Skip to main content

Foreign direct investment: భారత్‌కు రూ. 588 లక్షల కోట్ల ఎఫ్‌డీఏలు అవసరం: డెలాయిట్‌

భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.368 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి 8 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు .588 లక్షల కోట్లు) తాజా గ్రీన్‌ఫీల్డ్‌ పెట్టుబడులు అవసరమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– డెలాయిట్‌ విశ్లేషించింది.
FDIs

 ఈ మేరకు సెప్టెంబర్‌ 14 ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్‌లలోని బహుళజాతి కంపెనీలకు చెందిన 1,200 మంది వ్యాపార వేత్తల అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే అధ్యయనం రూపొందింది.

గ్రీన్‌పీల్డ్‌ పెట్టుబడి అంటే..

గ్రీన్‌పీల్డ్‌ పెట్టుబడి అంటే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)లో ఒక విధానం. ఈ విధానంలో ఒక పేరెంట్‌ కంపెనీ వివిధ దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందుకు అనుగుణంగా భారీగా పెట్టుబడులు పెడుతుంది.

 

నివేదికలోని ముఖ్యాంశాలు...

  • కోవిడ్‌–19 సవాళ్లలోనూ భారత్‌కు భారీగా ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఆశావహ పరిస్థితిని, ఆర్థిక మూలాలకు పటిష్టతను అందించింది.
  • 2020–21 ఏడాదిలో దేశంలోకి ఈక్విటీ, రీ–ఇన్వెస్టెడ్‌ ఎర్నింగ్స్, క్యాపిటల్‌సహా రికార్డు స్థాయిలో 81.72 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.

చ‌ద‌వండి: భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోన్న వాహన తయారీ సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌కు 8 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.588 లక్షల కోట్లు) తాజా గ్రీన్‌ఫీల్డ్‌ పెట్టుబడులు అవసరం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 14
ఎవరు    : అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– డెలాయిట్‌
ఎందుకు  : భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.368 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి...
 

Published date : 15 Sep 2021 03:23PM

Photo Stories