అక్టోబర్ 2018 వ్యక్తులు
Sakshi Education
స్వాతంత్య్ర సమరయోధుడు సత్యనారాయణ కన్నుమూత
స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ (95) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అక్టోబర్ 25న కన్నుమూశారు. 1924 అక్టోబరు 1న పశ్చిమగోదావరిలోని ఇరగవరం మండలం పేకేరులో వెంకటరామదాసు, భద్రమ్మ దంపతులకు సత్యనారాయణ జన్మించారు. తర్వాతి కాలంలో ఆయన తణుకులో స్థిరపడ్డారు. క్విట్ ఇండియా సహా పలు ఉద్యమాల్లో పాలొన్న సత్యనారయణ అనేక పర్యాయాలు జైలు జీవితం గడిపారు.
1942లో సీపీఐలో చేరిన సత్యనారయణ 1962, 1972, 1994లో మూడు పర్యాయాలు పెనుగొండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2018 ఆగస్టు 9న 75వ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా... డిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : వంక సత్యనారాయణ (95)
ఎక్కడ : తణుకు, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
అమెరికా ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా భారతీయ సంతతి వ్యక్తి
అమెరికా ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్(ఎఫ్‌ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా భారతీయ సంతతికి చెందిన నెయిల్ ఛటర్జీ నియమితులయ్యారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 25న ఉత్తర్వులు జారీ చేశారు. పస్తుతం ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా ఉన్న కెవిన్ మేక్ ఇంటైర్ స్థానంలో ఛటర్జీ అనారోగ్యం కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా పవర్ గ్రిడ్, వేలకోట్ల డాలర్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఎఫ్‌ఈఆర్‌సీ పరిధిలోకి వస్తాయి. ఛటర్జీ ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించడం ఇది రెండోసారి. గతంలో మెక్ ఇంటైర్ ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించకముందు 2017 ఆగస్టు 10 నుంచి డిసెంబర్ 7 వరకు ఛటర్జీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా భారతీయ సంతతి వ్యక్తి
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : నెయిల్ ఛటర్జీ
ఎక్కడ : అమెరికా
ఇథియోపియా తొలి మహిళా అధ్యక్షురాలిగా షాహ్లె
ఇథియోపియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆ దేశ పార్లమెంటు సభ్యులు షాహ్లె వర్క్‌జ్యూడె ఎన్నికయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 26న ఆమె ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా షాహ్లె మాట్లాడుతూ... ఇథియోపియాలో స్త్రీపురుష సమానత్వం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఇథియోపియా ప్రధానిగా అమీ అహ్మద్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇథియోపియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : షాహ్లె వర్క్‌జ్యూడె
ఎక్కడ : ఇథియోపియా
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ విజేత క్లారా సోసా
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2018 విజేతగా పరాగ్వేకు చెందిన క్లారా సోసా నిలిచింది. మయన్మార్‌లో అక్టోబర్ 25న నిర్వహించిన అందాల పోటీల్లో సోసా మొదటిస్థానంలో నిలిచి కిరీటం సొంతంచేసుకోగా భారతీయ యువతి మీనాక్షి చౌదరి రెండోస్థానం దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2018 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : క్లారా సోసా
ఎక్కడ : మయన్మార్
ఈడీ కొత్త డెరైక్టర్‌గా సంజయ్ కుమార్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కొత్త డెరైక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(ఏసీసీ) అక్టోబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్‌గా ఉన్న మిశ్రా ప్రిన్సిపల్ స్పెషల్ డెరైక్టర్ హోదాలో మూడు నెలలపాటు లేదా మరొకరు నియమితులయ్యే వరకు ఈడీ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఎస్‌కే మిశ్రా ఇండియన్ రెవెన్యూ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ అధికారి. ప్రస్తుతమున్న ఈడీ డెరైక్టర్ కర్నాల్ సింగ్ పదవి అక్టోబర్ 28తో ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈడీ కొత్త డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : సంజయ్ కుమార్ మిశ్రా
శ్రీలంక ప్రధానిగా రాజపక్స
శ్రీలంక నూతన ప్రధానిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయనతో అక్టోబర్ 26న ప్రమాణం చేయించారు. ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘేకు చెందిన యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు సిరిసేన పార్టీ యునెటైడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్‌జ(యూపీఎఫ్‌ఏ) ప్రకటించింది. దీంతో విక్రమసింఘే తన పదవిని కొల్పోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : మహిందా రాజపక్స
ఎక్కడ : శ్రీలంక
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఖురానా కన్నుమూత
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా (82) అనారోగ్య కారణాలతో ఢిల్లీలో అక్టోబర్ 27న కన్నుమూశారు. 1936, అక్టోబర్ 15న పంజాబ్ ప్రావిన్స్(బ్రిటిష్ ఇండియా)లోని ల్యాల్‌పూర్‌లో ఎస్‌డీ ఖురానా, లక్ష్మీదేవి దంపతులకు మదన్‌లాల్ ఖురానా జన్మించారు. 1993-96 మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 2004లో రాజస్తాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : మదన్‌లాల్ ఖురానా (82)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్య కారణాలతో
ఐజేయూ అధ్యక్షుడిగా అమర్ బాధ్యతల స్వీకరణ
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్ అక్టోబర్ 28న బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లో అక్టోబర్ 27, 28 తేదీల్లో ఐజేయూ 9వ జాతీయ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు ఎస్.ఎన్ సిన్హా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీకి చెందిన సబినా ఇంద్రజిత్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐజేయూ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : దేవులపల్లి అమర్
300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన బ్రాడ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ రిఫరీ అయిన క్రిస్ బ్రాడ్ 300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన రెండో వ్యక్తిగా నిలిచారు. భారత్-వెస్టిండీస్ మధ్య పుణేలో అక్టోబర్ 27న జరిగిన మూడో వన్డేతో బ్రాడ్ ఈ రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ బ్రాడ్ 2004లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌కు తొలిసారి రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన కంటే ముందు రంజన్ మధుగలె (శ్రీలంక-336 మ్యాచ్‌లు) అత్యధిక మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన రెండో వ్యక్తి
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : క్రిస్ బ్రాడ్
బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా జాయర్ బోసానారు
బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జాయర్ బోసానారు ఎన్నికయ్యారు. అక్టోబర్ 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జాయర్ కమ్యూనిస్ట్ కూటమికి చెందిన వర్కర్స్ పార్టీ నాయకుడు ఫెర్నాండో హాడడ్‌పై సంపూర్ణ మెజారిటీ సాధించారు. జాయర్ కు 5.2 శాతం ఓట్లు రాగా, ఫెర్నాండోకు 44.8 శాతం ఓట్లు దక్కాయి. గతంలో సైనికాధికారిగా పనిచేసిన జాయర్ ఎన్నికల ప్రచార సమయంలో తరచూ మహిళలు, గేలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ‘బ్రెజిల్ ట్రంప్’గా పేరొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెజిల్ నూతన అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : జాయర్ బోసానారు
మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్‌దత్ తివారీ(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అక్టోబర్ 18 మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గతేడాది బ్రెయిన్‌స్ట్రోక్ రావడంతో తివారీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్‌లో 1925, అక్టోబర్ 18న నారాయణ్ దత్ తివారీ జన్మించారు. 1947లో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1976లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ సీఎంగా చేశారు. యూపీకి మూడుసార్లు, ఉత్తరాఖండ్‌కు ఒకసారి సీఎంగా చేశారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, రాజవ్ హయాంలో ఆర్థికం, పెట్రోలియం, విదేశాంగ మంత్రిగా చేశారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్డీ తివారీ కన్నుమూత
ఎప్పుడు: అక్టోబర్ 18
ఎవరు: ఎన్డీ తివారీ
ఎక్కడ: ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో
ఎందుకు : బ్రెయిన్‌స్ట్రోక్
ఎకనామిక్స్ ఫోరం నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావుకు వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం నుంచి మరోసారి ఆహ్వానం లభించింది. 2019 జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 49వ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌కు ఎకనామిక్స్ ఫోరమ్ అక్టోబర్ 21న ఆహ్వానం పంపింది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, డిజిటలైజేషన్, ఈఓడీబీ, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత వంటి కీలక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచిన సంస్కరణలపై సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌ను ఫోరం కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం నుంచి ఆహ్వానం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
‘కిలిమంజారో’ అధిరోహించిన పాలమూరు వైద్యుడు
ఆఫ్రికా ఖండంలో ఎత్తై శిఖరం కిలిమంజారోని మహబూబ్‌నగర్‌లోని సుశ్రుత ప్రజావైద్యశాల ఎండీ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అక్టోబర్ 22న అధిరోహించారు. మహబూబ్‌నగర్ ట్రెక్కింగ్ క్లబ్ తరఫున ‘మహబూబ్‌నగర్ బాలికలను రక్షించాలి’ అనే నినాదంతో ఆయన కిలిమంజారోని అధిరోహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘కిలిమంజారో’ అధిరోహించిన పాలమూరు వైద్యుడు
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : డాక్టర్ మధుసూదన్‌రెడి
ఎక్కడ : టాంజానియా, ఆఫ్రికా
సీబీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా నాగేశ్వరరావు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాత్కాలిక డెరైక్టర్‌గా 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐలో జాయింట్ డెరైక్టర్‌గా నాగేశ్వరావు పనిచేస్తున్నారు. అవినీతి ఆరోపణల కారణంగా సీబీఐ డెరైక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డెరైక్టర్ రాకేశ్ అస్థానాలను ప్రభుత్వం అక్టోబర్ 24న వారి పదవుల నుంచి తప్పించింది. దీంతో అలోక్ వర్మ స్థానంలో నాగేశ్వరావు నియమితులయ్యారు.
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపూర్ గ్రామానికి చెందిన మన్నెం పిచ్చయ్య, శేషమ్మల దంపతులకు నాగేశ్వరావు జన్మించారు. మంగపేట, తిమ్మంపేటలో విద్యాభ్యాసం చేసిన నాగేశ్వరావు ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. ఆ తరువాత సివిల్స్ రాసి ఐపీఎస్ సాధించారు. ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారిగా రూర్కెలా జిల్లా ఏఎస్సీగా, కటక్‌లో ఎస్పీగా, అనంతరం సీఆర్‌పీఎఫ్ ఐజీ, డీఐజీగా నాగేశ్వరావు విధులు నిర్వర్తించారు. తరువాత ఒడిశా అడిషనల్ డీజీగా కొంత కాలం పనిచేసి చెన్నై జోన్ సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీఐ తాత్కాలిక డెరైక్టర్
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : మన్నెం నాగేశ్వరరావు
టీవీఎస్ సీఈవోగా కేఎన్ రాధాకృష్ణన్
దేశంలో మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ హోల్‌టైమ్ డెరైక్టర్, సీఈవోగా కేఎన్ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఈ మేరకు టీవీఎస్ అక్టోబర్ 23న ప్రకటించింది. దీంతో ఐదు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవులో కొనసాగనున్నారు. 1986లో టీవీఎస్ గ్రూపు కంపెనీ సుందరం క్లేటాన్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీగా చేరిన రాధాకృష్ణన్ బిజినెస్ ప్లానింగ్ హెడ్‌గా ఎదిగారు. 2004లో టీవీఎస్ మోటార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. 2008లో ప్రెసిడెంట్ అయ్యారు. టీవీఎస్ మోటార్‌ను అంతర్జాతీయంగా 60 మార్కెట్లకు విస్తరింపజేశారు. ప్రస్తుతం టీవీఎస్ మోటార్ చైర్మన్‌గా వేణు శ్రీనివాసన్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈవో నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేఎన్ రాధాకృష్ణన్
డీఆర్‌డీఎల్ డెరైక్టర్‌గా డాక్టర్ దశరథరాం
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీస్ (డీఆర్‌డీఎల్) డెరైక్టర్‌గా డాక్టర్ దశరథరాం నియమితులయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వం అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డెరైక్టర్‌గా కొనసాగిన ప్రముఖ శాస్త్రవేత్త ఎం.ఎస్.ఆర్.ప్రసాద్ రక్షణ రంగంలో కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టం (ఎంఎస్‌ఎస్)కు డెరైక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్ దశరథరాం కొత్తగా బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీఆర్‌డీఎల్ డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : డాక్టర్ దశరథరాం
ఎక్కడ : హైదరాబాద్
ఐదు హైకోర్టులకు సీజేల నియామకం
దేశంలోని ఐదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల(సీజే)ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉత్తరాఖండ్, బాంబే, కలకత్తా, గువాహటి, సిక్కిం హైకోర్టులకు నూతన సీజేలు నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
కొత్తగా నియమితులైన సీజేలు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐదు హైకోర్టులకు సీజేల నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
జస్టిస్ పీసీ రావు కన్నుమూత
న్యాయకోవిదుడు, పద్మభూషణ్ జస్టిస్ పాటిబండ్ల చంద్రశేఖరరావు (82) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో అక్టోబర్ 11న కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో 1936 ఏప్రిల్ 22న జన్మించిన ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బీఎల్, ఎంఎల్, ఎల్‌ఎల్‌డీ (డాక్టర్ ఆఫ్ లాస్) పట్టాలు, హైదరాబాద్ నల్సార్ వర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. భారత ప్రభుత్వ న్యాయశాఖ, డిప్యూటీ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్‌లో అదనపు కార్యదర్శి, కార్యదర్శితో సహా పలు ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలను ఆయన చేపట్టారు.
హంబర్గ్‌లోని అంతర్జాతీయ సముద్ర జల వివాదాల ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా (1999 నుంచి 2002 వరకు), న్యాయమూర్తిగా 2017 వరకు జస్టిస్ పీసీ రావు పనిచేశారు. ఇటలీ-చైనా సముద్ర జలాల వివాదాలపై 1996 నుంచి మధ్యవర్తిగా వ్యవహరించారు. రాజ్యాంగ అంశాలపైనే కాకుండా మధ్యవర్తిత్వం, అంతర్జాతీయ చట్టాలపై అనేక పుస్తకాలు రాశారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ న్యాయవాది కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : జస్టిస్ పాటిబండ్ల చంద్రశేఖరరావు (82)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
గంగా ఉద్యమ యోధుడు అగర్వాల్ కన్నుమూత
గంగా నది పరిరక్షణ కోసం నిరశన దీక్ష చేపట్టిన ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్(86) గుండెపోటు కారణంగా అక్టోబర్ 11న కన్నుమూశారు. కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ అయిన అగర్వాల్.. గంగా నదిని కాలుష్యరహితం చేయాలని, దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ 2018 జూన్ 22 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. 109 రోజుల పాటు కేవలం తేనె కలిపిన నీరు మాత్రమే తీసుకున్నారు. కేంద్రం స్పందించకపోవడంతో ఇకపై నీరు కూడా తాగనంటూ అక్టోబర్ 9న ప్రకటించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అక్టోబర్ 10న రిషీకేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్‌లో 1932లో జన్మించిన అగర్వాల్.. రూర్కీ వర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ పొందారు. అనంతరం కాన్పూర్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1979లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మొదటి మెంబర్ సెక్రెటరీగా పని చేశారు. అదే సమయంలో ఐఐటీ రూర్కీలో విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత 2012లో సన్యాసం స్వీకరించి తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్‌గా మార్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గంగా ఉద్యమ యోధుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్(86)
‘బిల్డింగ్ ఏ లెగసీ’ పుస్తకం ఆవిష్కరణ
ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ అనుమోలు రామకృష్ణ బయోగ్రఫీ ‘బిల్డింగ్ ఏ లెగసీ’ పుస్తకంను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చెన్నైలో అక్టోబర్ 12న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయితలు వి.పట్టాభిరామ్, ఆర్.మోహన్‌లను వెంకయ్య అభినందించారు. భారతీయ పరిశ్రమలో నిజమైన, గొప్ప జీవిత చరిత్రను కలిగిన వ్యక్తి రామకృష్ణ అని ఆయన అన్నారు. రామకృష్ణకు మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్డింగ్ ఏ లెగసీ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
సంగీత కళాకారిణి అన్నపూర్ణ కన్నుమూత
ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారిణి అన్నపూర్ణదేవి(92) ముంబైలో అక్టోబర్ 13న కన్నుమూశారు. ‘మా’గా పిలుచుకునే అన్నపూర్ణదేవి 1927లో మధ్యపదేశ్‌లోని మైహర్ పట్టణంలో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు జన్మించారు. బాల్యంలో ఆమె పేరు రోషనారాఖాన్ కాగా అప్పటి మైహర్ మహారాజు బ్రిజ్‌నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరే స్థిరపడిపోయింది.
ఐదేళ్ల వయసులో తండ్రి ఉస్తాద్ బాబా దగ్గర అన్నపూర్ణదేవి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. 1941లో ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌ను వివాహం చేసుకున్న ఆమె 1962లో విడాకులు తీసుకున్నారు. అనంతరం కొద్ది మంది శిష్యులకు శిక్షణ ఇచ్చారు. హిందుస్తానీ సంగీతానికి విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణాదేవిని 1977లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. సంప్రదాయ హిందుస్తానీ సంగీతంలో ‘సేనియా మైహర్ ఘరానా’ అనే శైలిని నెలకొల్పడంలో అన్నపూర్ణ తండ్రి విశేష కృషి చేశారు. ప్రముఖ హిందుస్తానీ సంగీతకారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఆమె సోదరుడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారిణి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : అన్నపూర్ణదేవి(92)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
రోమెరో, పోప్ పాల్-6లకు సెయింట్‌హుడ్
హత్యకు గురైన, ఎల్ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ ఆస్కార్ అర్నుల్‌ఫో రోమెరో గాల్డమెజ్, ఇటలీకి చెందిన పోప్ పాల్-6లకు సెయింట్‌హుడ్ లభించింది. ఈ మేరకు వాటికన్ సిటీలో అక్టోబర్ 14న పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్ పాల్-6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 1978లో అనారోగ్యంతో మరణించారు. ఎముకల కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్ నన్ సహా మరో ఐదుగురికి కూడా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌హుడ్ ప్రసాదించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్కార్ అర్నుల్‌ఫో రోమెరో గాల్డమెజ్, పోప్ పాల్-6 లకు సెయింట్‌హుడ్
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎక్కడ : వాటికన్ సిటీ
ఏపీ మాజీమంత్రి మల్యాల రాజయ్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యుడు మల్యాల రాజయ్య(82) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హైదరాబాద్‌లో అక్టోబర్ 15న ఆయన తుదిశ్వాస విడిచారు. 1936లో కరీంనగర్ జిల్లా వెదిర గ్రామంలో జన్మించిన రాజయ్య ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్.ఎల్.బి చేశారు. మొదట న్యాయవాదిగా పనిచేసిన ఆయన తర్వాత జడ్జీగా చీరాల, కల్వకుర్తి, హైదరాబాద్, సిటీ సివిల్ కోర్టుల్లో పనిచేశారు. 1984లో రాజకీయాల్లోకి వచ్చిన రాజయ్య 1985, 1989, 1994లో టీడీపీ తరఫున అందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1998, 1999ల్లో సిద్దిపేట నుంచి ఎంపీగా గెలిచారు. 2006లో టీఆర్‌ఎస్‌లో చేరి కొంతకాలం తర్వాత తిరిగి టీడీపీలో చేరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : మల్యాల రాజయ్య(82)
ఎక్కడ : హైదరాబాద్
నోకియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆలియా భట్
మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ నోకియా బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి ఆలియా భట్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత్‌లో నోకియా ఫోన్ల డిజైన్, సేల్స్ నిర్వహిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్ ఇండియా అక్టోబర్ 15న ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోకియా బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : ఆలియా భట్
మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు అలెన్ కన్నుమూత
మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచపు అత్యంత ధనికుల్లో ఒకరైన పాల్ అలెన్ (65) కన్నుమూశారు. నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమా అనే కేన్సర్ కారణంగా అమెరికాలో అక్టోబర్ 16న తుదిశ్వాస విడిచారు. అనేక వ్యాపార రంగాల్లోనూ ప్రవేశించిన ఆయన పలు దాతృత్వ సంస్థలను నెలకొల్పారు. సాంకేతిక, వైద్య పరిశోధనల కోసం పలు పరిశోధనాత్మక సంస్థలను స్థాపించి సమాజసేవ చేశారు. మైక్రోసాఫ్ట్ మరో సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అలెన్ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. 1975 ఏప్రిల్ 4న ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : పాల్ అలెన్ (65)
ఎక్కడ : అమెరికా
ఎందుకు : నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమా అనే కేన్సర్ కారణంగా
ప్రైవసీ యాజ్ సీక్రసీ పుస్తకావిష్కరణ
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ప్రైవసీ యాజ్ సీక్రసీ’ పుస్తకంను న్యూఢిల్లీలో అక్టోబర్ 16న ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ... గోప్యత పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వకుండా తిరస్కరించేందుకు వీల్లేదని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ప్రైవసీ యాజ్ సీక్రసీ’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ
ఎక్కడ : న్యూఢిల్లీ
లైంగిక వేధింపుల ఆరోపణలపై మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ అక్టోబర్ 17న తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం తెల్సిందే. అక్బర్ రాజీనామాను ప్రధాని మోదీ, ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. అక్బర్ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు. 20 ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళా జర్నలిస్టు ప్రియా రమణి మంత్రి పై ఆరోపణలు చేశారు.
వ్యక్తిగతంగానే పోరాడుతా...
వ్యక్తిగతంగానే కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అక్బర్ అన్నారు. ‘పదవికి రాజీనామా చేసి నాపై వచ్చిన ఆరోపణల్ని వ్యక్తిగతంగానే కోర్టులో సవాలుచేయడం సరైనదని భావించి రాజీనామా చేశా’ అని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా
ఎప్పుడు: అక్టోబర్ 17
ఎవరు: కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్
ఎందుకు : లైంగిక వేధింపుల ఆరోపణలు
ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ రాజీనామా
ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ తన పద వులకు అక్టోబర్ 4న రాజీనామా చేశారు. అలాగే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె వైదొలిగారు. 2019 మార్చి 31 వరకు చందా కొచర్ పదవీ కాలం ఉండగా అయితే వీడియోకాన్ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం కారణంగా ముందుగానే పదవి నుంచి తప్పుకున్నారు.
1984లో ఐసీఐసీఐ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన చందా కొచర్ చురుకైన పనితీరుతో గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్‌ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్ చైర్మన్ కేవీ కామత్ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను కొచర్ అందుకున్నారు.
కొత్త ఎండీ, సీఈవోగా సందీప్ బక్షి
ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు చందా కొచర్ రాజీనామా చేయడంతో ఐసీఐసీఐ కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. ఈ మేరకు 2023 అక్టోబర్ 3 వరకు సందీప్ బక్షీ ఆ పదవుల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యుటీ ఎండీగా వ్యవహరించిన బక్షి 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో రాజీనామా
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : చందా కొచర్
దేశంలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ
దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. ఈ మేరకు దేశంలోని టాప్-100 శ్రీమంతులతో రూపొందించిన జాబితాను ఫోర్బ్స్ అక్టోబర్ 4న విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు రూ.3.4 లక్షల కోట్ల సంపదతో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉండగా 1.5 లక్షల కోట్ల సంపదతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రెండవ స్థానం పొందారు. అలాగే దాదాపు 1.3 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ నివాస్ మిట్టల్ మూడోస్థానంలో ఉన్నారు. మిట్టల్ తర్వాతి స్థానాల్లో వరుసగా హిందూజా సోదరులు, పల్లోంజీ మిస్త్రీ, హెచ్‌సీఎల్ గ్రూప్ అధిపతి శివ్ నాడార్, గోద్రెజ్ కుటుంబం నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : ఫోర్బ్స్
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ సూర్యకాంత్
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లోని దర్భార్ హాలులో అక్టోబర్ 5న గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనతో ప్రమాణం చేయించారు.
హరియాణాలోని హిస్సార్‌లో 1962, ఫిబ్రవరి 10వ తేదీన జన్మించిన సూర్యకాంత్ ప్రభుత్వ పోస్టుగ్రాడ్యుయేట్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశారు. 1984లో హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. అనంతరం పంజాబ్, హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత హరియాణా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్‌గా వ్యవహరించారు. 2004లో హరియాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజే బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : సూర్యకాంత్
నాగాలాండ్ గాంధీ కన్నుమూత
నాగాలాండ్ గాంధీగా పేరు గాంచిన సామాజిక కార్యకర్త నట్వర్ ఠక్కర్(86) అక్టోబర్ 7న కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా అసోంలోని గువాహటిలో తుదిశ్వాస విడిచారు. 1932లో మహారాష్ట్రలో జన్మించిన ఠక్కర్.. తన 23 ఏళ్ల వయసులో నాగాలాండ్‌కు వచ్చి అక్కడే సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు. చుచుయిమ్‌లాంగ్ అనే గ్రామంలో ‘నాగాలాండ్ గాంధీ ఆశ్రమం’ను స్థాపించారు. మహాత్మాగాంధీ బోధనలు, భావాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఠక్కర్ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1994లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారాన్ని, 1999లో పద్మశ్రీ అవార్డ్‌ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాగాలాండ్ గాంధీ కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : నట్వర్ ఠక్కర్(86)
ఎక్కడ : అసోం
ఎందుకు : గువాహటి, అనారోగ్యం కారణంగా
ఐడీబీఐ బ్యాంక్ చీఫ్‌గా రాకేశ్ శర్మ
ఐడీబీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈఓ)గా రాకేశ్ శర్మ అక్టోబర్ 10న బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆరు నెలల కాలంపాటు శర్మ ఈ పదవులలో కొనసాగనున్నారు. ఐడీబీఐ బ్యాంక్ చీఫ్‌గా బాద్యతలు నిర్వహించిన బీ. శ్రీరామ్, సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయడంతో అక్టోబర్ 5న ఐడీబీఐ బ్యాంక్ చీఫ్‌గా శర్మ పేరును కేంద్రం ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా చేరిన శర్మ తర్వాత లక్ష్మీ విలాస్ బ్యాంక్‌కు బదిలీ అయ్యారు. 2014 ఏప్రిల్ 7 నుంచి 2015 సెప్టెంబర్ 9 వరకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా ఆయన వ్యవహరించారు. 2015 సెప్టెంబర్ 11 నుంచి 2018 జూలై 31 వరకు కెనరాబ్యాంక్ ఎండీ, సీఈఓగా పనిచేసి పదవీ విరమణ పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : రాకేష్ శర్మ
లోక్‌పాల్ ఎంపిక కమిటీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా
అవినీతి నిరోధం కోసం నియమించనున్న లోక్‌పాల్ ఎంపిక కమిటీ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సెప్టెంబర్ 27న నియమితులయ్యారు. దేశాయ్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యులను ఎంపిక చేయనుంది.
భారతీయ స్టేట్ బ్యాంక్ మాజీ చైర్‌వుమన్ అరుంధతీ భట్టాచార్య, ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాశ్, ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్, అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సఖ రామ్ సింగ్ యాదవ్, గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సేన్ ఖండ్వావాల, రాజస్తాన్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లలిత్ పన్వార్, మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌లు ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌పాల్ ఎంపిక కమిటీ చైర్‌పర్సన్ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్
ఎందుకు : లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యులను ఎంపిక చేసేందుకు
బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీలకు కొత్త చీఫ్‌లు
సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)లకు కొత్త అధిపతులను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27న నియమించింది. 1984 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రజినీకాంత్ మిశ్రా బీఎస్‌ఎఫ్‌కు చీఫ్‌గా నియమితులయ్యారు. దీంతో 2019 ఆగస్టు వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా రజినీకాంత్ ఉన్నారు. ప్రస్తుత బీఎస్‌ఎఫ్ చీఫ్‌గా ఉన్న కేకే శర్మ సెప్టెంబర్ నెలాఖరుకు పదవీ విరమణ పొందనున్నారు.
1984 బ్యాచ్ హరియాణా కేడర్‌కు చెందిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్‌ఎస్ దేశ్వాల్ ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా మిశ్రా స్థానంలో నియమితులయ్యారు. పదవీ విరమణ పొందే వరకు (2021 ఆగస్టు) కొనసాగనున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది, నేపాల్ సరిహద్దులో ఎస్‌ఎస్‌బీ సిబ్బంది పహారా కాస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీలకు కొత్త చీఫ్‌ల నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : రజినీకాంత్ మిశ్రా, ఎస్‌ఎస్ దేశ్వాల్
ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ చంద్రూ
ప్రభుత్వ రంగ బ్యాంక్- ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పద్మజ చంద్రూ సెప్టెంబర్ 27న బాధ్యతలు చేపట్టారు. ఇప్టటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్లోబల్ మార్కెట్స్ విభాగానికి డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా పద్మజ పనిచేశారు. ఇటీవ ల పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎండీ, సీఈఓలను నియమించగా... ఈ జాబితాలో పద్మజ కూడా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ బ్యాంక్ సీఈఓ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : పద్మజ చంద్రూ
గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్‌గా మేరీ కోమ్
భారత గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్‌గా భారత బాక్సర్ ఎమ్‌సీ మేరీ కోమ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 27న ప్రకటించింది. మణిపూర్‌కి చెందిన మేరీ కోమ్ ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అలాగే రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేసింది. ఈ సందర్భంగా మేరీ కోమ్ మాట్లాడుతూ గిరిజనుల వృద్ధి, వికాసానికి నా వంతు సహకారం అందజేస్తానని వాళ్లంతా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : ఎమ్‌సీ మేరీ కోమ్
జీవోఎం అధ్యక్షునిగా సుశీల్‌కుమార్ మోదీ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి (జీవోఎం) అధ్యక్షునిగా బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28న ప్రకటించింది. ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం జీవోఎంను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పించనుంది.
సుశీల్‌కూమార్ నే తృత్వంలోని ఈ కమిటీలో అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్ సభ్యులుగా ఉన్నారు. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీవోఎం అధ్యక్షుడి నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సుశీర్‌కూమార్ మోదీ
ఏపీ నూతన సీఎస్‌గా అనిల్ చంద్ర పునేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2019 మే నెలాఖరు వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌గా పునేత పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న దినేశ్ కుమార్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పునేత తొలుత వైఎస్‌ఆర్ కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఉద్యావన కమిషనర్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : అనిల్ చంద్ర పునేత
ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థిక వేత్తగా భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు 2018 ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్న మౌరిస్ ఓస్ట్‌ఫెల్డ్ స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఐఎమ్‌ఎఫ్ అక్టోబర్ 1న ప్రకటించింది.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన గీతా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వాషింగ్టన్ యూనివర్సిటీల నుంచి ఎమ్‌ఏ డిగ్రీలు సాధించారు. 2001లో ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి పీ.హెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2016లో ఆమె కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. అయితే ఈ నియామకం వివాదాస్పదమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా భారత సంతతి మహిళ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : గీతా గోపీనాథ్
గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, మాజీ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి(80) కన్నుమూశారు. అమెరికాలోని అలస్కా సిటీ వద్ద అక్టోబర్ 2న జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మూలపాలెంలో ఎంవీవీఎస్ మూర్తి జన్మించారు. వ్యాపార నిమిత్తం 1970 దశకంలో విశాఖపట్నానికి వచ్చి స్థిరపడ్డారు. గోల్డ్‌స్పాట్ శీతల పానీయాల కంపెనీని స్థాపించి గోల్డ్‌స్పాట్ మూర్తిగా పేరుగాంచారు.
1984లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరిన మూర్తి అప్పట్నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలు విశాఖపట్నం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 1980లో గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(గీతం) కళాశాలను స్థాపించారు. అనంతరం అది డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గీతం క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గీతం విద్యాసంస్థల అధినేత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఎంవీవీఎస్ మూర్తి(80)
ఎక్కడ : అలస్కా, అమెరికా
ఎందుకు : రోడ్డు ప్రమాదం కారణంగా
46వ సీజేఐగా జస్టిస్ గొగోయ్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్ (63) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో అక్టోబర్ 3న జస్టిస్ గొగోయ్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. దీంతో 2019 నవంబర్ 17 వరకు జస్టిస్ గొగోయ్ ఈ పదవిలో కొనసాగనున్నారు. అసోం నుంచి సీజేఐ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా జస్టిస్ గొగోయ్ నిలిచారు. సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.
1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్‌లో జన్మించిన జస్టిస్ గొగోయ్ 1978లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. గువాహతి హైకోర్టులో రాజ్యాంగం, టాక్సేషన్, కంపెనీ వ్యవహారాలపై ప్రాక్టీస్ చేశారు. అనంతరం 2001, ఫిబ్రవరి 28న గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. 2010, సెప్టెంబర్ 9న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011, ఫిబ్రవరి 12న అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2012, ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 46 భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : జస్టిస్ రంజన్ గొగోయ్
ఎక్కడ : దర్బార్ హాల్, రాష్ట్రపతిభవన్

హైకోర్టు పేరు | ప్రధాన న్యాయమూర్తి |
ఉత్తరాఖండ్ హైకోర్టు | జస్టిస్ రమేశ్ రంగనాథన్ |
సిక్కిం హైకోర్టు | జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్ |
కలకత్తా హైకోర్టు | డీకే గుప్తా |
గువాహటి హైకోర్టు | ఏ సోమయ్య బోపన్న |
బాంబే హైకోర్టు | జస్టిస్ నరేశ్ హరిశ్చంద్ర పాటిల్ |

Published date : 24 Oct 2018 03:45PM