Skip to main content

నవంబర్ 2017 వ్యక్తులు

తొలి మహిళా నేవీ పైలట్‌గా సుభాంగి స్వరూప్
Current Affairs
భారత నావికా దళంలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ పెలైట్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్ ఎంపికయ్యారు. మరో ముగ్గురు మహిళా అధికారులను కూడా నావికాదళం ఎంపిక చేసింది. వీరు.. న్యూఢిల్లీకి చెందిన ఆస్తా సెహ్‌గల్, పుదుచ్చేరికి చెందిన ఎ. రూప, కేరళకు చెందిన ఎస్.శక్తిమాయ. నావికాదళంలోని నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టొరేట్ (NAI) విభాగంలో ఈ ముగ్గురూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేరళలోని కన్ననూర్ జిల్లాలో ఉన్న ఇండియన్ నావల్ అకాడెమీలో ఈ నలుగురు మహిళలు నావల్ ఓరియంటేషన్ పూర్తి చేసుకున్నారు. ఉమెన్ పైలట్‌గా సుభాంగి స్వరూప్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మహిళా నేవీ పైలట్
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : సుభాంగి స్వరూప్

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలత
లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్నేహలతా శ్రీవాస్తవ నవంబర్ 28న నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలవనుంది. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా స్థానంలో స్నేహలత డిసెంబర్ 1న బాధ్యతలు చేపడతారు. ఈమె పదవీ కాలం 2018 డిసెంబర్ 30న ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : స్నేహలతా శ్రీవాస్తవ
ఎందుకు : అనూప్ మిశ్రా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో

‘కొలిమి రవ్వలు’ పుస్తకం ఆవిష్కరణ
ఇటీవల హత్యకు గురైన కర్ణాటకకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నవంబర్ 28న ఆవిష్కరించారు. గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గౌరీ లంకేశ్ పుస్తకం కొలిమి రవ్వలు ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రకాశ్ రాజ్

ఎయిరిండియా కొత్త సీఎండీ ప్రదీప్ సింగ్
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నవంబర్ 28న నియమితులయ్యారు. ఈయన 1985 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రదీప్‌సింగ్ 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. అలాగే కర్ణాటక అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ చైర్మన్‌గా, కర్నాటక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ నుంచి ప్రదీప్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిరిండియా కొత్త సీఎండీ నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రదీప్ సింగ్
ఎందుకు : ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ స్థానంలో

విశ్వసుందరిగా డెమి-లేహ్ నెల్ పీటర్స్
దక్షిణాఫ్రికా యువతి డెమి-లేహ్‌సెల్ పీటర్‌‌స(22) విశ్వసుందరిగా ఎంపికయ్యారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో 2017 నవంబర్ 26న జరిగిన తుది పోటీల్లో డెమి ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన శ్రద్ధ శశిధర్ 10వ స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశ్వ సుందరి 2017 విజేత
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డెమీలే-నెల్ పీటర్స్
ఎక్కడ : లాస్ వేగాస్

15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఎన్‌కే సింగ్
ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్ 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నవంబర్ 27న నియమితులయ్యారు. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్‌టీ ప్రభావం వంటి అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షించి అక్టోబర్ 2019 నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఈ కమీషన్ 2020 ఏప్రిల్ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి తగినసిఫార్సులు చేస్తుంది.
కమీషన్‌లో మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి, నీతీ ఆయోగ్ సభ్యులు రమేష్ చాంద్, జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్‌లు సభ్యులుగా ఉంటారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు సంబంధించిన 14వ ఫైనాన్స్ కమిషన్ 2013 జనవరి 2న ఏర్పాటయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఎన్‌కే సింగ్

ఆసియా సంపన్నుల్లో తొలి స్థానంలో ముకేశ్ కుటుంబం
Current Affairs
ఫోర్బ్స్ పత్రిక విడుదల ఆసియా టాప్ - 50 సంపన్న కుటుంబాలు - 2017 జాబితాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ తొలి స్థానంలో నిలిచింది. ఈ కుటుంబం తాలూకు సంపద విలువ 19 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ఏకంగా 44.8 బిలియన్ డాలర్లకు ఎగిసింది. శాంసంగ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన కొరియాకు చెందిన లీ కుటుంబం 40.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన క్వాక్ కుటుంబం 40.4 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. వీరి నికర సంపద విలువ 40.4 బిలియన్ డాలర్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా సంపన్న కుటుంబాలు - 2017
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ఫోర్బ్స్ పత్రిక
ఎక్కడ : తొలిస్థానంలో ముకేశ్ అంబానీ కుటుంబం

మానుషి ఛిల్లర్‌కు మిస్ వరల్డ్ - 2017 టైటిల్
హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించింది. చైనాలోని సాన్యా నగరంలో నవంబర్ 18న నిర్వహించిన 67వ మిస్ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని ైకైవసం చేసుకుంది. ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది.
2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది.
బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ..
మిస్ వర్డల్ - 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్ సెమిఫైనల్‌కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం ఛిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు.
భారత్‌కు 6 మిస్‌వరల్డ్ టైటిల్స్
మానుషి ఛిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు.
భారత్‌కు రెండు సార్లు ‘మిస్ యూనివర్స్’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు మిస్ యూనివర్స్‌లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ వరల్డ్ - 2017 టైటిల్
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : మానుషి ఛిల్లర్ (భారత్)
ఎక్కడ : సాన్యా నగరం, చైనా

వెయిట్‌లిఫ్టర్ సులేమాన్ ఒగ్లు కన్నుమూత
ఏడుసార్లు విశ్వవిజేత... వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్... టర్కీ దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ నైమ్ సులేమాన్‌ఒగ్లు అనారోగ్యంతో నవంబర్ 18న కన్నుమూశారు. కేవలం 4.8 అడుగుల ఎత్తుండే సులేమాన్ ఒగ్లును వెయిట్‌లిఫ్టింగ్ ప్రపంచంలో ‘ద పాకెట్ హెర్క్యూలెస్’గా పిలుస్తారు.
1988 సియోల్ (60 కేజీలు), 1992 బార్సిలోనా (60 కేజీలు), 1996 అట్లాంటా (64 కేజీలు) ఒలింపిక్స్ క్రీడల్లో ఆయన స్వర్ణ పతకాలు గెలిచారు. తన శరీర బరువుకు 2.5 రెట్లు బరువునెత్తిన తొలి, ఏకై క వెయిట్ లిఫ్టర్ ఆయనే. 22 ఏళ్లకే 32 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆయన 2000లో సిడ్నీ ఒలింపిక్స్ తర్వాత ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వెయిట్‌లిఫ్టర్ సులేమాన్ ఒగ్లు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఏడుసార్లు విశ్వవిజేత. వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్.

యూనిసెఫ్ బాలల హక్కుల ప్రచారకర్తగా త్రిష
తమిళ సినీ నటి త్రిష ఐక్యరాజ్యసమితి బాలల నిధి(యూనిసెఫ్) సెలబ్రిటీ అడ్వకేట్‌గా వ్యవహరించనున్నారు. బాలల హక్కులు, వారి సమస్యలపై త్రిష ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారని నవంబర్ 20న యూనిసెఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలు, పిల్లల్లో రక్తహీనత, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులపై అకృత్యాలు తదితర సమస్యలపై పోరాటంలో త్రిష భాగస్వాములవుతారని యూనిసెఫ్ ఉన్నతాధికారి జాబ్ జకారియా చెప్పారు. కుటుంబాల్లో, సామాజిక వర్గాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చిన్నారుల హక్కులకు భంగం వాటిల్లిన సందర్భాల్లో ఆమె క్రియాశీలంగా వ్యవహరిస్తారని జకారియా చెప్పారు. యూనిసెఫ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తొలి దక్షిణభారత నటి త్రిషనే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూనిసెఫ్ బాలల హక్కుల ప్రచారకర్తగా త్రిష
ఎప్పుడు : నవంబర్ 20
ఎందుకు : బాలల హక్కులు, వారి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు

దాతృత్వ నెట్‌వర్క్‌లోకి నీలేకని దంపతులు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ఆ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి నీలేకని తాము సైతం సమాజ సేవకు సంపదను ధారపోస్తామంటూ ముందుకొచ్చారు. తమ సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తుల సమూహం ‘ద గివింగ్ ప్లెడ్‌‌జ’లో నీలేకని దంపతులు చేరారు. ఇందుకు సంబంధించి అంగీకారం తెలుపుతూ నీలేకని రాసిన లేఖను ద గివింగ్ ప్లెడ్‌‌జ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
గివింగ్ ప్లెడ్‌‌జను బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా, వారెన్ బఫెట్ కలసి 2010లో ఏర్పాటు చేశారు. అధిక ధనవంతులను దాతృత్వం దిశగా ప్రోత్సహించేందుకు ఇది ఏర్పాటయింది. ఈ నెట్‌వర్క్‌లో మన దేశం నుంచి విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, శోభా డెవలపర్స్ ఎమిరటస్ చైర్మన్ పీఎన్‌సీ మీనన్ ఇంతకుముందే చేరగా, వీరి బాటలోనే నీలేకని దంపతులు నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ద గివింగ్ ప్లెడ్‌‌జ’లోకి నీలేకని దంపతులు
ఎప్పుడు : నవంబర్ 20
ఎందుకు : సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు

ఐసీజే న్యాయమూర్తిగా మళ్లీ ఎన్నికైన భండారి
అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ నుంచి నవంబర్ 21న బ్రిటన్ (అభ్యర్థి క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్ ) తప్పుకోగా.. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, భద్రతా మండలిలు భండారీకి పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ అతి పెద్ద దౌత్య విజయం సాధించినటై్లంది. ఐరాస సాధారణ సభలో మొత్తం 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లనూ భండారీ దక్కించుకున్నారు. ఈ విజయంతో ఆయన మరో 9 ఏళ్ల కాలానికి ఐసీజే న్యాయమూర్తిగా పనిచేయనున్నారు. హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులుండగా.. ప్రతీ మూడేళ్లకు ఐదుగురిని ఎన్నుకుంటారు.
2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్‌‌స అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీజే న్యాయమూర్తిగా మరోసారి ఎన్నికైన దల్వీర్ భండారి
ఎప్పుడు : నవంబర్ 20
ఎక్కడ : ది హేగ్, నెదర్లాండ్స్

బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రీతి రాజీనామా
బ్రిటన్‌లో భారత సంతతి కేబినెట్ మంత్రి, బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు ప్రీతి పటేల్ (45) పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు పలువురు నేతలతో రహస్యంగా భేటీ కావడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపకపోవడంతో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ప్రీతిపై వేటు పడింది. ఇజ్రాయెల్ నేతలతో భేటీ విషయం వివాదాస్పదంగా మారడంతో ఆఫ్రికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావాలని ప్రధాని థెరిసా మే ప్రీతిని ఆదేశించారు. దీంతో నవంబర్ 8న ప్రధాని కార్యాలయానికి చేరుకున్న ఆమె థెరిసాకు రాజీనామా సమర్పించారు. సాధారణంగా విదేశీ పర్యటనలు జరిపే బ్రిటిష్ మంత్రులు ఆ వివరాలను తమ విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రతి పటేల్ రాజీనామా
ఏమిటి : నవంబర్ 8
ఎందుకు : ఇజ్రాయెల్ పర్యటనలో అనుమతి లేకుండా ఆ దేశ నేతలతో సమావేశం కావటంతో

‘నాడా’ అప్పీల్ ప్యానెల్‌లో సెహ్వాగ్
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)లో సభ్యునిగా వీరేంద్ర సెహ్వాగ్ ఎంపికయ్యాడు. క్రికెట్‌ను కూడా ‘నాడా’ పరిధిలోకి తీసుకురావాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో కమిటీలో సెహ్వాగ్ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది. సెహ్వాగ్‌తో పాటు డిల్లీ మాజీ క్రికెటర్ వినయ్ లాంబా తదితరులు ఆరుగురు సభ్యుల ఈ కమిటీలో ఉన్నారు. అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్- ఏడీడీపీ)ని కూడా ‘నాడా’ నియమించింది. ఈ కమిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు చోటు కల్పించింది. 2001లో డోపింగ్ కారణంగా ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన వెయిట్ లిఫ్టర్ కుంజరాణికి ఈ కమిటీలో సభ్యురాలిగా నియమించారు. కుంజరాణితో పాటు ఏడీడీపీ కమిటీలో అఖిల్ కుమార్ (బాక్సింగ్), రీత్ అబ్రహం (అథ్లెటిక్స్), జగ్బీర్ సింగ్ (హాకీ), రోహిత్ రాజ్‌పుట్ (టెన్నిస్) తదితరులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
‘నాడా’ అప్పీల్ ప్యానెల్
ఏమిటి : నవంబర్ 9
ఎవరు : వీరేంద్ర సెహ్వాగ్ కు చోటు

నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్
Current Affairs దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్ ఎంపికయ్యారు. 2018 మార్చిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పదవీకాలం అప్పటితో ముగుస్తుంది. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తొలి మహిళ.. ఘోష్. ఆమె ఇంటెల్ దక్షిణాసియా విభాగం ఎండీగా పనిచేశారు. నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఘోష్ సభ్యురాలు కాగా.. నాస్కామ్ ఫౌండేషన్ ట్రస్టీగా కూడా ఉన్నారు.
దేశీ ఐటీ, బీపీవో రంగం ప్రస్తుతం 150 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : దేబ్‌జానీ ఘోష్

భార్యను కలిసేందుకు జాధవ్‌కు అనుమతి
భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తన భార్యను కలుసుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వీలుగా ఆయన తల్లికి మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని భారత్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై పాక్ ఈ మేరకు స్పందించింది. మానవతా దృక్పథంతోనే జాధవ్ తన భార్యను పాక్‌లో కలుసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో మరణశిక్షపై స్టే లభించింది.

యునెస్కోకి రెండోసారి మహిళాధిపతి
‘ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో)’ నూతన డెరైక్టర్ జనరల్(డీజీ)గా ఫ్రాన్స్ సాంస్కృతిక, సమాచార శాఖ మాజీ మంత్రి ఆద్రే అజోలే నియమితులయ్యారు. ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను యునెస్కో సర్వ సభ్య సదస్సు నవంబర్ 12న ఆమోదించింది. యునెస్కోకి 11వ డీజీగా నియమితులైన అజోలే ఈ పదవిని అలంకరించనున్న రెండో మహిళ కావడం గమనార్హం. ఈమె ఇరినా బొకోవా స్థానంలో నియమితులయ్యారు.

పాక్‌లో భారత హైకమిషనర్‌గా అజయ్ బిసారియా
Current Affairs పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా 1987 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అజయ్ బిసారియా నియమితులయ్యారు. పాక్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న గౌతమ్ బంబావలే ఇటీవల చైనా రాయబారిగా వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అజయ్‌ను నియమించింది. ప్రస్తుతం అజయ్ పోలెండ్‌లో భారత రాయబారిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాక్‌లో భారత హైకమిషనర్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : అజయ్ బిసారియా

ఆసియా కుబేరుడుగా అవతరించిన ముకేశ్
రిలయన్‌‌స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చైనాకు చెందిన హు కా యాన్‌ను అధిగమించి ఆసియా కుబేరుడిగా అవతరించారు. ఆర్‌ఐఎల్ షేరు ధర నవంబర్ 1న 1.22 శాతం పెరగడంతో ముకేశ్ వ్యక్తిగత సంపద విలువ ఒక్కరోజే 466 మిలియన్ డాలర్ల మేర (రూ.3,000) పెరిగింది. దీంతో 42.1 బిలియన్ డాలర్ల సంపద విలువతో (రూ.2.7 లక్షల కోట్లు) ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. చైనా ఈవర్‌గ్రాండ్ గ్రూపు చైర్మన్ హు కా యాన్ సంపద నవంబర్ 1 నాటికి నాటికి 1.28 బిలియన్ డాలర్ల మేర తగ్గి 40.6 బిలియన్ డాలర్లు (రూ.2.60 లక్షల కోట్లు) కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముకేశ్ అంబానీ 14వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా కుబేరుల్లో అగ్రస్థానం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : ముఖేష్ అంబానీ (రిలయన్‌‌స ఇండస్ట్రీస్)

దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్‌గా సురేష్ చుక్కపల్లి
హైదరాబాద్‌లో దక్షిణ కొరియా గౌరవ కాన్సుల్ జనరల్‌గా ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ విదేశాంగ శాఖ నవంబర్ 1న ఒక ప్రకటన వెలువరించింది. గతంలో ఈయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ కొరియా గౌరవ కాన్సుల్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : సురేష్ చుక్కపల్లి
ఎక్కడ : హైదరాబాద్

ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో ఐదుగురు భారతీయులు
ఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికి ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో జర్మనీ చాన్‌‌సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె ఈ స్థానాన్ని దక్కించుకోవటం ఇది 12వ సారి. వరుసగా ఏడోసారి.
మెర్కెల్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా యూకే ప్రధాని థెరెసా మే, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ నిలిచారు. ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 4వ స్థానంలో, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా ఐదో స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన పెప్సికో సీఈవో ఇంద్రా నూయి 11వ స్థానం, ఇండో-అమెరికన్ నిక్కీ హేలీ 43వ స్థానంలో ఉన్నారు. జాబితాలో కొత్తగా 23 మంది స్థానం దక్కించుకోగా, అందులో ఇవాంకా ట్రంప్ (19వ స్థానం) కూడా ఉన్నారు.
ఈ జాబితాలో బారత్ నుంచి ఐదుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. వీరిలో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ అగ్రస్థానం (మొత్తంగా 32వ స్థానం) లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో హెచ్‌సీఎల్ కార్ప్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా (57), బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా (71) హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్, ఎడిటోరియల్ డెరైక్టర్ శోభన భర్తియా (92) బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (97) ఉన్నారు.

టాప్ 10 శక్తిమంతమైన మహిళలు

శక్తిమంతమైన భారత మహిళలు

ర్యాంక్

పేరు

పేరు

ర్యాంక్

1

ఏంజెలా మెర్కెల్

చందా కొచ్చర్

32

2

థెరెసా మే

రోష్ని నాడార్ మల్హోత్రా

57

3

మిలిండా గేట్స్

కిరణ్ మజుందార్ షా

71

4

షెరిల్ శాండ్‌బర్గ్

శోభన భర్తియా

92

5

మేరీ బర్రా

ప్రియాంక చోప్రా

97

6

సుసన్ వోజిస్కీ

7

అబిగెయిల్ జాన్సన్

8

క్రిస్టినా లగార్డే

9

అనా ప్యాట్రిసియా బోటిన్

10

గిన్నీ రోమెట్టీ


క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో ఐదుగురు భారతీయులు
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : చందా కొచ్చర్, రోష్ని నాడార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభన భర్తియా, ప్రియాంక చోప్రా
ఎక్కడ : ప్రపంచంలో 100 మంది శక్తిమంతమైన మహిళలు

మహమ్మద్ అలీ జిన్నా కూతురు కన్నుమూత
పాకిస్థాన్ నిర్మాత మహమ్మద్ అలీ జిన్నా కూతురు దీనా వాడియా (99) నవంబర్ 3న అమెరికాలో కన్నుమూశారు. వాడియా గ్రూపు చైర్మన్ నుస్లీ వాడియా ఆమె కుమారుడు. దీనా తన తండ్రితో విభేదించి వాడియాను పెళ్లి చేసుకొని తండ్రికి దూరంగా ఉన్నది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహమ్మద్ అలీ జిన్నా కూతురు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : దీనా వాడియా
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

తెలుగులో ‘హిట్ రీఫ్రెష్’
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రాసిన ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకం తెలుగులో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ భాషల్లోనూ ఈ పుస్తకంను అనువదించారు.‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంతో పాటూ మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణం, ఇతర అనుభవాలను నాదెళ్ల వివరించారు. పుస్తక ప్రచారం నిమిత్తం భారత్‌కు వచ్చిన నాదెళ్ల నవంబర్ 6న హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
తెలుగులో హిట్ రీఫ్రెష్ పుస్తకం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : సత్య నాదెళ్ల

కర్ణాటకకు తొలిసారి మహిళా డీజీపీ
కర్ణాటక తొలి మహిళా డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా నీలమణి రాజు అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టారు. 1983 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆమె ఈ పదవిలో 2020 జనవరి వరకు ఉంటారు. నీలమణి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ.
Published date : 15 Nov 2017 11:36AM

Photo Stories