కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 17 - 24) బిట్ బ్యాంక్
1. ఇటీవల సెంట్రల్ బోర్డ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో (CBFC) సభ్యులుగా ఎవరిని నియమించారు?
1) గౌతమి
2) రాగిణి రెడ్డి
3) చిరంజీవి
4) వెంకటేష్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1952లో ముంబాయి ప్రధాన కార్యాలయంగా CBFC (సెన్సార్ బోర్డు) ను ఏర్పాటు చేశారు. ఇటీవల విద్యాబాలన్, మరియు గౌతమీ లను కొత్త సభ్యులగా నియమించారు. .
- సమాధానం: 1
2. ఏ దేశ శాస్త్రవేత్తలు జికా వైరస్ నియంత్రణకు మొక్కల ఆధారిత వాక్సిన్ను తయారు చేశారు?
1) కెనడా
2) బ్రెజిల్
3) యు.ఎస్.ఏ
4) చైనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అరిజొనా రాష్ర్ట విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలుపొగాకు మొక్కలోని DIII అనే ప్రొటీన్ ద్వారా జికా వైరస్ నియంత్రణకు వాక్సిన్ను అభివృద్ధి చేశారు. .
- సమాధానం: 3
3. ఇటీవల ఏ ప్రాంతంలో అత్యంత ఎక్కువ అగ్ని పర్వతాలను కనుగొన్నారు?
1) ఆర్కిటికా షిల్డ్
2) పశ్చిమ అంటార్కిటికా
3) అండమాన్ బెల్ట్
4) గ్రీన్లాండ్ బెల్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పశ్చిమ అంటార్కికా ప్రాంతంలో మంచు పలక కింద 2 కి.మీ.లోపు 100 అగ్ని పర్వతాలు కనుగొన్నారు. 100 నుంచి 3,850 మీటర్ల ఎత్తులో ఈ అగ్ని పర్వతాలు ఉన్నాయి.
- సమాధానం: 2
4. ఇటీవల నాసా విడుదల చేసిన నివేదిక ప్రకారం ‘‘2014-16 మధ్య ఎల్‌నినో’’ ప్రభావం వలన ఎంత కార్బన్ డైయాక్సైడ్ వాతవరణంలోకి చేరింది?
1) 1 బిలియన్ టన్నులు
2) 1.5 బిలియన్ టన్నులు
3) 2 బలియన్ టన్నులు
4) 3 బిలియన్ టన్నులు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎన్‌నినో అనగా స్పానిష్ బాషలో బాల క్రీస్తు లేదా చిన్న పిల్లవాడు అని అర్థం. తూర్పు - మధ్య ఫసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కే పరిస్థితుల వల్ల వివిధ ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అనావృష్టి (కరువు) ఏర్పడుతుంది. దీని ప్రభావంతో 2014 -16 మధ్య కాలంలో 3 బిలియన్ల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ వాతవరణంలోకి చేరింది.
- సమాధానం: 4
5. ఇండియా - ఆసియాన్ యూత్ సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1) బాండుంగ్
2) భోపాల్
3) బాకు
4) బైడోనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండియా - ఆసియాన్ యూత్ సమావేశంను 5 రోజుల పాటుబోఫాల్లో నిర్వహించారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం త్రీవవాదం నిర్మూలన, పేదరికం మరియు డ్రగ్స బారి నుండి యువతను కాపాడుట.
2017 theme - shared values, common destiny
- సమాధానం: 2
6. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది ‘‘న్యూ ఇండియా మూమెంట్ 2017 - 22’’ ను ఎక్కడప్రారంభించారు?
1) కోయంబత్తూరు
2) కాన్పూర్
3) గాంధీనగర్
4) వారణాసి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘న్యూ ఇండియా మావ్మెంట్ 2017 -22’ అనే పథకంను కొయంబత్తూరులో ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం పేదరికం నిర్మూలన, లంచంగొండితనం, త్రీవవాదం, మతోన్మాదం, కులతత్వం మరియు అపరిశుభ్రత లేకుండా కృషి చేయడం.
- సమాధానం: 1
7. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి రొబోట్ ఏది?
1) నానో
2) జూనో
3) BRABO
4) రోబో ఇండియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: TAL మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ BRABO పేరుతో తొలి స్వదేశీ రొబొట్ను తయారు చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి కోసం టాటా ఎంటర్‌ప్రెజైస్ Robo whiz పేరుతో విద్యా సంబంధిత ‘‘సెల్’’ ను విశ్వ విద్యాలయాలు మరియు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3
8. ఇండియాలో తొలి ‘‘విభజన’’ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కలకత్తా
2) హౌరా
3) శ్రీనగర్
4) అమృత్సర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతదేశం విభజన ద్వారా ఇండియా మరియు పాకిస్థాన్ ఏర్పడ్డాయి. విభజన సందర్భంలోని ఫొటోలు, న్యూస్ పేపర్స క్లిప్లింగ్స, ఇంటర్వ్యూలు, వస్తువులు, బహుమతులు వంటి వాటితో అమృత్‌సర్‌లో తొలి విభజనమ్యూజియంను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
9. ఇటీవల కర్ణాటక ఏ పేరుతో క్యాంటిన్లు ఏర్పాటు చేసింది?
1) అమ్మ క్యాంటిన్
2) ఇందిరా క్యాంటిన్
3) అన్న క్యాంటిన్
4) రాజీవ్ క్యాంటిన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: బెంగళూరులోని జయనగర్‌లో ఇందిరా క్యాంటిన్లను ప్రారంభించారు.
- సమాధానం: 2
10. 2017లో G-7 సమావేశాలను నిర్వహించిన దేశం ఏది?
1) ఇటలీ
2) కెనడా
3) ఫ్రాన్స
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 1
11. ప్రపంచ జనావాస యోగ్యత ర్యాంకింగ్‌సలో తొలి స్థానంలో ఉన్న నగరం ఏది?
1) న్యూఢిల్లీ
2) టొరంటో
3) మెల్బోర్న
4) సిడ్నీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ జనావాస యోగ్యత ర్యాంకింగ్‌సను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స యూనిట్ స్థిరత్వం, ఆరోగ్య పరిరక్షణ, సంస్కృతి మరియు వాతవరణం, విద్య మరియు అవస్థాపనవంటి 30 కారకాల ఆధారంగా రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా 140 నగరాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారు చేశారు.
ఇందులో తొలిస్థానంలో మెల్బోర్న (ఆస్టేలియా) ఉంది. తర్వాతి స్థానాలలో వియన్నా, వాంకోవర్ మరియు టొరంటో ఉన్నాయి.
- సమాధానం: 3
12. 13వ ట్రాన్స్ ఆఫ్గనిస్థాన్ పైప్‌లైన్ సమావేశంను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) ముంబాయి
4) గోవా
- View Answer
- సమాధానం: 1
వివరణ: తుర్కమేనిస్థాన్ - ఆఫ్ఘనిస్థాన్ - పాకిస్థాన్ - ఇండియా గ్యాస్ పైప్‌లైన్ (TAPI) నే ట్రాన్స ఆప్ఘనిస్థాన్ పైప్‌లైన్ అని కూడా అంటారు. 1995లో తొలిసారి ఈ పైప్లెన్ను ప్రతిపాదించారు. 2015లో ఆసియా అభివృద్ధి బ్యాంకు సహాకారంతో నిర్మాణం ప్రారంభమైంది.
- సమాధానం: 1
13. ఇటీవల ఏ ప్రాంతంలో కొత్త టెక్టొనిక్ ప్లేట్లు కనుగొన్నారు?
1) అండమాన్ తీరం
2) ఈక్వేడార్ తీరం
3) డూడ్సన్ బే
4) బేరింగ్ గల్ఫ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాకు చెందిన రైస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈక్వేడార్ తీరంలోని తూర్పు పసిఫిక్ సముద్రంలో కొత్త భూఖండ ఫలకాల (టెక్టొనిక్ ప్లేట్లు)ను కనుగొన్నారు. వీటికి కొలంబియాకు చెందిన ఒక దీవి ‘‘మల్పెలో’’ పేరు పెట్టారు.
- సమాధానం: 2
14. ప్రతిష్ఠాత్మక రోజర్స్ కప్ టోర్నమెంట్ విజేత ఎవరు?
1) రోజర్ ఫెదరర్
2) రోహన్ బోపన్న
3) అలెగ్జాండర్ జెవెరెవ్
4) నికొలస్ మహత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రోజర్కప్ టోర్నమెంట్‌ను అమెరికాలోని వాషింగ్టన్లో నిర్వహించారు. ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించి అలెగ్జాండర్ జెవెర్వ్ (Alexander Zverev) టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ కప్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
- సమాధానం: 3
15. 6వ గోల్డెన్ గ్లోవ్ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) స్పెయిన్
2) ఫ్రాన్స
3) నార్వే
4) సెర్బియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సెర్బియాలోని వోజ్వోడిన (Vojvodina) అనే ప్రాంతంలో 6వ గోల్డెన్ గ్లోవ్ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ క్రీడలలో ఇండియా రెండు బంగారు, 4 వెండి, మరియు 4 కాంస్య పతకాలు గెలుచుకుంది.
51 కేజీల కేటగిరిలో జ్యోతి, 60 కేజీల కేటగిరిలో వానలాల్ హరిపుతిల్ (Vanlal haritpuil) బంగారు పతకం గెలుచుకున్నారు.
- సమాధానం: 4
16. 16వ IAAF ప్రపంచ ఛాంపియన్షిప్ 2017 ను ఎక్కడ నిర్వహించారు?
1) టొరంటో
2) లండన్
3) వాషింగ్టన్
4) చికాగో
- View Answer
- సమాధానం: 2
వివరణ: IAAF - International Association of Athletics Federations. ఈ క్రీడల మస్కట్ Whiz bee
- సమాధానం: 2
17. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక మరియు సమాచార కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) న్యూఢిల్లీ
2) కలకత్తా
3) దిస్పూర్
4) గౌహతి
- View Answer
- సమాధానం: 1
18. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక వేతనం పొందుతున్న మహిళా నటి ఎవరు?
1) జెన్నిఫర్ లారెన్స్
2) జెన్నిఫర్ అన్నిస్టన్
3) ఎమ్మాస్టోన్
4) మెలిసా మెక్ కార్ధి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఎమ్మాస్టోన్ నటించిన లా లా లాండ్ చిత్రం ఆస్కార్ పురస్కారం సాధించింది. ఎమ్మాస్టోన్ గత సంవత్సరం 26 మిలియన్ డాలర్ల వేతనం పొందింది. జెన్నిఫర్ అనిస్టన్ 25.5 మిలియన్ డాలర్సతో రెండోస్థానంలో ఉంది. 2015, 2016లో అత్యధిక వేతనం పొందిన జెన్నీఫర్ లారెన్స 24 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది.
-
19. ఇటీవల అమెరికా ఏ సంస్థను ‘‘విదేశీ త్రీవవాద సంస్థ’’గా ప్రకటించింది?
1) అస్సోం రైఫిల్స్
2) నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్
3) మవోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
4) హిజ్బుల్ ముజాహిద్ధిన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పాక్ ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్లో పనిచేస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థను అమెరికా విదేశీ త్రీవవాద సంస్థల జాబితాలో చేర్చింది.
- సమాధానం: 4
20. ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ రాష్ర్టంలో ఏనుగుల జనాభా ఎక్కువగా ఉంది?
1) కర్ణాటక
2) కేరళ
3) అస్సోం
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ ఏనుగుల దినోత్సం (August 12) నాడు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏనుగుల జనాభా లెక్కలు విడుదల చేసింది. దేశం మొత్తం మీద 27,312 ఏనుగులు ఉన్నాయి. దేశంలో కర్ణాటక రాష్ర్టం 6,045 ఏనుగులతో తొలిస్థానంలో ఉంది. తరువాతి స్థానంలో అస్సోం (5,719) మరియు కేరళ (3,054) ఉన్నాయి.
- సమాధానం: 1
21. స్పానిష్ సూపర్ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను గెలుపొందింది ఎవరు?
1) బార్సిలోనా ఎఫ్‌సి
2) సౌత్ డకోట
3) రియల్ మాడ్రిడ్
4) బకింగ్ హామ్
- View Answer
- సమాధానం:3
వివరణ: స్పానిష్ సూపర్ కప్ టైటిల్‌ను రియల్ మ్యాడ్రిడ్ 10వ సారిగెలుచుకుంది.
-
22. ఇండియా అపాచే సైనిక హెలికాప్టర్లను ఏ దేశం నుండిదిగుమతి చేసుకొంటుంది?
1) చైనా
2) యూఎస్ఏ
3) ఆస్ట్రేలియా
4) ఇజ్రాయిల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: యుఎస్ఏ నుంచి 6 అపాచే AH 64 E సైనిక హెలికాప్టర్లను ఇండియా దిగుమతి చేసుకొంటుంది. ఈ ఒప్పందం విలువ రూ.4,168 కోట్లు.
-
23. ఇటీవల ఖతార్, ఏ తీరప్రాంత పట్టణంను కలుపుతూ వ్యాపార మార్గంను ఏర్పాటు చేసింది?
1) పాకిస్థాన్
2) చైనా
3) ఆప్ఘనిస్థాన్
4) లెబనాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఖతార్‌కు చెందిన హమద్ రేవు నుంచి, పాకిస్థాన్‌లోని కరాచి వరకు ప్రత్యక్ష మార్గంను ప్రారంభించింది.
- సమాధానం: 1
24. వాతావరణ మార్పుల నుండి దేశాన్ని కాపాడుట కోసం, ఇండియా ఎంత వ్యయం చేసింది?
1) 10 బిలియన్లు
2) 15 బిలియన్లు
3) 20 బిలియన్లు
4) 25 బిలియన్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: వాతావరణ సమస్యల నిర్మూలన కోసం ప్రతి సంవత్సరం 10 బిలియన్ల డాలర్లు వినియోగ స్తున ్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు.
- సమాధానం: 1
25. ఇటీవల భూమికి అతి సమీపంగా వచ్చిన ఉల్క పేరు ఏమిటి?
1) ఆస్టరాయిడ్ బోస్
2) ఆస్టరాయిడ్ న్యూటన్
3) ఆస్టరాయిడ్ లెనిన్
4) ఆస్టరాయిడ్ ప్లొరెన్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భూమికి 7 మిలియన్ కిలోమీటర్ల దూరం నుండి వెళ్లిన ఉల్కకు ప్రముఖ నర్సు ప్లోరెన్స నైటింగెల్ పేరును పెట్టారు. భూమికి అతి దగ్గర నుండి వెళ్ళనున్న అతి పెద్ద ఉల్క ఆస్టరాయిడ్ ప్లొరెన్స (పొడవు 4 కి.మీ.)
- సమాధానం: 4
26. అంతర్జాతీయ బల్గేరియా ఓపెన్ సిరీస్ టైటిల్ విజేత ఎవరు?
1) జ్వోనిమిర్ డుర్కింజన్
2) దినుక కరుణరత్న
3) లక్ష్యసేన్
4) విజేందర్ కన్నా
- View Answer
- సమాధానం: 3
వివరణ: బల్గేరియాలోని సోఫియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్, క్రోయేషియాకు చెందిన జ్యోనిమిర్ డుర్కింజన్ను ఓడించి, బల్గేరియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
- సమాధానం: 3
1) టోరంటో
2) సిడ్నీ
3) రియోడిజనిరో
4) ప్లాట్లా
- View Answer
- సమాధానం: 1
వివరణ: కెనడాలోని టొరంటోలో 7వ ప్రపంచ మరుగుజ్జు క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడలలో ఇండియా 15 బంగారు, 10 వెండి, మరియు 12 కాంస్య పురస్కారాలు గెలుచుకుంది.
- సమాధానం: 1
28. ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం వినియోగిస్తున్న దేశం ఏది?
1) ఇండియా
2) రష్యా
3) చైనా
4) యుఎస్ఏ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం వినియోగిస్తున్న దేశం చైనా. రెండవ స్థానంలో ఇండియా ఉంది.
- సమాధానం: 3
29. ప్రపంచంలోనే తొలిసారి ‘‘ప్రపంచ శాంతి విశ్వవిద్యాలయం’’ ను ఎక్కడ ప్రారంభించారు?
1) లండన్
2) న్యూఢిల్లీ
3) పూణే
4) బీజింగ్
- View Answer
- సమాధానం: 3
30. పూర్తిగా మహిళా నావికులుగల ఏ నౌక భూమి ప్రదక్షిణకు బయలుదేరింది?
1) INS శివాలిక్
2) INS తరిణి
3) INS గోదావరి
4) INS వైతరణి
- View Answer
- సమాధానం: 2
వివరణ: మొట్టమొదటి సారిగా భారతీయ మహిళా నావికులు భూమి చుట్టూ తిరిగి రావడానికి INS తరిణీ నౌకలో బయలుదేరారు. దీనికి నావికాసాగర్ పరిక్రమ అనే పేరు పెట్టారు.
- సమాధానం: 2
31. ఇటీవల కృతిమ గర్భాశయంను తయారు చేసింది ఎవరు?
1) నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
2) యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఆస్ట్రేలియా
3) యూనివర్సిటీ ఆఫ్ వేల్స్
4) యూనివర్సిటీ ఆఫ్ స్టాన్ఫోర్డ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నెలలు నిండకుండా జన్మించే పిల్లలను కాపాడుట కోసం ఒక కృతిమ గర్భాశయంను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఆస్ట్రేలియా మరియు తోహకు యూనివర్సిటీ హాస్పిటల్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు.
- సమాధానం: 2
32. ఫోర్బ్స్ విడుదల చేసిన ‘‘అత్యంత ఎక్కువ వేతనం పొందిన మహిళా క్రీడాకారిణి ఎవరు?
1) సెరెనా విలియమ్స్
2) వీనస్ విలియమ్స్
3) మరియా షరపోవా
4) విక్టోరియా అజరెంకా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2016 జూన్ నుంచి 2017 జూన్ మధ్య 27 మిలియన్ డాలర్ల వేతనం పొందిన సెరెనా విలియమ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక మహిళా క్రీడాకారిణి సెరెనా.
- సమాధానం: 1
33. ప్రపంచ మానవత్వ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 15
2) ఆగస్టు 17
3) ఆగస్టు 19
4) ఆగస్టు 21
- View Answer
- సమాధానం: 3
వివరణ: మానవులకు సేవ చేసేందుకు తమ ప్రాణాలు సైతం లెక్క చెయ్యని వారిని ప్రశంసించేందుకు ఆగస్టు 19వ తేదీన ప్రపంచ మానవత్వ దినోత్సవం నిర్వహిస్తారు.
2017 theme - Not a target.
- సమాధానం: 3
34. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఆగస్టు 10
2) ఆగస్టు 13
3) ఆగస్టు 16
4) ఆగస్టు 19
- View Answer
- సమాధానం: 4
35. ఇండియా రోడ్లపై ఎన్ని కిలోమీటర్ల మేరఎల్ఇడి బల్బ్‌లు ఏర్పాటు చేసింది?
1) 30,000 కి.మీ.
2) 50,000 కి.మీ.
3) 80000 కి మీ.
4) 1,00,000 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్ స్ట్రీట్ లైటినింగ్ నేషనల్ ప్రోగ్రామ్ (SLNP) కింద 50,000 కిలోమీటర్ల మేర రోడ్లపై 30 లక్షల ఎల్ఇడి బల్బ్‌లు ఏర్పాటు చేసింది. దీంతో ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ప్రపంచంలో అతి పెద్ద వీధి దీపాల నిర్వహణ కంపెనీగా అవతరించింది.
- సమాధానం: 2
36. ప్రతిష్ఠాత్మక కల్పన చావ్లా పురస్కారంనకు ఎంపికైనది ఎవరు?
1) జులన్ గోస్వామి
2) అరుంధతీ రెడ్డి
3) మిథాలీ రాజ్
4) ప్రీతి శ్రీనివాసన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తమిళనాడు రాష్ర్ట అండర్ - 19 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ప్రీతి శ్రీనివాసన్‌కు కల్పనా చావ్లా ధైర్య సాహసాల పురస్కారంను అందించారు. ఈమె యాక్సిడెంట్ తరువాత వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికీ అలాంటివారికి ధైర్యం నింపుతూ ప్రోత్సహించినందుకు గాను ఆమెను ఈ పురస్కారంనకు ఎంపిక చేశారు. ప్రీతి Soul Free అనే సంస్థను ప్రారంభించి వీల్చైర్లు దానం చేస్తుంది.
- సమాధానం: 4
37. రాజీవ్ సద్భావన దివస్‌ను ఏరోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 20
2) ఆగస్టు 21
3) ఆగస్టు 22
4) ఆగస్టు 23
- View Answer
- సమాధానం: 1
వివరణ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జన్మదినంను సద్భావన దినంగా జరుపుకుంటారు.
- సమాధానం: 1
38. 8వ ప్రపంచ పునరుత్పాదక శక్తి టెక్నాలజీ సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1) పారిస్
2) లండన్
3) న్యూఢిల్లీ
4) టోక్యో
- View Answer
- సమాధానం: 3
39. ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్వాస్థ బచ్చే, స్వస్థ భారత్ పథకంను ఎక్కడ ప్రారంభించింది?
1) న్యూఢిల్లీ
2) గాంధీనగర్
3) కొచ్చి
4) గోవా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కొచ్చిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన (KVS) విద్యార్థులలో శారీరక ఆగోగ్యం కాపాడుటకోసం ఫిట్నెస్ పథకంను ప్రారంభించింది. కెవిఎస్ పాఠశాలలో 12 లక్షల మంది విద్యార్థుల చదువుతున్నారు.
- సమాధానం: 3
40. ఏ మధ్య ఆసియా దేశంలో తొలిసారిగా ఫిపా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు?
1) సిరియా
2) ఇరాన్
3) సౌదీ అరేబియా
4) ఖతార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2022లో జరిగే ప్రపంచ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ఖతార్ వేదిక కానుంది.
- సమాధానం: 4
41. ప్రపంచంలో అతి చిన్న సర్జికల్ రోబొట్ను ఎవరు తయారు చేశారు?
1) బ్రిటన్ శాస్త్ర వేత్తలు
2) జపాన్ శాస్త్ర వేత్తలు
3) యూఎస్ఏ శాస్త్ర వేత్తలు
4) కెనడా శాస్త్ర వేత్తలు
- View Answer
- సమాధానం: 1
42. ది వెస్ట్రన్ - సదరన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
1) పిర్రే హుగుస్ హెర్బర్‌ట
2) గ్రిగర్ దిమిట్రోవ్
3) నికోలస్ మహత్
4) ఆండ్రీ హర్బర్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సిన్సినాటి మాస్టర్స పేరును ది వెస్ట్రన్ - సదరన్ ఓపెన్‌గా మార్చారు. బల్గేరియాకు చెందిన గ్రిగర్ దిమిట్రోవ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను గార్బైన్ ముగురుజా గెలుచుకుంది.
- సమాధానం: 2
43. FIBA ఆసియా కప్‌ను గెలుచుకున్న దేశం ఏది?
1) లెబనాన్
2) ఇరాన్
3) సిరియా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: FIBA ఆసియాకప్‌ను లెబనాన్‌లో నిర్వహించారు. ఈ క్రీడలలో తొలిసారి పాల్గొన్న ఆస్ట్రేలియా ఇరాన్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
FIBA - The International Basketball federation.
- సమాధానం: 4
44. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం 150 కోట్ల లాభం పొందిన గ్రామీణ బ్యాంకు ఏది?
1) ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు
2) గోదావరి బ్యాంకు
3) మహేష్ బ్యాంకు
4) తెలంగాణ గ్రామీణ బ్యాంకు
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017-18 సంవత్సరంలో ఆంధ్ర ప్రగతి బ్యాంకు మరియు కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంకు 150 కోట్లు నికరలాభాలు పొందాయి. దేశంలో మొత్తం గ్రామీణ బ్యాంకులు 56. అందులో 45 లాభాలు గడిస్తున్నాయి.
- సమాధానం: 1
45. ఇటీవల గూగుల్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ 8.0 వెర్షన్ పేరు ఏమిటి?
1) Krack Jack
2) Parle
3) Oreo
4) Britannia
- View Answer
- సమాధానం: 3
46. ట్రిపుల్ తలాక్‌ను రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించిన న్యాయమూర్తి ఎవరు?
1) జస్టీస్ కురియన్ జొసెఫ్
2) జస్టీస్ ఆర్ఎఫ్ నారియన్
3) జస్టీస్ యుయు లలిత్
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: తలాక్ అనగా ఆరబిక్లో విడాకులు. ఇస్లాంకు చెందిన పురుషులు మూడు సార్లు తలాఖ్ చెప్పి భార్యకు విడాకులు ఇవ్వవచ్చు. జస్టీస్ జె.ఎస్ ఖేహర్ మరియు జస్టీస్ ఎస్ అబ్ధుల్ నజిద్ ట్రిపుల్ తలాక్ పై 6 నెలల స్టే విధించి, ఈ కాలంలో ప్రభుత్వం ఒక చట్టం తేవాలని కోరారు.
కానీ మిగతా ముగ్గురు న్యాయమూర్తులు జస్టీస్ కురియన్ జొసెఫ్, జస్టీస్ ఆర్ఎఫ్ నారియన్, మరియు జస్టిస్ యు యు లలిత్ లు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రకటించారు.
సౌదీ ఆరేబియా, మొరాకో, ఆప్ఘనిస్థాన్, మరియు పాకిస్థాన్ వంటి 20 ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్ ను నిషేధించాయి.
- సమాధానం: 4
47. ఇటీవల తొలిసారిగా భారతదేశం నుండి అరటి పండ్లు ఏ దేశానికి ఎగుమతి చేశారు?
1) చైనా
2) బ్రిటన్
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కెనడా తొలిసారిగా ఇండియా నుంచి అరటి, నారింజ, సీతాఫలం లను దిగుమతి చేసుకుంది.
- సమాధానం: 3
48.ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో అత్యధిక వేతనం పొందుతున్న నటుడు ఎవరు?
1) ప్రభాస్
2) షారుఖ్‌ఖాన్
3) అమీర్‌ఖాన్
4) సల్మాన్‌ఖాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫోర్బ్స్జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న నటుడు Steven Spielberg (68 మిలియన్ డాలర్లు). ఇండియాలో ఎక్కువ వేతనం పొందేది షారుఖ్ ఖాన్ (38 మిలియన్ డార్లు).
- సమాధానం: 2
49.ఇటీవల భారత సైన్యం కోసం నానో క్షిపణిని తయారు చేసింది ఎవరు?
1) నరేష్ వర్మ
2) రామ చంద్రారెడ్డి
3) సతీష్ రెడ్డి
4) పాండురంగ రోహిత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మద్రాస్‌కు చెందిన SRM విశ్వవిద్యాలయం విద్యార్థి దాచర్ల పాండురంగ రోహిత్ భారత సైన్యం కోసం నానో క్షిపణిని తయారు చేశాడు.
- సమాధానం: 4
50. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆపదలో ఉన్న మహిళలను కాపాడుటకు ప్రారంభించిన సహాయక ఫోన్ నెంబర్ ఏది?
1) 181
2) 118
3) 160
4) 120
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ రాష్ర్ట మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆపదలో ఉన్న స్త్రీల రక్షణకు ‘‘181’’ అనే హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించింది.
- సమాధానం: 1