ఏప్రిల్ 2019 ఎకానమీ
Sakshi Education
త్వరలో కొత్త రూ.20 నోటు
త్వరలో కొత్త రూ.20 నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించింది. గతంలోలాగే గాంధీజీ సిరీస్‌లోనే ఈ కొత్త నోట్ కూడా ఉంటుందని ఏప్రిల్ 27న తెలిపింది. నోటుపై కొత్త డిజైన్లు, అందులో కలిసేలా రేఖాగణిత నమూనాలు ఉంటాయి. అలాగే రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. ఈ నోటు వెనుకవైపు మన చారిత్రక వారసత్వ సంపదైన ఎల్లోరా గుహల చిహ్నం, దేవనాగరి లిపిలో 20 అంకె, స్వచ్ఛభారత్ లోగో, నినాదం ఉంటాయి. కొత్త నోట్‌తోపాటు పాత నోట్లూ చలామణిలోనే ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : త్వరలో కొత్త రూ.20 నోటు
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)
భారత్ జీడీపీ వృద్ధి రేటు తగ్గింపు
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ గ్రూప్ విభాగం అయిన ఇండియా రేటింగ్‌స అండ్ రీసెర్చ్ తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకాగా, దీనిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వృద్ధిరేటు కోత అంచనాలకు కారణమని ఏప్రిల్ 30న ఇండియా రేటింగ్స్ పేర్కొంది.
2019-20 వృద్ధి రేటుపై అంచనా (శాతాల్లో)
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు తగ్గింపు 7.3 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : మే 1
ఎవరు : ఇండియా రేటింగ్‌స అండ్ రీసెర్చ్
భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి
భారత్‌లో వచ్చే మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వెల్లడించింది. అలాగే 2019 ఏడాది ఆఖరుకి భారత్‌లోని ఉద్యోగుల సంఖ్యను కూడా 1,000కి పెంచుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులున్నట్లు బైట్‌డ్యాన్స్ డెరైక్టర్ (ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ) హెలినా లెర్ష్ తెలిపారు. స్వల్ప నిడివి వీడియోలను షేర్ చేసుకునేందుకు ఉపయోగపడే టిక్‌టాక్ యాప్ ద్వారా అశ్లీల వీడియోలు కూడా వ్యాప్తి చెందుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో దీన్ని నిషేధించడం తెలిసిందే. దీంతో గూగుల్, యాపిల్ సంస్థలు టిక్‌టాక్‌ను తమ యాప్ స్టోర్స్ నుంచి తొలగించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : బైట్‌డ్యాన్స్
ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్‌బీఐ నిష్క్రమణ
నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్)ల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిష్ర్కమించింది. వాటిలో తనకు ఉన్న మొత్తం వాటాలను వరుసగా రూ.1450 కోట్లు, రూ.20 కోట్లకు కేంద్ర ప్రభుత్వానికి విక్రయించినట్లు ఏప్రిల్ 24న ఆర్‌బీఐ ప్రకటించింది. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో, ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో తన వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు పేర్కొంది. దీంతో ఈ రెండు సంస్థల్లోని 100 శాతం వాటాలు ప్రభుత్వానికి చేరినట్లయింది.
బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ఆర్‌బీఐ అదే రంగ సంస్థల్లో వాటాలు కూడా కలిగి ఉండటం సరికాదని నరసింహం రెండో కమిటీ సిఫార్సు చేస్తూ 2001, అక్టోబర్‌లో తన నివేదికను ఇచ్చింది. ఈ నివేదికతోపాటు ఆర్‌బీఐ సొంతం చర్చా పత్రమైన ‘హార్మనైజింగ్ ద రోల్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ డెవలపమ్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్’ సిఫారసుల అమలులో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకుంది. 1982, జులై 12న నాబార్డ్ ఏర్పాటు కాగా, హౌసింగ్ రంగానికి ఊతమిచ్చే యోచనతో 1987-88లో బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఎన్‌హెచ్‌బీ ఏర్పాటైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌ల నిష్ర్కమణ
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
తక్కువ వడ్డీ దారిలో ఆర్‌బీఐ: ఫిచ్
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తక్కువ వడ్డీరేటు వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించిన తొలి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- ఫిచ్ పేర్కొంది. దేశీయంగా తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులు, అమెరికా సెంట్రల్‌బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంచే అవకాశాలు కనబడని తీరు, దీనితో అంతర్జాతీయంగా సరళతరంగా ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితులు... ఆర్‌బీఐ రేటు తగ్గింపునకు దోహదపడుతున్న అంశాలుగా ఫిచ్ వివరించింది. ఈ మేరకు ఆసియా పసిఫిక్ సావరిన్ క్రెడిట్ ఓవర్‌వ్యూ రిపోర్ట్‌ను ఫిచ్ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా, 2020-21లో 7.1 శాతాంగా నమోదవుతుందని ఫిచ్ అంచనా వేసింది.
ఆర్‌బీఐ ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏప్రిల్ 4న రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది.
త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్
త్వరలోనే రూ.50 నోటు నూతన సిరీస్ చలామణిలోకి రానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే కొత్త సిరీస్ త్వరలోనే చలామణిలోకి రానుందని, ఈ సిరీస్‌తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్‌బీఐ ఏప్రిల్ 16న ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయాలతో గృహ, రుణ, వాహన రుణాలపై కస్టమర్ల నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) తగ్గుతాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) ఎంపీసీకి ఇది తొలి ద్వైమాసిక సమావేశం. రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్‌బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి.
పాలసీ ముఖ్యాంశాలు...
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెపో రేటు, రివర్స్ రెపో రేటు పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారత్‌కు ట్రిపుల్ బి మైనస్ గ్రేడ్ : ఫిచ్
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారత్‌కు మరోసారి ట్రిపుల్ బి మైనస్ రేటింగ్ ఇచ్చింది. దీంతో వరుసగా 13వ ఏడాది ఇదే రేటింగ్ కొనసాగించినట్లయింది. పెట్టుబడులకు సంబంధించి తక్కువ స్థాయి గ్రేడ్‌ను ఇది సూచిస్తుంది. మరోవైపు భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగాను ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది. 2018-19 మధ్య కాలంలో భారత వృద్ధి రేటు సగటున 7.5 శాతంగా నమోదైందని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు ట్రిపుల్ బి మైనస్ గ్రేడ్
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
ఐహెచ్‌ఎఫ్‌లో విలీనానికి ఎల్‌వీబీ ఆమోదం
గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్‌ఎఫ్)లో విలీనానికి ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) బోర్డు ఏప్రిల్ 5న ఆమోదముద్ర వేసింది. ఈ విలీన ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. విలీన ప్రతిపాదన ప్రకారం.. ప్రతీ 100 ఎల్‌వీబీ షేర్లకు (రూ. 10 ముఖవిలువ) ఐహెచ్‌ఎఫ్ షేర్లు 14 (రూ. 2 ముఖవిలువ) కేటాయించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐహెచ్‌ఎఫ్‌లో విలీనానికి ఎల్‌వీబీ ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) బోర్డు
భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 8న ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో పెట్టుబడుల పరిస్థితి పటిష్టం అవుతోందని, ఎగుమతులు మెరుగుపడుతున్నాయని, వినియోగ పరిస్థితులు బాగున్నాయని ప్రపంచబ్యాంక్ ఈ నివేదికలో పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు...
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-20లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ప్రపంచబ్యాంక్
భారత్ వృద్ధి రేటు 7.3 శాతం : ఐఎంఎఫ్
భారత్ వృద్ధి రేటు 2019లో 7.3 శాతంగా, 2020లో 7.5 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వె ల్లడించింది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2019-20) వృద్ధిరేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ వృద్ధి పటిష్టతకు పెట్టుబడుల్లో వేగవంతమైన రికవరీ, వినియోగ పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటి అంశాలు తోడ్పడుతున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రపంచ వృద్ధిరేటు అంచనా తగ్గింపు....
2019లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతం నుంచి 3.3 శాతానికి ఐఎంఎఫ్ తగ్గించింది. అలాగే 2020లో వృద్ధి అంచనాలను కూడా 3.7 శాతం నుంచి 3.6 శాతానికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సున్నితమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ తెలిపారు.
ఐఎంఎఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు...
ఏమిటి : 2019లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
అత్యధిక డాలర్లు జమ అయిన దేశంగా భారత్
2018 ఏడాదిలో డాలర్ల రూపంలో అత్యధికంగా సొమ్ము జమ అయిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018లో భారత్‌కు వివిధ దేశాల నుంచి 79 బిలియన్ డాలర్లు చేరాయి. ఆ తర్వాత చైనా (67 బిలియన్ డాలర్లు), మెక్సికో (36 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ 34 (బిలియన్ డాలర్లు), ఈజిప్ట్(29 బిలియన్ డాలర్లు) దేశాలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య మితంగా (7శాతం) ఉంది.
భారత్‌కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య 2018లో 14 శాతం పెరిగింది. కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేకమంది పెద్దమొత్తంలో సొమ్మును భారత్‌కు పంపారని ప్రపంచబ్యాంకు తెలిపింది. దక్షిణాసియాకు పంపుతున్న నగదు 12 శాతం మేర పెరిగిందని 2018లో ఆ మొత్తం 131 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొంది. భారత్‌కు డాలర్ల రూపంలో 2016లో 62.7 బిలియన్ డాలర్లు, 2017లో 65.3 బిలియన్ డాలర్లు వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018లో అత్యధిక డాలర్లు జమ అయిన దేశంగా భారత్
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : ప్రపంచ బ్యాంకు
బీవోబీలో బ్యాంకుల విలీనం అమలు
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వ రంగంలోనిది), ఐసీఐసీఐ బ్యాంక్ (ప్రైవేట్ రంగంలోనిది) తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది. విలీనం తర్వాత బీవోబీ వ్యాపార పరిమాణం రూ. 14.82 లక్షల కోట్లుగాను, నికర మొండిబాకీల నిష్పత్తి 5.71గా ఉంది. ఈ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గింది. మూలధనంపరంగా విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు బీవోబీకి రూ. 5,042 కోట్ల మేర అదనంగా నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీవోబీలో బ్యాంకుల విలీనం అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు తగ్గింపు
2019 సంవత్సరానికిగాను ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటును 3.7 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 2న వార్షిక అంచనాలను విడుదల చేసింది. వ్యవస్థాపరమైన సమస్యలు ప్రపంచ ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్నాయని డబ్ల్యూటీవో పేర్కొంది. 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ధి 3 శాతంగా ఉన్న విషయం విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2.6 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
భారత్ వృద్ధి రేటు తగ్గింపు : ఏడీబీ
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాలను ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 7.6 నుంచి 7.2 శాతానికి త గ్గించింది. అలాగే 2018-19 వృద్ధి అంచనాలను కూడా 7.3 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు, ఆదాయాల్లో క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణమని ఏడీబీ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 3న అవుట్‌లుక్‌ను విడుదల చేసింది.
ఏడీబీ అవుట్‌లుక్‌లోని ముఖ్యాంశాలు...
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.6 నుంచి 7.2 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)

ఆర్‌బీఐ | 7.2 |
ఏడీబీ | 7.2 |
ప్రపంచబ్యాంక్ | 7.5 |
ఐఎంఎఫ్ | 6.8 |
ఫిచ్ | 6.8 |

- రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గింపు.
- వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌తో పాటు పామీదువా, రవీంద్ర దోలాకియా, మైఖేల్‌పాత్రలు అనుకూలంగా ఓటు వేశారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఎంసీసీ సభ్యుడు ఛేతన్ ఘాటే వ్యతిరేకంగా ఓటు వేశారు.
- జీడీపీ వృద్ధి రేటు వచ్చే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా ఉండొచ్చు. 2019, ఫిబ్రవరిలో ఈ రేటును 7.4 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. అంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది.
- ద్రవ్యోల్బణం రేటు అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 2.9-3 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ అంచనాలను 3.2-3.4 శ్రేణిగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో 3.5-3.8 శాతం వరకూ ఉంటుందని అంచనావేసింది. అంటే ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతం దిగువనే ద్రవ్యోల్బణం ఉంటుందన్నమాట.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెపో రేటు, రివర్స్ రెపో రేటు పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారత్‌కు ట్రిపుల్ బి మైనస్ గ్రేడ్ : ఫిచ్
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారత్‌కు మరోసారి ట్రిపుల్ బి మైనస్ రేటింగ్ ఇచ్చింది. దీంతో వరుసగా 13వ ఏడాది ఇదే రేటింగ్ కొనసాగించినట్లయింది. పెట్టుబడులకు సంబంధించి తక్కువ స్థాయి గ్రేడ్‌ను ఇది సూచిస్తుంది. మరోవైపు భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగాను ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది. 2018-19 మధ్య కాలంలో భారత వృద్ధి రేటు సగటున 7.5 శాతంగా నమోదైందని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు ట్రిపుల్ బి మైనస్ గ్రేడ్
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
ఐహెచ్‌ఎఫ్‌లో విలీనానికి ఎల్‌వీబీ ఆమోదం
గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్‌ఎఫ్)లో విలీనానికి ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) బోర్డు ఏప్రిల్ 5న ఆమోదముద్ర వేసింది. ఈ విలీన ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. విలీన ప్రతిపాదన ప్రకారం.. ప్రతీ 100 ఎల్‌వీబీ షేర్లకు (రూ. 10 ముఖవిలువ) ఐహెచ్‌ఎఫ్ షేర్లు 14 (రూ. 2 ముఖవిలువ) కేటాయించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐహెచ్‌ఎఫ్‌లో విలీనానికి ఎల్‌వీబీ ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) బోర్డు
భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 8న ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో పెట్టుబడుల పరిస్థితి పటిష్టం అవుతోందని, ఎగుమతులు మెరుగుపడుతున్నాయని, వినియోగ పరిస్థితులు బాగున్నాయని ప్రపంచబ్యాంక్ ఈ నివేదికలో పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- 2018-2019లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా.
- వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధి మంచి ఫలితమే.
- ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 4 శాతంలోపే ఉంటుందని భావించడం జరుగుతోంది.
- దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం- కరెంట్ అకౌంట్‌లోటు, అలాగే ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు అదుపులోనే ఉన్నాయి.
- ఎగుమతులు పెరుగుతుండడం, తక్కువ ముడి చమురు దిగుమతుల వల్ల దేశానికి తగ్గే చమురు బిల్లు భారం కరెంట్ అకౌంట్ లోటును 1.9 శాతానికి (2019-20 జీడీపీ విలువలో) కట్టడిచేసే అవకాశంఉంది. అలాగే ద్రవ్యలోటు 3.4 శాతం దాటకపోవచ్చు.
ఆర్‌బీఐ | 7.2 |
ఏడీబీ | 7.2 |
ప్రపంచబ్యాంక్ | 7.5 |
ఐఎంఎఫ్ | 6.8 |
ఫిచ్ | 6.8 |
ఏమిటి : 2019-20లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ప్రపంచబ్యాంక్
భారత్ వృద్ధి రేటు 7.3 శాతం : ఐఎంఎఫ్
భారత్ వృద్ధి రేటు 2019లో 7.3 శాతంగా, 2020లో 7.5 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వె ల్లడించింది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2019-20) వృద్ధిరేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ వృద్ధి పటిష్టతకు పెట్టుబడుల్లో వేగవంతమైన రికవరీ, వినియోగ పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటి అంశాలు తోడ్పడుతున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రపంచ వృద్ధిరేటు అంచనా తగ్గింపు....
2019లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతం నుంచి 3.3 శాతానికి ఐఎంఎఫ్ తగ్గించింది. అలాగే 2020లో వృద్ధి అంచనాలను కూడా 3.7 శాతం నుంచి 3.6 శాతానికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సున్నితమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ తెలిపారు.
ఐఎంఎఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు...
- ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.
- 2018లో భారత్ వృద్ధి రేటు 7.1 శాతం. చైనా 6.6 శాతం వృద్ధిరేటుకన్నా ఇది అధికం. 2019, 2020ల్లో చైనా వృద్ధిరేట్లు వరుసగా 6.3 శాతం, 6.1 శాతం ఉంటాయని భావిస్తున్నాం.
- ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, 2019, 2020ల్లో చైనా వృద్ధి నెమ్మదిగానే ఉండే వీలుంది.
- ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, దీనితో వడ్డీరేట్ల తగ్గుదల భారత్ వృద్ధి జోరు కారణాల్లో కొన్ని.
- మధ్యకాలికంగా చూస్తే, 7 శాతం స్థాయిలో భారత్ వృద్ధి స్థిరీకరణ పొందే అవకాశం ఉంది. వ్యవస్థాగత సంస్కరణల అమలు, మౌలిక ప్రాజెక్టుల విషయంలో అవరోధాల తొలగింపు ఈ అంచనాలకు కారణం.
- ప్రభుత్వ రుణం తగిన స్థాయిలో ఉంచడం వృద్ధి పటిష్టతకు దోహదపడే అంశాల్లో ఒకటి.
- 2018లో అంతర్జాతీయ వృద్ధి మందగమనంలోకి జారింది. చివరి ఆరు నెలల కాలంలో ఈ పరిస్థితి మరింత క్షీణించింది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అంశాలు దీనికి ప్రధాన కారణం.
ఏమిటి : 2019లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
అత్యధిక డాలర్లు జమ అయిన దేశంగా భారత్
2018 ఏడాదిలో డాలర్ల రూపంలో అత్యధికంగా సొమ్ము జమ అయిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018లో భారత్‌కు వివిధ దేశాల నుంచి 79 బిలియన్ డాలర్లు చేరాయి. ఆ తర్వాత చైనా (67 బిలియన్ డాలర్లు), మెక్సికో (36 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ 34 (బిలియన్ డాలర్లు), ఈజిప్ట్(29 బిలియన్ డాలర్లు) దేశాలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య మితంగా (7శాతం) ఉంది.
భారత్‌కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య 2018లో 14 శాతం పెరిగింది. కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేకమంది పెద్దమొత్తంలో సొమ్మును భారత్‌కు పంపారని ప్రపంచబ్యాంకు తెలిపింది. దక్షిణాసియాకు పంపుతున్న నగదు 12 శాతం మేర పెరిగిందని 2018లో ఆ మొత్తం 131 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొంది. భారత్‌కు డాలర్ల రూపంలో 2016లో 62.7 బిలియన్ డాలర్లు, 2017లో 65.3 బిలియన్ డాలర్లు వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018లో అత్యధిక డాలర్లు జమ అయిన దేశంగా భారత్
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : ప్రపంచ బ్యాంకు
బీవోబీలో బ్యాంకుల విలీనం అమలు
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వ రంగంలోనిది), ఐసీఐసీఐ బ్యాంక్ (ప్రైవేట్ రంగంలోనిది) తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది. విలీనం తర్వాత బీవోబీ వ్యాపార పరిమాణం రూ. 14.82 లక్షల కోట్లుగాను, నికర మొండిబాకీల నిష్పత్తి 5.71గా ఉంది. ఈ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గింది. మూలధనంపరంగా విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు బీవోబీకి రూ. 5,042 కోట్ల మేర అదనంగా నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీవోబీలో బ్యాంకుల విలీనం అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు తగ్గింపు
2019 సంవత్సరానికిగాను ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటును 3.7 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 2న వార్షిక అంచనాలను విడుదల చేసింది. వ్యవస్థాపరమైన సమస్యలు ప్రపంచ ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్నాయని డబ్ల్యూటీవో పేర్కొంది. 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ధి 3 శాతంగా ఉన్న విషయం విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2.6 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
భారత్ వృద్ధి రేటు తగ్గింపు : ఏడీబీ
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాలను ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 7.6 నుంచి 7.2 శాతానికి త గ్గించింది. అలాగే 2018-19 వృద్ధి అంచనాలను కూడా 7.3 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు, ఆదాయాల్లో క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణమని ఏడీబీ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 3న అవుట్‌లుక్‌ను విడుదల చేసింది.
ఏడీబీ అవుట్‌లుక్‌లోని ముఖ్యాంశాలు...
- 2020లో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుంది.
- 2019-20లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది.
- వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2019-20లో సగటున 4.3 శాతంగా ఉంటే, 2020-21లో 4.6 శాతంగా ఉంటుంది.
- దక్షిణాసియాలో మందగమన పరిస్థితులు మొత్తం ఆసియాపై ప్రతికూలత చూపవచ్చు.
- దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం- కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతం (జీడీపీ విలువలో పోల్చి), 2020-21లో 2.5 శాతంగా ఉండే అవకాశం ఉంది. - క్యాడ్ సమస్యను భారత్ విజయవంతంగా అధిగమించే అవకాశం ఉంది.
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.6 నుంచి 7.2 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
Published date : 19 Apr 2019 06:22PM