Hindu Temple: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయం అపవిత్రం
Sakshi Education
ఆస్ట్రేలియాలోని స్వామి నారాయణ్ మందిరంపై ఖలిస్తాన్ మద్దతుదారులు రంగులతో దాడిచేశారు. గోడలపై తమ హిందూ విద్వేషాన్ని చూపించారు.
ప్రధాని మోదీ వ్యతిరేక రాతలు రాశారు. మెల్‌బోర్న్ సమీపంలోని మిల్ పార్క్‌లోని స్వామి నారాయణ్ మందిరంపై జనవరి 12వ తేదీ కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు దాడిచేశారు. 1980లలో పంజాబ్‌లో స్వర్ణదేవాలయంలో దాక్కొన్న నాటి సిక్కు వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ ఉద్యమకారుడు దివంగత జర్నేల్ సింగ్ భింద్రావాలే ‘అమరుడు’, ప్రధాని మోదీ ఒక హిట్లర్ అంటూ నలుపు రంగుతో గ్రాఫిటీ చేశారు. భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ హిందుస్తాన్ ముర్దాబాద్ వంటివి రాశారు. దాడి ఘటనను ఆస్ట్రేలియాలోని భారతీయ హిందువులు, భారతీయ మూలాలున్న నేతలు తీవ్రంగా ఖండించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, ఎంపీలకు ఫిర్యాదుచేశారు.
Rishi Sunak: 2024లో రిషి గెలుపు కష్టమే!
Published date : 13 Jan 2023 03:13PM