Skip to main content

100 Kisan Drones: దేశంలోని ఎన్ని ప్రాంతాల్లో కిసాన్‌ డ్రోన్‌లను ప్రారంభించారు?

KIsan Drones

పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్‌ డ్రోన్‌’లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని 100 ప్రాంతాల్లో ఒకేసారి ఢిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఫిబ్రవరి 18న ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. డ్రోన్‌ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్‌ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రానున్న రోజుల్లో రైతులు తమ పంటను తక్కువ సమయంలోనే డ్రోన్ల సాయంతో మార్కెట్లకు తరలించవచ్చు. ఆదాయం పెరుగుతుంది. 21వ శతాబ్దిలో అధునాతన సాగు విధానాల్లో డ్రోన్‌ అనే కొత్త అధ్యాయం మొదలైంది.’’ అని పేర్కొన్నారు.

2022–23 బడ్జెట్‌లో..

వ్యవసాయ రంగంలో కిసాన్‌ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు  ‘‘కేంద్ర బడ్జెట్‌ 2022–23’’లో ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... పంటల మదింపు, పురుగుల మందుల పిచికారీ, ఎరువులు జల్లడం వంటివన్నీ కిసాన్‌ డ్రోన్లు చేస్తాయి. వ్యవసాయ రంగం మరింత పారదర్శకంగా ఉండేందుకు భూ రికార్డుల్ని డిజిటలైజేషన్‌కి కూడా డ్రోన్ల సాయంతో చేస్తారు. ఇక డ్రోన్‌ శక్తి కార్యక్రమాన్ని మరింత శక్తిమంతంగా అమలు చేయడానికి స్టార్టప్‌లు ఏర్పాటు చేయనున్నారు.

చ‌ద‌వండి: నేషనల్‌ డామ్‌ సేఫ్టీ అథారిటీ కార్యాలయం ఎక్కడ ఉంది?

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
దేశంలోని 100 ప్రాంతాల్లో కిసాన్‌ డ్రోన్‌ల ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  
ఎందుకు : పంట భూముల్లో పురుగుల మందుల పిచికారీ, ఎరువులు జల్లడం వంటి వాటి కోసం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Feb 2022 12:41PM

Photo Stories