Skip to main content

NASA: ఆర్టెమిస్‌ మళ్లీ ఆగింది

 చంద్రుడిపైకి పంపించేందుకు నాసా నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ఆర్టెమిస్‌ ప్రయోగం రెండోసారి వాయిదా పడింది.
Disappointment as NASA's Artemis launch cancelled again
Disappointment as NASA's Artemis launch cancelled again

 సెప్టెంబర్ 3 న మధ్యాహ్నం జరగాల్సిన ప్రయోగాన్ని భారీ ఇంధన లీకేజీ కారణంగా వాయిదా వేసినట్లు నాసా తెలిపింది. 322 అడుగుల ఎత్తైన ఈ భారీ రాకెట్‌లోకి 10 లక్షల గ్యాలన్ల ద్రవీకృత హైడ్రోజన్‌ ఇంధనాన్ని నింపే కార్యక్రమం మొదలైన కాసేపటికే ఇంధనం లీకవుతున్నట్లు గుర్తించారు. ఎంత ప్రయత్నించినా లీకేజీ ఆగకపోవడంతో ప్రయోగం వాయిదా పడింది. గత ఆగష్టు 29 న కూడా సెన్సార్ల లోపం, ఇంధన లీకేజీ వల్ల ప్రయోగం ఆఖరి క్షణంలో వాయిదా పడింది.

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: IFFM 2022లో "ఉత్తమ నటి అవార్డు" ఎవరు గెలుచుకున్నారు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 05 Sep 2022 06:52PM

Photo Stories