Skip to main content

McKinsey Global Institute: ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశం?

China and US Flag


ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశంగా అమెరికాను రెండో స్థానానికి నెట్టి, చైనా అగ్రస్థానానికి చేరింది. స్విట్జర్‌ల్యాండ్‌లోని జ్యూరిచ్‌ నగరంలో ఉన్న మెకిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌.. నవంబర్‌ 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • స్థిరాస్తుల విలువలకు రెక్కలు రావడంతో గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద గణనీయంగా విస్తరించింది. ఈ ప్రయాణంలో ఎక్కువగా లబ్ది పొందింది చైనా, అమెరికాయే.
  • ప్రపంచ సంపద నికర విలువ 2000 నాటికి 156 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2020 నాటికి 514 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది.
  • ఒక దేశ పౌరుల చేతిలోని ఆస్తుల మొత్తం విలువను నికర విలువ లేదా నికర సంపద అంటారు.
  • చైనా నికర విలువ 2000 నాటికి ఉన్న 7 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 2020లో 120 ట్రిలియన్‌ డాలర్లకు విస్తరించింది. ఇదే కాలంలో అమెరికా నెట్‌వర్త్‌ (నికర సంపద విలువ) రెట్టింపునకు పైగా పెరిగి 90 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది.
  • ప్రపంచంలో 60 శాతం ఆదాయాం పది దేశాల వద్దే ఉంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్‌లు ఉన్నాయి.

రియల్‌ ఎస్టేట్‌కే పెద్ద వాటా..

  • మెకిన్సే అధ్యయనం ప్రకారం.. ప్రపంచ సంపదలో 68 శాతం రియల్‌ ఎస్టేట్‌ రూపంలోనే ఉంది. మిగిలిన మేర మౌలిక సదుపాయాలు, మెషినరీ, ఎక్విప్‌మెంట్, మేధో సంపత్తి హక్కుల రూపంలో ఉంది.
  • మెకిన్సే ప్రపంచ సంపద అధ్యయనంలోకి ఆర్థికపరమైన ఆస్తులను తీసుకోలేదు. ఎందుకంటే వీటికి అంతే మేర అప్పులు కూడా ఉంటాయన్న అంచనాతో పరిగణనలోకి తీసుకోలేదు.

చ‌ద‌వండి: భారత్‌ రేటింగ్‌ను నెగటివ్‌ అవుట్‌లుక్‌తో కొనసాగించిన సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశంగా చైనా
ఎప్పుడు  : నవంబర్‌ 16
ఎవరు    : అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్జజ సంస్థ– ఫిచ్‌
ఎందుకు : గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద గణనీయంగా పెరిగిన నేపథ్యంలో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 17 Nov 2021 07:09PM

Photo Stories