Skip to main content

Hippopotamus: బాలుడ్ని మింగిన హిప్పో..!

ఉగాండాలోని కబటోరోలో ఇంటికి దగ్గరలో ఉన్న సరస్సు వద్ద రెండేళ్ల వయసున్న పాల్‌ ఇగా ఆడుకుంటుండ‌గా అక్కడికి వచ్చిన నీటిఏనుగు(హిపోపాటమస్) ఆ బాలుడ్ని మింగేసింది.

అదే సమయంలో దారిన పోతున్న క్రిస్పస్‌ బగోంజా అనే వ్యక్తి అది చూసి చేతికందిన రాళ్లు తీసుకొని హిప్పోపై విసిరాడు. అంతే.. అందరూ అవాక్కయ్యేలా ఆ హిప్పో వెంటనే ఆ బాలుడ్ని సజీవంగానే కక్కేసింది. స్వల్ప గాయాలతో బాలుడు హిప్పో పొట్టలోంచి బయటకు వ‌చ్చాడు. వెంటనే ఆ బాలుడ్ని ఆస్పత్రికి తీసుకువెళ్లి యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్లు ఇచ్చి చికిత్స చేశారు. హిప్పో కడుపులోకి వెళ్లి తిరిగి రావడం అత్యంత అరుదైన ఘటనని చెబుతున్న ఉగాండా పోలీసులు ఆ బాలుడ్ని మృత్యుంజయుడిగా కీర్తించారు. 

Weekly Current Affairs (Sports) క్విజ్ (18-24 నవంబర్ 2022)

సింహం కంటే మూడు రెట్లు బలంగా..
నీటిఏనుగులు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్  ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి.

Mauna Loa: 38ఏళ్ల తర్వాత బద్దలైన మౌనాలోవా

Published date : 17 Dec 2022 01:12PM

Photo Stories