Skip to main content

యునెస్కో సృజనాత్మక నగరాల్లో హైదరాబాద్

ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ‘క్రియేటివ్ సిటీస్’(సృజనాత్మక నగరాలు) జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది.
ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 31న క్రియేటివ్ సిటీస్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో గ్యాస్ట్రానమీ (రుచికరమైన ఆహారం, తినుబండారాలకు సంబంధించింది) కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా 10 నగరాలను ఎంపిక చేయగా, అందులో హైదరాబాద్ స్థానం సంపాదించింది. టర్కీ, పెరు, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇటలీ, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఈక్వెడార్, చైనా దేశాలకు చెందిన నగరాలు కూడా ఈ జాబితాలో ఎంపికయ్యాయి.

మరోవైపు క్రియేటివ్ సిటీస్-ఫిల్మ్ కేటగిరీలో దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చోటు దక్కింది. భారత్ నుంచి హైదరాబాద్, ముంబైలు మాత్రమే క్రియేటివ్ సిటీల జాబితాలో స్థానం సంపాదించాయి. ప్రపంచవ్యాప్తంగా 246 నగరాలను వివిధ కేటగిరీల్లో పరిశీలించిన యునెస్కో 66 నగరాలను ఎంపిక చేసింది. విన్నూత పద్ధతులు, ఆలోచనల ద్వారా నగర ప్రాంతాల ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి కలగజేస్తోన్న నగరాలను క్రియేటివ్ సిటీలుగా యునెస్కో ప్రకటించింది. ప్రస్తుతం యునెస్కో డెరైక్టర్ జనరల్‌గా ఆడ్రే అజౌలే ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో చోటు
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : హైదరాబాద్
ఎక్కడ : గ్యాస్ట్రానమీ (రుచికరమైన ఆహారం, తినుబండారాలకు సంబంధించింది) కేటగిరీలో
Published date : 01 Nov 2019 05:28PM

Photo Stories