ఫిబ్రవరి 26 - మార్చి 3 కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్
1. ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలీమర్ లిమిటెడ్
2) భారత్ పెట్రోలియం లిమిటెడ్
3) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
4) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
2. అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ఫిచ్ భారత ఆర్థిక సంవత్సరం 2020 (ఎఫ్వై 20) కోసం జి.డి.పి.ని 5.1 శాతం నుంచి ఎంత తగ్గించింది?
1) 4.6%
2) 5.0%
3) 4.4%
4) 4.9%
- View Answer
- సమాధానం: 4
3. ఇటీవల రిటైర్మంట్ ప్రకటించిన టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా ఏ దేశానికి చెందింది?
1) రష్యా
2) సెర్బియా
3) స్విట్జర్లాండ్
4) స్పెయిన్
- View Answer
- సమాధానం: 1
4. జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బెర్లినేల్) 2020లో గోల్డెన్ బేర్ అవార్డును గెల్చుకున్న చిత్రం ఏది?
1) ద ట్రబుల్ విత్ బీయింగ బోర్న్
2) దేర్ ఈజ్ నో ఇవిల్
3) నెవర్ రేరల్లీ సమ్‌టైమ్స్
4) ద ఉమెన్ హూ ర్యాన్
- View Answer
- సమాధానం: 2
5. భారతదేశం తరపున ఖతార్‌లోని దోహాలో జరిగిన యూఎస్–తాలిబాన్ శాంతి ఒప్పందానికి హాజరైన భారత రాయబారి ఎవరు?
1) లలిత్ మాన్సింగ్
2) పి.కుమారన్
3) హర్షవర్దన్ ష్రింగ్లా
4) ఎ.కె. సింగ్
- View Answer
- సమాధానం: 2
6. యూకె, స్విట్జర్లాండ్, భారతదేశాల నుంచి నిపుణుల బృందం జయంతియా కొండలలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతుల గుహ చేపలను కనుగొన్నారు. ఈ జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) అస్సాం
2) మణిపూర్
3) మిజోరాం
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 4
7. మెక్సికన్ ఓపెన్ లేదా అబియెర్టో మెక్సికో టెల్సెల్ టైటిల్ గెలుచుకున్న మొదటి మెక్సికన్ క్రీడాకారిణి?
1) అన్నీ ఫెర్నాండెజ్
2) హీథర్ వాట్సన్
3) గియులియానా ఓల్మోస్
4) డేనియల్ గార్జా
- View Answer
- సమాధానం: 3
8. 2020 ఫిబ్రవరి 26న విడుదలైన ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్ ప్రకారం నెం.1 టెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరు?
1) విరాట్ కొహ్లి
2) కేన్ విలియంసన్
3) రోహిత్ శర్మ
4) స్టీవ్ స్మిత్
- View Answer
- సమాధానం: 4
9. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద 7 ఓపీవీ సిరీస్‌లో 6వ నౌక ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ ‘యార్డ్ 45006వజ్ర’ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది?
1) మజాగాన్ డాక్ లిమిటెడ్
2) గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్
3) హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
4) ఎల్ అండ్ టీ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
10. ‘ఇండస్ట్రీ 4.0–ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ’ అనే నేపథ్యంతో ప్రపంచ ఉత్పాదకత కాంగ్రెస్ 2020, 19వ ఎడిషన్‌ను ఏ నగరం నిర్వహించనుంది?
1) భూపాల్
2) బెంగళూరు
3) నోయిడా
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
11. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకునే జాతీయ విజ్ఞాన దినోత్సవం ఉద్దేశం ఏమిటి?
1) ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తులుకు సైన్స్
2) సైన్స్‌లో మహిళలు
3) సైన్స్ కోసం ప్రజలు, ప్రజల కోసం సైన్స్
4) స్థిరమైన భవిష్యత్ కోసం సైన్స్
- View Answer
- సమాధానం: 2
12. ఏటా మార్చి 3న జరుపుకునే వన్యప్రాణి దినోత్సవం–2020 నేపథ్యం ఏమిటి?
1) వన్యప్రాణుల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది
2) యువస్వరాలను వినండి
3) భూమిపై అన్ని జీవజాతులను నిలబెట్టడం
4) పెద్ద పిల్లులు
- View Answer
- సమాధానం: 3
13. ‘2019 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–రీజియన్, సిటీ పి.ఎం.2.5 ర్యాంకింగ్’ పేరుతో ఐక్యూ ఎయిర్ ఎయిర్విజువల్ నివేదిక ప్రకారం అత్యంత కలుషితమైన దేశ జాబితాలో భారతదేశం ర్యాంక్?
1) 17
2) 9
3) 7
4) 5
- View Answer
- సమాధానం: 4
14. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 1వ ఖేలో విశ్వవిద్యాలయ ఆటల చిహ్నం ఏది?
1) జే, బిజయ్
2) విజయ్, విజయ
3) జయ, విజయ్
4) బిజయ్, విజయ్
- View Answer
- సమాధానం: 1
15. జాతీయ సైబర్ రీసెర్చ్, ఇన్నోవేషన్, కెపాసిటీ సెంటర్‌ను హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఏ నగరంలో ప్రారంభించారు?
1) పుణె, మహారాష్ట్ర
2) కోల్‌కతా, పశ్చిమబెంగాల్
3) హైదరాబాద్, తెలంగాణ
4) గువాహటి, అసోం
- View Answer
- సమాధానం: 3
16. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కింది ఏ ఈశాన్య రాష్ట్రంలో డీలిమిటేషన్ వ్యాయామానికి ఆమోదం తెలిపారు?
1) అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్
2) మణిపూర్
3) నాగాలాండ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
17. రెండు రోజుల ‘నిమాద్ చిల్లీ పండుగ 2020’ ను ఏ రాష్ట్రం జరుపుకుంది?
1) ఒడిశా
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
18. ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసర్ నివేదిక ప్రకారం ‘వర్డ్లైన్ ఇండియా డిజిటల్ చెల్లింపులు 2019’ పేరుతో అత్యధిక డిజిటల్ లావాదేవీల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) తెలంగాణ
2) పశ్చిమ బెంగాల్
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
19. హురున్ రీసెర్చ్ ఇన్సిట్యూట్, షిమావో షెన్కాంగ్ ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్తంగా విడుదలచేసిన ‘ది హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020’ ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు?
1) లారీ పేజ్
2) బెర్నార్డ్ ఆర్నాల్ట్
3) జెఫ్ బెజోస్
4) బిల్‌గేట్స్
- View Answer
- సమాధానం: 3
20. ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసర్ నివేదిక ప్రకారం ‘వరల్డ్‌లైన్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ 2019’ పేరుతో 2019లో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరిపిన నగరం ఏది?
1) హైదరాబాద్
2) కొలకత్తా
3) బెంగళూరు
4) ముంబై
- View Answer
- సమాధానం: 3
21. ఆఫ్‌షోర్ ఇండియా రూపాయి ద్వారా 10 సంవత్సరాల బాండ్లు కలిగిన 118 మిలియన్ డాలర్లను సంపాదించిన సంస్థ ఏది?
1) ప్రపంచ బ్యాంక్
2) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
3) ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్
4) ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
22. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మొదటి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌ను ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలోప్రారంభించారు?
1) లేహ్, లడఖ్
2) గ్యాంగ్‌టక్, సిక్కిం
3) సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
4) షిల్లాంగ్, మేఘాలయ
- View Answer
- సమాధానం: 1
23. ప్రోటీన్ ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ‘ప్రోటీన్ క్యాహై’ అనే నేపథ్యంతో భారతదేశం మొదటి ప్రోటీన్ డేను ఏ రోజున జరుపుకుంటుంది?
1) జూలై 4
2) ఫిబ్రవరి 27
3) జనవరి 29
4) సెప్టెంబర్ 8
- View Answer
- సమాధానం: 2
24. రైజ్–2020– ‘సామాజిక సాధికారత కోసం బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు’అనే నేపథ్యంతో మొదటి కృత్రిమ మేధస్సు సమావేశాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది?
1) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3) సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
4) ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
25. ‘2019 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–రీజియన్, సిటీ పిఎమ్ 2.5 ర్యాంకింగ్’ పేరుతో ఐక్యూ ఎయిర్ ఎయిర్ విజువల్ నివేదిక ప్రకారం ప్రపంచంలో తక్కువ గాలి నాణ్యత కలిగిన నగరాల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) ఘజియాబాద్
2) న్యూఢిల్లీ
3) పూణె
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
26. రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే మొదటి రెస్టారెంట్ ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ను ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు?
1) దుర్గాపుర స్టేషన్, రాజస్థాన్
2) అసన్సోల్ స్టేషన్, పశ్చిమబెంగాల్
3) హరిద్వార్ స్టేషన్, ఉత్తరాఘండ్
4) సూరత్గర్ స్టేషన్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
27. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 1వ ఖేలో విశ్వవిద్యాలయ క్రీడల్లో పతకాల జాబితాలో ఏ భారతీయ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది?
1) సావిత్రిభాయి ఫులే పూణె విశ్వవిద్యాలయం
2) అన్నా విశ్వవిద్యాలయం
3) పంజాబ్ విశ్వవిద్యాలయం
4) కళింగ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 3
28. కలప అక్రమ రవాణా, పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ, పెట్రోలియం ఉత్పత్తులు, సమాచార రంగాలలో పోరాడటానికి క్యాబినేట్ అవగాహన ఒప్పందాలను ఆమోదించి, ఏ ఆసియా దేశంతో భారత్ 3 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది?
1) చైనా
2) మయన్మార్
3) బంగ్లాదేశ్
4) థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 2
29. ఇజ్రాయెల్‌కు చెందిన టెలీ అవీవ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్న ఆక్సిజన్ లేకుండా జీవించగల మొట్టమొదటి జంతువుపేరు ఏమిటి?
1) వికుగ్నా పాకోస్
2) డాసిపస్ నవలసింక్టస్
3) క్రికెటులస్ గ్రిసియస్
4) హెన్నెగుయా సాల్మినికోలా
- View Answer
- సమాధానం: 4
30. డా. స్వరాజ్య అవార్డులు 2020లో డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ అవార్డు రాజకీయాలకుగాను ఎవరికి వచ్చింది?
1) వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
2) బిప్లాబ్ కుమార్ దేబ్
3) ప్రమోద్ సావంత్
4) సర్బానంద సోనోవాల్
- View Answer
- సమాధానం: 4
31.నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్సి)కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన మొదటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి రాష్ట్రం ఏది?
1) జార్ఖండ్
2) తెలంగాణ
3) బీహార్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
32. ‘ఓఈసీడీ మధ్యంతర ఆర్థిక అంచనా కరోనా వైరస్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది’ అనే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) నివేదిక ప్రకారం 2020 సంవత్సరానికి భారతదేశ అంచనా వృద్ధిరేటు(జి.డి.పి.) ఎంత?
1) 5.0%
2) 4.6%
3) 5.1%
4) 4.9%
- View Answer
- సమాధానం: 3
33. తాజా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచ ర్యాంకింగ్స్ 2020లో భారత పురుషుల జట్టు ర్యాంక్ ఎంత?
1) 6
2) 4
3) 9
4) 8
- View Answer
- సమాధానం: 2
34. భారత ప్రభుత్వం ‘ఆపరేషన్స్ గ్రీన్ పథకం’ కింద రూ.162కోట్లను మంజూరు చేసింది. ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది?
1) ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3) వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 1
35. స్వామి వివేకానంద కర్మయోగి అవార్డు2020తో ఎవరిని సత్కరించారు?
1) సుమైరా అబ్దులాలి
2) కింక్రీ దేవి
3) చండి ప్రసాద్ భట్
4) జాదవ్ పయెంగ్
- View Answer
- సమాధానం: 4
36. ఇన్సిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదాను ఇచ్చే బిల్లును కేంద్ర కేబినేట్ కింది ఏ సంస్థలను ఆమోదించింది?
1) నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, కుండ్లీ, హర్యానా
2) నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, తంజావూరు, తమిళనాడు
3) నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఇండోర్, మధ్యప్రదేశ్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
37. మల్టీనేషనల్ ఫైనాన్స్ సర్వీస్ కంపెనీ మాస్టర్ కార్డ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) మార్క్ స్క్వార్టజ్
2) సిల్వియో బార్జీ
3) మైఖేల్ మీబాచ్
4) ఆల్ఫ్రెడ్ ఎఫ్ కెల్లీ
- View Answer
- సమాధానం: 3
38. మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ 20) 100 మ్యాచ్‌లు ఆడిన మొదటి క్రికెటర్ ఎవరు?
1) విరాట్ కొహ్లి
2) కేన్ విలియంసన్
3) క్రిస్ గేల్
4) రాస్ టేలర్
- View Answer
- సమాధానం: 4
39. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ నిర్వహించిన నేషనల్ వర్కషాప్ ఆన్ ఎక్స్‌ప్లోజివ్ డిటెక్షన్ (ఎన్డబ్ల్యూఈడీ–2020) ఎక్కడ జరిగింది?
1) భోపాల్, మధ్యప్రదేశ్
2) కటక్, ఒడిశా
3) నోయిడా, ఉత్తరప్రదేశ్
4) పూణె, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
40. ఎన్సీఎఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వీసెస్ ఇండెక్స్ (ఎన్–ఎల్ఆర్ఎస్ఐ 2019–20) మొదటి ఎడిషన్ ప్రకారం భూరికార్డులను డిజటలైజ్ చేసే విషయంలో భారతదేశంలో ఉత్తమంగా పనిచేసిన రాష్ట్రం ఏది?
1) పంజాబ్
2) తెలంగాణ
3) ఒడిశా
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
41. ‘ఎయిర్‌ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ చైర్ ఆప్ ఎక్స్‌లెన్స్’ పేరుతో ఎక్స్‌లెన్స్ కుర్చీని స్థాపించడానికి భారత వైమానిక దళంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న భారత విశ్వవిద్యాలయం ఏది?
1) ఢిల్లీ విశ్వవిద్యాలయం
2) సావిత్రిభాయి ఫులే పూణె విశ్వవిద్యాలయం
3) బెనరాస్ హిందూ విశ్వవిద్యాలయం
4) కలకత్తా విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
42. ప్రపంచ ప్రభుత్వేతర సంస్థ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు?
1) ఫిబ్రవరి 27
2) ఫిబ్రవరి 28
3) మార్చి 8
4) ఏప్రిల్ 6
- View Answer
- సమాధానం: 1
43. ఉత్తరప్రదేశ్‌లోని హిందన్ వద్ద జరిగిన ఇంధ్రధనుష్ 5వ ఎడిషన్ వాయు వ్యాయామం ‘ఇంధ్రధనుష్ వి 2020’ ఏ రెండు దేశాల మధ్య జరిగింది?
1) భారత్, రష్యా
2) భారత్, యూఎస్ఎ
3) భారత్, శ్రీలంక
4) భారత్, యునైటెడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 4
44. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఎంత విలువైన రక్షణ ఒప్పందం ఖరారు చేశారు?
1) 750 మిలియన్ డాలర్లు
2) 5 బిలియన్ డాలర్లు
3) 1175 మిలియన్ డాలర్లు
4) 3 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
45. భారతదేశ వృద్ధిరేటు(జి.డి.పి.)ను లెక్కించడానికి ఒక కొత్త పద్ధతిని రూపొందించి ‘భారత జి.డి.పి. వృద్ధిని లెక్కించే డైనమిక్ ఫ్యాక్టర్ మోడల్’ అనే శీర్షికతో ఆర్బీఐ ఎన్ని సూచికలను విడుదల చేసింది?
1) 18
2) 15
3) 12
4) 7
- View Answer
- సమాధానం: 3
46. 2019–20 సులభ సంస్కరణ వార్షిక నివేదిక ప్రకారం 2018 మార్చిలో 8.96 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో స్థూల నిరర్ధక ఆస్తులు ఎంత తగ్గాయి?
1) 6.25 లక్షల కోట్లు
2) 6.98 లక్షల కోట్లు
3) 7.65 లక్షల కోట్లు
4) 7.17 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 4
47. వైద్యం, మిలిటరీ వంటి నిర్దిష్ట రంగాలలో ఉపయోగించే టెక్స్‌టైల్‌కు సంబంధించి ‘నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్’ కోసం కేంద్ర క్యాబినేట్ ఎంత నిధులు మంజూరు చేసింది?
1) 750 కోట్లు
2) 890 కోట్లు
3) 1,160 కోట్లు
4) 1,480 కోట్లు
- View Answer
- సమాధానం: 4
48. ముందస్తు అనుమతి లేకుండా కొత్త శాఖలను తెరవడానికి ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి అనుమతి పొందింది?
1) లక్ష్మి విలాస్ బ్యాంక్
2) ఫెడరల్ బ్యాంక్
3) ధనలక్ష్మి బ్యాంక్
4) బంధన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
49. మెటల్స్, మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సి.ఎం.డి.)గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ సింగ్
2) పవన్ ప్రకాశ్
3) సుధాన్షు పాండే
4) రమేశ్ శంకర్
- View Answer
- సమాధానం: 3
50. కన్నడ నవల కుసుమబాలేను ఆంగ్లంలోకి అనువదించినందుకు ఆంగ్లంలో అనువాద విభాగంలో 2019 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?
1) సి.టి. ఇంద్ర
2) రీటా కొఠారి
3) ప్రమోద్ కె. నాయర్
4) సుసాన్ డేనియల్
- View Answer
- సమాధానం: 4
51. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల అమ్మకందారులకు మూలధనాన్ని సులభంగా పొందేలా సహాయపడటానికి వ్యాపారం స్వీకరించదగిన ఎలక్ట్రానిక్ డిస్కౌంట్ సిస్టమ్‌ను కలిగిన ప్రభుత్వ సంస్థ ఏది?
1) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు
2) ప్రసారభారతి
3) నేషనల్ హసింగ్ బ్యాంక్
4) ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
- View Answer
- సమాధానం: 1
52. భారత పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోడీ సమర్పించిన బహుమతి ఏమిటి?
1) తాజ్‌మహల్ విగ్రహం
2) మూడు తెలివైన కోతుల విగ్రహం
3) గాంధీజీ విగ్రహం
4) శబర్మతి ఆశ్రమ శిల్పం
- View Answer
- సమాధానం: 2
53. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్’ అనే నేపథ్యం ఆధారంగా 2021లో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం ఏది?
1) హైదరాబాద్
2) కొచ్చిన్
3) విశాఖపట్నం
4) పూణె
- View Answer
- సమాధానం: 4
54. మలేషియా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) ముహిద్దీన్ బిన్ హాజీ మహ్మద్ యాసిన్
2) మహ్మద్ నజీబ్ బిన్ తున్ హాజీ అబ్దుల్ రజాక్
3) అబ్దుల్లా బిన్ హాజీ అహ్మద్ బదావి
4) అబ్దుల్లా హాజీ రజాక్
- View Answer
- సమాధానం: 1
55. దేశంలోనే మొదటిసారిగా ఏకీకృత వాహన రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించిన రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ తర్వాత ఏకీకృత డ్రైవింగ్ లైసెన్స్‌ను ప్రారంభించిన రెండో రాష్ట్రం ఏది?
1) ఒడిశా
2) మధ్యప్రదేశ్
3) పంజాబ్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 2