INS Satpura: ఆస్ట్రేలియాలో ఐఎన్‌ఎస్ సాత్పురా పరాక్రమం
Sakshi Education
ఆస్ట్రేలియాలో జరిగిన మల్టీనేషన్ ఎక్స్ కాకడు సముద్ర విన్యాసాల్లో భారత నావికాదళం నుంచి పాల్గొన్న ఐఎన్‌ఎస్ సాత్పురా యుద్ధనౌక తన పరాక్రమాన్ని ప్రదర్శించింది.
రాయల్ ఆస్ట్రేలియన్ నేవీతో కలిసి చేసిన విన్యాసాల్లో సాత్పురా.. యాంటీ సబ్‌మెరైన్, యాంటీ–షిప్ వార్‌ఫేర్ విన్యాసాలతో పాటు కచ్చితమైన లక్ష్యాన్ని నాశనం చేసే సామర్థ్యాన్ని తెలియజెప్పింది. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇరు దేశాల నావికాదళాల పరిజ్ఞాన మార్పిడికి ఈ విన్యాసాలు దోహదపడతాయని నౌకాదళ అధికారులు చెప్పారు.
Published date : 23 Sep 2022 05:33PM