National Family Health Survey: దేశంలో 54శాతం మహిళలకే సొంత సెల్‌ఫోన్
Sakshi Education
దేశంలోని మహిళలు సెల్‌ఫోన్ల వినియోగంలో వివక్ష ఎదుర్కొంటున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ ఎఫ్‌హెచ్‌ఎస్)–5 వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,24,115 మంది మహిళలను ఇంటర్వ్యూ చేస్తే అందులో సగంమంది మాత్రమే తమకు ప్రత్యేకంగా సెల్‌ఫోన్ ఉందని చెప్పారు. మహిళా సాధికారత అన్వేషణలో భాగంగా 15–49ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఉపాధి, సంపాదనపై నియంత్రణ, యాజమాన్య హక్కులు, మొబైల్ ఫోన్ వినియోగంపై 2019–21 మధ్యకాలంలో ఈ సర్వే నిర్వహించారు. ఎన్ ఎఫ్‌హెచ్‌ఎస్–5 సర్వేలో సొంత సెల్‌ఫోన్లు వినియోగిస్తున్న మహిళల్లో గోవా అగ్రస్థానంలో నిలవగా.. మధ్యప్రదేశ్ చివరి స్థానంలో ఉంది.
PMJJBY: పీఎం జీవన్ జ్యోతి, సురక్ష బీమా... ప్రీమియం పెంపు
Published date : 07 Jun 2022 06:29PM