Skip to main content

Reliance Infratel: జియో గూటికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌లో (ఆర్‌ఐటీఎల్‌) 100 శాతం వాటాలను రిలయన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ (ఆర్‌పీపీఎంఎస్‌ఎల్‌) దక్కించుకుంది.

ఇందుకోసం రూ.3,725 కోట్లు వెచ్చించింది. ఆర్‌పీపీఎంఎస్‌ఎల్‌ మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే దివాలా చర్యలు ఎదుర్కొంటున్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ (ఆర్‌ఐటీఎల్‌) మొబైల్‌ టవర్, ఫైబర్‌ అసెట్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు టెలికం దిగ్గజం జియోలో భాగమైన ఆర్‌పీపీఎంఎస్‌ఎల్‌ 2019లో రూ. 3,720 కోట్లకు బిడ్‌ చేసింది. ఈ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో డిపాజిట్‌ చేస్తామంటూ నవంబర్‌ 6న ప్రతిపాదించింది. దీనికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేయడంతో తాజాగా రూ. 3,720 కోట్లను ఎస్‌బీఐ ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

Published date : 23 Dec 2022 03:54PM

Photo Stories