NSO Group: పెగాసస్ స్పైవేర్‌పై ఆంక్షలు విధించిన దేశం?
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపు తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో పాటు నిఘా పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్‌కే చెందిన మరో సంస్థ ‘కాండిరూ’ను నియంత్రిత సంస్థల జాబితాలో చేరుస్తున్నట్లు అమెరికా వాణిజ్యశాఖ నవంబర్ 3న ప్రకటించింది. ఈ సంస్థల ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అణచివేతకు దారితీశాయని జో బైడెన్ సర్కారు పేర్కొంది. నియంత్రిత సంస్థల జాబితాలో చేరిస్తే... ఈ సంస్థలకు అమెరికా కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానం, విడిభాగాలు, పరికరాలు లభించడం కష్టతరమవుతుంది. ఈ సంస్థలకు ఎగుమతులు చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనసరి కానుంది.
పెగాసస్ స్పైవేర్ ద్వారా విపక్షనేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై భారత్‌తోసహా దాదాపు 50 దేశాల్లో నిఘా పెట్టారని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం బయటపెట్టిన విషయం తెలిసిందే.
చదవండి: భారత్ ప్రారంభించిన ఐరిస్ కార్యక్రమ ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఎస్‌ఓ గ్రూపు తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌పై ఆంక్షలు విధించిన దేశం?
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : అమెరికా
ఎక్కడ : అమెరికా
ఎందుకు : ఎన్‌ఎస్‌ఓ గ్రూపు ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అణచివేతకు దారితీశాయని...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్