Y-Break App: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వై–బ్రేక్ యాప్ ఉద్దేశం?
ఒక ఐదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆయుష్ శాఖ ‘‘వై–బ్రేక్(యోగా బ్రేక్)’’ అనే యాప్‌ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. 2021, సెప్టెంబర్ 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ సెప్టెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సెప్టెంబర్ 1న ప్రారంభం...
యోగా బ్రేక్‌కు 2020, జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాలలో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని తప్పనిసరి చేశారు. 2021, సెప్టెంబర్ 1న కేంద్రం వై–బ్రేక్ యాప్‌ని ప్రారంభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వై–బ్రేక్(యోగా బ్రేక్) మొబైల్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : కేంద్ర ఆయుష్ శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : ఉద్యోగులకు 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని అమలు చేయడంలో భాగంగా...