Union Budget 2022 Live Updates: పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మల
Union Budget 2022 Live Updates: కరోనా మహమ్మారి తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వృద్ధిరేటులో మనం ముందున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (మంగళవారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనాతో ప్రభావితమైన వ్యవస్థలన్నీ 2022–23 బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నాయి.
వరుసగా రెండోసారి..
కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్‌లో అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంది. పార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. వరుసగా రెండోసారి పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా, మేడ్ ఇన్ ఇండియా ట్యాబ్‌లో బడ్జెట్‌ను భద్రపరచినట్టు వెల్లడించారు. ట్యాబ్‌లో చూసి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పరిమిత సంఖ్యలోనే ప్రతులను ఆర్థికశాఖ ముద్రించింది.