎస్‌ఆర్టీసీకి జాతీయ రవాణా ప్రతిభా పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : ఆల్ ఇండియా స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్
ఎక్కడ : న్యూఢిల్లీలో
తెలంగాణ ప్రభుత్వ అధికారులకు ఉత్తమ సేవ అవార్డులు
వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించినవారికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాహితీవేత్తలు, స్వచ్ఛంద సేవకుల (సోషల్ వర్కర్లకు)కు ఈ అవార్డులు ప్రకటించింది. ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగిన 71వ పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీరికి అవార్డులు అందజేశారు.
అవార్డు గ్రహీతలు..
పొలీసు శాఖ
అంజనీకుమార్ ఐపీఎస్, రాజీవ్ రత్న ఐపీఎస్, ఎన్.సూర్యనారాయణ ఐపీఎస్, ఎం.శివకుమార్ ఐపీఎస్
సాంస్కృతిక శాఖ
సుద్దాల అశోక్ తేజ (తెలుగు పాటలు), జయరాజు (తెలుగు పాటలు), భాష్యం విజయసారధి(తెలుగు, సంస్కృత పండితుడు)
తెలంగాణ స్టేట్ ఇన్‌సెంటివ్ అవార్డు
డాక్టర్ జే రమేష్, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో ఆర్మూర్
హరిత మిత్ర
వై.శేఖర్‌రెడ్డి(ప్రజా ప్రతినిధి, వరంగల్ రూరల్), పెద్ది సుదర్శన్‌రెడ్డి (ప్రజా ప్రతినిధి, వరంగల్ రూరల్), సి. శ్రీధర్‌రావు (డీఎఫ్‌వో, సిద్దిపేట), ఎంపీపీఎస్, మురపల్లి, జగిత్యాల. జనరల్ మేనేజర్, ఫారెస్టు, ఎస్‌సీసీఎల్ రామగుండం-1, పెద్దపల్లి.
ఏపీ ఉద్యోగులకు ప్రోత్సాహక పురస్కారాలు
విధి నిర్వహణలో విశేష సేవలందించిన 22 మంది ప్రభుత్వ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహక పురస్కారాలను ప్రకటించింది. ఆగస్టు 15న తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రదానం చేశారు. పురస్కారానికి ఎంపికై న వారికి రూ.20 వేల చొప్పున నగదు బహుమతి అందజేశారు.
పురస్కార గ్రహీతలు
ఏపీఎస్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న కె.రమేష్, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పీ రవికుమార్, బీసీ వెల్ఫేర్‌లో డిప్యూటీ సెక్రెటరీ జీ రాజపుష్ఫ, ఏసీబీ డీఎస్పీలు ఏ. రమాదేవి, ఎస్‌వీవీ ప్రసాదరావు, ఏసీబీలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఏ.రవిశంకర్, ఏసీబీ ఇన్‌సపెక్టర్ డీ. సుదర్శన్‌రెడ్డి, శ్రీకాకుళం రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈఈ ఆర్‌ఆర్ విద్యాసాగర్, కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏడీ ఎస్. వెంకటేశ్వర్లు, సీసీఎల్‌ఏ మాజీ ప్రాజెక్టు డెరైక్టర్ పీ రంజిత్‌బాషా, జీఏడీ విభాగంలో పనిచేసే ఏఎస్‌వో పీ రామకృష్ణబాబు, సెక్షన్ ఆఫీసర్ ఎస్‌ఏ రషీద్, హోం శాఖలో పనిచేసే ఏఎస్‌వో వీ. బంగారం, వై.లీలా సరస్వతి, ఆర్థిక శాఖ డీఎఫ్‌ఏ మహ్మద్ ఇంతియాజ్, ఏఎస్‌వో ఎంఎస్ రంగశాయి శేషు, సీనియర్ అకౌంటెంట్ రంగా నాయక్, సెక్రెటేరియట్ సీనియర్ ఆడిటర్ వై. వరలక్ష్మి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ కమిషనర్లు జీ. బాలసుబ్రహ్మణ్యం, ఎం. శివప్రసాద్, ప్రాజెక్టు డెరైక్టర్ ఏ. కల్యాణ చక్రవర్తి, సీఎం స్పెషల్ సెక్రెటరీ పీఏ కె. వరప్రసాద్‌లు పోత్సాహక నగదు పురస్కారాన్ని అందుకున్నారు.
కిలిమంజారోను అధిరోహించిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎత్తయిన కిలిమంజారో (5,895 మీటర్లు) పర్వత శిఖరాన్ని ఆగస్టు 14న అధిరోహించారు. శిఖరాగ్రాన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దిన సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గిరిజన వీరుడు కుమ్రం భీంల చిత్రపటాలను ప్రదర్శించారు.
తెలంగాణ నుంచి సబావత్ సునీత(10వ తరగతి), నాయిని మల్లేశ్ (ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల), ఆనంద్‌కుమార్, శ్రీకుమార్, అరుణ్ కుమార్ (నల్లగొండ), చరణ్‌రాజ్ (డిగ్రీ విద్యార్థి), రాఘవేంద్ర (మహబూబ్‌నగర్) బృందంలో ఉన్నారు. ఏపీ నుంచి సత్యారావు (డిగ్రీ విద్యార్థి, బంగారుపాళెం, విశాఖపట్నం), రఘునీథ్ (మౌంటెనీరింగ్ గైడ్, తాడేపల్లి, గుంటూరు) ఈ బృందంలో ఉన్నారు. తమిళనాడు నుంచి నలుగురు, పశ్చిమ బంగ, మహారాష్ట్రల నుంచి ఒక్కొ క్కరు కూడా బృందంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిలిమంజారోను అధిరోహించిన భారత విద్యార్థుల బృందం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : తెలంగాణ, ఏపీ నుంచి 9 మంది విద్యార్థులు
ఎక్కడ : ఆఫ్రికా
హైదరాబాద్‌లో ప్రపంచ ఆప్టోమెట్రీ కాంగ్రెస్
2వ ప్రపంచ ఆప్టోమెట్రీ కాంగ్రెస్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరగనున్న ఈ సదస్సులో కంటి వైద్య చికిత్సలో నూతన విధానాలు, అధునాత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించనున్నారు. 1500 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ది ఆసియా పసిఫిక్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ఇండియన్ విజన్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2వ ప్రపంచ ఆప్టోమెట్రో కాంగ్రెస్
ఎప్పుడు : సెప్టెంబర్ 11-13, 2017
ఎక్కడ : హైదరాబాద్
ఎవరు : వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ది ఆసియా పసిఫిక్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ఇండియన్ విజన్ ఇనిస్టిట్యూట్
ఏపీ ఉపాధ్యాయుడు కంభం వెంకటేశ్‌కు రాష్ట్రపతి అవార్డు
కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె హైస్కూల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు కంభం వెంకటేశు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఎంపిక చేసే జాతీయ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఈయన ఒక్కరే ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : కంభం వెంక టేశ్
ఎక్కడ : వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
సుబ్బలక్ష్మికి మాలతీ చందూర్ పురస్కారం
ప్రముఖ కథ, నవలా రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మికి 2017 సంవత్సరానికి మాలతీ చందూర్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆగస్టు 21న హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోని ఎన్టీ రామారావు కల్యాణ మండపంలో సుబ్బలక్ష్మికి అవార్డును ప్రదానం చేస్తామన్నారు.
మాలతీ చందూర్ మరణం తర్వాత ఆమె పేరిట కుటుంబ సభ్యులు పురస్కారాన్ని నెలకొల్పారు. 2014 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాలతీ చందూర్ పురస్కారం - 2017
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : శివరాజు సుబ్బలక్ష్మి
ఎందుకు : సౌహిత్య రంగంలో చేసిన సేవలకు గాను
ఏపీలో మహిళల రక్షణకు ‘అభయ’
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు ‘అభయ’ పేరుతో మొబైల్ యాప్ (ప్రాజెక్టు) ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఏ సమయంలోనైనా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చేయడమే దీని లక్ష్యం. ఇందుకోసం తొలివిడతగా ఏపీకి రూ.56 కోట్లు కేటాయించింది.
క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స(ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేలా ‘అభయ’ ప్రాజెక్టును రూపొందించారు. ‘అభయ’ ప్రాజెక్టు అమల్లోకి వస్తే క్యాబ్‌లు, ఆటోలతో పాటు ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలన్నింటికి జీపీఎస్ అమర్చుకోవాల్సి ఉంటుంది. రవాణా, పోలీసుశాఖ సిబ్బంది కాల్‌సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. అభయ ప్రాజెక్టును విశాఖ, విజయవాడల్లో మొదట ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘అభయ’ అనే ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : మహిళలకు రక్షణ కల్పించేందుకు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎక్స్‌ప్రెస్ భద్రత తనిఖీ
శంషాబాద్ విమానాశ్రయంలో ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ(భద్రత) తనిఖీ విధానాన్ని ఆగస్టు 4న ప్రారంభించారు. దీని కింద దేశీయ ప్రయాణికులతో పాటు బ్యాగేజీ తనిఖీ ఉంటుంది. దేశంలోనే తొలిసారి ఈ బోర్డింగ్‌ను ప్రవేశపెట్టిన జీఎంఆర్ ఎయిర్‌పోర్టు.. తనిఖీని వేగవంతం చేసే చర్యలో భాగంగా దీనిని ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎక్స్‌ప్రెస్ భద్రత తనిఖీ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎక్కడ : జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
తెలంగాణలో రెరా నిబంధనలు ఖరారు
తెలంగాణలో రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్-2016) చట్టం నిబంధనలు ఖరారయ్యాయి. ఈ మేరకు జూలై 31న జారీ చేసిన ఈ ఉత్తర్వులను ప్రభుత్వం ఆగస్టు 3న బహిర్గతం చేసింది. 2017 జనవరి 1, ఆ తర్వాత అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఈ చట్టం వర్తించనుంది. జనవరి 1 కన్నా ముందు అనుమతులు పొందిన ప్రాజెక్టులు ఇంకా నిర్మాణంలో ఉండి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ / కంప్లీషన్ సర్టిఫికెట్‌ను ఇంకా పొందని ప్రాజెక్టులకు ఈ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. కొనుగోలుదారులు, ప్రమోటర్ల మధ్య వివాదాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ పరిష్కరించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెరా చట్టం - 2017 నిబంధనలు ఖరారు
ఎప్పుడు : జూలై 31
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలో
ఆరోగ్య పరీక్షలకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం
బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు మైక్రోసాఫ్ట్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. క్లౌడ్ బేస్డ్ అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం సహాయంతో ఈ మేరకు ఆరోగ్య పరీక్షలను మైక్రోసాఫ్ట్ నిర్వహించనుంది. దీంతోపాటు బాలల్లో అంధత్వాన్ని నివారించేందుకు మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ఫర్ ఐ కేర్ (మైన్) కార్యక్రమాన్ని సైతం రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆగస్టు 4న ఒప్పందం కుదుర్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరోగ్య పరీక్షలకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : రాష్ట్రంలోని బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు
అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
తెలంగాణలోని చేనేత, హస్త కళల ఉత్పత్తులకు తమ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మార్కెటింగ్ కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ, అమెజాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చేనేత, హస్తకళల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఉత్పత్తులను లిస్ట్ చేయడం వంటి అంశాల్లో నేత కార్మికులు, హస్త కళల నిపుణులకు అమెజాన్ శిక్షణ ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎందుకు : చేనేత, హస్తకళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు

- సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు
- గ్రామ రైతు సంఘాల సమన్వయ సమితి ఏర్పాటు. గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నవారంతా రైతు సంఘంలో సభ్యులుగా ఉంటారు. 11 మందితో సమన్వయ సమితులు ఏర్పాటవుతాయి.
- సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు - మండల స్థాయిలో సమితుల సదస్సుల నిర్వహణ
- సెప్టెంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
- సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా రికార్డుల ప్రక్షాళన.

Published date : 17 Aug 2017 01:39PM