Suicidal: బలవన్మరణాల్లో మహారాష్ట్ర టాప్
Sakshi Education
బలవన్మరణాల సంఖ్య మహారాష్ట్రలో చాలా ఎక్కువగా ఉంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వృత్తి సమస్యలు, ఒంటరితనం, హింస, కుటుంబ, మానసిక సమస్యలు, మద్యానికి బానిసకావడం, ఆర్థికంగా కుంగుబాటు, అనారోగ్యం.. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని నేర గణాంకాల బ్యూరో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది, కర్ణాటకలో 13,056 మంది సూసైడ్ చేసుకున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో సగానికిపైగా మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలోనే జరిగాయి. 53 నగరాల్లో మొత్తంగా 25వేల మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Sep 2022 06:57PM