Time magazin: టైమ్ ‘అద్భుత ప్రాంతాల జాబితా’లో లడఖ్, మయూర్ భంజ్
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన 50 ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి లడఖ్, మయూర్ భంజ్‌లకు చోటు కల్పించింది. అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం.. ఇవన్నీ కలగలిసిన ప్రాంతాలు ఇవి. ఇక్కడి మంచుకొండలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. ‘అక్కడి వాతావరణాన్ని అనుభూతి చెందడానికి పదేపదే లడఖ్ వెళ్లాలి’ అని టైమ్స్ కీర్తించింది. ‘ఇక మయూర్ భంజ్ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు నిలయం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’ ఇది అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్లో మయూర్ భంజ్లో జరిగే ’చౌ’ డ్యాన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతోపాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్ పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP