UNESCO: భారత్‌లో మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు
Sakshi Education
భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే మొధెరా సూర్యదేవాలయం, చారిత్రక నగరం వద్ నగర్, ఈశాన్య రాష్ట్రాల ఆన్ కోర్ వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది. ఇందులో వద్‌నగర్ ప్రధాని మోదీ స్వస్థలం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం ఆరు చారిత్రక ప్రదేశాలు భారత్ నుంచి వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 30 Dec 2022 04:56PM