Minister Ashwini Vaishnav: కేంద్రం ప్రారంభించిన రైల్ కౌశల్ వికాస్ యోజన ఉద్దేశం?
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్... రైల్ కౌశల్ వికాస్ యోజనను సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలో రైల్ భవన్‌లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మూడేళ్ల పాటు 50 వేల మంది యువతకు ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, ఫిట్టర్ తదితర నాలుగు ట్రేడ్‌లలో నైపుణ్య శిక్షణ అందించనున్నట్టు మంత్రి అశ్విని తెలిపారు. దేశవ్యాప్తంగా 75 రైల్వే శిక్షణ కేంద్రాల్లో పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణను అందించనున్నట్టు పేర్కొన్నారు.
బైజూస్, నీతి ఆయోగ్ జోడీ
ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ తాజాగా నీతి ఆయోగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బైజూస్ అభివృద్ధి చేసిన అభ్యాస కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 112 వెనుకబడిన జిల్లాల్లోని విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. నీట్, జేఈఈ లక్ష్యంగా చదువుతున్న 3,000 మంది ప్రతిభావంతులైన 11, 12వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తారు.
చదవండి: రాజా ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా రైల్ కౌశల్ వికాస్ యోజన ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ఎక్కడ : రైల్ భవన్, న్యూఢిల్లీ
ఎందుకు : యువతకు రైల్వే పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణను అందించేందుకు...