Skip to main content

Largest Iceberg: అతిపెద్ద ఐస్‌బర్గ్‌ అంతర్ధానం

అంటార్కిటికాలోని తీరప్రాంతంలో ఉన్న రొన్నే మంచు పలక నుంచి విడివడిన ఒక భారీ ఐస్‌బర్గ్‌ త్వరలోనే కనుమరుగు కానుంది.
The core of the largest iceberg

దీనిని ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ ఐస్‌బర్గ్‌ 2021 మేలో విడిపోయాక మరో మూడు ముక్కలైంది. ఎ–76ఎ గా పిలుస్తున్న దీని పొడవు 135 కిలోమీటర్లు కాగా వెడల్పు 26 కిలోమీటర్లు. లండన్‌ నగరానికి ఇది రెట్టింపు సైజులో ఉందని అమెరికా నేషనల్‌ ఐస్‌సెంటర్‌ వెల్లడించింది. ఇప్పటివరకు ఇది తన ఆకారాన్ని కోల్పోలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమధ్యరేఖ వైపు పయనించి అక్కడి సముద్ర జలాల వేడికి త్వరలోనే అంతర్థానం కానుందని అంటున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Dec 2022 05:00PM

Photo Stories