ఫిబ్రవరి 2019 ఎకానమీ
Sakshi Education
పీఎఫ్‌పై తాజా వడ్డీ రేటు 8.65 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. పీఎఫ్ రేటును పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 2015-16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016-17లో 8.65 శాతానికి, అటుపై 2017-18లో అయిదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ తెలియజేశారు. ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం 6 కోట్ల పైచిలుకు చందాదారులున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.65 శాతం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్
ఎక్కడ : న్యూఢిల్లీ
స్టాంప్ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం
పన్నుల ఎగవేతను నిరోధించడంతో పాటు స్టాంప్ డ్యూటీ విధింపును క్రమబద్ధీకరించే సవరణలతో కూడిన ‘భారతీయ స్టాంపుల చట్టం 1899’కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ ఆమోదం తెలిపారు. ఫైనాన్స్ చట్టం 2019లో భాగంగా భారతీయ స్టాంపుల చట్టం 1899కు సవరణలను ప్రభుత్వం చేయగా, దీనికి పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు సెక్యూరిటీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లపై స్టాంప్ డ్యూటీ విధించుకునేందుకు వీలుగా వ్యవస్థాగత, చట్టబద్ధమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశాల మేరకు ఆర్టికల్ 263 కింద సమన్వయ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించినట్టు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టాంప్ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్
ఎందుకు : పన్నుల ఎగవేతను నిరోధించడంతో పాటు స్టాంప్ డ్యూటీ విధింపును
నిర్మాణంలోని ఇంటిపై జీఎస్టీ తగ్గింపు
నిర్మాణంలో ఉన్న ఇళ్లు, నిర్మాణం పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన (నిర్మాణం పూర్తయినట్లుగా) ధ్రువపత్రం ఇంకా రాని ఇళ్లు, అందుబాటు ధరల్లో వచ్చే ఇళ్ల (అఫోర్డబుల్ హౌసెస్) కొనుగోలుపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును జీఎస్టీ మండలి తగ్గించింది. ఢిల్లీలో ఫిబ్రవరి 24న జరిగిన 33వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తయినా ఆ మేరకు ధ్రువపత్రం ఇంకా రాని ఇళ్ల కొనుగోలుపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. వ్యాపారులకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కూడా ఇస్తున్నారు. తాజాగా ఈ కేటగిరీ ఇళ్లపై పన్నును జీఎస్టీ మండలి 5 శాతానికి తగ్గించింది. ఐటీసీని ఎత్తివేసింది. అలాగే అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల కొనుగోలుపై ప్రస్తుతం 8 శాతంగా ఉన్న జీఎస్టీని 1 శాతానికి జీఎస్టీ మండలి తగ్గించింది. అందుబాటు ధరల ఇల్లు అంటే ఏంటనే నిర్వచనాన్ని కూడా సవరించింది. కొత్త పన్ను రేట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి (2019, ఏప్రిల్ 1 నుంచి) అమలు కానున్నాయి.
అందుబాటు ధరలో ఇల్లు అంటే...
‘అందుబాటు ధర ఇల్లు’కి నిర్వచనాన్ని కూడా జీఎస్టీ మండలి ఫిబ్రవరి 24న సవరించింది. ఇకపై రూ. 45 లక్షల విలువ కలిగి ఉండి, దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-ఎంఎంఆర్, కోల్‌కతా) అయితే 60 చదరపు మీటర్ల కార్పెట్ వైశాల్యం, మిగతా ఏ ప్రాంతంలోనైనా అయితే 90 చదరపు మీటర్ల కార్పెట్ వైశాల్యం ఉన్న ఇళ్లను ఇకపై అందుబాటు ధరల్లోని ఇళ్లుగా పరిగణించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నిర్మాణంలోని ఇంటిపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : జీఎస్టీ మండలి
చలామణి లోకి నూతన సిరీస్ వంద నోటు
త్వరలో నూతన సిరీస్ రూ.100 నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఫిబ్రవరి 26న ప్రకటించింది. కొత్త సిరీస్ వంద నోటుపై ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని పేర్కొంది. ఈ నోటు ప్రస్తుతం చెలామణిలో ఉన్నటువంటి రూ.100 నోటు మాదిరిగానే ఉంటుందని అయితే, ఒక్క సిరీస్‌లోనే నూతనత్వం ఉండనుందని వివరించింది. నూతన నోటుతో పాటు పాత నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని ఆర్‌బీఐ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చలామణి లోకి నూతన సిరీస్ వంద నోటు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
భారత్ బయోటెక్ చేతికి బెహరింగ్ వ్యాక్సిన్స్
గ్లాక్సోస్మిత్‌క్లిన్ (జీఎస్‌కే) ఏషియాకు చెందిన చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్స్ ను హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు రూపంలో 100 శాతం వాటాను దక్కించుకోనుంది. ఈ మేరకు హైదరాబాద్ లో ఫిబ్రవరి 15న ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. చిరోన్ బెహరింగ్‌కు గుజరాత్‌లోని అంకళేశ్వర్‌లో రేబిస్ టీకా తయారీ కేంద్రం ఉంది. దీని వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల మోతాదులు (డోస్‌లు), కాగా భారత్ బయోటెక్ రేబిస్ టీకా ప్లాంట్ సామర్థ్యం కోటి డోస్‌లు.
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రీ-అప్రూవ్‌డ అనుమతి పొందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్ ను 70 దేశాల్లో మార్కెట్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 16 వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్స్ కొనుగోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత్ బయోటెక్
కేంద్రానికి 28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి) కేంద్రప్రభుత్వానికి రూ. 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ఫిబ్రవరి 18న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది.
క్లుప్తంగా వివరాలు...
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రానికి 28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
వృద్ధి వేగంలో పదేళ్లు భారత్‌దే పైచేయి: ఆక్స్ ఫర్డ్
న్యూఢిల్లీ: వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకూ భారత్‌దే పైచేయని ఆక్స్ ఫర్డ్ ఎకనమిక్స్ విభాగం రూపొందించిన ఒక నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రూపొందిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
ఏమిటి : వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకూ భారత్‌దే పైచేయి..
ఎందుకు : భారత్ వృద్ధి రేటు
రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారడంతోపాటు ఈఎంఐల భారం తగ్గనుంది. 18 నెలల తర్వాత మళ్లీ ఆర్‌బీఐ వడ్డీ రేటను తగ్గించడం ఇదే తొలిసారి.
పాలసీ ముఖ్యాంశాలు...
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెపో రేటు, రివర్స్ రెపో రేటు పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారత వృద్ధి రేటు అంచనాలు సవరణ
2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను కేంద్రం ప్రభుత్వం జనవరి 31న సవరించింది. ఈ మేరకు ఇంతకు ముందు 6.7 శాతం వృద్ధి అంచనా వేయగా.. దాన్ని 7.2 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. వాస్తవ జీడీపీ లేదా 2011-12 ధరల వద్ద జీడీపీ 2016-17లో రూ.122.98 లక్షల కోట్లు, 2017-18లో రూ.131.80 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ఫలితంగా వృద్ధి వరుసగా 7.2 శాతం, 8.2 శాతం చొప్పున పెరిగిందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదు కావొచ్చని 2018, మేలో సీఎస్‌ఓ ముందస్తు అంచనాల్లో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలు సవరణ
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

- ఆర్‌బీఐ జూలై - జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. దీనిప్రకారం 2018 జూలై నుంచి 2019 జూన్ నెలాఖరు వరకూ ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది.
- 2018 ఆగస్టులో (తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరిధిలోనికి వచ్చే) ఆర్‌బీఐ ఒక ప్రకటన చేస్తూ, 2017-18కి సంబంధించి కేంద్రానికి రూ.50,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 40 వేల కోట్లు మిగులు నిధులుకాగా, 10 వేల కోట్లు మధ్యంతర డివిడెండ్.
- ఇక తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018 జూలై-2019 జూన్) సంబంధించి రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఇస్తున్నట్లు తాజాగా ఫిబ్రవరి 18న పేర్కొంది.
- దీనితో కేంద్రానికి సంబంధించినంతవరకూ ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్-2019 మార్చి) ఆర్‌బీఐ నుంచి మొత్తం రూ.78,000 కోట్లు అందినట్లవుతోంది.
- ఇలా మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఆర్‌బీఐ ఇవ్వడం ఇది వరుసగా రెండవ సంవత్సరం. 2017-18లో ప్రభుత్వానికి ఆర్‌బీఐ నుంచి అందిన మొత్తం డివిడెండ్ రూ.30,663 కోట్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రానికి 28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
వృద్ధి వేగంలో పదేళ్లు భారత్‌దే పైచేయి: ఆక్స్ ఫర్డ్
న్యూఢిల్లీ: వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకూ భారత్‌దే పైచేయని ఆక్స్ ఫర్డ్ ఎకనమిక్స్ విభాగం రూపొందించిన ఒక నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రూపొందిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- 2019-28 మధ్య భారత్ సగటు వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుంది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటితో చూస్తే అధికం.
- భారత్ తరువాతి స్థానాల్లో ఫిలిప్పైన్స్ (5.3 శాతం), ఇండోనేషియా (5.1 శాతం) ఉంటాయి.చైనా సగటు వృద్ధి కూడా 5.1 శాతంగా ఉంటుంది.
- వర్థమాన దేశాల తమ వృద్ధిని పటిష్టం చేసుకోడానికి నూతన ఆవిష్కరణలు, పరిశోధనా, అభివృద్ధి, సాంకేతిక రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇది దేశీయంగా మూలధన సృష్టికి కూడా దోహదపడుతుంది.
- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇటీవలి అంచనాల ప్రకారం- భారత్ వృద్ధిరేటు 2019లో 7.5 శాతం. 2020లో 7.7 శాతం. చైనా వృద్ధి ఇదే కాలంలో 6.2 శాతంగా ఉండనుంది.
ఏమిటి : వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకూ భారత్‌దే పైచేయి..
ఎందుకు : భారత్ వృద్ధి రేటు
రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారడంతోపాటు ఈఎంఐల భారం తగ్గనుంది. 18 నెలల తర్వాత మళ్లీ ఆర్‌బీఐ వడ్డీ రేటను తగ్గించడం ఇదే తొలిసారి.
పాలసీ ముఖ్యాంశాలు...
- రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. బ్యాంకు రేటు 6.5 శాతం.
- నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎలాంటి మార్పుల్లేవు. 4 శాతంగానే కొనసాగుతుంది.
- వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంతదాస్ సహా నలుగురు ఎంపీసీ సభ్యులు అనుకూలంగా ఓటు. చేతన్‌ఘటే, విరాళ్ ఆచార్య యథాతథానికి ఓటు.
- రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2019 జనవరి-మార్చి త్రైమాసికానికి 2.8 శాతానికి తగ్గింపు. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి) 3.2-3.4 శాతంగా అంచనా. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి అంచనా 3.9 శాతం.
- జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2019-20లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 7.2-7.4 శాతంగాను, అక్టోబర్-డిసెంబర్ కాలానికి 7.5 శాతంగానూ ఉండొచ్చు.
- చమురు ధరల్లో అస్పష్టత ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి.
- వ్యవసాయ రుణాలు, ప్రాంతీయ అసమానత, కవరేజీ విసృ్తతికి ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు.
- రూపాయి విలువలో స్థిరత్వానికి ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్ల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
- కార్పొరేట్ డెట్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలపై ఉన్న నియంత్రణలు ఎత్తివేత.
- పేమెంట్ గేట్‌వే సర్వీసు ప్రొవైడర్లు, పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో చర్చా పత్రం విడుదల.
- కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతమిస్తాయి.
- ఎన్‌బీఎఫ్‌సీల సమన్వయానికి త్వరలో మార్గదర్శకాలు.
- ఆర్‌బీఐ తదుపరి ఎంపీసీ భేటీ వచ్చే ఏప్రిల్ 2న జరగనుంది.
- హామీల్లేకుండా వ్యవసాయానికి ఇచ్చే రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది.
- దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పరిధిలోని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లో పాల్గొనే కంపెనీలు ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) మార్గంలో నిధుల సమీకరణకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెపో రేటు, రివర్స్ రెపో రేటు పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారత వృద్ధి రేటు అంచనాలు సవరణ
2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను కేంద్రం ప్రభుత్వం జనవరి 31న సవరించింది. ఈ మేరకు ఇంతకు ముందు 6.7 శాతం వృద్ధి అంచనా వేయగా.. దాన్ని 7.2 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. వాస్తవ జీడీపీ లేదా 2011-12 ధరల వద్ద జీడీపీ 2016-17లో రూ.122.98 లక్షల కోట్లు, 2017-18లో రూ.131.80 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ఫలితంగా వృద్ధి వరుసగా 7.2 శాతం, 8.2 శాతం చొప్పున పెరిగిందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదు కావొచ్చని 2018, మేలో సీఎస్‌ఓ ముందస్తు అంచనాల్లో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలు సవరణ
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 26 Feb 2019 01:32PM