Ashwini K.P.: ఐరాస మానవహక్కుల దూతగా దళిత యువతి అశ్విని
Sakshi Education
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్(యుఎన్ హెచ్‌ఆర్‌సీ) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని, దళిత యువతిని నియమించింది. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 36ఏళ్ల అశ్విని కె.పి.. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా నియమితులయ్యారు. ఈ సంస్థ కార్యకలాపాలను నిర్వర్తిస్తూనే జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తారు.ఈ పదవిలోకి వచ్చి న తొలి ఆసియా మహిళగా, తొలి భారతీయురాలిగా, తొలి దళితురాలిగా అశ్విని చరిత్ర సృష్టించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 21 Oct 2022 01:17PM