ECB Bank : వడ్డీ రేట్లు 0.75 శాతం పెంపు
Sakshi Education
మాంద్యం భయాలకన్నా, ద్రవ్యోల్బణం కట్టడికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చింది. వడ్డీరేటును 0.75% పెంచుతూ 25 మంది సభ్యుల గవర్నింగ్ కౌన్సిల్ అక్టోబర్ 27న కీలక నిర్ణయం తీసుకుంది.
యూరో కరెన్సీ చరిత్రలోనే ఒకేసారి ఈ స్థాయి రేటు పెంపు ఇదే తొలిసారి. ఈ ఏడాది మూడవ రేటు పెంపు నిర్ణయమిది. 19 దేశాల యూరోజోన్ ఆర్థిక వ్యవస్థపై పొంచి ఉన్న మాంద్యం ముప్పు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డ్ పేర్కొన్నారు. అమెరికాసహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం స్పీడ్ కట్టడికి వడ్డీరేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. యూరోజోన్‌లో 2% లక్ష్యానికి మించి, ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9.9%కి ఎగసింది.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీ ఏది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 28 Oct 2022 06:03PM