కరెంట్ అఫైర్స్ (మే 8 -15) బిట్ బ్యాంక్
1. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ’ఆయుష్మాన్ భారత్’ పథకంలో అవినీతిని అడ్డుకునేందుకు కింది వాటిలోని ఏ సంస్థతో నీతి ఆయోగ్ ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ప్రపంచ బ్యాంక్
2) ఏఐఐబీ
3) ఏడీబీ
4) ఐఎంఎఫ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలోని పేదలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆయుష్మాన్ భారత్. ఈ పథకంలో అవినీతిని అడ్డుకునేందుకు నీతి ఆయోగ్ ప్రపంచ బ్యాంక్ సహాయం కోరింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ఈ పథకానికి ఐటీ సాంకేతికతను అందిస్తోంది.
- సమాధానం: 4
2. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఆ దేశ అధ్యక్షుడు కావడం ఇది ఎన్నోసారి ?
1) మూడు
2) రెండు
3) నాలుగు
4) ఒకటి
- View Answer
- సమాధానం: 3
వివరణ: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2018 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 70 శాతానికిపైగా ఓట్లతో పుతిన్ మరోసారి విజయం సాధించారు. అధ్యక్ష పదవిలో ఆయన మరో ఆరేళ్లు ఉంటారు.
- సమాధానం: 3
3. ప్రభావవంతమైన పాలన అందించడంతో పాటు ప్రజలకు సమాచారం చేరవేసేందుకు ఇటీవల NCBN యాప్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మణిపూర్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్రంలో ప్రభావవంతమైన పాలన అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు NCBN(Nara Chandrababu Naidu) యాప్ ని ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా వార్తా సమాచారంతో పాటు సాధారణ ప్రజలు ప్రభుత్వంతో అనుసంధానం కావచ్చు.
- సమాధానం: 2
4. ప్రపంచ రోబోట్ కాన్ఫరెన్స్ - 2018 ఏ దేశంలో జరగనుంది ?
1) జపాన్
2) చైనా
3) భారత్
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ రోబోట్ కాన్ఫరెన్స్ చైనా రాజధాని బీజీంగ్‌లో ఆగస్టు 15 నుంచి 19 వరకు జరగనుంది.
- సమాధానం: 2
5. దివ్యాంగుల కోసం "AI For Accessibility'' ఇనిషియేటివ్ ను ప్రారంభించిన సంస్థ ఏది ?
1) గూగుల్
2) ఫేస్బుక్
3) ఇన్ఫోసిస్
4) మైక్రోసాఫ్ట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కృతిమ మేధో సహాయంతో దివ్యాంగులకు అనుకూలమైన సాంకేతికతను తయారు చేసేందుకు గాను మైక్రోసాఫ్ట్ ఏఐ ఫర్ యాక్సెసిబిలిటీ ఇనిషియేటివ్ ని ప్రారంభించింది. 25 మిలియన్ డాలర్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ డెవలపర్లకు ఏఐ టూల్స్ ని అందిస్తుంది.
- సమాధానం: 4
6. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పని విధానం కోసం ఇటీవల ఈ-ఆఫీస్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) బిహార్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ ప్రాసెసింగ్ విధానాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ఈ - ఆఫీస్ వ్యవస్థను ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త ఫైల్స్‌ను ఎలక్ట్రానిక్ విధానంలో నెట్ వర్క్ లో ఒకరి నుంచి ఒకరికి పంపుతారు. పాత వాటిని డిజిటలైజ్ చేస్తారు.
- సమాధానం: 4
7. గూగుల్ క్లౌడ్ ఇండియా బిజినెస్ హెడ్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) నితిన్ బవాన్కులే
2) అమిత్ అగర్వాల్
3) భాస్కర్ ప్రమానిక్
4) తేజు ప్రతాప్ సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: టెక్ దిగ్గజం గూగుల్ క్లౌడ్ ఇండియా బిజినెస్ హెడ్ గా నితిన్ బవాన్కులే ఇటీవల నియమితులయ్యారు. ఆయన గూగుల్ లో గత ఆరేళ్లుగా పనిచేస్తున్నారు.
- సమాధానం: 1
8. ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతులైన వ్యక్తులు - 2018 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు ?
1) డొనాల్డ్ ట్రంప్
2) వ్లాదిమిర్ పుతిన్
3) షీ జిన్ పింగ్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫోర్బ్స్ ఇటీవల ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితా - 2018ను విడుదల చేసింది. మొత్తం 75 మందితో కూడిన ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మొదటి స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండో స్థానంలో నిలిచారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో, రిలయన్స ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ 32వ స్థానంలో నిలిచారు.
- సమాధానం: 3
9. ఏ దేశంతో 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది ?
1) భారత్
2) రష్యా
3) ఇరాన్
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2015లో కుదిరిన చరిత్రాత్మక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఆ ఒప్పందం వల్ల ఏమీ ఉపయోగం లేదని, ఇరాన్ అణుబాంబుల తయారీలో జోరుగా తన పని తాను చేసుకుపోతోందని అన్నారు. అయితే తాము మాత్రం ఆ ఒప్పందంలోనే కొనసాగుతామని ఫ్రాన్స, బ్రిటన్, జర్మనీ, రష్యా, చైనా ప్రకటించాయి. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మాత్రం అమెరికా నిర్ణయాన్ని సమర్థించాయి.
- సమాధానం: 3
10. ఆసియా మీడియా సమ్మిట్ - 2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) బెంగళూరు
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 2
వివరణ: మే 10, 11 తేదీల్లో ఆసియా మీడియా సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. మీడియా, వినోదాత్మక రంగాలపై, డిజిటలైజేషన్ ప్రభావంపై ఈ సమ్మిట్‌లో చర్చించారు.
Theme : Telling Our Stories & Asia and More
- సమాధానం: 2
11.మలేషియా ప్రధాన మంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అనిఫా అమన్
2) నజీబ్ రజాక్
3) మహథీర్ మొహమ్మద్
4) అహ్మద్ జాహిద్ హమిది
- View Answer
- సమాధానం: 3
వివరణ: మలేషియాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 92 ఏళ్ల మహథీర్ మొహమ్మద్ నేతృత్వంలోని పకతన్ హరపాన్ కూటమి 122 సీట్లతో విజయం సాధించింది. 222 స్థానాలు ఉన్న మలేషియా పార్లమెంటులో 112 స్థానాలు మెజారిటీ సంఖ్య. దీంతో మహథీర్ మొహమ్మద్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసున్న ప్రధాన మంత్రిగా నిలిచారు.
- సమాధానం: 3
12. జాతీయ సాంకేతికత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మే 10
2) మే 12
3) మే 9
4) మే 11
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1998 మే 11న రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో భారత్ న్యూక్లియర్ బాంబ్ ని విజయవంతంగా పరీక్షించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా మే 11న జాతీయ సాంకేతికత దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 4
13. 2018 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ టెక్నాలజీ అవార్డుని పొందిన సంస్థ ఏది ?
1) భారత్ బయోటెక్
2) రెడ్డీ లాబ్స్
3) మేన్ కైండ్
4) బయోకాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: వ్యాక్సిన్ తయారీలో అతిపెద్ద సంస్థగా ఉన్న భారత్ బయోటెక్ 2018 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ టెక్నాలజీ అవార్డుని దక్కించుకుంది. రొటొవాక్ వాక్సిన్ను తయారు చేసినందుకు గాను ఆ సంస్థకు ఈ అవార్డు దక్కింది.
- సమాధానం: 1
14. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అమర్చే నంబర్ ప్లేట్లు ఏ రంగులో ఉంటాయి ?
1) నీలం
2) ఆకుపచ్చ
3) పసుపు
4) తెలుపు
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, వాటికి ఆకుపచ్చ నంబర్ ప్లేట్లను అమర్చేందుకు కేంద్రం అనుమతించింది. ఈ - వాహనాల ప్లేట్లపై నంబర్లు తెలుపు రంగులో ఉంటాయి. టాక్సీ ఈ - వాహనాలకు నంబర్లు పసుపు రంగులో ఉంటాయి.
- సమాధానం: 2
15. BIMSTEC 2018 సమ్మిట్ ఏ దేశంలో జరగనుంది?
1) శ్రీలంక
2) భారత్
3) నేపాల్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: BIMSTEC(Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation-2018) సమ్మిట్ నేపాల్లోజరగనుంది. ఇది ఏడు దేశాల కూటమి. అవి బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్. BIMSTEC ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉంది.
- సమాధానం: 3
16. 11వ కళింగఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(KIS) మానవత్వ అవార్డు- 2018కి ఎవరు ఎంపికయ్యారు ?
1) జస్టిస్ ఎన్ వీ రమణ
2) ముహమద్ యునుస్
3) కై లాశ్ సత్యార్థి
4) వీఎస్ నైపాల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు, ఫాదర్ ఆఫ్ మైక్రోఫైనాన్సగా గుర్తింపు పొందిన నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త ముహమద్ యునుస్ 11వ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ మానవత్వ అవార్డుకి ఎంపికయ్యారు.
- సమాధానం: 2
17. స్పానిష్ గ్రాండ్ ప్రీ - 2018 టైటిల్ విజేత ఎవరు ?
1) లూయిస్ హామిల్టన్
2) వాల్టెరీ బొట్టాస్
3) సెబాస్టియన్ వెటల్
4) మేక్స్ వెర్స్ స్టాపెన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బ్రిటన్‌కు చెందిన మెర్సిడీస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పానిష్ గ్రాండ్ ప్రీ - 2018 ఫార్ములా వన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
- సమాధానం: 1
18. ఇటీవల సెర్బియాలో జరిగిన అండర్ 16 ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను ఏ దేశ జట్టు గెలుచుకుంది ?
1) తజికిస్థాన్
2) భారత్
3) సెర్బియా
4) జోర్డాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నాలుగు దేశాల మధ్య సెర్బియాలో జరిగిన అండర్ 16 ఫుట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్లో తజికిస్థాన్‌ను ఓడించి భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. భారత్, సెర్బియా, తజికిస్థాన్, జోర్డాన్ దేశాలు ఈ టోర్నమెంట్లో తలపడ్డాయి.
- సమాధానం: 2
19. మాడ్రిడ్ ఓపెన్ - 2018 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) పెట్రా క్విటోవా
2) కరోలినా వొజ్నియాకి
3) మారియా షరపోవా
4) కికి బెర్టెన్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: చెక్ టెన్నిస్ ప్లేయర్ పెట్రో క్విటోవా నెదర్లాండ్స్ కు చెందిన కికి బెర్టాన్స్ ను ఓడించి మాడ్రిడ్ ఓపెన్ - 2018 టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అలెగ్జాండర్ జ్వెరెవ్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 1
20. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఉమెన్ ఎకనామిక్ ఫోరమ్ - 2018 సమ్మిట్‌లో ఎక్సలెంట్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుని ఈ కింది వారిలో ఎవరికి అందించారు ?
1) నిషా భళ్లా
2) ఆరాధన గుప్తా
3) మీనాక్షి కుమారి
4) క్రితికా జైన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉమెన్ ఎకనామిక్ ఫోరమ్ - 2018 (WEF) సమ్మిట్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో ముంబైకి చెందిన కన్సల్టెంట్ నిషా భళ్లా ఎక్సలెంట్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స అవార్డుని అందుకున్నారు. WEF సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళా వ్యాపారవేత్తలు, మహిళా నాయకులకు సంబంధించినసమావేశం.
- సమాధానం: 1
21. స్మార్ట్ నగరాల కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ (ICCC)నుప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
వివరణ: మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ స్మార్ట్ నగరాల కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ (ICCC)ని ఇటీవల ప్రారంభించింది. భోపాల్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 3
22. దేశంలోనే ప్రథమంగా రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఎవరు ప్రారంభించారు ?
1) ప్రధాని నరేంద్ర మోదీ
2) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
3) ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
4) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలోనే తొలిసారిగా రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మే 10న ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి - ఇందిరానగర్ లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల చొప్పున ఖరీఫ్, రబీలకు కలిపి రూ.8 వేలు అందజేస్తుంది.
- సమాధానం: 4
23. సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కింది వారిలో ఏ బాలీవుడ్ నటుడిని ఆ రాష్ట్ర గ్రీన్ అంబాసిడర్ గా నియమించింది ?
1) ప్రియాంకా చోప్రా
2) మోహిత్ చౌహాన్
3) ఏఆర్ రహమాన్
4) సల్మాన్ ఖాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సిక్కింను గ్రీన్ డెస్టినేషన్‌గా ప్రమోట్ చేసేందుకు బాలీవుడ్ నటుడు మోహిత్ చౌహాన్‌ను గ్రీన్ అంబాసిడర్ గా నియమించింది. మోహిత్ చౌహాన్ బాలీవుడ్ నేపథ్య గాయకుడు. సిక్కిం ప్రభుత్వం ఇంతకుముందు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను రాష్ట్ర పర్యాటక రంగం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.
- సమాధానం: 2
24. ఇటీవల కన్నుమూసిన హాకీ దిగ్గజం మన్సూర్ అహ్మద్ ఏ దేశానికి చెందినవారు ?
1) పాకిస్థాన్
2) భారత్
3) బంగ్లాదేశ్
4) మలేషియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1994లో హాకీ ప్రపంచ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టులో గోల్ కీపర్ అయిన మన్సూర్ అహ్మద్ ఇటీవల కన్నుమూశారు. ఆయన హాకీ అడుతున్న సమయంలో ప్రపంచంలో ఉత్తమ గోల్ కీపర్ గా గుర్తింపు పొందారు. మన్సూర్ 338 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. మూడు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు.
- సమాధానం: 1
25. దుర్భర పరిస్థితుల్లో ఉన్న మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం ‘యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’భారత్ లోని ఏ నగరంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) విశాఖపట్నం
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 2
వివరణ: దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళల్లో నైపుణ్యాభివృద్ధి కోసం యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భారత్ లోని హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
- సమాధానం: 2
26. జపాన్ అందించే నిక్కీ ఆసియా ప్రైజ్ - 2018ను కింది వారిలో ఎవరికి అందించారు ?
1) నరేంద్ర మోదీ
2) మన్మోహన్ సింగ్
3) బిందేశ్వర్ పాఠక్
4) ముకేశ్ అంబానీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: మానవ హక్కుల రక్షణ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు సులభ్ ఇంటర్నేషనల్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోన్న బిందేశ్వర్ పాఠక్ 2018 సంవత్సరానికి గాను జపాన్ నుంచి నిక్కీ ఆసియా ప్రైజ్ అవార్డు అందుకున్నారు. జపాన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ నిక్కీ ఇంక్ 1996 నుంచి ఏటా ఈ అవార్డు అందిస్తోంది. వ్యాపారం, ఆర్థికం, పర్యావరణం, సాంస్కృతిక రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. బిందేశ్వర్ పాఠక్ సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను 1970లో ప్రారంభించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఈ సంస్థ దేశవ్యాప్తంగా సులభ్ ఫ్లష్ కంపోస్టింగ్ టాయిలెట్స్ ను నిర్మించింది.
- సమాధానం: 3
27. కింది వారిలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఎవరు?
1) సదానంద గౌడ
2) రవిశంకర్ ప్రసాద్
3) సృ్మతి ఇరానీ
4) రాజ్యవద్ధన్ రాథోడ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మే 15న కేంద్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా సమాచార ప్రసారాల శాఖ, జౌళి శాఖలు నిర్వహిస్తోన్న సృ్మతి ఇరానీని కేవలం జౌళి శాఖకే పరిమితం చేశారు. సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా రాజ్యవర్ధన్ రాథోడ్ ను నియమించారు.
- సమాధానం: 4
28. 2023 నాటికి ఆహారంలో ట్రాన్సఫాట్ని నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ప్రణాళిక ఏది ?
1) HDL HEALTH
2) REPLACE
3) BAD FAT
4) TRANS FAT
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2023 నాటికి ఆహారంలో ట్రాన్స్ఫాట్ని నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ REPLACE పేరుతో స్పష్టమైన ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఈ విధానం అమలుని ప్రారంభించింది. శరీరంలో చెడు కొవ్వులకు కారణమయ్యే ట్రాన్స్ ఫాట్ని నిర్మూలించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని రక్షించాలన్నది డబ్ల్యూహెచ్ఓ ప్రణాళిక. వేపుళ్లు, బ్రెడ్ ఆహారం, బేకరీ ఆహార పదార్థాల్లో, నిలువ ఉంచే ఆహారాల్లో ట్రాన్స్ఫాట్లు అధికంగా ఉంటాయి.
- సమాధానం: 2
29. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర ప్రక్రియల్ని సింగిల్ విండో విధానంలో పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన వెబ్ సైట్ పేరేమిటి ?
1) ధరణి
2) భరణి
3) తరుణి
4) ధరిత్రి
- View Answer
- సమాధానం: 1
వివరణ: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, తహసీల్దార్లు చేయాల్సిన మ్యుటేషన్ తదితర ప్రక్రియల్ని సింగిల్ విండో విధానంలో పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్సైట్ ని అందుబాటులోకి తెచ్చింది.
- సమాధానం: 1
30. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా అరుణ్ - 3 జల విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు ?
1) శ్రీలంక
2) ఇజ్రాయెల్
3) నేపాల్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీతో కలిసి 900 మెగావాట్ల అరుణ్ - 3 జల విద్యుత్ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. సీతాదేవి జన్మించిన ప్రాంతంగా విశ్వసిస్తున్న జనక్‌పూర్ నుంచి శ్రీ రాముడు జన్మించిన ఆయోధ్య వరకు నడిచే బస్సు సర్వీసుని ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు.
- సమాధానం: 3
31. నక్సల్స్ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏది?
1) సమాధాన్
2) బంధన్
3) జంగల్ ఫైర్
4) జంగల్ బంధ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో నక్సల్స్ అణచివేత కోసం కేంద్ర ప్రభుత్వం సమాధాన్ ఆపరేషన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా 2022 నాటికి దండకారణ్యంలో మావోయిస్టుల కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించి నక్సల్స్ లేని జోన్‌గా చేయాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య ఆపరేషన్ సమాధాన్ చేపట్టనున్నారు.
- సమాధానం: 1
32. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా ఇటీవల విజయవంతంగా నింగిలో ప్రవేశపెట్టిన బంగబంధు- 1 ఉపగ్రహం ఏ దేశానికి చెందినది ?
1) బంగ్లాదేశ్
2) భారత్
3) భూటాన్
4) బెల్జియం
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇటీవల ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా బంగ్లాదేశ్ కు చెందిన బంగబంధు- 1 ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
- సమాధానం: 1
33. 4వ అంతర్జాతీయ యువ శాస్త్రవేత్తల కాంగ్రెస్- 2018 ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరంలో జరిగింది ?
1) తిరుపతి
2) విజయవాడ
3) విశాఖపట్నం
4) అనంతపురం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 4వ అంతర్జాతీయ యువ శాస్త్రవేత్తల కాంగ్రెస్- 2018 ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగింది. రాష్ట్రీయ విద్యాపీఠం నిర్వహించిన ఈ సదస్సులో భారత్, నైజీరియా, మలేషియా, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్, తజకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన 140 మందికిపైగా యువ శాస్త్రవేత్తలు పాల్గొని తమ పరిశోధనలపై పోస్టర్, ఓరల్ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. ఇందులో రాజస్థాన్‌కు చెందిన రాజేష్ కూమార్ మీనాకు యంగ్‌సైంటిస్ట్ అవార్డు లభించింది. తదుపరి ఇంటర్నేషనల్ యంగ్ సైంటిస్ట్ కాంగ్రెస్‌ను నేపాల్‌లో నిర్వహించనున్నారు.
- సమాధానం: 1
34. ఇటీవల ఏ సంస్థ దేశీయ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్టులో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది ?
1) అమెజాన్
2) వాల్ మార్ట్
3) రిలయన్స ఇండస్ట్రీస్
4) ఆపిల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశీయ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్టులో 77 శాతం వాటాని అమెరికా రిటైల్ సంస్థ వాల్ మార్ట్ కొనుగోలు చేసింది. దీని విలువ 16 బిలియన్ డాలర్లు. దీంతో ప్రపంచ ఈ - కామర్స్ రంగంలో అతిపెద్ద లావాదేవీగా ఇది నిలిచింది. ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు 2007లో బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్‌ను నెలకొల్పారు.
- సమాధానం: 2
35. ఇటీవల వెల్లడించిన స్వచ్ఛ సర్వేక్షన్- 2018 ర్యాంకుల ప్రకారం దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం ఏది ?
1) ఇండోర్
2) భోపాల్
3) చండీగఢ్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 4,203 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్-2018’ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందులో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ తొలి స్థానంలో నిలిచింది. ఇండోర్ తర్వాత భోపాల్, చండీగఢ్‌లు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.
- సమాధానం: 1
36. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ?
1) బీహార్
2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
వివరణ: విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 29 రకాల క్రీడాకారులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రస్తుతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా తెలంగాణ మూడో రాష్ట్రంగా నిలిచింది.
- సమాధానం: 4
37. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది ?
1) అనంతపురం
2) కృష్ణా
3) నెల్లూరు
4) శ్రీకాకుళం
- View Answer
- సమాధానం: 1
వివరణ: విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసింది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని జంతులూరు గ్రామంలో రూ.902.07 కోట్లతో ‘ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వ విద్యాలయం’ ను నిర్మించనున్నారు.
- సమాధానం: 1
38. కింది వారిలో ఎవరికి బిజినెస్ వరల్డ్ ఇటీవల డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ - 2018 పురస్కారాన్ని ప్రకటించింది ?
1) నారా లోకేశ్
2) కె.తారక రామారావు
3) అఖిలేశ్ యాదవ్
4) తేజ్ ప్రతాప్ యాదవ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ - 2018 పురస్కారాన్ని అందుకున్నారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని లోకేశ్‌కు ఈ అవార్డు ప్రకటించారు.
- సమాధానం: 1
39. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌ను సందర్శించిన భారత మొదటి రాష్ట్రపతి ఎవరు ?
1) అబ్దుల్ కలాం
2) రామ్ నాథ్ కోవింద్
3) ప్రతిభా పాటిల్
4) ప్రణబ్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల సందర్శించారు. దీంతో 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తర్వాత సియాచిన్‌ను సందర్శించిన రెండో రాష్ట్రపతిగా కోవింద్ గుర్తింపు పొందారు. జమ్మూ &కశ్మీర్లో 2 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 52 డిగ్రీల వరకు పడిపోతాయి.
- సమాధానం: 1
40. టెన్నిస్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న పెద్ద వయస్కుడిగా ఇటీవల రికార్డు సృష్టించిన ప్లేయర్ ఎవరు ?
1) రాఫెల్ నాదల్
2) నొవాక్ జకోవిచ్
3) రోజర్ ఫెడరర్
4) ఆండీ ముర్రే
- View Answer
- సమాధానం: 3
వివరణ: టెన్నీస్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెడరర్ మే 14న కై వసం చేసుకున్నాడు. దీంతో టెన్నీస్‌లో టాప్ ర్యాంక్ అందుకున్న పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ 8,670 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 7,950 పాయింట్లతో నాదల్ రెండో స్థానంలో ఉన్నాడు.
- సమాధానం: 3
41. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన జాతీయ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు ?
1) హర్ష భరత్ కోటి
2) స్వప్నిల్
3) ఈషా కర్వాడె
4) ముసునూరి రోహిత్ లలిత్ బాబు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్ మాస్టర్ ముసునూరి రోహిత్ లలిత్ బాబు గెలుచుకున్నాడు.
- సమాధానం: 4
42. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ ఎవరు ?
1) జస్టిస్ సీకే ప్రసాద్
2) జస్టిస్ మార్కెండేయ కట్జూ
3) జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్
4) జస్టిస్ దీపక్ మిశ్రా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్. ఇటీవల వెల్లడించిన ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచీపై పీసీఐ అసహనం వ్యక్తం చేసింది. ర్యాంకింగ్ ఇవ్వడానికి ప్రాతిపదికలు ఏమిటో చెప్పాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా డబ్ల్యూపీఎఫ్ స్పందించలేదని PCI చైర్మన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల వెల్లడించిన ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్ లో భారత్ 138వ ర్యాంకులో నిలిచింది.
- సమాధానం: 1
43. జాతీయ జల అభివృద్ధి సంస్థ డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఎం.కె. శ్రీనివాస్
2) ఎం.ఎస్. అగర్వాల్
3) తన్నీరు హరీశ్ రావు
4) దేవినేని ఉమ
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA) డెరైక్టర్జనరల్గా ఎం.కె.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు జాతీయ జల అభివృద్ధి సంస్థకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ ప్రాంతానికి, ఆయన చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఈయన అసిస్టెంట్ డెరైక్టర్‌గా జల వనరుల సంఘంలో పని చేశారు.
- సమాధానం: 1
44. రాజ్యసభ నిబంధనల పున:పరిశీలనకు చైర్మన్ వెంకయ్య నాయుడు ఇటీవల ఎవరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు ?
1) పీజే కురియన్
2) వీకే అగ్నిహోత్రి
3) మల్లిఖార్జునే ఖర్గే
4) హమీద్ అన్సారీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజ్యసభ తరచూ వాయిదాలు పడకుండా కార్యకలాపాలు మరింత మెరుగ్గా, సజావుగా కొనసాగేలా నిబంధనల పునఃపరిశీలనకు చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్ వీకే అగ్నిహోత్రి నేతృత్వంలో న్యాయ శాఖ రిటైర్డ్ సంయుక్త కార్యదర్శి ఎస్.ఆర్. దలేతాతో కూడిన కమిటీ వివిధ అంశాలను సమీక్షిస్తుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ వెల్లడించారు.
- సమాధానం: 2
45. ప్రస్తుత కేబినెట్ కార్యదర్శి ఎవరు?
1) ప్రదీప్ కుమార్ సిన్హా
2) అజిత్ సేథ్
3) కేఎం చంద్రశేఖర్
4) బీకే చతుర్వేది
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఆయన 2019 జూన్ 12 వరకు పదవిలో కొనసాగుతారు. 1977 బ్యాచ్‌కు చెందిన సిన్హా ఉత్తరప్రదేశ్ కేడర్ అధికారి. 2015లో ఆయన మొదట రెండేళ్ల పదవీ కాలానికి కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం ఒకసారి పదవీ కాలాన్ని పొడిగించారు.
- సమాధానం: 1
46. గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్- 2018 భారత్‌లోని ఏ నగరంలో జరగనుంది?
1) బెంగళూరు
2) లక్నో
3) హైదరాబాద్
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 3
వివరణ: పర్యావరణ హిత నిర్మాణాలపై నిర్వహించే జాతీయ సదస్సు గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్- 2018కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ గ్రీన్బిల్డింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 2018, అక్టోబరు 31 నుంచి నవంబరు 3 వరకు నాలుగు రోజుల పాటు హెచ్ఐసీసీ వేదికగా ఈ సదస్సు జరగుతుంది.
- సమాధానం: 3
47. ప్రతిష్టాత్మక వి.కె.కృష్ణ మీనన్ అవార్డు - 2018ను ఇటీవల ఎవరికి ప్రకటించారు ?
1) మహేంద్ర చౌదరి
2) నరేంద్ర మోదీ
3) ప్రణబ్ ముఖర్జీ
4) ప్రీతి పటేల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత మాజీ హోంశాఖ మంత్రి వి.కె. కృష్ణ మీనన్ స్మారకార్థం ఆయన పేరిట ఏటా అవార్డుని అందజేస్తున్నారు. 2018 సంవత్సరానికి గాను భారత సంతతి వ్యక్తి మహేంద్ర చౌదరి ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఫిజిలో లేబర్పార్టీకి చెందిన ఆయన ఫిజి దేశపు ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి. హర్యానాకు చెందిన మహేంద్ర చౌదరి పూర్వీకులు 1902లో ఫిజికి వలస వెళ్లారు.
- సమాధానం: 1
48. ఆన్లైన్ బస్సు సీట్ల రిజర్వేషన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) పేటీఎం
2) పేయూ
3) మోబీక్విక్
4) ఎయిర్టెల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆన్లైన్లో బస్సు సీట్ల రిజర్వేషన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పేటీఎంతో రాజస్థాన్ రాష్ట్ర రవాణా సంస్థ, హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
- సమాధానం: 1
49. 15వ ఆర్థిక సంఘానికి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు అందించేందుకు కేంద్రం ఇటీవల ఎవరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది?
1) సుర్జిత్ ఎస్ భళ్లా
2) అరవింద్ విరమణి
3) సంజీవ్ గుప్తా
4) పినాకీ చక్రవర్తి
- View Answer
- సమాధానం: 2
వివరణ: 15వ ఆర్థిక సంఘానికి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా కేంద్రం సలహా మండలిని ఏర్పాటు చేసింది. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ విరమణి ఈ మండలికి నేతృత్వం వహిస్తారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్- నంద కిశోర్ సింగ్.
- సమాధానం: 2
50. క్వాకరెల్లి సైమండ్‌స(QS) ఇటీవల వెల్లడించిన ఉత్తమ విశ్వవిద్యాలయాలు - 2018 జాబితాలో ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఉన్న నగరంగా నిలిచింది ఏది?
1) లండన్
2) పారిస్
3) టోక్యో
4) మెల్ బోర్న్
- View Answer
- సమాధానం: 1
వివరణ: క్వాకరెల్లి సైమండ్స్(QS) ఇటీవల ఉత్తమ విశ్వవిద్యాలయాలు - 2018 జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఉన్న నగరంగా లండన్ నిలిచింది. లండన్ తర్వాత టోక్యో, మెల్బోర్న్, మాంట్రియల్, పారిస్, మ్యూనిచ్, బెర్లిన్, జ్యూరిచ్, సిడ్నీ, సియోల్‌లు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
- సమాధానం: 1