కరెంట్ అఫైర్స్ (మే 9 - 16) బిట్ బ్యాంక్
1. ఇటీవల ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని ఏప్రిల్ నుంచి జనవరికి మార్చిన రాష్ట్రం ఏది ?
1) మధ్యప్రదేశ్
2) తెలంగాణ
3) ఉత్తరప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1867లో బ్రిటీష్ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1న ప్రారంభించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ విధానంలో ఇటీవల మార్పులు చేసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని జనవరి - డిసెంబర్‌కి మార్చింది.
- సమాధానం: 1
2. ప్రపంచంలో కెల్లా ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్న దేశం ఏది?
1) చైనా
2) ఫాన్స్
3) భారత్
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచం కెల్లా ఎత్తయిన రైల్వే వంతెనను భారత్ చినాబ్ నదిపై నిర్మించనుంది. దీని ఎత్తు 359 మీటర్లు. రూ. 1,100 కోట్ల వ్యయంతో 1.315 కి.మీ పొడవుతో నిర్మించే ఈ వంతెన ద్వారా బక్కాల్ - కౌరి ప్రాంతాల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది.
- సమాధానం: 3
3. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు ?
1) కోల్కత్తా - భువనేశ్వర్
2) ముంబయి - గోవా
3) ఢిల్లీ - భోపాల్
4) చెన్నై - నాగర్కోయిస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 20 కోచ్‌లు గల ఈ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులోని భోగీల్లో వైఫై సౌకర్యం ఉంటుంది.
- సమాధానం: 2
4. ఇటీవల ఏ నగరం కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేక ఫాంట్‌ను విడుదల చేసింది ?
1) ఢిల్లీ
2) న్యూయార్క్
3) సిడ్నీ
4) దుబాయి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ దుబాయి పేరుతో ప్రత్యేక ఫాంట్‌ను విడుదల చేసింది. అరబిక్ మరియు లాటిన్ లిపిలో ఉన్న ఈ ఫాంట్‌ని 23 భాషల్లో అందుబాటులోకి తెచ్చింది.
- సమాధానం: 4
5. ప్రతిష్టాత్మక అవ్వైయర్ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) పద్మా వెంకట్రామన్
2) మీరా కుమార్
3) సుష్మా స్వరాజ్
4) మాధురీ దీక్షిత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సంఘసేవ, మహిళాభివృద్ధి, సంస్కృతి, మీడియా, పరిపాలన వంటి అంశాల్లో ఉత్తమ పాత్ర పోషించిన మహిళలను గౌరవించేందుకు తమిళనాడు ప్రభుత్వం 2012లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.
2017 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపికైన పద్మ వెంకట్రామన్ మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ కుమార్తె. ఆమె 30 ఏళ్లుగా మహిళల అభివృద్ధి, కుష్టు వ్యాధి గ్రస్తుల పునరావాసం కోసం కృషి చేస్తున్నారు.
- సమాధానం: 1
6. ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ డిప్లొమెటిక్ సర్వీస్ మెరిట్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎ. కే. ఖాన్
2) రాజీవ్ కౌల్
3) రాజేంద్ర సచార్
4) సుమన్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ పురస్కారాన్ని దక్షిణ కొరియా ప్రదానం చేస్తుంది. 2017 సంవత్సరానికి గాను నికో గ్రూప్ ఛైర్మన్ రాజీవ్ కౌల్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 2
7. "సువల్గిరి మరియు స్వాల్గిరి" తెగ ప్రజలు ఏ రాష్ట్రానికి చెందినవారు ?
1) జార్ఖండ్
2) అస్సోం
3) ఉత్తరాఖండ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఒడిశా ప్రభుత్వం సువల్గిరి మరియు స్వాల్గిరిలను ఇటీవల షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చింది.
- సమాధానం: 4
8. తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా ఏ సమాచారాన్ని పొందవచ్చు ?
1) రేడియో ఫ్రీక్వెన్సీ
2) విద్యాశాఖ ప్రసారం చేసే అంశాలు
3) తప్పిపోయిన పిల్లల ఆచూకీ
4) మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా తరంగ్ సంచార్ పోర్టల్‌ను ప్రారంభించాయి. దీని ద్వారా తమ పరిసరాలలోని మొబైల్ టవర్ల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ వివరాలను తెలుసుకోవచ్చు.
- సమాధానం: 4
9. 2005 - 2014 మధ్య కాలంలో ఎంత నల్లధనం భారత్‌లోకి ప్రవేశించింది ?
1) 500 బిలియన్ డాలర్లు
2) 770 బిలియన్ డాలర్లు
3) 1000 బిలియన్ డాలర్లు
4) 1500 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటిగ్రిటి సంస్థ ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళుతున్న నల్లధనం వివరాలతో కూడిన జాబితాను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం 2005 - 2014 మధ్య కాలంలో 770 బిలియన్ డాలర్ల నల్లధనం భారత్‌లోకి ప్రవేశించింది. 165 బిలయన్ డాలర్ల నల్లధనం దేశం నుంచి బయటకు వెళ్లింది.
- సమాధానం: 2
10. స్వచ్ఛ సర్వేక్షణ్ - 2017 ప్రకారం దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం ఏది ?
1) భోపాల్
2) సూరత్
3) గాంధినగర్
4) ఇండోర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ నివేదికలో తొలి స్థానంలో ఇండోర్, రెండో స్థానంలో భోపాల్, మూడో స్థానంలో విశాఖపట్నం నగరాలు నిలిచాయి. 2016లో తొలి స్థానంలో నిలిచిన మైసూర్ ఈసారి 5వ స్థానానికి పడిపోయింది.
- సమాధానం: 4
11. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ దేశంలో యూరియా అండ్ అమ్మోనియం తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) బంగ్లాదేశ్
2) శ్రీలంక
3) మలేషియా
4) భూటాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2.1 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేసే ప్లాంట్ ఏడాదికి 2.4 మిలియన్ టన్నుల యూరియా, 1.35 మిలియన్ టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది. వీటిని భారత్ దిగుమతి చేసుకుంటుంది.
- సమాధానం: 3
12. జాతీయ స్టీల్ పాలసీ - 2017 ప్రకారం 2030లోపు తలసరి వినియోగాన్ని ఎంతకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ?
1) 110 కేజీలు
2) 158 కేజీలు
3) 190 కేజీలు
4) 250 కేజీలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో చైనా తొలి స్థానంలో ఉంది. జపాన్ రెండో స్థానంలో ఉండగా.. భారత్ 3వ స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశంలో తలసరి స్టీల్ వినియోగం 68 కేజీలుగా ఉంది. దీనిని 158 కేజీలకు పెంచాలని జాతీయ స్టీల్ పాలసీలో నిర్దేశించుకున్నారు.
- సమాధానం: 2
13. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
1) వేములపల్లి
2) కొట్టాయం
3) కలకత్తా
4) ఆగ్రా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అస్సోంకు చెందిన ప్రఖ్యాత టీ ప్లాంటర్ ప్రభాత్ కమల్ బెజ్బోరౌ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. తద్వారా ఈ పదవి చేపట్టిన తొలి నాన్ ఐఏఎస్ వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
- సమాధానం: 3
14. ఇటీవల ఇస్రో ప్రయోగించిన జీశాట్-9 ఉపగ్రహం సేవలను వినియోగించుకోని దేశం ఏది ?
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సార్క్ దేశాల కోసం ఇస్రో జీశాట్ - 9 ఉపగ్రహాన్ని GSLV-F09రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపింది. టెలికమ్యూనికేషన్స్, విపత్తు నిర్వహణ సంబంధిత సమాచారాన్ని ఈ ఉపగ్రహం చేరవేస్తుంది. పాకిస్తాన్ మినహా సార్క్ దేశాలు దీని సేవలను వినియోగించుకుంటాయి.
- సమాధానం: 1
15. ఇటీవల భారత్‌లో ఎక్స్‌ప్రెస్ వైఫైను ప్రవేశపెట్టిన సంస్థ ఏది ?
1) మైక్రోసాఫ్ట్
2) సామ్సంగ్
3) ఫేస్బుక్
4) రెడ్ఇట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఎక్స్‌ప్రెస్ వైఫై కార్యక్రమం కింద ఫేస్బుక్ నాలుగు రాష్ట్రాల్లో 7 వేల హాట్స్పాట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ బ్యాండ్ విడ్త్ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ సేవలను కెన్యా, నైజీరియా, ఇండోనేషియా, టాంజానియాలలో కూడా ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3
16. 50వ ప్రపంచ హౌస్టన్ చిత్రోత్సవంలో ప్రత్యేక జ్యూరీ పురస్కారం పొందిన భారతీయ నటి ఎవరు ?
1) ప్రియాంకా చోప్రా
2) దిపికా పదుకోన్
3) శ్రీదేవి
4) షబానా అజ్మీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ హాలీవుడ్ చిత్రం ది బ్లాక్ ప్రిన్స్లో నటనకు గాను ప్రత్యేక జ్యూరీ పురస్కారానికి షబానా అజ్మీ ఎంపికయ్యారు. ఈ చిత్రాన్ని పంజాబ్ చివరి రాజు మహరాజా దిలీప్ సింగ్ జీవితం ఆధారంగా తీశారు. హౌస్టన్ చిత్రోత్సవాలని 1961 నుంచి నిర్వహిస్తున్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద స్వతంత్ర చిత్రోత్సవం.
- సమాధానం: 4
17. అంతర్జాతీయ ఫెర్మా కల్చర్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు ?
1) హైదరాబాద్
2) మైసూర్
3) గోవా
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫెర్మా కల్చర్ - వ్యవసాయ మరియు సామాజిక నమూనా భావలనతో కూడిన ఒక పర్యావరణ సంస్థ. ఈ సంస్థ తొలి సమావేశాన్ని 1984లో ఆస్ట్రేలియాలో నిర్వహించారు.
హైదరాబాద్‌కు చెందిన అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ సంస్థ, అంతర్జాతీయ ఫెర్మా కల్చర్ కన్వజెన్స్ కౌన్సిల్‌తో కలిసి ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
- సమాధానం: 1
18. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కెమెరాను తయారు చేసిన దేశం ఏది ?
1) జపాన్
2) నార్వే
3) చైనా
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అత్యంత వేగవంతమైన (Frame)ను స్వీడన్‌కు చెందిన లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇది ఒక సెకనులో 5 ట్రిలియన్ ఫ్రేమ్‌లను బంధించగలదు.
- సమాధానం: 4
19. భారత్‌లో తొలి ప్రైవేటు ఆయుధ తయారీ పరిశ్రమను స్థాపించిన దేశం ఏది ?
1) యూకే
2) ఇజ్రాయెల్
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇజ్రాయెల్‌కు చెందిన పంజ్ లాయిడ్ లిమిటెడ్ మరియు జె.వి. పార్టనర్ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా మధ్యప్రదేశ్‌లోని మలంపూర్లో చిన్న ఆయుధాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశాయి.
- సమాధానం: 2
20. ఇటీవల రిజర్వు బ్యాంకు వెలువరించిన నివేదిక ప్రకారం దేశంలో విదేశీ మారక నిల్వల విలువ ఎంత ?
1) 19.869 బిలియన్ డాలర్లు
2) 119.86 బిలియన్ డాలర్లు
3) 230.06 బిలియన్ డాలర్లు
4) 372.73 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశంలో విదేశీ మారక నిల్వలు మొదటిసారి 372.73 బిలియన్ డాలర్ల మార్క్‌ను తాకాయి. ఆర్బీఐలో 19.869 బిలియన్ డాలర్ల విలువ గల బంగారు నిల్వలు ఉన్నాయి.
- సమాధానం: 4
21. విస్డన్-ఎమ్‌సీసీ క్రికెట్ ఫోటో ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన ఫోటోగ్రాఫర్ ఎవరు ?
1) దిగ్విజయ్ సింగ్
2) అబ్దుల్లా హుస్సేన్
3) సకిబ్ మాజిద్
4) సుందర్ లాల్ పండిత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: శ్రీనగర్‌కు చెందిన ఫ్రీలాన్స్ ఫోటో గ్రాఫర్ సకిబ్ మాజిద్, శ్రీనగర్‌లోని నిశాంత్ గార్డెన్స్‌లో పిల్లలు క్రికెట్ ఆడుతున్న ఫోటో తీశాడు. ఈ ఫోటో విస్డన్-ఎమ్‌సీసీ క్రికెట్ ఫోటో ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 3
22. అమెరికా ఇటీవల ఏ దేశంలో క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది ?
1) క్యూబా
2) దక్షిణ కొరియా
3) ఉక్రెయిన్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దక్షిణ కొరియాలో అమెరికా THAAD క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఉత్తర కొరియా, చైనా దేశాల నుంచి వచ్చే దాడులను ఈ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొడుతుంది.
THAAD - Terminal high altitude area defence
- సమాధానం: 2
23. ఇటీవల బోట్ అంబులెన్స్ సర్వీసులని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) అస్సోం
2) కేరళ
3) ఒడిశా
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
24. ఇటీవల భారత్ ఏ దేశంలో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించింది ?
1) దక్షిణాఫ్రికా
2) బ్రెజిల్
3) రష్యా
4) ఈజిప్ట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: రవీంద్రనాథ్ ఠాగూర్ 156వ జయంతి సందర్భంగా ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఒపెరా హౌస్‌లో భారత సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కాబులి వాలా నవల ఆధారంగా హెమెన్ గుప్తా తీసిని సినిమాను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించారు.
- సమాధానం: 4
25. సండే టైమ్స్ జాబితా ప్రకారం యూకేలోని ధనవంతుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నది ఎవరు ?
1) హిందూజా సోదరులు
2) లక్ష్మీ మిట్టల్
3) డేవిండ్ అండ్ సైమన్ రూబెన్
4) ప్రకాశ్ లోహియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ జాబితాలో 16.2 బిలియన్ పౌండ్ల సంపదతో హిందూజా సోదరులు తొలి స్థానంలో నిలిచారు. డేవిండ్ అండ్ సైమన్ రూబెన్ (14 బిలియన్ పౌండ్లు) 3వ స్థానంలో, లక్ష్మీ మిట్టల్ (13.2 బిలియన్ పౌండ్లు) 4వ స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 1
26. ఇటీవల బీబీఐఎన్ రవాణా మార్గ ప్రణాళిక నుంచి వైదొలిగిన దేశం ఏది ?
1) భారత్
2) నేపాల్
3) బంగ్లాదేశ్
4) భూటాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భూటాన్, బంగ్లాదేశ్, భారత్, నేపాల్‌ను కలుపుతూ రోడ్డురవాణా మార్గ నిర్మాణానికి భారత్ బీబీఐఎన్ ప్రణాళికలను రూపొందించింది. బంగ్లాదేశ్, నేపాల్ ఈ ప్రణాళికకు అంగీకారం తెలిపాయి. పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయంటూ భూటాన్ ఈ ప్రణాళిక నుంచి వైదొలిగింది.
- సమాధానం: 4
27. ఇటీవల మరణించిన లీలాసేథ్ ఏ రాష్ట్ర హైకోర్టుకు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ?
1) బిహార్
2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖండ్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలాసేథ్. ఆమె హైకోర్టులో మహిళా న్యాయమూర్తిగా, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
- సమాధానం: 2
28. ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వెండి పతకాన్ని గెలుచుకున్నది ఎవరు ?
1) జితేందర్ సింగ్
2) దినేశ్ కుమార్
3) శివతాప
4) విజేందర్ సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ పోటీలు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగాయి. శివతాప 2015 నుంచి ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించడం వరసగా ఇది మూడోసారి.
- సమాధానం: 3
29. 26వ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టైటిల్ విజేత ఎవరు ?
1) గ్రేట్ బ్రిటన్
2) ఆస్ట్రేలియా
3) న్యూజిలాండ్
4) భారత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి గ్రేట్ బ్రిటన్ టైటిల్‌ను దక్కించుకుంది.
అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్‌ను మలేషియా సుల్తాన్ అజ్లాన్ షా గౌరవార్థం 1983లో ప్రారంభించారు. 1983 నుంచి 1997 వరకు రెండేళ్లకోసారి నిర్వహించిన ఈ టోర్నీని 1998 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
30. ఇటీవల దేశంలోనే తొలి బయో రిఫైనరీ ప్లాంట్‌ను ఎక్కడ నిర్మించారు ?
1) హైదరాబాద్
2) సూరత్
3) మైసూర్
4) పూణె
- View Answer
- సమాధానం: 4
వివరణ: పూణెలోని రాహు అనే ప్రాంతంలో ఏడాదికి ఒక మిలియన్ లీటర్ల ఇథనాల్ సామర్థ్యంతో బయో రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
31. ఇటీవల సీఆర్పీఎఫ్ యాంటి మావోయిస్ట్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడికి మార్చారు ?
1) హైదరాబాద్
2) రాయ్‌పూర్
3) నాగ్‌పూర్
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్)ను 1939లో కోల్‌కత్తాలో ఏర్పాటు చేశారు. దీని పరిధిలోనే ఉన్న సీఆర్పీఎఫ్ యాంటి మావోయిస్ట్ ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ఛత్తీస్‌గ ఢ్కు మార్చారు.
- సమాధానం: 2
32. ఈగల్ లయన్ పేరుతో అమెరికా ఏ దేశంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించింది ?
1) రష్యా
2) ఇజ్రాయెల్
3) జోర్డాన్
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈగల్ లయన్ పేరుతో సంయుక్త మిలటరీ విన్యాసాలను అమెరికా జోర్డాన్‌తో కలిసి ఏటా నిర్వహిస్తుంది. ఇందులో 20 దేశాలకు చెందిన సైన్యాలు పాలుపంచుకుంటాయి.
- సమాధానం: 3
33. ఇమాన్యుల్ మక్రాన్ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ?
1) ఫ్రాన్స్
2) కొలంబియా
3) స్పెయిన్
4) బెల్జియం
- View Answer
- సమాధానం: 1
వివరణ: అతి చిన్న వయసులో ఫ్రాన్స్‌కి అధ్యక్షుడైన వ్యక్తి ఇమాన్యుల్ మాక్రాన్ (39). పార్టీ - En Marche
- సమాధానం: 1
34. ఇటీవల వార్తల్లో నిలిచిన " C 919" అనేది దేనికి సంబంధించినది ?
1) చైనా యుద్ధ నౌక
2) చైనా క్వాంటం శాటిలైట్
3) చైనా ప్యాసింజర్ జెట్
4) చైనా వాహక నౌక
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఎయిర్‌బస్, బోయింగ్ 737కి పోటీగా చైనా " C 919" అనే ప్యాసింజర్ జెట్‌ను రూపొందించింది.
- సమాధానం: 3
35. "Acentrias fritillary" అనే నూతన సీతాకోక చిలుక జాతిని ఏ ప్రాంతంలో కనుగొన్నారు ?
1) చైనా
2) ఇజ్రాయెల్
3) కెనడా
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉత్తర ఇజ్రాయెల్‌లోని మౌంట్ హర్మన్ వద్ద 109 ఏళ్ల తర్వాత నూతన సీతాకోక చిలుక జాతిని గుర్తించారు.
- సమాధానం: 2
36. గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ లిబరేషన్ ప్లే జెన్ - 2017 మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది ఎవరు ?
1) హీనా సిద్ధు
2) శారదా దేవి
3) రాజేశ్వర నాడర్
4) తేజస్వని సారంత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధు కాంస్యాన్ని గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ 7 పతకాలు గెలుచుకుంది.
- సమాధానం: 1
37. దేవేందర్ సింగ్ ఏ క్రీడకు చెందినవాడు ?
1) బాక్సింగ్
2) చెస్
3) జావలిన్ త్రో
4) హాకీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: లండన్‌లో నిర్వహించనున్న జావెలిన్ త్రో ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌కు ఎంపికైన రెండవ భారత క్రీడాకారుడు దేవెందర్ సింగ్
- సమాధానం: 3
38. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రారంభించిన విధానం పేరేమిటి ?
1) ఆలోచన
2) ఆపరేషన గ్రీన్ హంట్
3) మావో
4) సమాధాన్
- View Answer
- సమాధానం: 4
39. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన UN-HABITAT కు ఏకగ్రీవంగా ఎంపికైన దేశం ఏది ?
1) ఇజ్రాయెల్
2) భారత్
3) దక్షణాఫ్రికా
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ సంస్థకు భారత్ రెండేళ్లపాటు అధ్యక్షత వహిస్తుంది. ప్రపంచంలో మానవ స్థిర నివాసాల అభివృద్ధి కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. అధ్యక్ష హోదాలో ఉన్న దేశ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సంస్థకు అధ్యక్షత వహిస్తారు. (కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి - ఎం. వెంక య్యనాయుడు)
- సమాధానం: 2
40. ఇటీవల 26వ మీటింగ్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ UN-HABITATను ఎక్కడ నిర్వహించారు ?
1) నైరోబి
2) సనా
3) మదినా
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించారు.
- సమాధానం: 1
41. ఇటీవల ఐఎంఎఫ్ విడుదల చేసిన అంచనాల ప్రకారం 2018-19లో భారత జీడీపీ వృద్ధి ఎంత ?
1) 7.2 శాతం
2) 7.3 శాతం
3) 7.5 శాతం
4) 7.7 శాతం
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్ 2017-18లో 7.2 శాతం, 2018-19లో 7.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
- సమాధానం: 4
42. 22వ ఆసియాన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మస్కట్ పేరు ఏమిటి ?
1) ఓలివ్ టర్టిల్
2) కస్తూరి
3) వీరూ
4) జోనా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 22వ ఆసియాన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మస్కట్ ఓలివ్ టర్టిల్ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు.
- సమాధానం: 1
43. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది ?
1) ఓస్లో
2) ది హేగ్
3) స్టాక్ హోమ్
4) న్యూయార్క్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)ను 1945లో ఏర్పాటు చేశారు. ఇది నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉంది. ఇటీవల కుల్‌భూషణ్ జాదవ్ కేసులో స్టే తీసుకురావడంలో భారత్ పాకిస్తాన్‌పై విజయం సాధించింది.
- సమాధానం: 2
44. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) పార్క్ చూయింగ్హై
2) చూన్ డూ హొల్
3) రొ టైహో
4) మూన్ జాయి ఇన్
- View Answer
- సమాధానం: 4
45. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు ?
1) మిథాలీ రాజ్
2) జులన్ గోస్వామి
3) గార్గ్గి బెనర్జీ
4) గౌరీ ప్రియ
- View Answer
- సమాధానం: 2
వివరణ: జులన్ గోస్వామి ఇప్పటి వరకు (మే 14 - 2017) వన్డే క్రికెట్లో 181 వికెట్లు తీసి మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
46. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మే 20
2) మే 15
3) మే 10
4) మే 05
- View Answer
- సమాధానం: 3
వివరణ: Theme : Their future is our future - the healthy planet for migratory birds and peoples
- సమాధానం: 3
47. ఇటీవల రిజర్వు బ్యాంకు, ఏ బ్యాంకు బ్రాంచీల విస్తరణ, నియామకాలకు మార్గనిర్దేశనం చేసింది ?
1) ఐడీబీఐ
2) బ్యాంక్ ఆఫ్ బరోడా
3) కెనరా బ్యాంక్
4) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐడీబీఐ నిరర్ధక ఆస్తుల విలువ 15 శాతం దాటి , బ్యాంకు రూ.2,255 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది.
- సమాధానం: 1
48. ఉడ్రోవిల్సన్ అవార్డ్ ఫర్ గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్ పురస్కార గ్రహీత ఎవరు ?
1) సునీల్ కన్నా
2) అరుంధతి భట్టాచార్య
3) రాకేశ్ సేథి
4) చందాకొచ్చర్
- View Answer
- సమాధానం: 4
49. ఇటీవల భారత్‌లో పాక్ హైకమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) సోహైల్ మహమ్మద్
2) అబ్దుల్ వాహీద్
3) జహీర్ హుస్సేన్
4) అబ్దుల్ ఆజిజ్
- View Answer
- సమాధానం: 1
50. న్యూయార్క్ - భారత్ చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకత్వ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) కె.కలందర్
2) సుభాష్ భట్టాని
3) కొంకణా సేన్ శర్మ
4) ముక్తిదాస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: A Death in the gunj అనే చిత్రానికి గాను కొంకణా సేన్ శర్మకు ఈ పురస్కారం లభించింది.
- సమాధానం: 3