Skip to main content

Liz Truss: ట్రస్‌కు ఏటా రూ.కోటి!

లండన్‌: బ్రిటన్‌ ప్రధానిగా పని చేసింది కేవలం 45 రోజులే. అయితేనేం... మాజీ ప్రధాని హోదాలో లిజ్‌ ట్రస్‌ జీవితాంతం ఏటా ఏకంగా 1.15 లక్షల పౌండ్లు రూ.1,06,36,463) పెన్షన్‌గా అందుకోనున్నారు.
Liz Truss to get Rs 1 crore payout every year
Liz Truss to get Rs 1 crore payout every year

ప్రజా జీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు ఆర్థిక సాయం నిమిత్తం ఏర్పాటు చేసిన పబ్లిక్‌ డ్యూటీ కాస్ట్స్‌ అలవెన్సుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 1990లో బ్రిటన్‌ తొలి మహిళా ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ రాజీనామా అనంతరం ఈ అలవెన్సును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏకంగా ఆరుగురు బ్రిటన్‌ మాజీ ప్రధానులు ఈ అలవెన్సు పొందుతున్నారు! ట్రస్‌తో కలిపి ఏడుగురు మాజీ పీఎంల అలవెన్సుల రూపంలో ఏటా ఖజానాపై పడే భారం 8 లక్షల పౌండ్లు.

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 22 Oct 2022 01:07PM

Photo Stories