Venkaiah Naidu: ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ఫెసిలిటీని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు?
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోరీసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (ఐబీఎస్‌డీ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫైటో–ఫార్మాస్యూటికల్ ల్యాబ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్టోబర్ 5న ప్రారంభించారు. భారతదేశాభివృద్ధి సమర్థులైన, దేశభక్తులైన శాస్త్రవేత్తల చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని మళ్లీ విశ్వగురు స్థానంలో నిలపడంలో శాస్త్రవేత్తలు, పరిశోధకుల పాత్ర ఎంతో కీలకమన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లోని 40వ జాతీయ రహదారిలో షిల్లాంగ్ – డౌకి రహదారి అభివృద్ధి పనులకు అక్టోబర్ 4న శంకుస్థాపన చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా పాల్గొన్నారు.
చదవండి: ఏ పథకంలో భాగంగా బౌద్ధ సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫైటో–ఫార్మాస్యూటికల్ ల్యాబ్ ఫెసిలిటీ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోరీసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (ఐబీఎస్‌డీ) ప్రాంగణం, ఇంఫాల్, మణిపూర్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్