కరెంట్ అఫైర్స్ జనవరి (16 - 23) బిట్ బ్యాంక్
1. ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ ప్యూరిఫయర్‌ని ఏ దేశం రూపొందించింది ?
1) జపాన్
2) ఆస్ట్రేలియా
3) జర్మనీ
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చైనా ప్రయోగాత్మకంగా ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ ప్యూరిఫైయర్ని నిర్మించింది. 100 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో దీన్ని ఏర్పాటు చేసింది.
- సమాధానం: 4
2. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో నెలకొల్పిన ఐ క్రియేట్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు ?
1) గుజరాత్
2) హిమాచల్ ప్రదేశ్
3) రాజస్తాన్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గుజరాత్లో ఏర్పాటు చేసిన 'ఐ క్రియేట్'(International Centre for Entrepreneurship and Technology) ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నేరంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కలిసి జనవరి 17న ప్రారంభించారు.
- సమాధానం: 1
3. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు - 2017కి ఎవరు ఎంపికయ్యారు ?
1) స్టీవ్ స్మిత్
2) విరాట్ కోహ్లీ
3) క్వింటన్ డీ కాక్
4) ఏబీ డెవిలియర్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ ప్రకటించిన వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డును తొలిసారి కోహ్లి అందుకోనున్నాడు. భారత్ తరఫున గతంలో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, రవిచంద్రన్ అశ్విన్ దీనిని గెల్చుకున్నారు. అలాగే ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుని కూడా కోహ్లీ గెలుచుకున్నాడు. ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు దక్కింది.
- సమాధానం: 2
4. కళాకారులకు "ముఖ్యమంత్రి కలాకార్ సహాయత యోజన" పేరిట పింఛన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
1) ఒడిశా
2) రాజస్తాన్
3) అస్సోం
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఒడిశా ప్రభుత్వం ఇటీవల సాహిత్య, సాంస్కృతిక కళాకారుల కోసం ముఖ్యమంత్రి కలాకార్ సహాయత యోజన పేరిట పింఛన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కళాకారులకు నెలకు 1200 రూపాయల పింఛన్ అందుతుంది. 50 ఏళ్లకు పైబడిన పురుషులు, 40 ఏళ్లకు పైబడిన మహిళలు ఈ పథకానికి అర్హులవుతారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది కళాకారులు ప్రయోజనం పొందుతారు.
- సమాధానం: 1
5. నేషనల్ కమాడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్సేంజ్ లిమిటెడ్ ఎండీ, సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) నాబి నారాయణ్ దాస్
2) సమిర్ షా
3) జీత్‌మల్ సింగ్
4) విజయ్ కుమార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నేషనల్ కమాడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్సేంజ్ లిమిటెడ్(NCDEX) ఎండీ, సీఈవోగా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన 3 ఏళ్లపాటు ఈ పదవిలో ఉంటారు.
- సమాధానం: 4
6. ‘‘Imperfect’’ పేరుతో తన ఆటో బయోగ్రఫీని విడుదల చేసిన భారత క్రికెటర్ ఎవరు ?
1) దిలీప్ వెంగ్‌సర్కార్
2) సంజయ్ మంజ్రేకర్
3) రాహుల్ ద్రవిడ్
4) సౌరవ్ గంగూలీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.. ‘‘Imperfect’’ పేరుతో రచించిన తన ఆటో బయోగ్రఫీని ఇటీవల విడుదల చేశారు. మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
- సమాధానం: 2
7. జీవ రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ అయిన ఆస్ట్రేలియా గ్రూప్‌లో ఇటీవల చేరిన దేశం ఏది ?
1) దక్షిణాఫ్రికా
2) చైనా
3) రష్యా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జీవ రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ అయిన ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారత్ 43వ దేశంగా చేరింది. జీవ, రసాయనిక ఆయుధాలను అభివృద్ధి చేసుకోకుండా.. వీటి తయారీకి అవసరమైన పరికరాలు, ముడి పదార్థాలు, సాంకేతిక వ్యాప్తిని వ్యతిరేకించే దేశాలను సమన్వయం చేసే, సామరస్య పూర్వక ఎగుమతుల నియంత్రణను పర్యవేక్షించే స్వచ్ఛంద సంస్థగా ఆస్ట్రేలియా గ్రూప్ పనిచేస్తోంది.
- సమాధానం: 4
8. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన 100 వెబ్ సైట్లను ప్రారంభించిన కేంద్రమంత్రి ?
1) సుష్మా స్వరాజ్
2) అనంత్ కుమార్
3) థావర్ చంద్ గెహ్లాట్
4) నరేంద్ర సింగ్ తోమర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన దాదాపు 100 వెబ్సైట్లను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. దీంతో తమ శాఖ ‘వెబ్సైట్ యాక్సెసిబిలిటీ ప్రాజెక్టు’ కింద దివ్యాంగుల కోసం రూపొందించిన వెబ్సైట్ల సంఖ్య 917కు చేరుకుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
- సమాధానం: 3
9. దేశంలో సోలార్ ప్రాజెక్టులకు నిధులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని మిలియన్ డాలర్లతో సోలార్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది ?
1) 350 మిలియన్ డాలర్లు
2) 450 మిలియన్ డాలర్లు
3) 550 మిలియన్ డాలర్లు
4) 650 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో సోలార్ ప్రాజెక్టులకు నిధులు అందించేందుకు 350 మిలియన్ డాలర్లతో సోలార్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ని ఉత్పత్తి చేయాలన్నది కేంద్రం లక్ష్యం.
- సమాధానం: 1
10. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన సీఎండీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు
1) అనురాగ్ అగర్వాల్
2) ఎస్ సెల్వకుమార్
3) ప్రదీప్ సింగ్ ఖరోలా
4) ఎస్ భట్టాచార్య
- View Answer
- సమాధానం: 2
వివరణ: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - SPMCIL నూతన సీఎండీగా సీనియర్ ఐఏఎస్ ఎస్ సెల్వకుమార్ నియమితులయ్యారు. PMCIL కరెన్సీ నోట్లు, నాణేలు, పోస్టల్ స్టాంప్‌లు, నాన్ జ్యూడిషియల్ స్టాంప్‌లను ముద్రిస్తుంది.
- సమాధానం: 2
11. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ 48వ వార్షిక సమావేశాలు ఇటీవల ఏ నగరంలో జరిగాయి ?
1) దావోస్
2) బీజింగ్
3) న్యూయార్క్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ ఆర్థిక ఫోరమ్(WEF) 48వ వార్షిక సమావేశాలు ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత బృందం ఈ సమావేశాల్లో పాల్గొంది. వ్యాపారం, రాజకీయం, విద్య, సామాజిక రంగాలకు చెందిన 3 వేలకు మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు దావోస్ సదస్సుకి హాజరయ్యారు.
2018 Theme: Creating a Shared Future in a Fractured World
- సమాధానం: 1
12.ఇటీవల జరిగిన అంధుల ప్రపంచ క్రికెట్ కప్‌ను ఏ దేశ జట్టు గెలుచుకుంది ?
1) భారత్
2) పాకిస్తాన్
3) బంగ్లాదేశ్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూఏఈలోని షార్జాలో జరిగిన అంధుల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి భారత జట్టు విజేతగా నిలిచింది.
- సమాధానం: 1
13. మధ్యప్రదేశ్ నూతన గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) రామేశ్వర్ ఠాకూర్
2) కిజేకేథిల్ చాంది
3) ఆనంది బెన్ పటేల్
4) విజుభాయ్ వాలా
- View Answer
- సమాధానం: 3
వివరణ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ ఇటీవల మధ్యప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ గవర్నర్‌గా ఉన్న ఓం ప్రకాశ్ కోహ్లీ.. మధ్యప్రదేశ్ గవర్నర్‌గాను అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో.. ఆ స్థానంలో ఆనంది బెన్ పటేల్ నియమితులయ్యారు.
- సమాధానం: 3
14. ‘‘The Heartfulness Way’’ పుస్తక రచయిత ఎవరు ?
1) నందన్ బెనర్జీ
2) చేతన్ భగత్
3) సుషాంత్ గుప్తా
4) కమ్లేష్ పటేల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కమ్లేష్ పటేల్, జోషువా పోలాక్ రచించిన ‘‘The Heartfulness Way'’ పుస్తకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ధ్యానం గురించి ఈ పుస్తకంలో వివరించారు.
- సమాధానం: 4
15. ఎమర్జింగ్ ఎకనామీస్కు సంబంధించి ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఇటీవల విడుదల చేసిన సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 47
2) 26
3) 71
4) 62
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎమర్జింగ్ ఎకనామీస్కు సంబంధించి ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఇటీవల విడుదల చేసిన సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్ 62వ స్థానంలో నిలిచింది. చైనా 26వ స్థానంలో, పాకిస్తాన్ 47వ స్థానాల్లో నిలిచాయి. నార్వే తొలి స్థానంలో ఉంది.
- సమాధానం: 4
16. ‘‘కచ్రా మహోత్సవ్ - 2018’’ పేరుతో వ్యర్థాల వేడుకని ఇటీవల ఏ రాష్ట్రం నిర్వహించింది ?
1) మధ్యప్రదేశ్
2) ఛత్తీస్‌గఢ్
3) అసోం
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోనే తొలిసారిగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కచ్రా మహోత్సవ్ పేరుతో వ్యర్థాల వేడుకని నిర్వహించింది. వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
- సమాధానం: 2
17. దేశంలోని ఏ రాష్ట్రంలో రెండో ప్రపంచ యుద్ధ స్మారక మ్యూజియంను ఇటీవల ప్రారంభించారు ?
1) అరుణాచల్ ప్రదేశ్
2) కర్ణాటక
3) ఒడిశా
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అరుణాచల్ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్ జిల్లా జైరాంపూర్లో ఏర్పాటు చేసిన రెండో ప్రపంచ యుద్ధ స్మారక మ్యూజియంను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖండు ఇటీవల ప్రారంభించారు. ఆనాటి యుద్ధంలో పాల్గొన్న సైనికుల, ఇతర సహాయకులకు సంబంధించిన వస్తువులను ఇందులో ప్రదర్శనకు ఉంచారు.
- సమాధానం: 1
18. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఎస్పీ సింగ్
2) కీర్తి కుమార్
3) సుదీప్ లఖ్టాకియా
4) ప్రబత్ జైన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ) డెరైక్టర్ జనరల్‌గా ఎస్పీ సింగ్ జనవరి 31న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సుదీప్ లఖ్టాకియా ఎన్ఎస్జీ డీజీగా నియమితులయ్యారు. ఆయన 1984 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి.
- సమాధానం: 3
19. కేంద్ర ఎన్నికల సంఘం నూతన చీఫ్ కమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సన్నీ వర్గీస్
2) ఓం ప్రకాశ్ రావత్
3) ఏకే జోతి
4) సునీల్ అరోరా
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్‌గా ప్రస్తుత కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. సీఈసీ ఏకే జోతి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లావాసా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల సంఘంలో ప్రస్తుతం సునీల్ అరోరా మరో కమిషనర్‌గా ఉన్నారు. రావత్ ఈ పదవిలో 2018 డిసెంబర్ వరకు కొనసాగుతారు.
- సమాధానం: 2
20. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన కంపెనీల సెన్సెస్ ప్రకారం 2016-17లో భారత్ కు అత్యధిక ఎఫ్‌డీఐలు ఏ దేశం నుంచి వచ్చాయి ?
1) సింగపూర్
2) జపాన్
3) నేదర్లాండ్స్
4) మారిషస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2016-17కు సంబంధించి దేశవ్యాప్తంగా ఆర్బీఐ కంపెనీల సెన్సెస్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న 18,667 కంపెనీల్లో 17,020 కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా మారిషస్ నుంచి 21.8 శాతం ఎఫ్‌డీఐలు ఉన్నాయి. అమెరికా రెండో స్థానంలో ఉంది. యూకే, సింగపూర్.. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 4
21. 63వ జియో ఫిల్మ్ ఫేర్ అవార్డులు - 2018లో ఉత్తమ చిత్రం పురస్కారం ఏ సినిమాకు దక్కింది ?
1) దంగల్
2) న్యూటన్
3) టైలెట్ - ఏక్ ప్రేమ్ కథ
4) హిందీ మీడియం
- View Answer
- సమాధానం: 4
వివరణ: సౌకేత్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన "హిందీ మీడియం" చిత్రం 63వ జియో ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకుంది. ఇదే చిత్రంలో నటనకుగాను ఇర్ఫాన్ ఖాన్‌కి ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. తుమ్హారి సులు చిత్రంలో నటనకుగాను విద్యా బాలన్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.
- సమాధానం: 4
22. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కొత్త డెరైక్టర్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) ఎస్ సోమనాథ్
2) ఎంవైఎస్ ప్రసాద్
3) కే శివన్
4) ఏఎస్ కిరణ్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెరైక్టర్(వీఎస్ఎస్సీ)గా ఉన్న కే శివన్ ఇస్రో చైర్మన్‌గా నియమితులు కావటంతో ఆయన స్థానంలో ఇండియన్ ఏరోస్పేస్ ఇంజినీర్ ఎస్ సోమనాథ్ వీఎస్ఎస్సీ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 1
23. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ - 2018 ఏ దేశంలో జరగనుంది ?
1) భారత్
2) ఇంగ్లండ్
3) వెస్టిండీస్
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 3
వివరణ: 6వ ఎడిషన్ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2018 నవంబర్ 9 నుంచి 24 వరకు వెస్టిండీస్‌లో జరగనుంది. 2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నమెంట్లో వెస్టిండీస్ టైటిల్ విజేతగా నిలిచింది.
- సమాధానం: 3
24. జానకవి పీ సాలారమ్ అవార్డు - 2018 కి ఎవరు ఎంపికయ్యారు ?
1) బాలచందర్ కులకర్ణి
2) మాయా జాధవ్
3) విశ్వాస్ పాటిల్
4) సుధీర్ దాల్వి
- View Answer
- సమాధానం: 4
వివరణ: సినీ, టీవీ నటుడు సుధీర్ దాల్వి.. జానకి పి సాలారమ్ అవార్డుకి ఎంపికయ్యారు. ముంబైలోని థానే మున్సిపల్ కార్పొరేషన్, జానకవి పీ సాలారమ్ కలా సమితి ఈ అవార్డుని ఏర్పాటు చేశాయి.
- సమాధానం: 4
25. రైసీనా సంభాషణ సదస్సు - 2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) బెంగూళూరు
3) హైదరాబాద్
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 1
వివరణ: రైసీనా డైలాగ్.. బహుళ అంశాలపై న్యూఢిల్లీలో జరిగే వార్షిక సదస్సు. 2016 నుంచి ఈ సదస్సుని నిర్వహిస్తున్నారు. విదేశాంగ శాఖ సహాయంతో అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ ఈ కాన్ఫరెన్సను నిర్వహిస్తుంది. ఇటీవల జరిగిన 3వ ఎడిషన్ కాన్ఫరెన్సలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.
2018 Theme : Managing Disruptive Transitions - Ideas, Institutions and Idioms
- సమాధానం: 1
26. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో ఒకే వేదిక ద్వారా అందించడం కోసం ‘‘ఈ - ప్రగతి’’ పోర్టల్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో ప్రజలు పొందేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రీకృత సేవల పోర్టల్ ‘‘ఈ-ప్రగతి’’ని ప్రారంభించింది. దీని ద్వారా దాదాపుగా అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
- సమాధానం: 1
27. ఏ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలతో ‘‘నమస్తే షాలోమ్’’ మాస పత్రిక వెలువడుతుంది ?
1) భారత్, ఇజ్రాయెల్
2) బంగ్లాదేశ్, శ్రీలంక
3) నేపాల్, భూటాన్
4) థాయ్‌లాండ్, సింగపూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలతో వెలువడే ‘‘నమస్తే షాలోమ్’’ మాస పత్రికను ఇటీవల ప్రారంభించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఈ మ్యాగజైన్‌ను ప్రారంభించారు.
- సమాధానం: 1
28. భారత్‌లోని ఏ బ్యాంక్ తొలిసారి 5 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ కేపిటలైజేషన్ను అధిగమించింది ?
1) ఎస్బీఐ
2) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
3) ఐసీఐసీఐ బ్యాంక్
4) కొటక్ మహింద్రా బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రుణాలు ఇవ్వడంలో తనదైన గుర్తింపు పొందిన హెచ్డీఎఫ్సీ.. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో తొలిసారి 5 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించిన తొలి బ్యాంక్‌గా, మూడో సంస్థగా గుర్తింపు పొందింది. నానా బ్యాంకింగ్ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, రిలయన్స ఇండస్ట్రీస్ ఈ మార్క్‌ని గతంలోనే అధిగమించాయి.
- సమాధానం: 2
29. దేశవ్యాప్తంగా వెనుకబడిన 115 జిల్లాల పూర్తి సమాచారంతో ఆన్లైన్ డాష్‌బోర్డును రూపొందించేందుకు నీతి ఆయోగ్ ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశవ్యాప్తంగా వెనుకబడిన 115 జిల్లాల ఆన్లైన్ డాష్‌బోర్డ్ రూపకల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీతి ఆయోగ్ మధ్య ఇటీవల అవగాహన ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 3
30. భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అగ్ని - 5 బాలిస్టిక్ క్షిపణిని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు ?
1) ఉపరితలం నుంచి ఉపరితలం
2) ఉపరితలం నుంచి గగనతలం
3) గగనతలం నుంచి ఉపరితలం
4) గగనతలం నుంచి గగనతలం
- View Answer
- సమాధానం: 1
వివరణ: అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరీక్షని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి కానిస్టర్ ద్వారా ఈ క్షిపణిని పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు.
- సమాధానం: 1
31. ఆధార్ సమాచార రక్షణ, సైబర్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక సాంకేతిక కార్యక్రమం ఏది ?
1) సైబర్ భారత్
2) సైబర్ దేశ్
3) సైబర్ సురక్షిత్ భారత్ యోజన
4) భారత్ నెట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆధార్ సమాచార భద్రత, రక్షణ మరియు సైబర్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సైబర్ సురక్షిత్ భారత్ యోజన కార్యక్రమాన్ని చేపట్టింది. పబ్లిక్ - ప్రైవేటు భాగస్వామ్యంతో అమలయ్యే ఈ కార్యక్రమం ద్వారా సైబర్ దాడులను సైతం అడ్డుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
- సమాధానం: 3
32. ఇటీవల ఫుట్‌బాల్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ ప్లేయర్ రొనాల్డినో ఏ దేశానికి చెందినవారు ?
1) యునెటైడే కింగ్ డమ్
2) పోర్చుగల్
3) స్పెయిన్
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డినో ఇటీవల ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2002లో ప్రపంచ కప్ గెలిచిన బ్రెజిల్ జట్టులో రొనాల్డినో కూడా సభ్యుడే.
- సమాధానం: 4
33. భారతీయ ఛత్రా సన్సద్ ఫౌండేషన్ నుంచి ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు ?
1) కే చంద్రశేఖర్ రావు
2) చంద్రబాబు నాయుడు
3) నవీన్ పట్నాయక్
4) కేజ్రీవాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఇటీవల ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు. పూణెలో జరిగిన 8వ ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్లో ఈ అవార్డుని ప్రదానం చేశారు.
- సమాధానం: 3
34. ఈ కింది వారిలో ఎవరు ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మొదటి మహిళ పురస్కారాన్ని అందుకున్నారు ?
1) ఐశ్వర్యా రాయ్
2) సానియా మిర్జా
3) మేరీ కోమ్
4) బచేంద్రి పాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో నటి ఐశ్వర్యా రాయ్ మొదటి మహిళ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమెతో పాటు 112 రంగాలకు చెందిన మహిళలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలకు ఏటా ఈ అవార్డులని అందజేస్తారు.
- సమాధానం: 1
35. ఫిక్కీ డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) దిలీప్ చెనోయ్
2) రాషెస్ షా
3) సంజయ్ బారు
4) రాజీవ్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: FICCI (The Federation of Indian Chambers of Commerce and Industry) డెరైక్టర్ జనరల్‌గా దిలీప్ చెనోయ్ ఇటీవల నియమితులయ్యారు. వ్యాపార సంస్థల అసోసియేషన్ అయిన ఫిక్కీని 1927లో స్థాపించారు.
- సమాధానం: 1
36. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తాగునీటి సరఫరా అభివృద్ధికిప్రపంచ బ్యాంక్ ఎంత రుణం ఇచ్చేందుకు అంగీకరించింది ?
1) 175 మిలియన్ డాలర్లు
2) 250 మిలియన్ డాలర్లు
3) 50 మిలియన్ డాలర్లు
4) 120 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌తో 120 మిలియన్ డాలర్ల రుణానికి ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 4
37. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఏ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసింది ?
1) ఆమ్ఆద్మీ పార్టీ
2) జనతా దల్ యునెటైడ్
3) రాష్టీయ్ర జనతా దళ్
4) సమాజ్ వాదీ పార్టీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఢిల్లీ ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు గాను ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 65 మంది ఎమ్మెల్యేల బలముంది.
- సమాధానం: 1
38. ఇటీవల ఏ నగరంలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక సదస్సు జరిగింది ?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) వరంగల్
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 2
వివరణ: పారిశ్రామిక నవకల్పనలు, సాంకేతిక ఉత్పత్తి, పారిశ్రామికీకరణ అంశాలపై విశాఖపట్నంలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికాభివృద్ధి సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సదస్సుని ప్రారంభించారు. భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (అలీఫ్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహించింది.
- సమాధానం: 2
39. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఆర్ పి సిసోడియా
2) భన్వర్ లాల్
3) అనూప్ సింగ్
4) పూనం మాలకొండయ్య
- View Answer
- సమాధానం: 1
వివరణ: గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆర్.పి.సిసోడియాను ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
- సమాధానం: 1
40. ఇటీవల ఏ రాష్ట్ర పోలీసు శాఖ నేరస్తుల సమస్త సమాచారం కోసం సమగ్ర సర్వే నిర్వహించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) ఛత్తీస్ గఢ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ రాష్ట్రంలో నేరస్తుల గుర్తింపు, వారి కదలికలు, నిఘా కోసం జనవరి 18న ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో తరచూ నేరాలకు పాల్పడే వారు 2.18 లక్షల మంది ఉన్నారని తేల్చింది.
- సమాధానం: 1
41. ఇటీవల కన్నుమూసిన వెంపటి రవిశంకర్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినివారు ?
1) శాస్త్ర సాంకేతికం
2) కూచిపూడి నృత్యం
3) నాటకం
4) విద్యా రంగం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కూచిపూడి నృత్యంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన కళారత్న వెంపటి రవిశంకర్ ఇటీవల కన్నుమూశారు. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం రెండో కుమారుడు అరుున రవిశంకర్.. దాదాపు 80కి పైగా నృత్యరీతులను దేశ విదేశాల్లో శిష్యులకు నేర్పించారు. 200లకు పైగా స్వీయ రచనలకు సంగీతాన్ని సమకూర్చారు.
- సమాధానం: 2
42. పీడబ్ల్యూసీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?
1) 12
2) 5
3) 1
4) 8
- View Answer
- సమాధానం: 2
వివరణ: పీడబ్ల్యూసీ ఇటీవల నిర్వహించిన 2018 సర్వే ప్రకారం అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారత్ .. జపాన్ను అధిగమించి అయిదో స్థానానికి చేరింది. 2017లో భారత్ ఆరో స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్ లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
- సమాధానం: 2
43. అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్‌సలో సునీల్ గవాస్కర్ తర్వాత 900 రేటింగ్ పాయింట్లను అధిగమించిన రెండో భారత బ్యాట్స్‌మెన్ ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) రోహిత్ శర్మ
3) చటేశ్వర పుజారా
4) మురళీ విజయ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జనవరి 18న ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ 1979లో 916 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
- సమాధానం: 1
44. సుఖోయ్ - 30 యుద్ధ విమానంలో ప్రయాణించిన భారత తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి ఎవరు ?
1) సుష్మా స్వరాజ్
2) నిర్మలా సీతారామన్
3) మేనకా గాంధీ
4) ఉమా భారతి
- View Answer
- సమాధానం: 2
వివరణ: రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 17న రెండు సీటర్ల సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించారు. దీంతో సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా ఆమె నిలిచారు. సీతారామన్ కంటే ముందు మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్ 2003లో, ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్‌లో ప్రయాణించారు. సీతారామన్ కంటే ముందు 2003లో అప్పటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ సుఖోయ్-30 విమానంలో ప్రయాణించారు.
- సమాధానం: 2
45. సియట్ సంస్థ అంబాసిడర్‌గా ఎంపికై న భారత మహిళా క్రికెటర్ ఎవరు ?
1) మిథాలీ రాజ్
2) జులన్ గోస్వామి
3) హర్మన్ ప్రీత్ కౌర్
4) స్మృతి మందన
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ప్రఖ్యాత టైర్ల ఉత్పత్తుల సంస్థ ‘సియట్’కు అంబాసిడర్‌గా ఎంపికైంది. ఆమె ఇక ముందు తన బ్యాట్‌పై సియట్ లోగోను ప్రదర్శిస్తుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలతో ప్రస్తుతం ఒప్పందం కొనసాగిస్తున్న సియట్ ఒక మహిళా క్రికెటర్‌కు ఎండార్స్ చేయడం ఇదే మొదటిసారి.
- సమాధానం: 3
46. వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటు మీడియా సంస్థలకు ఇటీవల ఫేక్ న్యూస్ అవార్డులు ప్రకటించిన నేత ఎవరు ?
1) వ్లాద్ మిర్ పుతిన్
2) జిన్ పింగ్
3) కిమ్ జోంగ్
4) డొనాల్డ్ ట్రంప్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని మీడియా సంస్థలకు ‘ఫేక్ న్యూస్ అవార్డుల్ని’ ప్రకటించారు. ఈ ఫేక్‌న్యూస్ అవార్డుల జాబితాలో ద న్యూయార్క్ టైమ్స్ మొదటి స్థానంలో నిలిచింది.
- సమాధానం: 4
47. భారత్ ఇటీవల ఏ దేశంతో కలిసి SAREX - 18 పేరుతో అన్వేషణ, రక్షణ విన్యాసాలు నిర్వహించింది ?
1) జపాన్
2) అమెరికా
3) శ్రీలంక
4) యూకే
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, జపాన్ కోస్ట్ గార్డ్స్ఇటీవల SAREX - 18 పేరుతో బంగాళాఖాతంలో అన్వేషణ, రక్షణ విన్యాసాలు నిర్వహించాయి.
- సమాధానం: 1
48. 2018లో భారత్ ఎంత వృద్ధి రేటు సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసింది ?
1) 7.4 శాతం
2) 6.4 శాతం
3) 5.4 శాతం
4) 9 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్ 2018లో 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పెద్దనోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను అమలుకు సంబంధించి ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకుంటోందని తన వరల్డ్ అవుట్‌లుక్‌లో వివరించింది.
- సమాధానం: 1
49. విమానాల్లోను మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవల్ని అనుమతించాలని ఇటీవల ఎవరు సిఫార్సు చేశారు ?
1) TRAI
2) SEBI
3) FICCI
4) RBI
- View Answer
- సమాధానం: 1
వివరణ: టెలికం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా - TRAI తాజాగా ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీపై తన ప్రతిపాదనలను నివేదిక రూపంలో విడుదల చేసింది. ఇందులో.. శాటిలైట్, టెరిస్టియ్రల్ నెట్వర్క్ ద్వారా దేశీ విమాన ప్రయాణంలో మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవల్ని అనుమతించాలని సిఫార్సు చేసింది.
- సమాధానం: 1
50. తొలి అంతర్జాతీయ జలాశయాల భద్రత సదస్సు ఇటీవల భారత్‌లోని ఏ నగరంలో జరిగింది ?
1) తిరువనంతపురం
2) హైదరాబాద్
3) భోపాల్
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేరళలోని తిరువనంతపురంలో తొలి అంతర్జాతీయ జలాశయాల భద్రత సదస్సు జరిగింది. కేరళ ముఖ్యమంత్రి పినారియా విజయన్ ఈ సదస్సుని ప్రారంభించారు. కేంద్ర జల సంఘం, కేరళ నీటి వనరుల శాఖ సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించాయి. 20 దేశాల నుంచి 550 మందికిపైగా ప్రతినిధులు సదస్సుకి హాజరయ్యారు.
- సమాధానం: 1