Computer Science: భారత్‌లో ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రాం చేపట్టనున్న సంస్థ?
భారత్‌లో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఎఫ్‌ఈ) ప్రోగ్రాంను చేపట్టాలని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్ణయించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ (సీఎస్) విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పొందేందుకు సాయం చేస్తారు. తొలి ఏడాది లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, హరియణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను ఎంపిక చేస్తారు.
6–12 తరగతి విద్యార్థులకు...
అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమంలో భాగంగా 6–12 తరగతి విద్యార్థులకు బోధన ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ కోర్సులను భారతీయ భాషల్లో బోధిస్తారు. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు. కార్యక్రమ అమలు కోసం లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. భారత్‌లో నాణ్యమైన సీఎస్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్ పార్ట్‌నర్ కోడ్.ఓఆర్‌జీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ పనిచేస్తోంది.
చదవండి: కేంద్రం ప్రారంభించనున్న ఆపద మిత్ర కార్యక్రమం ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఎఫ్‌ఈ) ప్రోగ్రాంను చేపట్టనున్న సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్
ఎక్కడ : భారత్
ఎందుకు : వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ (సీఎస్) విద్యను అందించేందుకు...