డిసెంబర్ 2019 ఎకానమీ
ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్ఐసీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2,611 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మేరకు చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చైర్మన్ ఎమ్.ఆర్. కుమార్ డిసెంబర్ 27న అందజేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ 10 శాతం వృద్ధితో రూ.53,214 కోట్ల మిగులు విలువను సాధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 1956, సెప్టెంబర్ 1న ఎల్ఐసీని స్థాపించారు. ప్రస్తుతం రూ.31.11 లక్షల కోట్ల ఆస్తులను ఎల్ఐసీ నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.61 లక్షల కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రానికి రూ.2,611 కోట్ల డివిడెండ్
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్ఐసీ
ఎందుకు : 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను
భారత రుణ వృద్ధి 7 శాతం లోపే: ఇక్రా
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో బ్యాంకింగ్ రుణ వృద్ధి కేవలం 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఉంటుందని విశ్లేషించింది. ఇదే నమోదయితే రుణ వృద్ధిరేటు 58 సంవత్సరాల కనిష్టస్థాయికి పడిపోయినట్లేనని పేర్కొంది. ఈ మేరకు డిసెంబర్ 27న ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. 1962లో భారత రుణ వృద్ధిరేటు 5.4 శాతంగా ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2018-19) బ్యాంకింగ్ రుణ వృద్ధి 13.3 శాతంగా నమోదైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత రుణ వృద్ధి 7 శాతం లోపే
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఇక్రా
ఎందుకు : ఆర్థిక మందగమనం కారణంగా
ఆర్బీఐ 25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల
దేశ ఆర్థిక అంశాలపై రూపొందించిన ‘25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక’ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిసెంబర్ 27న విడుదల చేసింది. ‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఈ నివేదిక పేర్కొంది. చాలా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
గరిష్టస్థాయికి విదేశీ మారకపు నిల్వలు
భారత విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. డిసెంబరు 20తో ముగిసిన వారానికి 456 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,200 కోట్లు) పెరిగి, 454.95 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.32.3 లక్షల కోట్లు) చేరాయని ఆర్బీఐ వెల్లడించింది. అంత క్రితం వారం ఫారెక్స్ నిల్వలు 1.07 బి.డాలర్లు పెరిగి, 454.49 బి.డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)
మౌలిక రంగంలో రూ. 102 లక్షల కోట్ల పెట్టుబడులు
మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ‘జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్ (నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్-ఎన్ఐపీ)’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 31న వెల్లడించారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (దాదాపు రూ.356 లక్షల కోట్లు) అవతరించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం..
- ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ నాలుగు నెలల్లో 70 భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించి రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులను విద్యుత్, రైల్వేస్, అర్బన్ ఇరిగేషన్, మొబిలిటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో గుర్తించింది. మరో రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా వీటికి తోడవుతాయి.
- గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు మౌలిక రంగంపై చేసిన రూ.51 లక్షల కోట్ల వ్యయానకి ఇది అదనం.
- ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టుల్లో కేంద్రం, రాష్ట్రాల నుంచి చెరో 39 శాతం, ప్రైవేటు రంగం నుంచి 22 శాతం ఉంటాయి.
- ఎన్ఐపీ ప్రాజెక్టుల్లో రూ.42.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.32.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు తయారీ దశలో, 19.1 లక్షల కోట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.
- ఎన్ఐపీ ప్రాజెక్టులు ఇవి 22 శాఖలు, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అమలవుతాయి.
రంగం | ప్రాజెక్టుల విలువ (రూ.లక్షల కోట్లు) |
ఇంధనం | 24.54 |
రోడ్లు | 19.63 |
రైల్వే | 13.68 |
పోర్టులు | 1 |
విమానాశ్రయాలు | 1.43 |
టెలికం | 3.2 |
ఇరిగేషన్ | 7.7 |
పట్టణ మౌలిక సదుపాయాలు | 16.29 |
గ్రామీణ మౌలిక సదుపాయాలు | 7.7 |
పారిశ్రామిక మౌలిక సదుపాయాలు | 3.07 |
సోషల్ ఇన్ఫ్రా | 3.56 |
ఏమిటి : మౌలిక రంగంలో రూ. 102 లక్షల కోట్ల పెట్టుబడులు
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
రిజర్వ్ రేషియోను తగ్గించిన చైనా సెంట్రల్ బ్యాంక్
ఆర్థిక మందగమనంలో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఆ దేశ సెంట్రల్ బ్యాంక్- పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్‌సహా ఆర్థిక సంస్థల రిజర్వ్ రికై ్వర్మెంట్ రేషియో (ఆర్ఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) తగ్గిస్తున్నట్లు జనవరి 1న వెల్లడించింది. జనవరి 6 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నిర్ణయంతో చైనా ఆర్ఆర్ఆర్ 12.50 శాతానికి తగ్గుతుంది. ఈ నిర్ణయం వల్ల రుణాలివ్వడానికి వీలుగా ఫైనాన్స్ సంస్థల చేతికి 800 బిలియన్ యువాన్లు (114.7 బిలియన్ డాలర్లు) అందుబాటులోకి వస్తాయి. 2019, అక్టోబర్‌తో ముగిసిన త్రైమాసికంలో చైనా వృద్ధిరేటు 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిపిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిజర్వ్ రికై ్వర్మెంట్ రేషియో (ఆర్ఆర్ఆర్) 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా
ఎందుకు : ఆర్థిక మందగమనంలో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి
ఆర్బీఐ మని యాప్ ప్రారంభం
కంటి చూపు సరిగా లేని వారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన ‘మని(MANI)’ యాప్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ జనవరి 1న ప్రారంభించారు. మని అప్లికేషన్ సాయంతో కంటి చూపు సరిగా లేని వారు సులువుగా నోట్లను గుర్తించవచ్చని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఈ యాప్‌ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుందని తెలిపారు. ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ ద్వారా సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్లు ఉచితంగానే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్బీఐ మని యాప్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఎందుకు : కంటి చూపు సరిగా లేని వారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా
భారత్ వృద్ధి రేటు 4.6 శాతానికి కుదింపు: ఫిచ్
2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్ 5.6 నుంచి 4.6 శాతానికి తగ్గించింది. బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగమనం, పుంజుకోని పారిశ్రామిక, వ్యాపార రంగాలు, వినియోగ విశ్వాసం దెబ్బతినడం వంటి కారణాల వల్ల వృద్ధి అంచనాలను కుదించినట్లు ఫిచ్ పేర్కొంది. ఈ మేరకు డిసెంబర్ 20న ఒక నివేదికను విడుదల చేసింది. ఆర్బీఐ (5 శాతం), మూడీస్ (4.9 శాతం), ఏడీబీ (5.1శాతం) కన్నా తాజాగా ఫిచ్ అంచనాలు తక్కువగా ఉన్నాయి.
ఫిచ్ నివేదికలోని ముఖ్యాంశాలు
- భారత్ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’గానే కొనసాగిస్తున్నాం.
- 2020-21లో భారత జీడీపీ రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. 2021-22లో వృద్ధి రేటు మరింత పెరిగి 6.5 శాతానికి చేరే వీలుంది.
- ఆర్బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన చర్యలు, పన్నురేటు తగ్గించడంసహా కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధిరేటు పురోగతికి దోహదపడే వీలుంది.
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ఉండాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యమయినా, ఇది కొంత అదుపు తప్పే అవకాశం ఉంది.
ఏమిటి : 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు 4.6 శాతానికి కుదింపు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్
భారత్‌లో ఆర్థిక మందగమనం : ఐఎంఎఫ్
భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి ప్రభుత్వం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి ఐఎంఎఫ్ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికలోని అంశాలను ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ శాఖలో భారత్ వ్యవహారాల చీఫ్ రానిల్ సల్గాడో డిసెంబర్ 24న వెల్లడించారు.
ఐఎంఎఫ్ నివేదికలోని ముఖ్యాంశాలు
- 2019 సంవత్సరం నుంచీ భారత్‌లో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధానపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే భారీ వృద్ధి తర్వాత వచ్చే దిగువబాటగానే (సైక్లికల్) మేము ఈ పరిస్థితిని ఇంకా పరిగణిస్తున్నాం.
- ప్రస్తుతం 2019-20లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతం ఉంటుందని అంచనా. అంచనాల సవరణ నిర్ణయం జనవరిలో ఉంటుంది.
- దేశీయంగా ప్రైవేటు డిమాండ్‌లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయి్యందని గణాంకాలు పేర్కొంటున్నాయి.
- తగినంత వ్యాపార విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది.
- భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండడం ఒకటి.
- ప్రస్తుతం భారత్ ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ప్రకటించడానికి పరిమితులు ఉన్నాయి. 2019- 20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం
అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా డిసెంబర్ 13న ప్రకటించింది. వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు అమెరికా, చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25శాతం సుంకం కొనసాగుతుందని, మరో 120 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 7.5శాతం సుంకం అమలవుతుందని ట్రంప్ తెలిపారు. డిసెంబర్ 15న విధిస్తామని గతంలో ప్రకటించిన జరిమానా సుంకాలను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 ఎన్నికల వరకు వేచి చూడకుండా, రెండోదశ ఒప్పంద చర్చలు ప్రారంభిస్తామని కూడా ట్రంప్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాణిజ్య ఒప్పందానికి అంగీకారం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : అమెరికా-చైనా
ఫార్చూన్ జాబితాలో రిలయన్స్‌కు అగ్రస్థానం
ఆదాయం పరంగా వెలువడిన ఫార్చూన్ ఇండియా- 500 జాబితాలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితా ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ వృద్ధి 41.5 శాతంగా ఉంది. ఆర్ఐఎల్ తర్వాత ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను (ఐఓసీ) రెండోస్థానంలో నిలిచింది. ఐఓసీ అమ్మకాలు రూ.5.36 లక్షల కోట్లు కాగా, వృద్ధి 26.6 శాతం, లాభం రూ.39,588 కోట్లుగా ఉన్నాయి.
ఫార్చూన్ ఇండియా జాబితాలోని 500 కంపెనీల 2019 సగటు ఆదాయం 9.53 శాతం పెరగ్గా, లాభం 11.8 శాతం వృద్ధి చెందింది.
ఫార్చూన్ ఇండియా 500 జాబితా-2019
ర్యాంకు | కంపెనీ |
1 | రిలయన్స్ ఇండస్ట్రీస్ |
2 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ |
3 | ఓఎన్జీసీ |
4 | ఎస్బీఐ |
5 | టాటా మోటార్స్ |
6 | బీపీసీఎల్ |
7 | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ |
8 | టాటా స్టీల్ |
9 | కోల్ ఇండియా |
10 | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ |
11 | లార్సెన్ అండ్ టూబ్రో |
12 | ఐసీఐసీఐ బ్యాంక్ |
13 | హిందాల్కో ఇండస్ట్రీస్ |
14 | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ |
15 | మహీంద్రా అండ్ మహీంద్రా |
ఏమిటి : ఫార్చూన్ ఇండియా- 500 జాబితాలో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)
ఎక్కడ : ఆదాయం విభాగంలో
లాటరీలపై 28 శాతం పన్ను విధింపు
లాటరీలపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో డిసెంబర్ 18న జరిగిన 38వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లాటరీ పన్ను పెంపు 2020 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని రెవిన్యూ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే తెలిపారు. అల్లిన బ్యాగులపై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్‌లు వచ్చేందుకు ఇండస్ట్రియల్ ప్లాట్స్ మీద పన్ను మినహాయించామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లాటరీలపై 28 శాతం పన్ను విధింపు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : జీఎస్టీ కౌన్సిల్
ఎక్కడ : న్యూఢిల్లీ
జీడీపీ వృద్ధి అంచనాలు 5 శాతానికి తగ్గింపు: శక్తికాంత దాస్
ముంబై: విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి రేట్ల కోతకు వెళ్లకుండా యథాతథ పరిస్థితికి మొగ్గు చూపించింది. ప్రస్తుతమున్న రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ) 5.15 శాతం, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీ) 4.90 శాతాన్ని అలాగే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దేశ జీడీపీ వృద్ధిరేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోవడంతో (ఆరేళ్ల కనిష్ట స్థాయి), ఒకవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్బీఐ ఎంపీసీ.. కనీసం పావు శాతం వరకు రెపో రేటును తగ్గిస్తుందని విశ్లేషకులు, నిపుణులు ఊహించారు. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశాలుండటం రేట్ల కోతకు వెళ్లకుండా అడ్డుపడ్డాయి. అంతేకాదు, తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5%కి తగ్గించేసింది. అక్టోబర్ సమీక్షలో వృద్ధి అంచనాను 6.1%గా పేర్కొనటం గమనార్హం. తన సర్దుబాటు విధానాన్ని ఎంపీసీ కొనసాగించడం ఒక్కటే తాజా భేటీలో సానుకూలత. వృద్ధికి మద్దతుగా అవసరమైనంత వరకు ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే తదుపరి సమావేశాల్లో రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతం పంపింది. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణమే వడ్డీ రేట్లను నిర్ణయించగలదని స్పష్టం చేసింది. అంతేకాదు, తదుపరి రేట్ల కోత రానున్న బడ్జెట్‌పైనా ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు.
ద్రవ్యోల్బణం పెరగొచ్చు :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7-5.1 శాతం మధ్య.. 2020-21 మొదటి అర్ధభాగంలో 4.3-4.8 శాతం మధ్య ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ‘‘నాలుగో త్రైమాసికంలో (వచ్చే జనవరి-మార్చి) ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో ఉండొచ్చు. రానున్న నెలల్లో ఇది నియంత్రణలోకి రావడం అన్నది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంది. కూరగాయల ధరల పెరుగుదల ఒకటి, రెండు నెలలు కొనసాగొచ్చు. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన పంటల దిగుబడులు, సరఫరా దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2020 ఫిబ్రవరికి కూరగాయల ధరలు శాంతించొచ్చు. టెలికం చార్జీలు పెంచడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. అయితే, టోకు ద్రవ్యోల్బణం మాత్రం ప్రస్తుత స్థాయి 4 శాతం లోపే కొనసాగొచ్చు’’ అని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతానికి చేరిన విషయం తెలిసిందే. 4 శాతానికి కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం.
వృద్ధి 5 శాతం :
2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 5 శాతం మేరే ఉండొచ్చని ఎంపీసీ పేర్కొంది. 6.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలను సవరించింది. 2019-20 రెండో అర్ధభాగంలో (2019 అక్టోబర్- 2020 మార్చి) వృద్ధి రేటు 4.9-5.5 శాతం మధ్య.. 2020-21 మొదటి ఆరు నెలల కాలంలో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. రానున్న కేంద్ర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, వృద్ధిపై వాటి ప్రభావం విషయమై స్పష్టత వస్తుందని పేర్కొంది. డిమాండ్ పరిస్థితులు బలహీనంగా ఉన్నట్టు ఎన్నో అంశాలు స్పష్టం చేస్తున్నాయని అభిప్రాయపడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జీడీపీ వృద్ధి అంచనాలు 5 శాతానికి తగ్గింపు
ఎప్పుడు: డిసెంబర్ 5, 2019
ఎవరు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
ఎక్కడ: ముంబై
ఎందుకు: దేశ జీడీపీ వృద్ధిరేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోవడంతో..
కో-ఆపరేటివ్ బ్యాంకులు సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి..: ఆర్బీఐ
సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ) పరిధిలోకి రూ.500 కోట్లు, అంతకు మించి ఆస్తులు కలిగిన అన్ని అర్బన్ కోపరేటివ్ బ్యాంకులను తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. పెద్ద రుణాల మంజూరుకు సంబంధించిన సమాచారాన్ని సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోని సంస్థలు ఆర్బీఐకి వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులు, కొన్ని ఎన్బీఎఫ్సీలు, ఆర్థిక సంస్థలు దీని పరిధిలో ఉన్నాయి. ఇటీవలి పీఎంసీ బ్యాంకు స్కామ్ నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయానికి వచ్చింది.
కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్ర నిర్ణయానికి పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి డిసెంబర్ 5న పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2019కు పార్లమెంటు ఓకే చెప్పింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించే అంశంపై స్పష్టతనిచ్చారు. మైనింగ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, బుక్ ప్రింటర్లకు కొత్త తయారీ కంపెనీలకు వర్తించే ‘కనిష్ట 15 శాతం పన్ను రేటు’ వర్తించబోదని ఉద్ఘాటించారు.
ఆర్థిక వృద్ధి లక్ష్యంగా...
ఆర్థికవృద్ధే లక్ష్యంగా కార్పొరేట్ పన్నులను తగ్గించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగ ంలో అలసత్వ నిరోధం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వంటి పలు చర్యలు ఈ దిశలో ఉన్నాయన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపువల్ల పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ దేశంగా అవతరిస్తోందని వివరించారు. ఆర్థికరంగం పునరుత్తేజమే ధ్యేయంగా కేంద్రం తన చర్యలను కొనసాగిస్తుందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయానికి పార్లమెంట్ ఆమోదం
ఎప్పుడు: డిసెంబర్ 5, 2019
ఎవరు: ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్
ఎందుకు: కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించే
నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7 : ఆర్బీఐ
ముంబై: నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్/ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్బీఐ డిసెంబర్ 6న ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్లో పేర్కొంది. డిసెంబర్ 16న (డిసెంబర్ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి నెఫ్ట్ సెటిల్మెంట్ జరుగుతుంది. నెఫ్ట్ లావాదేవీల ప్రోత్సాహానికి గాను వీటిపై చార్జీలను ఆర్బీఐ లోగడే ఎత్తివేసింది. నెఫ్ట్ లావాదేవీలను గంటకోసారి ఒక బ్యాంచ్ కింద క్లియర్ చేస్తుండడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7
ఎప్పుడు: డిసెంబర్ 16 నుంచి
ఎందుకు: లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు
భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే : ఏడీబీ
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. అయితే 2020లో భారత్ వృద్ధి 6.5 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు 2019 అప్డేటెడ్ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్‌ను డిసెంబర్ 11న ఏడీబీ విడుదల చేసింది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి అంశాలు వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని ఏడీబీ తన అవుట్‌లుక్‌లో విశ్లేషించింది.
రెండవసారి కోత...
2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌కు రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ నవంబర్ 28న మరో రికార్డ్ ఘనత సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.10,01,555 కోట్లను తాకింది. దీంతో ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్ షేర్ చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్ ముకేశ్ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది.
ఒక్క రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలోని 250 కంపెనీల మార్కెట్ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్‌గా వ్యవహరిస్తారు.
రిలయన్స్ మార్కెట్ క్యాప్ జర్నీ ఇలా...
తేదీ | షేర్ ధర (రూ. లలో) | మార్కెట్ క్యాప్ (రూ.కోట్లలో) |
2/08/2005 | 94 | 1,03,321 |
16/04/2007 | 364 | 2,03,138 |
19/09/2007 | 543 | 3,02,935 |
29/10/2007 | 707 | 4,11,078 |
21/07/2017 | 793 | 5,15,400 |
01/11/2017 | 953 | 6,03,207 |
19/07/2018 | 1,105 | 7,00,089 |
23/08/2018 | 1,270 | 8,04,533 |
24/10/2019 | 1,437 | 9,10,587 |
28/11/2019 | 1,580 | 10,01,555 |
ఏమిటి : 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ
పసిడి కళాకృతులకు హాల్‌మార్క్ : కేంద్రం
దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ నవంబర్ 29న ప్రకటించారు. ఇందుకు సంబంధించి 2020, జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. నగల వర్తకులు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని, హాల్‌మార్క్‌తో కూడిన ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుందన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
2000 ఏప్రిల్ నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ను ధ్రువీకరించే పథకాన్ని బీఐఎస్ ఆచరణలోకి తీసుకొచ్చింది. కాకపోతే తప్పనిసరి చేయలేదు. దీంతో ప్రస్తుత ఆభరణాల్లో 40 శాతమే హాల్‌మార్క్‌వి ఉంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 234 జిల్లాల పరిధిలో 877 హాల్‌మార్కింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 జనవరి 15 నుంచి పసిడి కళాకృతులకు హాల్‌మార్క్ తప్పనిసరి
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్
ఎందుకు : వినియోగదారుల ప్రయోజనాల కోసం
4.5 శాతంగా దేశ వృద్ధి రేటు : ఎన్ఎస్ఓ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా నమోదయి్యంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) నవంబర్ 29న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012-13 జనవరి-మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది.
కట్టుతప్పిన ద్రవ్యలోటు...
ద్రవ్యలోటు విషయానికొస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నవంబర్ 29న ఈ గణాంకాలను విడుదల చేసింది.
వియత్నాంకు వేగవంతమైన వృద్ధి హోదా
ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు 6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి ‘వేగవంతమైన వృద్ధి’ హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయి్యంది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం.
భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే : క్రిసిల్
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స ఏజెన్సీ క్రిసిల్ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు డిసెంబర్ 2న ప్రకటించింది. దేశంలో ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) 4.75 శాతం వృద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్-మార్చి) మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
సమీప భవిష్యత్తులో బలహీనమే: డీఅండ్‌బీ
అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ- డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) మరో నివేదికను విడుదల చేస్తూ, సమీప భవిష్యత్తులో భారత్ ఆర్థిక వృద్ధి బలహీనంగానే ఉంటుందని విశ్లేషించింది. ఊహించినదానికన్నా మందగమనం కొంత ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను దెబ్బతీసిందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : రేటింగ్స ఏజెన్సీ క్రిసిల్
ఎందుకు : దేశంలో మందగమన తీవ్రత ఎక్కువగా ఉన్నందున
భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు కేబినెట్ ఆమోదం
దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి డిసెంబర్ 4న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. ఈటీఎఫ్ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది’’ అని వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
భారత్- 22 ఈటీఎఫ్ మాదిరిగా ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర కేబినెట్