Gautam Sawang: ఏపీపీఎస్సీ నూతన చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
APPSC New Chairman Gautam Sawang: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా(డీజీపీ) సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్ ఏఎస్పీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీగా సేవలందించిన ఆయన 2000లో డీఐజీగా పదోన్నతి పొంది వరంగల్, కరీంనగర్ రేంజ్‌ల్లో పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు.
ఐక్యరాజ్యసమితి తరపున..
అస్సాంకు చెందిన సవాంగ్ 2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేశారు. తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2016 జూన్‌లో డీజీగా పదోన్నతి పొందారు. అనంతరం 2019 ఏడాదిలో ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2022, డిసెంబర్ 15న డీజీపీ పోస్టు నుంచి బదిలీ అయ్యారు.
చదవండి: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన ఐపీఎస్ అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(ఏపీపీఎస్సీ) నూతన చైర్మన్‌గా నియమితులైన ఐపీఎస్ అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా(డీజీపీ) దామోదర్ గౌతమ్ సవాంగ్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్