కరెంట్ అఫైర్స్( ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 4, 2019)బిట్ బ్యాంక్
1. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల (సీడీఆర్ఐ) కోసం అంతర్జాతీయ కూటమి సహాయ సచివాలయ కార్యాలయం ఎక్కడ ప్రారంభం కానుంది?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) కోల్‌కత
- View Answer
- సమాధానం: 2
2. ఇంటిగ్రేటెడ్ ఎన్ఓసీ–నో అబ్జక్షన్∙సర్టిఫికేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఎన్ఓఏపీఎఎస్)లో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి?
1) 5
2) 6
3) 4
4) 3
- View Answer
- సమాధానం: 2
3. ‘పిల్లల శ్రేయస్సు సూచిక’ – 2019లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) కేరళ
2) తమిళనాడు
3) హిమాచల్‌ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
4. ‘కొత్త జాతీయ సైబర్ భద్రతా వ్యూహం వైపు’ అనే అంశంపై భారత భద్రతా శిఖరాగ్ర సమావేశం 12వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కత
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
5. ఉపయోగించని సైక్లోన్ డిటెక్షన్ రాడార్ భవనాన్ని వాతావరణ అవసరాల కోసం వినియోగించుకునేందుకు భారత వాతావరణ శాఖతో ఏ సాయుధ దళం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది?
1) ఇండియన్ ఆర్మీ
2) ఇండియన్ కోస్ట్‌గార్డ్
3) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
4) ఇండియన్ నేవీ
- View Answer
- సమాధానం: 4
6. పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ జంక్షన్ ఏది?
1) ఎడ్యుకేషన్
2) శగున్
3) శాల
4) గున్వత్త
- View Answer
- సమాధానం: 2
7. ఇ–బస్సుల కోసం భారతదేశపు తొలి ఆటోమేటెడ్ బ్యాటరీ చార్జింగ్ అండ్ చేంజింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ
2) వారణాసి, ఉత్తరప్రదేశ్
3) గువాహటి, అసోం
4) అహ్మదాబాద్, గుజరాత్
- View Answer
- సమాధానం: 4
8.అటవీ నిర్మూలన పరిహారం, ఇతర హరిత కార్యకలాపాల కోసం 27 రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని అప్పగించారు?
1) రూ. 47,436.18 కోట్లు
2) రూ. 50,436.18 కోట్లు
3) రూ. 55,436.18 కోట్లు
4) రూ. 46,436.18 కోట్లు
- View Answer
- సమాధానం: 1
9. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ‘బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన టెక్ సంస్థ?
1) టీసీఎస్
2) మైక్రోసాఫ్ట్
3) ఫేస్బుక్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 4
10. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ఏ సంవత్సరం నాటికి 100 నగరాలకు అందుబాటులో ఉంటుంది?
1) 2022
2) 2023
3) 2024
4) 2025
- View Answer
- సమాధానం: 1
11.‘ఆక్వా ఆక్వేరియా ఇండియా–2019’ 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) చెన్నై
- View Answer
- సమాధానం: 1
12. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రంగానికి రాబోయే 5 సంవత్సరాల్లో రూ. 25,000 కోట్ల పెట్టుబడి లభించనుంది?
1) భారీ పరిశ్రమల శాఖ
2) ఎరువుల శాఖ
3) మత్స్య శాఖ
4) టెలీకమ్యూనికేషన్స్ శాఖ
- View Answer
- సమాధానం: 3
13. ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ‘టెర్రకోట గ్రైండర్’ను ఎక్కడ ప్రారంభించింది?
1) వారణాసి
2) గువాహటి
3) న్యూఢిల్లీ
4) ముంబై
- View Answer
- సమాధానం: 1
14. 2019 ఇండో పసిఫిక్ చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ (సీహెచ్ఓడీ) సమావేశం ఎక్కడ జరిగింది?
1) నోమ్ పెన్, కంబోడియా
2) నేపితావ్, మయన్మార్
3) హనోయ్, వియత్నాం
4) బ్యాంకాక్, థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 4
15. 2019 సంవత్సరానికి ప్రపంచ నైపుణ్యాల అంతర్జాతీయ పోటీ 45వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) బెర్లిన్, జర్మనీ
2) పారిస్, ఫ్రాన్స్
3) కజాన్, రష్యా
4) మాస్కో, రష్యా
- View Answer
- సమాధానం: 3
16. ఇటీవల న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అధ్యక్షుడు?
1) క్రిస్టిన్ లగార్డే
2) జిన్ లిక్వన్
3) తకిహికో నకావ్
4) కె.వి. కామత్
- View Answer
- సమాధానం: 3
17.ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అధ్యక్షుడు కొత్త ప్రధాన కార్యక్రమాలకు మద్దతుగా రాబోయే 3 సంవత్సరాలలో (2020–22) భారతదేశానికి ఎంత మొత్తాన్ని ఇవ్వనున్నట్లు అంగీకరించారు?
1) 12 బిలియన్ డాలర్లు
2) 18 బిలియన్ డాలర్లు
3) 10 బిలియన్ డాలర్లు
4) 15 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
18.2020 మార్చిలో మొదటి సౌత్ ఏసియా సబ్‌రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఎస్ఏ ఎస్ఈసీ) ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
1) భూటాన్
2) శ్రీలంక
3) అఫ్ఘనిస్తాన్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
19. ఇండోనేషియా ప్రభుత్వం తన కొత్త రాజధానిని ఏర్పాటు చేయడానికి ఏ ద్వీపాన్ని ఎంచుకుంది?
1) బోర్నియో
2) సుమత్రా
3) జావా
4) సులవేసి
- View Answer
- సమాధానం: 1
20.న్యూఢిల్లీలో అమిత్ షాతో సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై చర్చించిన కె. షణ్ముగం ఏ దేశానికి హోంమంత్రి?
1) మలేషియా
2) సింగపూర్
3) నేపాల్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం:2
21. హిప్సో ‘గ్లోబల్ హ్యాపినెస్ సర్వే–2019’లో భారత్ ర్యాంక్?
1) 7
2) 8
3) 9
4) 10
- View Answer
- సమాధానం: 3
22. ‘ఫిచ్ సొల్యూషన్స్ మాక్రో రీసెర్చ్’ ప్రకారం అత్యధిక కోకింగ్ బొగ్గు దిగుమతిదారైన చైనాను 2025 నాటికి ఏ దేశం అధిగమించనుంది?
1) భారత్
2) అమెరికా
3) జపాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
23. ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) సెక్రటరీ జనరల్ ఎవరు?
1) డెస్టినో పెడ్రో
2) ప్రిడోలిన్ లెకారి
3) రోజిరియో గల్లారో
4) జుర్గెన్ స్టాక్
- View Answer
- సమాధానం: 4
24.భారతదేశంలో పసిఫిక్ ప్రాంత సంస్కృతులను ప్రదర్శించడానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాపువా న్యూ గినియా, ఫిజి హై కమిషన్లు ఏ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాయి?
1) ‘నమస్తే ఏషియా’
2) ‘నమస్తే పసిఫిక్’
3) ‘నమస్తే ఇండియా’
4) ‘నమస్తే భారత్’
- View Answer
- సమాధానం: 2
25. అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్ – 2019 ఎక్కడ జరిగింది?
1) కోల్‌కత, పశ్చిమ బెంగాల్
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) ముంబై, మహారాష్ట్ర
4) హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
26. పోర్ట్ కాల్ కోసం థాయ్‌లాండ్‌లోని, బ్యాంకాక్, లామ్ చాబాంగ్ను సందర్శించిన భారతీయ నౌకాదళ యుద్ధనౌకలు ఏవి?
1) ఐఎన్ఎస్ సుకన్య, కిర్పన్
2) ఐఎన్ఎస్ సహ్యాద్రి, కిల్టన్
3) ఐఎన్ఎస్ కులిష్, కిల్టన్
4) ఐఎన్ఎస్ శారద, కులిష్
- View Answer
- సమాధానం: 2
27. దక్షిణాసియా స్పీకర్ల నాలుగో సమావేశం ఎక్కడ జరిగింది?
1) బ్యాంకాక్, థాయ్‌లాండ్
2) విక్టోరియా, సేషెల్స్
3) పోర్ట్ లూయిస్, మారిషస్
4) మాలే, మాల్దీవులు
- View Answer
- సమాధానం: 4
28.ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ప్రపంచ నివాసయోగ్య సూచీ–2019లో న్యూఢిల్లీ ర్యాంక్?
1) 130
2) 125
3) 118
4) 120
- View Answer
- సమాధానం: 3
29. కింది ఏ రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది?
1) కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్
2) బొగ్గు తవ్వకం
3) బ్యాంకింగ్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
30.2018–19 సంవత్సరానికి బ్యాంక్ మోసాల కేసులు ఎంత శాతం పెరిగాయి?
1) 35%
2) 25%
3) 20%
4) 15%
- View Answer
- సమాధానం: 4
31. ఇండియా రేటింగ్స్ – రీసెర్చ్ ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ?
1) 7.0%
2) 6.7%
3) 7.2%
4) 7.5%
- View Answer
- సమాధానం: 2
32. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనంతో రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించింది ఏది?
1) ఇండియన్ బ్యాంక్
2) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)
- View Answer
- సమాధానం: 4
33.ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎంత మొత్తాన్ని చొప్పించారు?
1) రూ. 50500 కోట్లు
2) రూ. 45500 కోట్లు
3) రూ. 55250 కోట్లు
4) రూ. 35500 కోట్లు
- View Answer
- సమాధానం: 3
34.10 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనంతో 4 అతిపెద్ద పీఎ‹స్బీల ఏర్పాటు తర్వాత భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) సంఖ్య?
1) 12
2) 15
3) 17
4) 20
- View Answer
- సమాధానం: 1
35. 2018–19లో 13.70 మిలియన్ టన్నుల చేపలను ఉత్పత్తి చేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది?
1) ఇండోనేషియా
2) జపాన్
3) భారత్
4) చైనా
- View Answer
- సమాధానం: 3
36. తమిళనాడులోని ఏ ఉత్పత్తులకు ఇటీవల భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ లభించింది?
1) దిండిగల్ తాళం
2) కరైకుడి కందంగి చీరలు
3) మథురై జిగర్తాండ
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
37. గోరేవాడ అంతర్జాతీయ జంతుప్రదర్శన శాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) నాగ్‌పూర్, మహారాష్ట్ర
2) గుర్గావ్, హరియాణా
3) బాదర్పూర్, ఢిల్లీ
4) గువాహటి, అసోం
- View Answer
- సమాధానం: 1
38. అరుదుగా కనిపించే పీకాక్ పారాచూట్ స్పైడర్ లేదా గుత్తి టరంట్యుల (పోలిసోథీరియా మెటాలికా)ను ఎక్కడ కనుగొన్నారు?
1) విల్లుపురం, తమిళనాడు
2) కొచ్చి, కేరళ
3) అమరావతి, ఆంధ్రప్రదేశ్
4) వరంగల్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
39. 2019 ఆగస్టు 28న ‘ఘజ్నవీ’ అనే బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన దేశం?
1) బంగ్లాదేశ్
2) ఇరాన్
3) ఇరాక్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
40. కార్బన్ నానోట్యూబ్స్ (సీఎన్టీ) – ఆర్వి 16 ఎక్స్ నానోను ఉపయోగించి ఏ సంస్థ శాస్త్రవేత్తలు అతిపెద్ద కంప్యూటర్ చిప్‌ను అభివృద్ధి చేశారు?
1) యేల్ విశ్వవిద్యాలయం
2) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
3) హార్వర్డ్ విశ్వవిద్యాలయం
4) స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
41. ఆసియాలో తొలి 5వ తరం వర్చువల్ రియాలిటీ (వీఆర్) ఆధారిత అడ్వాన్స్డ్ డ్రైవర్ ట్రైనింగ్ సిమ్యులేటర్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది?
1) చెన్నై, తమిళనాడు
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) ముంబై, మహారాష్ట్ర
4) కోల్‌కత, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
42. ‘కియాన్’అనే హై–ప్రెసిషన్ జెట్–ప్రొపెల్డ్ డ్రోన్ ను ఆవిష్కరించిన దేశం?
1) అమెరికా
2) చైనా
3) రష్యా
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 4
43.2021–22లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రారంభించనున్న భారతదేశపు లోతైన మహాసముద్ర మైనింగ్ ప్రాజెక్ట్ పేరు?
1) సముద్రయాన్
2) సాగర్యాన్
3) నేవీ
4) వాటర్‌టెక్
- View Answer
- సమాధానం: 1
44. సరిహద్దు భద్రతా దళ – 25వ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ రామ్
2) హరీశ్ కాంత్ మిశ్రా
3) వివేక్ కుమార్ జోహ్రీ
4) సంతోష్ కుమార్ సింగ్
- View Answer
- సమాధానం: 3
45. 2019 ఆగస్టు 31న తెలంగాణ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కల్రాజ్ మిశ్రా
2) తమిళసై సౌందరరాజన్
3) కళ్యాణ్ సింగ్
4) విద్యాసాగర్ రావు
- View Answer
- సమాధానం: 2
46. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బండారు దత్తాత్రేయను ఏ రాష్ట్ర గవర్నర్‌గా నియమించారు?
1) హిమాచల్‌ప్రదేశ్
2) రాజస్థాన్
3) కేరళ
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
47. 2019 సెప్టెంబరు 1న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వీసీఓఏఎస్)గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) అభయ్ కృష్ణ
2) రణ్‌బీర్ సింగ్
3) దేవ్‌రాజ్ అన్బు
4) మనోజ్ ముకుంద్ నరవాణె
- View Answer
- సమాధానం: 4
48. ఇటీవల భారత వాయుసేనకు ‘అపాచీ ఏహెచ్–64ఈ’ ఫైటర్ హెలీకాప్టర్లను అందజేసిన దేశం?
1) ఎయిర్‌బస్, నెదర్లాండ్స్
2) సఫ్రాన్, ఫ్రాన్స్
3) బోయింగ్, అమెరికా
4) డస్సాల్ట్ ఏవియేషన్, ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
49. లద్దాఖ్‌లో జరిగిన ‘లా అల్ట్రా ది హై’ మారథాన్ 2019 పదో ఎడిషన్‌లో 555 కిలోమీటర్ల మారథాన్‌ను పూర్తి చేసిన తొలి భారతీయుడు?
1) ఫౌజా సింగ్
2) బుధియా సింగ్
3) డి.పి. సింగ్
4) ఆశిష్ కాసోడేకర్
- View Answer
- సమాధానం: 4
50. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి పారాలింపియన్?
1) వరుణ్ సింగ్ భాటి
2) మరియప్పన్ తంగవేలు
3) దేవేంద్ర ఝఝారియా
4) దీపా మలిక్
- View Answer
- సమాధానం: 4