Election Commissioners: ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొత్త వ్యవస్థ
Sakshi Education
ఎన్నికల కమిషనర్ల నియామకాలకు కొత్త వ్యవస్థను ప్రకటిస్తూ.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఎన్నికల సంఘంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలను ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో కొత్త చట్టం తీసుకొచ్చే వరకు ఈసీల నియామకాలు ఇలాగే జరగాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 5–0 మెజార్టీతో ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Mar 2023 05:03PM