కరెంట్ అఫైర్స్ (జనవరి 17-24) బిట్ బ్యాంక్
1. భారత్ నుంచి దిగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై ఇటీవల నిషేధం విధించిన దేశం ?
1) అమెరికా
2) కెనడా
3) సౌదీ అరేబియా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న రెండో అతి పెద్ద దేశం సౌదీ అరేబియా. ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఆ దేశం భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై తాత్కాలిక నిషేధం విధించింది.
- సమాధానం: 3
2. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని స్వచ్ఛంద సంస్థల లెసైన్సులను రద్దు చేసింది ?
1) 5,000
2)10,000
3)15,000
4)20,000
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలో మొత్తం 33 వేల రిజిస్టర్డ్స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వీటిలో 20 వేల సంస్థలు చట్టాలను ఉల్లంఘించి విదేశీ నిధులు సేకరించాయని గుర్తించిన కేంద్రం వాటి లెసైన్సులను రద్దు చేసింది.
- సమాధానం: 4
3. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం ?
1) మాలీన్నోంగ్
2) కోనోమా
3) కిలా రాయ్‌పూర్
4) మలానా
- View Answer
- సమాధానం: 1
వివరణ: మేఘాలయ రాష్ట్రం తూర్పుఖాసి హిల్స్ జిల్లాలోని మాలీన్నోంగ్ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ ఎంపిక చేసింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం అందరూ కలిసి గ్రామాన్ని శుభ్రపరుస్తారు.
- సమాధానం: 1
4. ఇటీవల ఏ దేశంలో ప్రో న్యూక్లియర్ ట్రాన్సఫర్ ద్వారా పిల్లలు జన్మించారు ?
1) చైనా
2) ఇజ్రాయెల్
3) ఉక్రెయిన్
4) కెనడా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రో న్యూక్లియర్ ట్రాన్సఫర్ విధానంలో ముగ్గురు వ్యక్తుల అంశాలతో పిల్లలు జన్మిస్తారు. మైటోకాండ్రియా వ్యాధులు ఉన్నవారిలో సంతానం కోసం ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. తొలిసారి 2016లో మెక్సికోలో ఈ విధానం ద్వారా పిల్లలు జన్మించారు. ఇటీవల 2017 జనవరి 5న ఉక్రెయిన్‌లో ఇదే విధానంతో ఓ ఆడపిల్ల జన్మించింది.
- సమాధానం: 3
5. అర్బన్ క్యాపిటల్ రూపొందించిన పాస్ పోర్ట్ ఇండెక్స్ 2017లో భారత్ స్థానం ?
1) 58
2) 68
3) 78
4) 98
- View Answer
- సమాధానం: 3
వివరణ: వీసా లేకుండా లేదా గమ్యం చేరిన తర్వాత వీసా పొందే విధానంలో వివిధ దేశాలు పాటిస్తున్న నియమాల ఆధారంగా అర్బన్ క్యాపిటల్ సంస్థ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2017ను తయారు చేసింది. ఈ నివేదికలో 157 మార్కులతో జర్మనీ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్, స్వీడన్ 156 మార్కులతో రెండో స్థానంలో ఉండగా చైనా 58, భారత్ 78, పాకిస్తాన్ 94 స్థానాల్లో నిలిచాయి.
- సమాధానం: 3
6. దేశంలో తొలి నగదు రహిత దీవి ?
1) వీలార్
2) కరంగ్
3) అకోదర
4) సాల్స్టెట
- View Answer
- సమాధానం: 2
వివరణ: డిజిటల్ ఇండియాలో భాగంగా మణిపూర్ రాష్ట్రంలోని కరంగ్ తొలి నగదు రహిత దీవిగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
7. ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016-17లో భారత్ వృద్ధి రేటు ఎంత ?
1) 7.7 శాతం
2) 7 శాతం
3) 6.8 శాతం
4) 6.3 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అవకాశాలు 2017 పేరుతో ఐరాస జనవరి 17న నివేదిక విడుదల చేసింది. 2016-17లో భారత్ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటుందని ఇందులోపేర్కొంది.
- సమాధానం: 1
8. ఇటీవల యూరోపియన్ పార్లమెంట్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు ?
1) గియాన్ని పిటెల్లా
2) మాల్టిన్ షూల్జ్
3) జాన్ క్లాడ్ జంకర్
4) ఆంటోనియా టాజాని
- View Answer
- సమాధానం: 4
వివరణ: యూరోపియన్ పీపుల్స్ పార్టీకి చెందిన 63 ఏళ్ల ఆంటోనియా టాజాని, గియాని పిటెల్లాను ఓడించి యూరోపియన్ పార్లమెంట్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- సమాధానం: 4
9. హిల్సా చేపల రక్షణ కోసం ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసిన రాష్ట్రం ?
1) ఒడిశా
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: IUCN (International Union for Conservation of Nature) సంస్థ హిల్ సా చేపలను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ చేపలను పట్టడం, కొనడం, విక్రయించడాన్ని నేరంగా పరిగణిస్తూ జీవో జారీ చేసింది.
- సమాధానం: 3
10. లెజెండ్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించిన క్రీడాకారుడు ఎవరు ?
1) కపిల్‌దేవ్
2) సచిన్
3) సునిల్ గవాస్కర్
4) అజిత్ వాడేకర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోని ప్రముఖ క్రికెట్ క్లబ్ లెజెండ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్‌దేవ్‌కి ఇటీవల చోటు లభించింది. కపిల్ సారథ్యంలో భారత్ తొలిసారి 1983లో క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది. టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయిని దాటిని తొలి క్రికెటర్ కపిల్ దేవ్.
- సమాధానం: 1
11. 58వ భారత అంతర్జాతీయ గార్మెంట్ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) కొయంబత్తూరు
2) వారణాసి
3) మణపురం
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: వస్త్రాల ఎగుమతుల ప్రమోషన్ కోసం కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాన్ని కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. ఈ ఉత్సవాన్ని 1988 నుంచి నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 4
12. ఇటీవల భారతీయ రైల్వే వచ్చే పదేళ్లలో ఎన్ని కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) రూ.41,000 కోట్లు
2) రూ.31,000 కోట్లు
3) రూ.21,000 కోట్లు
4) రూ.11,000 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: మిషన్ 41K కింద వచ్చే పదేళ్లలో రూ.41,000 కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రానిక్ ఇంజిన్లను ప్రవేశపెట్టనుంది. అలాగే మార్కెట్ నుంచి తక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఈ తరహా చర్యల ద్వారా ప్రస్తుత ఇంధన వినియోగంలో 25 శాతం ఆదా చేయొచ్చన్నది రైల్వే శాఖ అంచనా.
- సమాధానం: 1
13. దేశంలోని ఏ ప్రాంత విద్యుత్ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ ఇటీవల రూ.1,376 కోట్ల రుణం మంజూరు చేసింది ?
1) పశ్చిమ బెంగాల్
2) అసోం
3) ఉత్తరప్రదేశ్
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ బ్యాంకు రుణంతో త్రిపుర రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం 132కేవీ, 32 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టారు.
- సమాధానం: 4
14. ఇటీవల బుర్కినాఫాసో దేశానికి భారత హైకమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) రాజేంద్ర సింగ్
2) బిరేంద్ర సింగ్ యాదవ్
3) రామ్ చరణ్ యాదవ్
4) నిర్మలా రాజారామ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఘనాలో భారత హైకమిషనర్‌గా ఉన్న బిరేంద్ర సింగ్ యాదవ్ ఇటీవల బర్కినా ఫాసోకు బదిలీ అయ్యారు.
- సమాధానం: 2
15. ప్రపంచ మెట్రోలాజికల్ సంస్థ నివేదిక ప్రకారం అత్యంత వేడి సంవత్సరం ఏది ?
1) 2000
2) 2007
3) 2012
4) 2016
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2016లో గరిష్ట ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది. 1950లో ప్రపంచ మెట్రోలాజికల్ సంస్థను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
16. ఇటీవల ప్రపంచ ఒలింపిక్స్ సంఘంతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న ఈ కామర్స్ సంస్థ ఏది ?
1) అమెజాన్
2) అలిబాబా
3) స్నాప్ డీల్
4) ఈబే
- View Answer
- సమాధానం: 2
వివరణ: దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సమావేశంలో ప్రపంచ ఒలింపిక్ సంఘం, అలిబాబా మధ్య దీర్ఘ కాలిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2028 నుంచి ఒలింపిక్స్‌కు అధికారిక స్పాన్స్ర్గా అలిబాబా వ్యవహరిస్తుంది.
- సమాధానం: 2
17. హిమాచల్ ప్రదేశ్ రెండవ రాజధానిగా ఇటీవల గుర్తింపు పొందిన ప్రాంతం ఏది ?
1) కాంగ్రా
2) మనాలి
3) ధర్మశాల
4) డల్హౌసి
- View Answer
- సమాధానం: 3
వివరణ: హిమాచల్ ప్రదేశ్‌కు మొదటి రాజధానిగా ఉన్న సిమ్లా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని సౌకర్యాలు ఉన్న ధర్మశాలను ఆ రాష్ట్ర రెండో రాజధానిగా ఎంపిక చేశారు.
- సమాధానం: 3
18. గాంబియా దేశ నూతన అధ్యక్షుడు ఎవరు ?
1) యహా జమ్మె
2) ఫాతోమాత టామభజంగ్
3) ఫారిమాంగ్ మహమ్మది
4) ఆదామా బారో
- View Answer
- సమాధానం: 4
19. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి డిజి ధన్ మేళా ఎక్కడ నిర్వహించారు ?
1) కాకినాడ
2) విజయవాడ
3) విశాఖపట్నం
4) అన్నవరం
- View Answer
- సమాధానం: 2
వివరణ: విజయవాడలో నిర్వహించిన డిజిధన్ మేళాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఆన్లైన్ చెల్లింపులు చేసిన వారిలో 15 వేల మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.
- సమాధానం: 2
20. ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి టెక్నికల్ విభాగంలో ఎంపికైన భారతీయుడు ?
1) పరాగ్ హవల్ దార్
2) మైఖేల్ జాన్ కేస్లింగ్
3) స్టీవ్ స్మిత్
4) మైక్ బ్రహాయ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అకాడమి ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సెన్సైస్ ప్రదానం చేసే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పురస్కారానికి ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి పరాగ్ హవల్ దార్ ఎంపికయ్యారు. ఈయన మాన్స్టర్ హౌస్, హన్ కాక్, స్పైడర్ మ్యాన్ చిత్రాలకు సాంకేతిక సహకారం అందించారు.
- సమాధానం: 1
21. క్షయ నిర్మూలనకు పాటుపడినందుకు గాను ఏ బాలీవుడ్ నటుడు అమెరికా ప్రశంసా పురస్కారం పొందారు ?
1) సల్మాన్ ఖాన్
2) షారూఖ్ ఖాన్
3) అమితాబ్ బచ్చన్
4) రాకేశ్ రోషన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: గత 20 ఏళ్లుగా భారత్-అమెరికా సంయుక్తంగా క్షయ నిర్మూలన కోసం కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరిచారు. అతడి సేవలకు గుర్తింపుగా అమెరికా ప్రశంసా పురస్కారం దక్కింది.
- సమాధానం: 3
22. చెన్నై ఓపెన్ డబుల్స్ విజేత ఎవరు ?
1) పూర్వర్ రాజా, దివిజ్ శరణ్
2) రోహన్ బోపన్న, జీవన్ నెడుంజెహియన్
3) నికోలస్ మాన్రో, ఆర్టమ్ సిక్టా
4) జేమ్స్ సెర్టాని, ఫిలిప్ ఓస్వాల్ద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పూర్వర్ రాజా, దివిజ్ శరణ్‌లను ఓడించి రోహన్ బోపన్న, జీవన్ నెడుంహెహియన్ చెన్నై ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. రాబర్టో బటిస్టా అగుత్ సింగిల్స్ విజేతగా నిలిచాడు. 1996లో చెన్నై ఓపెన్ టైటిల్‌ను ప్రారంభించారు.
- సమాధానం: 2
23. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్రాంతంలో అల్లంలో కొత్త జాతిని కనుగొన్నారు ?
1) కేరళ
2) అసోం
3) హిమాచల్ ప్రదేశ్
4) అండమాన్ అండ్ నికోబార్ దీవులు
- View Answer
- సమాధానం: 4
వివరణ: zingiber pseudo squarrosum అనే కొత్త రకం అల్లంను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఎరుపు రంగులో తామర పువ్వు ఆకారంలో ఉంటుంది.
- సమాధానం: 4
24. శాస్త్రవేత్తలు ఇటీవల ఏ సముద్రంలో నూతన భూ ఫలకం ఆనవాళ్లను గుర్తించారు ?
1) హిందూ మహాసముద్రం
2) బాల్టిక్ సముద్రం
3) పసిఫిక్ సముద్రం
4) మధ్య ధరా సముద్రం
- View Answer
- సమాధానం: 1
వివరణ: సింగపూర్, ఫ్రాన్స్, ఇండోనేషియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ భూ ఫలకం ఆనవాళ్లను గుర్తించారు. దీని వల్ల భూకంపాల తీవ్రత, విధ్వంసం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు వెల్లడించారు.
- సమాధానం: 1
25. యూరప్ తొలి జలాంతర్గ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) వెనిస్
2) బెర్న్
3) లాంజ్ రోట్
4) వియన్నా
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్పెయిన్ దేశానికి చెందిన కేనరి దీవుల తీరాన్ని ఆనుకొని ఉన్న లాంజ్రోట్ వద్ద తొలి జలాంతర్గ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇందులో జాసన్ కై రావ్ టేలర్ అనే శిల్పి 3 సంవత్సరాల వ్యవధిలో 300 శిల్పాలను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 3
26. అట్లాంటిక్ కౌన్సిల్‌కు నామినేట్ అయిన భారతీయుడు ఎవరు ?
1) అమిత్ షా
2) వెంకయ్య నాయుడు
3) అరుణ్ జైట్లీ
4) మనిష్ తివారి
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ రాజకీయ నాయకులు, వ్యాపారులు, మేధావుల కోసం 1961 అట్లాంటిక్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో సభ్యుడిగా మనిష్ తివారి నామినేట్ అయ్యారు. ఈయన భారత్-అమెరికాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తారు.
- సమాధానం: 4
27. ఐఎన్ఎస్ కందారి స్కార్పియన్ జలాంతర్గామిని తయారు చేసిన దేశం ఏది ?
1) ఇంగ్లండ్
2) ఫ్రాన్స్
3) కెనడా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్కార్పియన్ తరగతికి చెందిన డీజిల్-ఎలక్ట్రికల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కందారిని ఫ్రాన్స్‌కు చెందిన డెరైక్షన్ దెస్ కన్స్ట్రక్షన్స్ నావల్స్, స్పెయిన్‌కు చెందిన నావిటియా సంస్థలు ముంబైలోని మజ్‌గావ్‌డక్‌లో నిర్మించాయి.
- సమాధానం: 2
28. పీపుల్స్ చాయిస్ పురస్కారాల్లో భాగంగా డ్రామాటిక్ టి.వి. ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికైన నటి ఎవరు ?
1) ప్రియాంకా చోప్రా
2) కేర్రి వాషింగ్టన్
3) వయోల డేవిస్
4) ఎల్లెన్ పొంపే
- View Answer
- సమాధానం: 1
వివరణ: క్వాంటికో టీవీ సిరీస్‌లో నటనకు గాను ప్రియాంక చోప్రా పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డు ఆమెకు రావడం ఇది రెండోసారి.
- సమాధానం: 1
29. ఐక్యరాజ్యసమితి ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ నూతన ఆవిష్కరణ పురస్కారానికి ఎంపికైన గ్రామం ఏది ?
1) మోర్వి
2) మంగళంపల్లి
3) గోవర్ధ్దన్
4) హాలీబీడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐరాస నుంచి ఎన్జీవో విభాగంలో గుర్తింపు పొందిన మొదటి భారత గ్రామం గోవర్ధ్దన్. ఇది మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. ఈ గ్రామాన్ని ఇస్కాన్ సంస్థ అభివృద్ధి చేసింది.
- సమాధానం: 3
30. ది ఇండియా ఈ-టైలింగ్ లీడర్షిప్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది ?
1) అమెజాన్
2) ఫ్లిప్‌కార్ట్
3) స్నాప్‌డీల్
4) ఈబే
- View Answer
- సమాధానం: 2
వివరణ: రెడ్ సీర్ కన్సల్టింగ్ సంస్థ ఏటా ది ఇండియా ఈ టైలింగ్ లీడర్షిప్ ఇండెక్స్‌ను తయారు చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం అత్యంత విశ్వసనీయత కలిగిన ఈ కామర్స్ సంస్థగా ఫ్లిప్ కార్ట్ ఎంపికైంది. ఆ సంస్థ ఈ జాబితాలో వరుసగా నాలుగో ఏడాది మొదటి స్థానాన్ని సంపాదించింది.
- సమాధానం: 2
31. అంతర్జాతీయ బొర్రెగో స్ప్రింగ్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చలనచిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా ?
1) లా లా లాండ్
2) క్వాంటికో-2
3) సాంజ్
4) సుల్తాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సాంజ్ చిత్రాన్ని హిమాచల్ మాండలికంలో తీశారు. దీని దర్శకుడు అజయ్ సకలాని.
- సమాధానం: 3
32. ఇటీవల ప్రకటించిన వార్షిక విద్యా నివేదికలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) కేరళ
3) కర్నాటక
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రాథం అనే స్వచ్ఛంద సంస్థ 2016 వార్షిక విద్యా నివేదికను తయారు చేసింది. పాఠశాలలో 6-14 ఏళ్లలోపు పిల్లలో 99.8 శాతం మందిని పాఠశాలల్లో నమోదు చేసిన హిమాచల్ ప్రదేశ్ ఈ నివేదికలో మొదటి స్థానంలో నిలిచింది.
- సమాధానం: 4
33. మద్యపాన నిషేధాన్ని సమర్థిస్తూ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలో అతిపెద్ద మానవహారాన్ని నిర్వహించారు ?
1) గుజరాత్
2) బిహార్
3) రాజస్థాన్
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
వివరణ: బిహార్‌లో 2 కోట్ల మంది పౌరులు 45 నిమిషాల పాటు 11,299 కి.మీ. పొడవైన మానవహారాన్ని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 2
34. ఏ దేశ సహకారంతో నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు ?
1) రష్యా
2) జపాన్
3) చైనా
4) స్పెయిన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 575 కి.మీ. పొడవైన రైల్వే మార్గంపై 200 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించే రేల్వే వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్-రష్యా మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 1
35. ప్రపంచంలో అత్యంత వినూత్న ప్రయోగాలు చేస్తున్న కంపెనీల జాబితాలో తొలిస్థానంలో ఉన్న సంస్థ ఏది ?
1) గూగుల్
2) టెస్లా మోటర్స్
3) మైక్రోసాఫ్ట్
4) ఆపిల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతి సంవత్సరం 50 ఉత్తమ కంపెనీల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది నివేదికలో ఆపిల్ సంస్థ తొలిస్థానంలో నిలిచింది. గూగుల్, టెస్లా మోటర్స్, మైక్రోసాఫ్ట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 4
36. ఖోదల్ ధామ్ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది ?
1) గోవా
2) గుజరాత్
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2017 జనవరి 21న ఖోదల్ ధామ్ దేవాలయంలో ఖోదియా దేవత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా 3.5 లక్షల మంది ప్రజలు జాతీయ గీతాలాపన చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
- సమాధానం: 2
37. మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ మహిళా సింగిల్స్ విజేత ?
1) పూన్ లోక్ యాన్
2) త్సె హింగ్ సుట్
3) సైనా నెహ్వాల్
4) ఫోరంపవి చోచువింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: థాయ్‌లాండ్‌కు చెందిన ఫోరంపవి చోచువోంగ్ను ఓడించి సైనా నెహ్వాల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
- సమాధానం: 3
38. ఇటీవల ఏ క్రీడాకారుడు / క్రీడాకారిణి చిత్రాన్ని పోస్టల్ స్టాంప్‌పై ముద్రించారు ?
1) పి వి సింధు
2) సైనా నెహ్వాల్
3) లియాండర్ పేస్
4) విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: గోల్డెన్ గర్ల్స్ ఆఫ్ ఇండియా-ప్రైడ్ ఆఫ్ నేషన్ అనే పేరుతో భారత తపాల శాఖ పి.వి. సింధు, దీపా కర్మాకర్, సాక్షి మాలిక్‌ల చిత్రాలను పోస్టల్ స్టాంప్‌పై ముద్రించింది. రియో ఒలింపిక్స్‌లో ఆటతీరుకి గుర్తింపుగా వారికి ఈ గౌరవం దక్కింది.
- సమాధానం: 1
39. భారత్ నుంచి కూరగాయల దిగుమతి తగ్గించుకోవడానికి ఇటీవల పదేళ్ల ప్రణాళిక తయారు చేసుకున్న దేశం ఏది ?
1) పాకిస్తాన్
2) భూటాన్
3) నేపాల్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: నేపాల్ ఏటా భారత్ నుంచి 55 బిలియన్ డాలర్ల విలువైన 25 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలని దిగుమతి చేసుకుంటోంది.
- సమాధానం: 3
40. ఏ నగరంలో తన తొలిశాఖను ఏర్పాటు చేసేందుకు స్విస్ రే అనే పునర్ బీమా కంపెనీ ఐఆర్డీఏ అనుమతి పొందింది ?
1) హైదరాబాద్
2) ముంబై
3) కోల్కత్తా
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నష్ట నివారణ కోసం బీమా కంపెనీలు ఇతర కంపెనీల పాలసీలను నేరుగా కానీ బ్రోకర్ ద్వారా కానీ కొనుగోలు చేసేందుకు వీలు కల్పించేది పునర్ బీమా. ఈ తరహా సేవలు అందించేందుకు స్విస్ రే అనే సంస్థ తన తొలి శాఖను ముంబైలో ఏర్పాటు చేసేందుకు ఐఆర్డీఏ అనుమతి పొందింది.
- సమాధానం: 2
41. ఇటీవల ఏ ప్రాంతంలో యూనివర్సల్ రైల్ మిల్‌ను ఏర్పాటు చేశారు ?
1) విశాఖ స్టీల్ ప్లాంట్
2) రూర్కేలా స్టీల్ ప్లాంట్
3) బిలాయి స్టీల్ ప్లాంట్
4) విజయనగర్ స్టీల్ ప్లాంట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బిలాయి స్టీల్ ప్లాంట్‌లోని యూనివర్సల్ రైల్ మిల్లో ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్ రైల్ (130 మీ)ను ఉత్పత్తి చేశారు.
- సమాధానం: 3
42. 11వ అంతర్జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) కోల్కత్తా
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 4
వివరణ: బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేష్ విభాగంలో బంగారు నెమలి పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 4
43. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వేగంగా వేయి పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ ఎవరు ?
1) ఇయాన్ మోర్గాన్
2) విరాట్ కోహ్లీ
3) స్టీవ్ స్మిత్
4)ఎ బి డివిలియర్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కెప్టెన్‌గా 17 వన్డే మ్యాచ్‌లలో వేయి పరుగులు పూర్తి చేసి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలొకల్పాడు. అంతకముందు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఎ బి డివిలియర్స్ 18 మ్యాచ్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.
- సమాధానం: 2
44. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్‌ని ఏర్పాటు చేసిన దేశం ?
1) చైనా
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) భారత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనాలోని క్వింగ్ హై ప్రావిన్స్‌లో గల లాంగ్ యాంగ్జియాలో ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్కు ఏర్పాటైంది. 27 చ.కి.మీ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పార్కు కోసం చైనా 875 మిలియన్ డాలర్లు వెచ్చించింది. దీని నుంచి 850 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
- సమాధానం: 1
45. నీ హక్కులు తెలుసుకో అనే పథకాన్ని ప్రారంభించిన సంస్థ ఏది ?
1) భారత వినియోగదారుల సంఘం
2) BCSBI
3) SBI
4) FIDC
- View Answer
- సమాధానం: 2
వివరణ: వినియోగదారుల బ్యాంకింగ్ సేవల రక్షణ కోసం 2006లో బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా- BCSBI ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
- సమాధానం: 2
46. మొదటి హ్యూగో చావేజ్ శాంతి, సార్వభౌమత్వ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) జి జిన్‌పింగ్
2) నరేంద్ర మోదీ
3) బరాక్ ఒబామా
4) వ్లాదిమిర్ పుతిన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్ స్మారకార్థం హ్యూగో చావేజ్ శాంతి, సార్వభౌమత్వ పురస్కారాన్ని 2016లో ప్రారంభించారు. తొలి పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందుకున్నారు.
- సమాధానం: 4
47. చిన్న పట్టణాలలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) తెలంగాణ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ ఒప్పందం జనవరి 18న జరిగింది. పాంతీయ అనుసంధాన పథకంలో భాగంగా తెలంగాణలోని 9 ప్రాంతాల్లో చిన్న విమానాశ్రయాలు నిర్మించనున్నారు.
- సమాధానం: 3
48. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సహకార వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు ?
1) అనురాగ్ కశ్యప్
2) మేఘనాథ్ రెడ్డి
3) ఎమ్ ఆర్ రెడ్డి
4) టి. విజయ్ కుమార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రతి రైతు స్థిరమైన ఆర్థిక వ్యవసాయ ఉత్పాదకత సాధించడంలో సహకార వ్యవసాయ రంగం చేయూతనందిస్తుంది.
- సమాధానం: 4
49. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఏ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు కనుగొంది ?
1) పూణె
2) పశ్చిమ గోదావరి
3) సేలం
4) బీజాపూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో బొగ్గు నిక్షేపాలను కనుగొంది. ఇవి చింతలపూడి, శెట్టివానిగూడెం ప్రాంతాల్లో 50-70 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా చింతలపూడి ప్రాంతంలో 2 వేల మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నాయని అంచనా.
- సమాధానం: 2
50. పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్ సర్వే ప్రకారం మాంసం వినియోగంలో మొదటి స్థానంలో నగరం ఏది ?
1) హైదరాబాద్
2) విజయవాడ
3) విశాఖపట్నం
4) ముంబై
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సగటున ఒక్కొక్కరు ఏడాదికి 5 కిలోల మాంసం వినియోగిస్తుండగా హైదరాబాద్‌లో సగటు వినియోగం 31 కిలోలు.
- సమాధానం: 1