Ganesh Sculpture: 13వ శతాబ్దానికి చెందిన అతి చిన్న రాతి వినాయక విగ్రహం
కాకతీయుల కాలానికి చెందిన వినాయకుడి అతి చిన్న రాతి విగ్రహం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుప యుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున్న బౌద్ధ స్థూప శిథిలాలను పరిశీలిస్తుండగా.. ఈ విగ్రహం లభించిందని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు.'కాకతీయుల కాలం 13వ శతాబ్దానికి చెందిన ఈ రాతి విగ్రహం 4 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. తలపైన కాకతీయ శైలి జటామకుటం, ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం, చేతుల్లో దంతం, మోదకం, బొజ్జమీదుగా నాగయజ్ఞోపవీతం ఉన్న ఈ వినాయకుడు లలితాసన భంగిమలో కూర్చుని ఉన్నాడు. మెత్తడి రాతితో చెక్కిన ఈ విగ్రహం అప్పట్లో ఇళ్లలో పూజలందుకుని ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP