కరెంట్ అఫైర్స్ (మే 24 - 31) బిట్ బ్యాంక్
1. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఏ షెడ్యూల్ ప్రకారం.. ఆప్మెల్ (APHMEL) సంస్థను ఇటీవల ఆ రాష్ట్రానికి కేటాయించారు ?
1) 9వ షెడ్యూల్
2) 11వ షెడ్యూల్
3) 13వ షెడ్యూల్
4) 7వ షెడ్యూల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరువలో కృష్ణానది ఒడ్డున కొండపల్లిలో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ APHMEL (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్)ను ఏపీకి కేటాయించారు. 1994 నుంచి సింగరేణి అనుబంధ సంస్థగా ఉంటూ వస్తున్న APHMEL (ఆప్మెల్)ను ఇటీవలే ఏపీ పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి కేటాయిస్తూ షీలాబిడే కమిటీ ఇచ్చిన నివేదికకు కేంద్ర ఆమోదం లభించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాంతం ప్రాతిపదికన సింగరేణిలో 51 శాతం వాటాను తెలంగాణకు కేటాయించారు. ఈ లెక్కన సింగరేణిలో తెలంగాణకి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉంది.
- సమాధానం: 1
2. కృష్ణానదీ పునరుజ్జీవ జాతీయ సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) విజయవాడ
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
వివరణ: కృష్ణానదీ పునరుజ్జీవంపై 2018 మే 22న హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సును తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొన్న జలసంరక్షణ నిపుణుడు, రామన్ మెగసేసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ కృష్ణానదీ పరివాహక ప్రాంతమంతా కృష్ణానదికి సంబంధించినదేనని, దీనిని రక్షించడానికి ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.
- సమాధానం: 2
3. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ మొదటి మహిళా అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) నిక్కీ హేలీ
2) మనిషా సింగ్
3) స్టాసీ కన్నిన్ గమ్
4) నియోమి రావ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NYSE) 226 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా NYSE బోర్డు 67వ అధ్యక్షురాలిగా స్టాసీ కన్నిన్‌గమ్ ఇటీవల నియమితులయ్యారు. స్టాసీ కన్నిన్‌గమ్ మొదట NYSE లో క్లర్కు గా చేరారు.
- సమాధానం: 3
4. ఎవరెస్టుని ఎక్కువసార్లు అధిరోహించిన మహిళగా రికార్డు సృష్టించిన లక్పా షెర్పా ఏ దేశానికి చెందినవారు ?
1) భారత్
2) పాకిస్తాన్
3) చైనా
4) నేపాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించిన మహిళగా నేపాల్‌కు చెందిన లక్పా షెర్పా రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె తొమ్మిదోసారి ఎవరెస్టును అధిరోహించి తన పేరిటే ఉన్న రికార్డును అధిగమించారు.
- సమాధానం: 4
5. ట్రిప్ అడ్వైజర్ సంస్థ ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో తాజ్ మహల్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) రెండో స్థానంలో
2) ఆరో స్థానంలో
3) పదో స్థానంలో
4) ఒకటో స్థానంలో
- View Answer
- సమాధానం: 2
వివరణ: ట్రిప్ అడ్వైజర్ సంస్థ ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల జాబితా వెల్లడించింది. ఇందులో భారత్ లోని తాజ్‌మహల్‌కు 6వ స్థానం దక్కింది. ఆసియాలో తాజ్‌మహల్‌కు 2వ స్థానం లభించింది. ఈ సంస్థ 12 నెలల కాలంలో ప్రముఖ కట్టడాలను సందర్శించిన పర్యటకుల అభిప్రాయాలను విశ్లేషించి రూపొందించిన ఈ జాబితాలో కంబోడియాలోని అంకోర్ వాట్ మందిరం తొలి స్థానంలో నిలవగా, స్పెయిన్ లోని ప్లాజాడీ ఎస్పావా రెండో స్థానంలో, అబుధాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు మూడో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 2
6. 2018 మే 24న కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని కోట్ల జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచారు?
1) 31.56 కోట్లు
2) 80 కోట్లు
3) 120 కోట్లు
4) 90 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (PMJDY) కింద ఇప్పటివరకు 31.56 కోట్ల ఖాతాలు తెరిచామని కేంద్ర ప్రభుత్వం మే 24న వెల్లడించింది. 2018 మే 2 నాటికి ఈ ఖాతాల్లో రూ.81,300 కోట్ల నిల్వలు ఉన్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనను 2015 ఆగస్టు 28న ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు.
- సమాధానం: 1
7. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రదానం చేసిన మిషన్ కాకతీయ మీడియా అవార్డులు - 2017లో ఎలక్టాన్రిక్ మీడియా విభాగంలో ప్రథమ బహుమతిని ఎవరు అందుకున్నారు ?
1) నోముల రవీందర్ రెడ్డి
2) కె మల్లికార్జున రెడ్డి
3) పి శ్రీనివాస్
4) కె శ్రీశైలం
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ సాగునీటి ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ మీడియా అవార్డులు-2017 ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. చెరువుల పునరుద్ధరణ, పనుల తీరుపై రాసిన వార్తలకు, ప్రసారం చేసిన కథనాలకు గానూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు మంత్రి హరీశ్‌రావు అవార్డులు ప్రదానం చేశారు. ప్రింట్ విభాగంలో నోముల రవీందర్ రెడ్డి (ఆంధ్రజ్యోతి), ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో కె శ్రీశైలం (ఈటీవీ తెలంగాణ), ఫోటో జర్నలిస్టుల విభాగంలో గొట్టె వెంకన్న (నమస్తే తెలంగాణ) ప్రథమ బహుమతి అందుకున్నారు.
- సమాధానం: 4
8. పుంగ్వేరీ అణు పరీక్ష కేంద్రం ఏ దేశంలో ఉంది ?
1) ఉత్తర కొరియా
2) దక్షిణ కొరియా
3) లిబియా
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉత్తర కొరియాలో ఉన్న పుంగ్వేరీ అణు పరీక్ష కేంద్రాన్ని ఇటీవల ఆ దేశం ధ్వంసం చేసింది. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్రరహితంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 1
9. తాడోబా అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
1) తెలంగాణ
2) మహారాష్ట్ర
3) బిహార్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తాడోబా అభయారణ్యం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉంది. ఈ అభయారణ్యంలో నల్లపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ఇటీవల ధృవీకరించారు. చిరుత సంచారానికి సంబంధించి విదేశీ పర్యాటకులు అందించిన చిత్రాలను పరిశీలించిన తర్వాత అధికారులు ఈ మేరకు ప్రకటించారు.
- సమాధానం: 2
10. హర్యానాకు చెందిన మాజీ మంత్రి ప్రొఫెసర్ గణేషిలాల్ ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
వివరణ: హర్యానాకు చెందిన మాజీ మంత్రి ప్రొఫెసర్ గణేషిలాల్.. ఇటీవల ఒడిశా గవర్నర్ గా నియమితులయ్యారు. మిజోరాం గవర్నర్ గా కేరళకు చెందిన కుమ్మనం రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మే 25న ఉత్తర్వులు జారీ చేశారు.
- సమాధానం: 4
11. అబార్షన్ పై నిషేధాన్ని కొనసాగించాలా? లేదా రద్దు చేయాలా ? అనే అంశంపై ఇటీవల ఏ దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ?
1) స్విట్జర్లాండ్
2) నెదర్లాండ్స్
3) ఐర్లాండ్
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అబార్షన్ పై నిషేధాన్ని కొనసాగించాలా ? లేదా రద్దు చేయాలా ? అనే అంశంపై ఇటీవల ఐర్లాండ్ లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆ దేశంలో అబార్షన్ ని నిషేధిస్తు ఉన్న కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా 66.4 శాతం మంది ఓటు వేశారు. ఆరేళ్ల క్రితం భారత సంతతి వివాహిత సవితా హాప్పనవర్ (31) మృతితో ఐర్లాండ్‌లో అబార్షన్ వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఉద్యమం ప్రారంభమైంది.
- సమాధానం: 3
12. ఇటీవల కన్నుమూసిన మాదాల రంగారావు ఏ రంగానికి సంబంధించిన వారు ?
1) సినిమా
2) సాహిత్యం
3) రాజకీయం
4) వ్యాపారం
- View Answer
- సమాధానం: 1
వివరణ: విప్లవ చిత్రాల కథానాయకుడు మాదాల రంగారావు ఇటీవల హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయన 70 సినిమాల్లో నటించి, 12 సినిమాలని నిర్మించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో జన్మించిన రంగారావు.. ఛైర్మన్ చమయ్య తో సినిమా రంగ ప్రవేశం చేశారు. యువతరం కదిలింది చిత్రం ద్వారా గుర్తింపు సాధించారు.
- సమాధానం: 1
13. ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 11 సీజన్ టైటిల్ ని చెన్నై సూపర్ కింగ్స్ ఏ జట్టుని ఓడించి గెలుచుకుంది ?
1) సన్ రైజర్స్ హైదరాబాద్
2) కోల్‌కతా నైట్ రైడర్స్
3) రాజస్థాన్ రాయల్స్
4) కింగ్స్ ఎలెవన్ పంజాబ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐపీఎల్ - 11 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ముంబైలో జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఓడించి.. చెన్నై టైటిల్ కై వసం చేసుకుంది. చెన్నైకి ఇది మూడో ఐపీఎల్ ట్రోఫీ. ఇంతకముందు 2010, 2011ల్లోను ఆ జట్టు విజేతగా నిలిచింది.
- సమాధానం: 1
14. ఛాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీ - 2018 విజేత ఎవరు ?
1) లివర్ పూల్
2) బార్సిలోనా
3) రియల్ మాడ్రిడ్
4) మాంచెస్టర్ యునెటైడ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రొనాల్డో జట్టు రియల్ మాడ్రిడ్ ఛాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో విజయం సాధించింది. ఉక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన ఫైనల్లో లివర్‌పూల్‌పై గెలిచి వరుసగా మూడో ఏడాది టైటిల్ కై వసం చేసుకుంది.
- సమాధానం: 3
15. కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (NPHM) కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ కాన్పు చేయాలంటే ఎవరి అనుమతి తప్పనిసరి ?
1) తహసీల్దార్ / మున్సిపల్ చైర్మన్
2) జిల్లా కలెక్టర్
3) ప్రభుత్వ ఆసుపత్రి
4) ఎవరి అనుమతి అవసరం లేదు
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (NPHM) కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ కాన్పు చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రి అనుమతి అవసరం. ఈ మేరకు కేంద్రం ఇటీవల నిబంధనలను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్ కాన్పు చేయాలంటే ఆ గర్భిణికి కారణాలను వివరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రే అక్కడికి పంపాలి. పడకలు లేదా మానవ వనరుల కొరత లేక మరేదైనా ఇతర సమస్య ఉంటే దాన్ని పేర్కొనాలి. సహజ కాన్పులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని ఆయుష్మాన్ భారత్ (NPHM) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇందు భూషణ్ వెల్లడించారు.
- సమాధానం: 3
16. ఇటీవల పదవీ విరమణ చేసిన ఎస్. క్రిస్టోఫర్ కింది వాటిలోని ఏ సంస్థ అధిపతిగా పనిచేశారు ?
1) ఇస్రో
2) సీబీఎస్ఈ
3) డీఆర్డీవో
4) హెచ్ఏఎల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అధిపతి ఎస్. క్రిస్టోఫర్ 2018 మే 28న పదవీ విరమణ చేశారు. దీంతో 3 నెలల పాటు ఈ బాధ్యతను రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. క్రిస్టోఫర్ పదవీకాలం 2017 మే నెలలోనే ముగిసినప్పటికీ కేంద్రం ఆయనకు ఏడాదిపాటు పొడిగింపునిచ్చింది.
- సమాధానం: 3
17. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తొలిసారిగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎవరిని నియమించింది ?
1) సుధా బాలకృష్ణన్
2) అరుంధతి భట్టాచార్య
3) శిఖా శర్మ
4) చందా కొచ్చర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలిసారిగా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా సుధా బాలకృష్ణన్ ను నియమించింది. ఆమె ఇప్పటి వరకు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీకు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.
- సమాధానం: 1
18. పతంజలి సంస్థ ఇటీవల ఏ సంస్థతో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుని విడుదల చేసింది ?
1) ఎయిర్ టెల్
2) బీఎస్ఎన్ఎల్
3) ఐడియా
4) రిలయన్స్ జియో
- View Answer
- సమాధానం: 2
వివరణ: బాబా రాందేవ్ ప్రమోటర్ గా ఉన్న పతంజలి సంస్థ ఇటీవల సొంత సిమ్ కార్డ్ ను విడుదల చేసి టెలికం రంగంలోకి ప్రవేశించింది. బీఎస్ఎన్ఎల్ తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుని విడుదల చేసింది. దీనితో 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని పొందే ప్లాన్ కుడా తెచ్చింది
- సమాధానం: 2
19. ‘మద్యం తాగుట ఆరోగ్యానికి హానికరం. తాగి వాహనాలు నడపకండి. సురక్షితంగా ఉండండి’ అని పేర్కొంటూ మద్యం సీసాలపై హెచ్చరిక ముద్ర ఎప్పటి నుంచి కనిపించనుంది ?
1) 2018 జూలై
2) 2018 డిసెంబర్
3) 2019 జనవరి
4) 2019 ఏప్రిల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సిగిరెట్ ప్యాకెట్లపై ముద్రించిన హెచ్చరిక లాగే మద్యం సీసాలపై ‘మద్యం తాగుట ఆరోగ్యానికి హానికరం. తాగి వాహనాలు నడపకండి. సురక్షితంగా ఉండండి’ అని పేర్కొంటు హెచ్చరిక ముద్ర ముద్రించాలని భారత ఆహార భద్రత, ప్రమాణ ప్రాధికార సంస్థ (FSSAI) ఆదేశించింది. 2019 ఏప్రిల్ నుంచి మద్యం సీసాలపై ఈ ముద్ర కనిపించనుంది.
- సమాధానం: 4
20. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) అధ్యక్షునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) జస్టిస్ ఆర్.కే.అగర్వాల్
2) జస్టిస్ ఎన్వీ రమణ
3) జస్టిస్ దీపక్ మిశ్రా
4) జస్టిస్ రమేశ్ రంగనాథన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) అధ్యక్షునిగా జస్టిస్ ఆర్కే అగర్వాల్ ఇటీవల నియమితులయ్యారు. ఆయన ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు.
- సమాధానం: 1
21. జోకో విడోడో కింది వాటిలోని ఏ దేశ అధ్యక్షుడు ?
1) నేపాల్
2) ఇండోనేషియా
3) ఇథియోపియా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మూడు తూర్పు ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో పర్యటించారు. మోదీ ఇండోనేషియా వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య అంతరిక్షం, శాస్త్ర సాంకేతికత, రైల్వేలు, ఆరోగ్యం తదితర అంశాలపై 15 ఒప్పందాలు కుదిరాయి.
- సమాధానం: 2
22. తెలంగాణ రాష్ట్రం గ్రూప్ రైతుబంధు బీమా పథకాన్ని ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది ?
1) ఐసీఐసీఐ లాంబార్డ్
2) స్టార్ హెల్త్
3) ఎల్ఐసీ
4) నేషనల్ ఇన్సురెన్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు గ్రూప్ బీమా పథకాన్ని ఎల్ఐసీ సంస్థతో కలిసి ప్రారంభించింది. 2018 ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలవుతుంది. పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులకే ఈ పథకం వర్తిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులు పథకానికి అర్హులు. బీమా పరిధిలో ఉన్న రైతులు ఏదైనా కారణం చేత మరణిస్తే రూ. 5 లక్షల బీమా కుటుంబ సభ్యులకు అందుతుంది.
- సమాధానం: 3
23. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా ఇటీవల దేనిని ఎంపిక చేసింది ?
1) పాలపిట్ట
2) రామచిలక
3) కోయిల
4) పావురం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర వృక్షంగా వేప, రాష్ట్ర జంతువుగా జింక ఇప్పటికే ఉండగా, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వు, రాష్ట్ర పక్షిగా రామచిలుకను ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్ర వృక్షం - జమ్మి చెట్టు, రాష్ట్ర జంతువు - జింక, రాష్ట్ర పుష్పం - తంగేడు, రాష్ట్ర పక్షి - పాలపిట్ట.
- సమాధానం: 2
24. వాట్సాప్ కి పోటీగా ఇటీవల కింభో పేరుతో స్వేదేశీ యాప్ ని ఏ సంస్థ అందుబాటులోకి తెచ్చింది ?
1) ఇన్ఫోసిస్
2) కాగ్నిజెంట్
3) పతంజలి
4) ఫ్లిప్‌కార్ట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పతంజలి సంస్థ వాట్సాప్ కి పోటీగా కింభో పేరుతో స్వదేశీ మెసేజింగ్ యాప్ ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.
- సమాధానం: 3
25. క్రిప్టోసిస్టమ్ అనే సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం ఎక్కువగా ఆన్లైన్ మోసాలకు, మాల్వేర్ దాడులకు గురవుతన్న దేశం ఏది ?
1) కెనడా
2) అమెరికా
3) భారత్
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: క్రిప్టో సిస్టమ్ అనే సంస్థ 2018 జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య జరిగిన ఆన్ లైన్ మోసాలు, మాల్వేర్ దాడులపై అధ్యయనం చేసింది. ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. ఇందులో కెనడా మొదటి స్థానంలో, అమెరికా రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో, బ్రెజిల్ నాలుగో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 1
26. జాతీయ రాజకీయ పార్టీలు ప్రభుత్వ సంస్థల కిందకి వస్తాయని, వాటికి సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని ఇటీవల కింది వాటిలోని ఏ సంస్థ స్పష్టం చేసింది ?
1) ఆర్బీఐ
2) కేంద్ర ఎన్నికల సంఘం
3) కాగ్
4) నీతి ఆయోగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జాతీయ రాజకీయ పార్టీలు ప్రభుత్వ సంస్థల కిందకి వస్తాయని వాటికి సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు ఎంత మొత్తంలో విరాళాలు వచ్చాయో చెప్పాలని ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా ఆ వివరాలు తమ వద్ద లేవనీ, పార్టీలు చట్టం పరిధిలోకి రావని ఈసీ సమాధానమిచ్చింది. ఇది వివాదాస్పదం కావడంతో ఈసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. జాతీయ పార్టీలను ప్రభుత్వ సంస్థలుగా ప్రకటిస్తూ, వాటికీ ఆర్టీఐ చట్టం వర్తిస్తుందని కేంద్ర సమాచార కమిషన్ 2013 జూన్‌లో ఆదేశాలిచ్చింది.
- సమాధానం: 2
27. ఇటీవల భారత్ లో పర్యటించిన మార్క్ రూట్ కింది వాటిలోని ఏ దేశ ప్రధానమంత్రి ?
1) ఇండోనేషియా
2) జపాన్
3) చైనా
4) నెదర్లాండ్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ ఇటీవల భారత్ లో పర్యటించారు. మే 24న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స మూడో స్థానంలో ఉంది.
- సమాధానం: 4
28. ఏ రాష్ట్రంలో నిర్మించిన బంగ్లాదేశ్ భవన్ ను ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇటీవల ప్రారంభించారు ?
1) పశ్చిమ బెంగాల్
2) సిక్కిం
3) ఉత్తరాఖండ్
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలకు చిహ్నంగా పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్శిటీలో బంగ్లాదేశ్ ‘‘బంగ్లాదేశ్ భవనాన్ని’’ నిర్మించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు ఇటీవల ఈ భవనాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 1
29. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎన్ని జోన్లకు ఆమోదం తెలిపింది ?
1) 2 జోన్లు
2) 6 జోన్లు
3) 7 జోన్లు
4) 10 జోన్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణలో కొత్తగా 7 జోన్లు, 2 మల్టీ జోన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల వ్యవస్థను విభజించి కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. ఒకటో మల్టీ జోన్లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు... రెండో మల్టీ జోన్లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు ఏర్పాటు కానున్నాయి.
- సమాధానం: 3
30. తూత్తుకుడి స్టెరిలైట్ రాగి ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత లిమిటెడ్‌కు చెందిన ‘స్టెరిలైట్’ రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యం వెదజల్లుతున్న ఈ ప్లాంట్‌ను మూసేయాలని ప్రజలు వంద రోజులుగా ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోయారు.
- సమాధానం: 2
31. ఉబెర్ కప్ ఏ క్రీడకు సంబంధించినది ?
1) బ్యాడ్మింటన్
2) క్రికెట్
3) టెన్నిస్
4) హాకీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించినది. దీన్ని మహిళల టీమ్ చాంపియన్‌షిప్ గాను పిలుస్తారు. ఇటీవల థాయ్‌లాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన ఉబెర్ కప్ ఫైనల్లో థాయ్‌లాండ్ ను ఓడించి జపాన్ విజేతగా నిలిచింది.
- సమాధానం: 1
32. ఇటీవల జరిగిన మొనాకో గ్రాండ్ ప్రీ - 2018 టైటిల్ విజేత ఎవరు ?
1) డానియెల్ రికియార్డో
2) సెబాస్టియన్ వెటెల్
3) లూయిస్ హామిల్టన్
4) వాల్టెరీ బొటాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో గెలుచుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రన్నరప్‌గా నిలవగా మరో డ్రైవర్ హామిల్టన్ మూడో స్థానంలో నిలిచాడు.
- సమాధానం: 1
33. ఇటీవల కన్నుమూసిన వ్యోమగామి అలెన్ బీన్ ఏ దేశానికి చెందిన వారు ?
1) రష్యా
2) భారత్
3) అమెరికా
4) చైనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికా వ్యోమగామి అలెన్ లావెర్న్ బీన్ ఇటీవల అనారోగ్యం కారణంగా హ్యూస్టన్ నగరంలో కన్నుమూశారు. 1969 నవంబర్ 14న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అపోలో 12 పేరిట చేపట్టిన చంద్రగ్రహ యాత్రలో కన్రాడ్, రిచర్డ్, గోర్డాన్లతోపాటు అలెన్ బీన్ పాల్గొన్నారు. ఇది విజయవంతం అవడంతో చంద్రునిపై కాలుమోపిన నాలుగో వ్యక్తిగా అలెన్ బీన్ గుర్తింపు పొందారు.
1969లో నీల్ ఆమ్ట్రాంగ్ తొలిసారి చంద్రుడిపై కాలుమోపారు. నాసా అపోలో మిషన్ 11 ద్వారా ఈ ఘనత సాధించారు. రెండో వ్యక్తి బచ్ ఆల్డిన్ ్రజూనియర్. మూడో వ్యక్తి పీట్ కాన్రాడ్ జూనియర్. నాలుగో వ్యక్తి అలెన్ బీన్.
- సమాధానం: 3
34. భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు (NSA) గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) పంకజ్ శరణ్
2) నృపేంద్ర మిశ్రా
3) అజిత్ దోవల్
4) దేబాష్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా సీనియర్ దౌత్యవేత్త పంకజ్ శరణ్ నియమితులయ్యారు. ఆయన రెండేళ్లు ఈ పదవిలో ఉంటారు. 1982 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) బ్యాచ్‌కు చెందిన పంకజ్ 2015 నుంచి ఇప్పటివరకు రష్యాలో భారత రాయబారిగా ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు - అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి - నృపేంద్ర మిశ్రా, ప్రధాన మంత్రి సంయుక్త కార్యదర్శి - దేబశ్రీ ముఖర్జీ, వి శేషాద్రి, బ్రజేంద్ర నవనిత్, గోపాల్ బగ్లే.
- సమాధానం: 1
35. ఇటీవల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించిన ‘‘Illustrated biography of Jawaharlal Nehru'' పుస్తక రచయిత ఎవరు ?
1) ఏకే ఆంటోని
2) రోషయ్య
3) ఏ గోపన్న
4) కిరణ్ కుమార్ రెడ్డి
- View Answer
- సమాధానం: 3
వివరణ: తమిళనాడు కాంగ్రెస్ మీడియా ఇన్చార్జ్ ఏ.గోపన్న రచించిన "Illustrated biography of Jawaharlal Nehru" ని ఇటీవల ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. మొదటి ప్రతిని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలకు అందజేశారు.
- సమాధానం: 3
36. ఇటీవల మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అవార్డు - 2018 కి ఎంపికై న ఓగ్లా తొకర్ జూ ఏ దేశానికి చెందిన రచయిత ?
1) పోలాండ్
2) అమెరికా
3) రష్యా
4) భారత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పోలాండ్ రచయిత ఓగ్లా తొకర్ జూ రాసిన ‘ఫ్లైట్స్’ అనే అనువాద నవలకు ఈ ఏడాది మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఈ బహుమతి కింద వచ్చే 67 వేల డాలర్ల ప్రైజ్ మనీని ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్ క్రోఫ్ట్తో కలిసి పంచుకుంటారు. ఇదే నవలకు గాను ఓగ్లాకు 2008లో పోలాండ్ అత్యున్నత సాహిత్య పురస్కారమైన ‘నైక్’ అవార్డు కూడా దక్కింది. 2005 నుంచి మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ అవార్డుని అందజేస్తున్నారు. యూకేకి చెందిన మాన్ గ్రూప్ పీఎల్సీ సంస్థ ఈ అవార్డుని అందజేస్తుంది.
- సమాధానం: 1
37. వింగ్స్ ఏవియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఇటీవల దేశంలోనే తొలిసారిగా కింది వాటిలోని ఏ నగరంలో ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించింది?
1) అహ్మదాబాద్
2) లక్నో
3) కోల్కత్తా
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలోనే తొలిసారిగా ఎయిర్ అంబులెన్స్ సేవలను మే 16న హైదరాబాద్ లో వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రారంభించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సేవలను అందించనుంది.
- సమాధానం: 4
38. ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో కింది వారిలో ఎవరికి క్రీడా ప్రపూర్ణ బిరుదుని ప్రదానం చేసింది ?
1) వీవీఎస్ లక్ష్మణ్
2) కిడాంబి శ్రీకాంత్
3) అంబటి రాయుడు
4) పీవీ సింధు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం మే 31న జరిగింది. ఇందులో భాగంగా క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు క్రీడా ప్రపూర్ణ బిరుదుని ప్రదానం చేసింది. సంగీత దర్శకుడు ఇళయరాజా, గేయ రచయిత చంద్రబోస్, నేపథ్య గాయని రావు బాల సరస్వతిలకు కళా పురస్కారాలను ప్రదానం చేశారు.
- సమాధానం: 1
39. కింది వాటిలోని ఏ దేశం విదేశీ సినిమాలను ఇటీవల తాత్కాలికంగా నిషేధించింది ?
1) పాకిస్తాన్
2) అమెరికా
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: విదేశీ సినిమాలని తాత్కాలికంగా నిషేధిస్తూ పాకిస్తాన్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న దేశీయ చిత్ర పరిశ్రమ డిమాండ్ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 1
40. అవసరానికి మంచి సోలార్ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తు ఇతరులకు విక్రయిస్తున్న సంస్థగా గుర్తింపు పొందిన దేశంలోని తొలి ప్రభుత్వ పౌర సేవల సంస్థ ఏది ?
1) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
2) దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
3) గ్రేటర్ చెన్నై కార్పొరేషన్
4) గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తన పరిధిలోని 55 భవనాలపై సోలార్ ప్యానెల్స్ అమర్చింది. వీటి ద్వారా అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు మిగులు విద్యుత్ ను ఇతర సంస్థలకి విక్రయిస్తుంది. తద్వారా ఈ తరహా గుర్తింపు పొందిన దేశంలోనే తొలి పౌర సేవల సంస్థగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
41. ఆసియాన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) గోవా
3) బెంగళూరు
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మే 25 నుంచి 30 వరకు ఆసియాన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ఈ వేడుకని ప్రారంభించారు. జసారీ భాషలో రూపొందించిన సింజారి చిత్రాన్ని తొలుత ప్రదర్శించారు. 11 దేశాలకు చెందిన 32 చిత్రాలను ఇందులో ప్రదర్శించారు.
Tag Line : Friendship through Films
- సమాధానం: 1
42. జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (NCDC) ఇటీవల ఏ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం రూ.5 వేల కోట్లు మంజూరు చేసింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ ను 1963లో ఏర్పాటు చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ కింద స్వతంత్ర సంస్థగా ఇది పనిచేస్తుంది. వ్యవసాయంలో సహకారం, వ్యవసాయ అనుబంధ సంస్థలకు రుణ సహాయం తదితర సేవలు అందిస్తుంది. రాజస్థాన్ ప్రభుత్వం.. సహకార బ్యాంకుల నుంచి రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న ఆ రాష్ట్ర రైతులకు మాఫీ ప్రకటించింది. ఇందుకోసం రూ.8 వేల కోట్లు అవసరమవుతాయి. ఇందులో రూ.5 వేల కోట్ల రూపాయలను జాతీయ సహకార అభివృద్ధి కొర్పోరేషన్ మంజూరు చేసింది.
- సమాధానం: 4
43. ఇటీవల నాటో (North Atlantic Treaty Organization) లో చేరిన లాటిన్ అమెరికాలోని తొలి దేశం ఏది ?
1) పెరూ
2) కొలంబియా
3) వెనెజులా
4) చిలి
- View Answer
- సమాధానం: 2
వివరణ: నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో చేరుతున్న తొలి లాటిన్ అమెరికా దేశంగా కొలంబియా గుర్తింపు పొందింది. ఈ మేరకు నాటోలో చేరుతున్నట్లు కొలంబియా ఇటీవల ప్రకటించింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్ మెంట్ (OECD) లో కూడా చేరుతున్నట్లు కొలంబియా ప్రకటించింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడిన సోవియట్ యూనియన్ను అడ్డుకునేందుకు అమెరికా, ఐరోపా దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)ను ఏర్పాటు చేశాయి. 1949 ఏప్రిల్ 4న ఇది ఆవిర్భవించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, పోర్చుగల్, ఇటలీ, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ తదితర దేశాలు దీనిపై సంతకాలు చేశాయి.
- సమాధానం: 2
44. లెబనాన్ ప్రధానమంత్రిగా మూడోసారి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) మైఖెల్ ఔన్
2) సాద్ హరిరి
3) అబ్దుల్ హషీమ్
4) మహమ్మద్ ముర్జా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫ్యూచర్ మూమెంట్ పార్టీకి చెందిన సాద్ హరిరి ఇటీవల జరిగిన లెబనాన్ ఎన్నికల్లో 128 సీట్లలో 111 సీట్లు సాధించి మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈయన ప్రధాని పదవికి ఎన్నికవడం ఇది మూడోసారి. లెబనాన్ ప్రతిపక్ష పార్టీ - హెజ్ బొల్లా
- సమాధానం: 2
45. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు ?
1) హస్ముఖ్ అథియా
2) ఎన్ కే సింగ్
3) పీపీ మల్హోత్రా
4) రంజిత్ కుమార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్ కే సింగ్. ఇటీవల మే 28 నుంచి 31 వరకు ఎన్ కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం కేరళలో పర్యటించింది. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, వివరాలను పరిశీలించింది.
- సమాధానం: 2
46. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ సంస్థతో కలిసి రుస్తుమ్ - 2 మానవరహిత ఏరియల్ వెహికల్ ను తయారు చేస్తోంది ?
1) డీఆర్డీవో
2) ఇస్రో
3) హెచ్ఏఎల్
4) ఆర్ఆర్ఐ
- View Answer
- సమాధానం: 3
వివరణ: రుస్తుమ్ - 2 మానవ రహిత ఏరియల్ వెహికల్ ను భారత్ ఎలక్టాన్రిక్స్ లిమిటెడ్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తుంది. దీన్ని 2020 నాటికి భారత సైన్యానికి అందిస్తామని డీఆర్డీవో ఇటీవల ప్రకటించింది.
- సమాధానం: 3
47. బార్బడోస్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) మియా మాట్లే
2) జియా అండ్రూస్
3) టియా గ్రెగర్
4) డయానా హెడ్జర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కరీబియన్ ద్వీప దేశం బార్బొడోస్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా ఇటీవల మియా మాట్లే ఎన్నికయ్యారు. బార్బడొస్ లేబర్ పార్టీకి చెందిన మియా డెమొక్రటిక్ లేబర్ పార్టీని ఓడించారు. అసెంబ్లీలోని మొత్తం 30 సీట్లలో ఆమె గెలుపొందారు.
- సమాధానం: 1
48. సియాట్ క్రికెట్ రేటింగ్స్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికైన ప్లేయర్ ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) శిఖర్ ధావన్
3) ట్రెంట్ బౌల్ట్
4) కొలిన్ మన్రూఫ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇటీవల సియాట్ క్రికెట్ రేటింగ్స్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కు ఎంపిక్యయారు. ఇంటర్నేషనల్ బ్యాట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ గా శిఖర్ ధావన్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ గా ట్రెంట్ బౌల్ట్ ఎంపికయ్యారు.
- సమాధానం: 1
49. బారన్ టాప్ - 30 గ్లోబల్ సీఈవోల జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయుడు ఎవరు ?
1) ఆదిత్య పురి
2) చందా కొచ్చర్
3) అజిమ్ ప్రేమ్ జీ
4) ముఖేశ్ అంబానీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోని టాప్-30 గ్లోబల్ సీఈవోలలో వరుసగా నాలుగో ఏడాది కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ పబ్లికేషన్ ‘బారన్’ టాప్-30 గ్లోబల్ సీఈవోల జాబితాను ఇటీవల విడుదల చేసింది. అమెజాన్ జెఫ్ బెజోస్, బెర్క్‌షైర్ హాతవే వారెన్ బఫెట్, జేపీ మోర్గాన్ చేస్ జమీ డిమోన్, అల్ఫాబెట్ లారీ పేజ్, నెట్‌ఫ్లిక్స్ రీడ్ హస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, ఫేస్బుక్ మార్క్ జుకర్‌బర్గ్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.
- సమాధానం: 1
50. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మే 27
2) మే 29
3) మే 31
4) మే 25 2018 Theme : Tobacco and heart disease
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పొగాకు, ధూమపానం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
- సమాధానం: 3