Brittney Griner: బ్రిట్నీ గ్రినర్‌ను విడుదల చేసిన రష్యా
Sakshi Education
అమెరికా, రష్యాలు ఖైదీల పరస్పర విడుదల ఒప్పందం కింద అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రినర్‌ను రష్యా విడుదల చేసింది.
బదులుగా ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్‌ను అమెరికా–రష్యాకు అప్పగించింది. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన గ్రినర్‌ను రష్యా పర్యటనలో ఉండగా మాదకద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు. శిక్షను ఖరారు చేసి జైలుకు పంపారు. ఆమెకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా బైడెన్ సర్కా రు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఖైదీల పరస్పర విడుదలకు రష్యాతో బేరసారాలు కొనసాగించింది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అబుదాబిలో గ్రినర్ ను అప్పగించి, విక్టర్ బౌట్‌ను స్వదేశానికి తీసుకువచ్చినట్లు రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.
Morality Police: ఇరాన్‌లో ‘నైతిక పోలీస్’ రద్దు
Published date : 09 Dec 2022 03:53PM