ఏప్రిల్ 2021 జాతీయం
Sakshi Education
కరోనా టీకా సంస్థలకు అడ్వాన్స్
దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ల సరఫరాను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ), భారత్ బయోటెక్ తదితర టీకాల తయారీ సంస్థలకు భవిష్యత్‌లో సరఫరా చేయబోయే వ్యాక్సిన్లకు సంబంధించి రూ. 4,500 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఎస్‌ఐఐకి రూ. 3,000 కోట్లు, భారత్ బయోటెక్‌కు సుమారు రూ. 1,500 కోట్లు లభిస్తాయి. క్రెడిట్ లైన్ రూపంలో ఇచ్చే ఈ నిధులకు కేబినెట్ ఆమోదం అవసరం లేదు. ఆర్థిక మంత్రి ఆమోదం ఉంటే సరిపోతుంది.
సంభవ్ సదస్సులో గడ్కరీ...
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహించిన సంభవ్ సదస్సులో కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలను వచ్చే ఆరు నెలల్లో దేశీయంగానే పూర్తి స్థాయిలో తయారీ చేయగలమని గడ్కరీ చెప్పారు.
డబ్ల్యూఈఎఫ్ ఆవిష్కరించిన ఇంధన సూచీలో భారత్ ర్యాంకు
ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్‌తో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన ఇంధన సూచీ(ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్–ఈటీఐ) ఏప్రిల్ 21న విడుదలైంది. 115 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో భారత్ 87వ ర్యాంకు దక్కించుకుంది. ఈ సూచీలో పశ్చిమ, ఉత్తరాది యూరప్ దేశాలు టాప్ 10లో నిల్చాయి. స్వీడన్ అగ్రస్థానంలో ఉండగా, నార్వే (2), డెన్మార్క్ (3) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
మూడో వంతు భారత్, చైనాదే...
అంతర్జాతీయంగా ఇంధన డిమాండ్‌లో మూడో వంతు చైనా (68వ స్థానం), భారత్‌దే ఉంటోందని ఈటీఐ పేర్కొంది. ఇప్పటికీ బొగ్గు వినియోగం కాస్త ఎక్కువే ఉంటున్నప్పటికీ పర్యావరణహిత ఇంధనాల విషయంలో గడిచిన దశాబ్ద కాలంగా రెండు దేశాలు గణనీయమైన పురోగతి సాధించాయని వివరించింది. ఆర్థిక వృద్ధి, పర్యావరణ హితం, ఇంధన భద్రత కోణాల్లో వివిధ దేశాల ఇంధన వ్యవస్థల ప్రస్తుత పనితీరును.. మెరుగైన విధానాల వైపు మళ్లేందుకు సంసిద్ధతను ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకున్నారు.
అత్యంతవేగంగా కోవిడ్–19 వ్యాక్సినేషన్ చేపట్టిన దేశం?
కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల కోవిడ్–19 టీకా డోసులు వేయడం ద్వారా అత్యంతవేగంగా వ్యాక్సినేషన్ చేపట్టిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 13 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసేందుకు అమెరికాకు 101 రోజులు, చైనాకు 109 రోజులు పట్టాయని వివరించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ఏప్రిల్ 21న ఉదయం 7 గంటల వరకు 19,01,413 సెషన్లలో 13,01,19,310 డోసుల టీకా అందజేసినట్లు వెల్లడించింది.
కోవిషీల్డ్ ధర నిర్ణయం...
రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే కరోనా ‘కోవిషీల్డ్’ టీకా ధరలను పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రకటించింది. ప్రభుత్వాలకు సరఫరా చేసే టీకా ధర రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర రూ.600గా ఉంటుందని ఆ సంస్థ సీఈఓ అదార్ సి.పూనావాలా ఏప్రిల్ 21న వెల్లడించారు. 2021, మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిటన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు అభివృద్ధి చేసిన కోవిడ్–19 ‘‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది.
కరోనా టీకా ఉత్సవాలను ఏ తేదీల్లో నిర్వహించనున్నారు?
దేశంలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏప్రిల్ 8న వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులను కోరారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విధిస్తున్న నైట్ కర్ఫ్యూ పేరును ‘కరోనా కర్ఫ్యూ’గా పేర్కొనాలని సూచించారు. అలాగే 2021, ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు టీకా ఉత్సవం నిర్వహించాలని, తద్వారా అర్హులైన వారికి పెద్ద సంఖ్యలో టీకా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11 సామాజిక సంస్కర్త జ్యోతిరావు ఫులే జయంతి అని ప్రధాని గుర్తు చేశారు. టీకా ఇచ్చేందుకు నిర్ధారించిన 45 ఏళ్ల వయో పరిమితిని ప్రధాని సమర్ధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021, ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు టీకా ఉత్సవం నిర్వహించాలి
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు
ఎన్‌ఐఏ దక్షిణ మండల కార్యాలయం ఎక్కడ ప్రారంభమైంది?
దక్షిణాది రాష్ట్రాల తీవ్రవాద కార్యకలాపాల కట్టడి, కేసుల నమోదు, దర్యాప్తునకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దక్షిణ మండల కార్యాలయాన్ని ఏప్రిల్ 8న చెన్నైలో ప్రారంభించారు. కార్యాలయ సూపరింటెండెంట్‌గా అస్సాంకు చెందిన ఐపీఎస్ అధికారి శ్రీజిత్ బాధ్యతలు చేపట్టారు. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ఎన్‌ఐఏ ప్రధానపాత్ర పోషిస్తోంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ...
ఏర్పాటు: 2009
ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ
ఎన్‌ఐఏ ప్రస్తుత డైరెక్టర్ జనరల్: యోగేశ్ చందర్ మోదీ
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దక్షిణ మండల కార్యాలయం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : దేశంలో తీవ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకోనేందుకు
రెమిడెసివర్ ఇంజెక్షన్‌ను ఏయే వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు?
కోవిడ్–19 వ్యాధి చికిత్సలో వాడుతున్న రెమిడెసివర్ ఇంజెక్షన్లకు డిమాండ్ పెరగడంతో కేంద్రం వాటి ఎగుమతులపై నిషేధం విధించింది. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని పట్టి కుదిపేస్తున్న నేపథ్యంలో రెమిడెసివర్ వినియోగం అకస్మాత్తుగా పెరిగిపోయింది. ఎబోలా చికిత్సకు వాడే ఈ యాంటీ వైరల్ ఇంజెక్షన్ కరోనాని అరికట్టడంలో కూడా సత్ఫలితాలనే ఇస్తోంది. రెమిడెసివర్ ఇంజక్షన్, రెమిడెసివర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ) ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టుగా ఏప్రిల్ 11న కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెమిడెసివర్ ఇంజక్షన్, రెమిడెసివర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ) ఎగుమతులపై నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్–19 వ్యాధి చికిత్సలో వాడుతున్న రెమిడెసివర్ ఇంజెక్షన్లకు డిమాండ్ పెరగడంతో
ఎంఎన్‌ఎల్‌యూ అకడమిక్ బిల్డింగ్ ప్రారంభం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ఏప్రిల్ 14న నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ఎంఎన్‌ఎల్‌యూ) అకడమిక్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్నారు. సంస్కృత భాషను భారతదేశ అధికార జాతీయ భాషగా ప్రకటించాలని డాక్టర్ అంబేడ్కర్ ప్రతిపాదించారని జస్టిస్ బాబ్డే చెప్పారు.
అమరులకు నివాళి...
జలియన్ వాలాబాగ్ అమరులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 1919 ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్‌లోని జలియన్ వాలాబాగ్‌లో ఏర్పాటైన సమావేశానికి హాజరైన ప్రజలపై బ్రిటిష్ జనరల్ డయ్యర్ నేతృత్వంలో సైనికులు విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో వందలాది మంది నిరాయుధులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ ప్రసంగం...
అహ్మదాబాద్‌లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహించిన ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’ 95వ వార్షిక సమావేశం, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ల జాతీయ సెమినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ఏప్రిల్ 13న ప్రసంగించారు. అంబేద్కర్‌పై కిశోర్ మాక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు.
సాగులో సాంకేతికత వినియోగంపై ఏ సంస్థతో కేంద్రం ఒప్పందం చేసుకుంది?
ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో వ్యవసాయంలో సాంకేతికత వినియోగంపై ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ సాయం అందించనుంది. ఈ మేరకు ఆ సంస్థతో కేంద్ర వ్యవసాయశాఖ ఏప్రిల్ 14న ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయానికి సాంకేతికత తోడైతే రైతులు మరింత లబ్ధి పొందుతారని, ఈ తరం వారు కూడా వ్యవసాయం పట్ల ఆకర్షితులవుతారని అనే అనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన మేరకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.
ఒప్పందం ప్రకారం... దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు.. ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌ల్లోని 100 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులో మైక్రోసాఫ్ట్ స్థానిక భాగస్వామి కార్ప్‌డాటాతో కలసి భాగస్వామ్యమైంది. ఈ మేరకు థర్డ్‌పార్టీ ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సాగులో సాంకేతికత వినియోగంపై ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్
ఎందుకు : వ్యవసాయానికి సాంకేతికత తోడైతే రైతులు మరింత లబ్ధి పొందుతారని...
రష్యాకి చెందిన ఏ టీకా వినియోగానికి భారత్ అనుమతి ఇచ్చింది?
రష్యా తయారీ స్పుత్నిక్ టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)నుంచి తమకు అనుమతి లభించిందని ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏప్రిల్ 13న తెలిపింది. తాజా పరిణామంతో ప్రస్తుతం కొనసాగుతున్న దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు తోడు మూడో టీకా స్పుత్నిక్ రానుంది.
కొన్ని వివరాలు...
ఏమిటి : స్పుత్నిక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు అనుమతి
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)
ఎందుకు : భారత్‌లో అత్యవసర వినియోగానికి...
రహదారుల నిర్మాణ వేగవంతంలో భారత్ ప్రపంచ రికార్డు
వేగవంతంగా రహదారుల నిర్మాణంలో భారత్ గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) ప్రపంచ రికార్డు సాధించిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రిల్ 2న తెలిపారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకూ 13,394 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిపిందనీ, రోజూవారీ సగటు 37 కిలోమీటర్లని ఆయన వివరించారు. తాను రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి రోజుకు 2 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం మాత్రమే ఉండేదని పేర్కొన్నారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
ఏ ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశారు?
భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కోవాగ్జిన్’ అనే కోవిడ్–19 టీకాను అభివృద్ధి చేసింది. కోవాగ్జిన్ టీకా మూడో డోసు క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది. కొందరు వాలంటీర్లపై మూడో డోసును ప్రయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఏప్రిల్ 2న భారత్ బయోటెక్ సంస్థకు అనుమతినిచ్చింది. 6 ఎంసీజీల మోతాదులో బూస్టర్ డోస్(మూడో డోసు) ఇవ్వాలని భారత్ బయోటెక్‌కు సూచించింది. ప్రస్తుతం డీసీజీఐ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ వీజీ సోమాని ఉన్నారు.
టీకా ఎగుమతులపై నిషేధం లేదు...
కోవిడ్ టీకాలపై నిషేధం విధించలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం చేపట్టిన ‘వ్యాక్సిన్ మైత్రి’ విధానం ప్రపంచదేశాల ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా సాగుతోందని వివరించింది. విదేశాలకు అందజేసిన 6.40 కోట్ల డోసుల్లో 1.04 కోట్ల డోసులు గ్రాంట్‌గాను, 3.57 కోట్ల డోసులు వాణిజ్య విధానంలోనూ, 1.82 కోట్ల డోసులు కోవాక్స్ విధానం కింద సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని ఎక్కడ నిర్మిస్తున్నారు?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు(యూఎస్‌బీఆర్‌ఎల్ ప్రాజెక్టు)లో భాగంగా చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఈ వంతెనకి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం ఏప్రిల్ 5న పూర్తయిందని భారతీయ రైల్వే ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని తెలిపింది. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా పీయూష్ గోయల్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా అశుతోష్ అగర్వాల్ ఉన్నారు.
వంతెన ప్రత్యేకతలు
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : చీనాబ్ నది, జమ్మూకశ్మీర్
ఎందుకు : కశ్మీర్ లోయను మిగతా దేశంతో కలపడానికి వీలుగా
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు తొలుత ఎక్కడ ప్రారంభమయ్యాయి?
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దండి గ్రామంలో ఏర్పాటు చేసిన 25 రోజుల ‘దండి మార్చి’ఉత్సవాల ముగింపు సభలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. దండి మార్చ్ ఉత్సవంలో 25 రోజుల్లో 385 కిలోమీటర్ల దూరాన్ని నడిచిన 81 మంది వలంటీర్లను ఉపరాష్ట్రపతి అభినందించారు. గుజరాత్‌లోని నవసరీ జిల్లా జలాల్‌పూర్ తాలూకాలో దండి గ్రామం ఉంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా... ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 ప్రాంతాల్లో 75 వారాలపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను మార్చి 12న తొలుత గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సమీపంలోని సబర్మతీ ఆశ్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2022 ఆగస్టు 15 వరకూ వేడుకలు కొనసాగుతాయి.

- స్పుత్నిక్ వినియోగానికి అనుమతులిచ్చిన 60వ దేశం భారత్ అని రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) తెలిపింది.
- కరోనా వైరస్‌పై స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది.
- భారత్‌లో స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్‌తోపాటు ఉత్పత్తి చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌తో 2020 ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది.
- భారత్‌లో ఏడాదికి 850 మిలియన్ డోసుల స్పుత్నిక్ టీకాను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా... గ్లాండ్ ఫార్మా, హెటిరో, బయోఫార్మా, పనాసియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ వంటి ప్రముఖ సంస్థలతో ఆర్‌డీఐఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఏమిటి : స్పుత్నిక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు అనుమతి
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)
ఎందుకు : భారత్‌లో అత్యవసర వినియోగానికి...
రహదారుల నిర్మాణ వేగవంతంలో భారత్ ప్రపంచ రికార్డు
వేగవంతంగా రహదారుల నిర్మాణంలో భారత్ గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) ప్రపంచ రికార్డు సాధించిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రిల్ 2న తెలిపారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకూ 13,394 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిపిందనీ, రోజూవారీ సగటు 37 కిలోమీటర్లని ఆయన వివరించారు. తాను రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి రోజుకు 2 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం మాత్రమే ఉండేదని పేర్కొన్నారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
- వేగవంతమైన రహదారుల నిర్మాణంతోసహా మొత్తం మూడు అంశాల విషయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులను భారత్ నమోదు చేసింది.
- 2014 ఏప్రిల్ నాటికి భారత్ రహదారుల నిర్మాణం 91,287 కిలోమీటర్లు ఉంటే, 2021 మార్చి 20 నాటికి ఈ పొడవు 1,37,625 కిలోమీటర్లకు చేరింది.
- 2014–15లో రహదారుల నిర్మాణానికి కేటాయింపులు రూ.33,414 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధుల పరిమాణం 5.5 రెట్టు పెరిగి రూ.1,83,101 కోట్లకు ఎగసింది.
- భారత్‌మాల పరియోజన బృహత్తర ప్రణాళిక కింద దాదాపు రూ.5.35 లక్షల కోట్లతో 34,800 కిలోమీటర్ల నిర్మాణం కేంద్రం లక్ష్యం.
ఏ ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశారు?
భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కోవాగ్జిన్’ అనే కోవిడ్–19 టీకాను అభివృద్ధి చేసింది. కోవాగ్జిన్ టీకా మూడో డోసు క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది. కొందరు వాలంటీర్లపై మూడో డోసును ప్రయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఏప్రిల్ 2న భారత్ బయోటెక్ సంస్థకు అనుమతినిచ్చింది. 6 ఎంసీజీల మోతాదులో బూస్టర్ డోస్(మూడో డోసు) ఇవ్వాలని భారత్ బయోటెక్‌కు సూచించింది. ప్రస్తుతం డీసీజీఐ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ వీజీ సోమాని ఉన్నారు.
టీకా ఎగుమతులపై నిషేధం లేదు...
కోవిడ్ టీకాలపై నిషేధం విధించలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం చేపట్టిన ‘వ్యాక్సిన్ మైత్రి’ విధానం ప్రపంచదేశాల ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా సాగుతోందని వివరించింది. విదేశాలకు అందజేసిన 6.40 కోట్ల డోసుల్లో 1.04 కోట్ల డోసులు గ్రాంట్‌గాను, 3.57 కోట్ల డోసులు వాణిజ్య విధానంలోనూ, 1.82 కోట్ల డోసులు కోవాక్స్ విధానం కింద సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని ఎక్కడ నిర్మిస్తున్నారు?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు(యూఎస్‌బీఆర్‌ఎల్ ప్రాజెక్టు)లో భాగంగా చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఈ వంతెనకి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం ఏప్రిల్ 5న పూర్తయిందని భారతీయ రైల్వే ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని తెలిపింది. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా పీయూష్ గోయల్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా అశుతోష్ అగర్వాల్ ఉన్నారు.
వంతెన ప్రత్యేకతలు
- కశ్మీర్ లోయను మిగతా దేశంతో కలపడానికి వీలుగా రైల్వేశాఖ రూ.27,949 కోట్లతో ఉధంపుర్–శ్రీనగర్–బారాముల్లా రైల్వే ప్రాజెక్టు చేపడుతోంది. అందులో భాగంగా రూ.1,486 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మిస్తోంది.
- వంతెన పొడవు: 1.315 కిలోమీటర్లు.
- పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ 35 మీటర్ల ఎత్తులో ఉంది.
- చీనాబ్ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది.
- 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి.
- 2017 నుంచి వంతెనపై ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్ టన్నులు.
- 28660 మెట్రిక్ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు.
- 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా వంతెనను డిజైన్ చేశారు.
- నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్ చేశారు.
- నిర్మాణంలో వినియోగించిన స్టీల్ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు.
- అర్ధచంద్రాకారంలో ఉండే ఈ ఉక్కు వంతెన నిర్మాణం.. భారతీయ రైల్వే ఎదుర్కొన్న అతిపెద్ద సివిల్ ఇంజినీరింగ్ సవాల్.
- వంతెనలో ప్రధానమైన ఆర్చి 467 మీటర్లు ఉంటుంది. దానిపైన వంతెన పొడవు 1,315 మీటర్లు ఉంటుంది.
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : చీనాబ్ నది, జమ్మూకశ్మీర్
ఎందుకు : కశ్మీర్ లోయను మిగతా దేశంతో కలపడానికి వీలుగా
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు తొలుత ఎక్కడ ప్రారంభమయ్యాయి?
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దండి గ్రామంలో ఏర్పాటు చేసిన 25 రోజుల ‘దండి మార్చి’ఉత్సవాల ముగింపు సభలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. దండి మార్చ్ ఉత్సవంలో 25 రోజుల్లో 385 కిలోమీటర్ల దూరాన్ని నడిచిన 81 మంది వలంటీర్లను ఉపరాష్ట్రపతి అభినందించారు. గుజరాత్‌లోని నవసరీ జిల్లా జలాల్‌పూర్ తాలూకాలో దండి గ్రామం ఉంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా... ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 ప్రాంతాల్లో 75 వారాలపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను మార్చి 12న తొలుత గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సమీపంలోని సబర్మతీ ఆశ్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2022 ఆగస్టు 15 వరకూ వేడుకలు కొనసాగుతాయి.
Published date : 16 Apr 2021 05:18PM