మే 2021 ఎకానమీ
Sakshi Education
కియా భారత విభాగం పేరును ఏ విధంగా మార్చారు?
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చింది. కియా మోటార్స్ పేరును.. కియా ఇండియాగా మార్చినట్లు మే 25న వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండలో ఉన్న తయారీ ప్లాంటులో లోగో, పేరును ఇప్పటికే మార్చినట్లు పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే కియా తమ కొత్త కార్పొరేట్ లోగో, అంతర్జాతీయ బ్రాండ్ స్లోగన్‌ను ఆవిష్కరించింది.
2021–22లో 7.3 శాతం క్షీణత
భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–21 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా మే 24న పేర్కొంది. అయితే ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) 2 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ పరిగణనలోకి తీసుకునే గ్రాస్ వ్యాలూ యాడెడ్ (జీవీఏ) ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం క్షీణిస్తే, నాల్గవ త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదవుతుందని తెలిపింది.
భారత్లో స్పుత్నిక్ టీకాను తయారు చేస్తోన్న సంస్థలు?
రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్), భారత ఔషధ దిగ్గజం పనాసియా బయోటెక్‌లు స్పుత్నిక్–వి కోవిడ్ వ్యాక్సిన్ తయారీని భారత్‌లో ప్రారంభించాయి. ఈ మేరకు రెండు సంస్థలు సంయుక్తంగా మే 24న ఒక ప్రకటన విడుదల చేశాయి. హిమాచల్ప్రదేశ్లోని బద్ది వద్ద ఉన్న పనాసియా బయోటెక్ తయారీ కేంద్రం వద్ద వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని మొదలుపెట్టినట్లు తెలిపాయి. వ్యాక్సిన్ తయారు చేశాక నాణ్యతను పరీక్షించేందుకు రష్యాలోని గమాలియా సెంటర్‌కు పంపించనున్నారు. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులను తయారు చేసేందుకు ఆర్‌డీఐఎఫ్, పనాసియాల మధ్య 2021 ఏప్రిల్‌లోనే ఒప్పందం కుదిరింది. భారత్‌లో స్పుత్నిక్ అత్యవసర వినియోగానికి 2021 ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో స్పుత్నిక్ టీకాను తయారు చేస్తోన్న సంస్థలు?
ఎప్పుడు : మే 24
ఎవరు : రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్), భారత ఔషధ దిగ్గజం పనాసియా బయోటెక్‌లు
ఎక్కడ : బద్ది, హిమాచల్‌ప్రదేశ్
ఎందుకు : కోవిడ్-19ను ఎదుర్కోనేందుకు...
కేంద్ర ప్రభుత్వానికి.. రిజర్వ్ బ్యాంక్ డివిడెండుగా ఎంత మొత్తాన్ని అందించనుంది?
2021 ఏడాది మార్చి 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ. 99,122 కోట్ల మిగులు నిధులను(డివిడెండ్) కేంద్ర ప్రభుత్వానికి బదలాయించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిర్ణయించింది. మే 21న ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్‌బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కేంద్రం బడ్జెట్‌లో అంచనా వేసిన రూ. 53,510 కోట్ల కన్నా ఇది దాదాపు 85 శాతం అధికం. కోవిడ్–19 విజృంభణ వేళ ఈ నిధులు చర్చనీయాంశంగా మారాయి. రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం మార్కెట్ లావాదేవీలు, పెట్టుబడులు మొదలైన వాటిపై వచ్చే లాభాలను కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ బదలాయిస్తుంది. ఆర్బీఐ తన జులై-జూన్ ఖాతా ఏడాదిని ప్రభుత్వంతో పాటు ఏప్రిల్-మార్చికి అనుగుణంగా సర్దుబాటు చేయడం వల్ల తొమ్మిది నెలల (2020 జులై-2021 మార్చి) కాలానికి డివిడెండు చెల్లించాల్సి వచ్చింది.
కోవిడ్ వ్యాక్సిన్ కోసం...
18 నుంచి 44 ఏళ్ల మధ్య వారి కోసం టీకాలు కొనుగోలు చేసి, వేసే భారాన్ని కేంద్రం రాష్ట్రాలపై మోపింది. ఇది సరికాదని, ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేయాల్సిన అంశానికి సంబంధించి ఆర్థికపరమైన బాధ్యతలను కేంద్రమే తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ కేంద్రానికి డివిడెండుగా ఇస్తున్న నిధులను వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయించింది. 2021, మే దాకా గణాంకాలను బట్టి ఇందులో సుమారు 8.5 శాతమే వినియోగించిందని నిపుణుల అంచనా.
జీడీపీ అంచనాలపై ఎస్బీఐ రూపొందించిన నివేదిక పేరు?
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అనే అంశంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘ఎకోర్యాప్’ పేరుతో ఒక పరిశోధనా నివేదికను మే 25న విడుదల చేసింది. 2020-21 ఆర్థిక ఏడాది భారత జీడీపీ మైనస్ 7.3 శాతం వరకు క్షీణిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. భారత జీడీపీ మైనస్ 7.4 శాతంగా ఉండొచ్చని ఎస్‌బీఐ గతంలో అంచానా వేసింది. తాజాగా మైనస్ 7.3 శాతానికి తగ్గించింది.
వృద్ధి 7.7 శాతమే: బార్క్లేస్
భారత్ ఆర్థిక వ్యవస్థ 2021–22 వృద్ధి తొలి అంచనాలకు బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ– బార్‌క్లేస్ మే 25న కోత పెట్టింది. క్రితం అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు తగ్గించి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 9.2 శాతానికి కుదించింది. కరోనా థర్డ్ వేవ్ సంక్షోభం, లాక్‌డౌన్లు; వ్యాక్సినేషనలో ఆలస్యం వంటి సవాళ్ల కారణంగా వృద్ధి రేటు 7.7 శాతానికి పడిపోతుందని కూడా అంచనా వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-21 ఆర్థిక ఏడాది భారత జీడీపీ మైనస్ 7.3 శాతం వరకు క్షీణిస్తుంది
ఎప్పుడు : మే 25
ఎవరు : ఎస్‌బీఐ ఎకోర్యాప్ పరిశోధనా నివేదికను
ఎందుకు : కరోనా వల్ల తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో...

Published date : 30 Jun 2021 02:06PM